Islam The Misunderstood Religion (Telugu)
ఇసా౦ అపారాల మబు ళ్ (9 © me
మూలం: ముహమ్మద్ కుత్చ్
అనువాదం : ఎస్.ఎమ్. మలిక్
ఓ ఇక మతం. అవసరం లేధా? ప 12 మూలకారణం -12; సరికొత్త దేముడు -13; సైన్సు (పపంచం -14; మతం లేకుండా -15; మానవునిలో ఆశాజ్యోతి -17 ; పునాదులు వేరయితే -19; అపార్థం -21; విమోచనం -22 ; జీవితాశయం -24 ; భావ స్వాతంత్యం -25; కొత్త దేముడు -27 ; సామరస్యానికి ఒక్కరే మార్గం -29; దేవతలూ తప్పుకోండి -30; చిల్లర దేవుళ్ళు -32; వీరిది ఇస్లాం కాదు -33; పరిపాలన - (పజల హక్కు -34; స్మామాజ్య వాదానికి తిరుగుబాటు -35; విశ్వజనీన సంస్కరణ -36; ఇవి పపగతి వికాసాలా? -38 ; సహజమయిన (వమాణాలు-39 ; లోతుగా పరిశీలిస్తే -40 ; ఇస్లాం పునరుజ్జీవనోద్యమం -42 ; ఆధునిక ఇస్లామీయ ఉద్యమం -44; మొదటి (పత్యేకత -45; రెండవ (ప్రత్యేకత -45; మూడవ (పత్యేకత -47 ; దైవదత్తం ఈ జీవన విధానం -48; (క్రియా శీల వ్యవస్థ “50.
2 బానిసల, సమస్య. 0000000000 0600 టీల సందిగ్ధంలో యువతరం -53 ; శ్యాస్తీయ వంచన -55 ; భయంకర చిత్రం అపార్థానికి మూలం -56; వారి కన్నా పశువులే నయం -57; ఉల్లాసానికి కాలక్షేపానికి -58 ; విప్లవాత్మకం ఈ పిలుపు -60 ; తొలిసారిగా అన్ని హక్కులు 63; సర్వ్మతా సమానత -64; మానవ హక్కులు - 66; సర్వ స్వతంత్రత వైపుకు 66; అల్ ఇత్క -67 ; ముకాతబత్ -70 ; సాలెగూడు పటాపంచలయింది-71; సమస్య - సమగ పరిశీలన -72; పరిణామం, (ప్రగతి, పరిణతి మార్గం - ఇస్లాం 75;- మనిషిలో
మానవత -75; మానసికమయిన అవాంతరాలు -/6; సంస్కరణ సహజరీతిలో -80 ; బానిసలు కాదు సోదరులు -81; చేదు ఫలాలు -84 ; మూఢ సంపదాయాలు -85 ; అపజయమే వారి అపరాధం - 86; యుద్ధం కాదు 'జివాదో - 87 ముస్లిమేతరులు; ; ఇస్లాం = యుద్ధం - 89; ధర్మపధంలో అనివార్యమయి ........ -913 విలక్షణమయిన పంథా -92; ఆచరణలో అదర్శం -94 ; మహిళా బానిసలు -95; ఆధునిక యుగంలో బానిసత్వం -96 ; బానిసత్వం అంతమయిందా? -96 ;అందమయినతెరలచాటున -98 ; నాగరికతా సదనంలో బానిస వదనం -100; మహిళా విమోచనం -102; ఆధునిక వెలియాలి -104; ఇది మరో బానిస గాథ -107; 3.భూస్వామ్య వ్యవస్థ వహ్ స chert పట పేలే చ రాల 108 భూస్వామ్య వ్యవస్థ 109 ; పలాయనం పర్యవసానం 111; అపార్థానికి మూలం -113; వ్యావసాయిక కట్టు బానిసత్వం -114; దాస్యం ఆయనకే -115 ; బాధ్యతాయుత భూస్వామి స్వేచ్చాయుత రైతు -116 ; వ్యావసాయిక వ్యవస్థ -118 ; వాణిజ్య వ్యవవారం కాదు, సేవా తత్పరత -119; అధికారాలు ఏకపక్షం కావు -120 ; న్యాయం నిష్పాక్షికం -121; స్వేచ్చ, పగతులు తోడునీడగా -123; విశ్వాసం బలహీనమయితే కండ పతనం:-125; చర్చ యొక్క సారాంశం -126; 4.పెట్టుబడి దారీ వ్యవస్థ......... ద వ | న! యంతం (పగతికి మూల మంతం -129; పారంభంలోనే జరిగింది పొరబాటు -130 ; దుష్టద్వయం -131; ఆ విప్లవం ఇక్కడ వచ్చి ఉంటే 132; వలస రాజ్య వ్యవస్థ పరిణామ (క్రమంలో భాగమా? -134; సమస్యకు మూలాంకురం -135; జీవితంలో సమతూకం, సామరస్యం -137; ఆంతర్యం కోరేదే బాహ్యంలో చట్టమయితే-139 ; 5.వ్యక్తిగత అఆస్తి..............0.0224 సంతం 140 అనుభవం ఇచ్చే సాక్ష్యం -140 ; ఏది సహజం? -141; అన్యాయానికి మూలం ఏమిటి? -144; ఇస్లామీయ సమాజంలో -145; సామాజిక
లూ
ద్ధాంతాలు, ఆర్థిక వ్యవస్థ -148; ఇస్లాం'మధ్యే మార్గం -149; సంస్కరణే అసలు ధ్యేయం కావాలి -151;
6. వర్గవ్యవస్థం 020000000000 లలలల లలల లల లలల లలల 154 వర్గవిభేదానికి మూలం -154; సామాన్యుల వారసత్వం -155; వర్గ వ్యవస్థకు మూల భావన -157 ; ఆస్తి వికేందీకరణ-157 ; యదార్థాన్ని (పకటించిన ఖుర్‌ఆన్ -159; ఇస్లాంలో వర్గ విభజన -160;
7.దాన ధర్మాలు...... ఎభితఖ్యాల తి ఆ Teen టను నాం ఎం161 భిక్ష కాదు బాధ్యత -162 ; జకాత్ - ఇస్లామీయ వ్యవస్థలో -163; దాన ధర్మాలు -164 ; గౌరవ (పదమయిన సంపాదన -165;
పూర్వ రంగం -168; మనిషి కాదు, మెషిను -169; అరుదయిన ఆత్మీయత -170; నిరంతర వంచన -171; బాలల కన్నా హీనం (స్తీలగతి -171; గోరు చుట్టుపై .......... 173; కొండను (తవ్వి తీసిన ఎలుక -175; మహిళ మానవాళిలో సగభాగం -176; హక్కుల్లో పరిపూర్ణత -179; స్వేచ్చ, సమానత -181; సహజమయిన తారతమ్యం -183; జీవిత పరమార్ధం -]189; వారసత్వం -190; సాక్ష్యానికి సంబంధించిన చట్టం -192; కుటుంబం పెద్ద -193; సహజమయిన ఎన్నిక -194; దాసి కాదు, జీవన సవాచరిణి -195; సహజం, సమంజస మయిన మార్గం -196; ఇది అన్యాయమా? -198; కుటుంబంలో సౌమనస్యం కోసం-201; చట్టంతోనే సరిపోదు -203; ఉద్దేశ్యం సంస్కరణే -205 ; భార్యకు అన్యాయం జరిగినా -208; విడాకులు: చట్టపరమయిన అంశాలు -210 ; విడాకులు అభిశాపమా? వరమా? -211; సయోధ్యకు సరయిన పద్ధతి -213; మానవ (పకృతికి, సామాజిక అవసరాలకు అతి సన్నిహితంగా -216 ; పమాద భరితం - 220; కావలసిందేమిటి? -222; అసలు కారణాలేవి? -225; ముందు నుయ్యి వెనుక గొయ్యి -227 ; ఇస్లాం కోరే వ్యవస్థలో -230 ; నీతి మాలిన వ్యక్తులు కాదు -231;
కరము? శక్త ఏ 5. అ లం ఉపటం ముక ంపప .238 భిన్న ధృవాలు -239 ; పాక్షిక దృష్టి -240 ; మధ్యే మార్గం -241; మూల నిర్మూలనం -244 ; అపోహలా భయాలా? -246 ;
10.సంస్కృతీ నాగరికతలు.............00002. AN 248 ఆమూలా(గ సంస్కరణ -249; మానవ (శ్రేయమే ధ్యేయం--250 ; 1తరోగమప వోదేరం. సంస సలా wets 253 ఇది అవసరం కాదు, అభిశాపం -253; సహేతుకమయిన ఏర్పాటు - 255; ఇది రోగం కాదు...... అక్షణం -257 ; పతనానికి పూబాట - *258; (స్తీ తన సహజ రంగానికి దూరంగా -260 ;
12.ఇస్లాం మరియు శృంగారం............02222 కటి 264
అణచివేత - తాత్కాలిక ఉపసంహరణ -265; నిషేధాలు కావు, పరిమితులు -266; కావలసింది మనోన్మిగహం -267; ఆశయ సిద్ధికి త్యాగనిరతి అనివార్యం -269 ; కరుణాసాగరం - దైవం 2703 13.భావ స్వాతంత్య౦.... ౬20౭000000౪ దివ 0 2000 0056602069 2743 విలోమ (పతికియ -275 ; ధార్మికంగా గుత్తాధిపత్యం? -276 ; నాస్తిక ధర్మం -278; నిరంకుశ రాజ్యం -279;
14. పజలకు మత్తుమందు.... =. 4౭4౬౪2౪౭00000 టే క .284 విప్లవ మార్గంలో మవావరోధం -284; ముస్లిం విద్వాంసులు -285 ; అన్యాయంపై పోరాటం -286 ; వ(క భాష్యాలు -287 ; అన్యాయాన్ని సహించడం మహాపాపం -290 ; ఆర్థిక దోపిడిపై ధ్వజమెత్తాలి -292 ; ధన సర్పాలు వినాశ కారకులు -294; సంతృప్తే సదా వాంఛనీయం - 297; సంతృప్తి"పోరాటం -298 ;
15.ముస్లిమేతర అల్ప సంఖ్యాకులు....... సనక 301 సమాన హక్కులు -301; పాశ్చాత్య సాక్ష్యం -302; మత మౌఢ్యానికి నిజభావం -305; మత స్వేచ్చ -307 ; కపట నాటకం -309; 16.ఇస్తాం మరియు కమ్యూనిజ౦...........024224222 అం 6026626! 311 సరికొత్త హేతువు -311; వంచనకు పరాకాష్ట -313; సిద్ధాంతాల్లో
వ్యతిరేకత -314 ; మౌలిక వైరుధ్యాలు-317 నైతిక, ఆర్థిక స్థితిగతులు -320 ; అపూర్వ మహత్కార్యాలు -322; ఆచరణాత్మకంగానూ sis -323 ఇది బలమయిన సిద్ధాంతమా? వడ్ల
17.ఇస్తాం మరియు ఆదర్శవాదం.......... అలిచ6 56620696 66660328 ఆచరణీయ ఆదర్శం -329; (కియా శీల ఆదర్శ వ్యవస్థ - దాని చరిత -331; ధార్మిక పునరుజ్జీవనం -332 ; నాటి అద్భుతాలు నేటి అవసరాలు -333; ఆదర్శాన్ని అనుసరించే వారవసరం -335; వట్టి ఆదర్శవాదం? -338;
18.కింకర్తవ్యం? ......... EE తులకు అభం ఆబఖరేశీలి విశ్వాసం అభేద్యమయిన కోట -340 ; జరిగిన పరాభవం చాలదా? - 342; ఇస్లామీయ ఉద్యమం -344 ;
నా మాట
ముహమ్మద్ కుత్స్ ఈజిస్ట్‌కి చెందిన గొప్ప ఇస్లామీయ తత్వవేత్త. (పాచ్య, పాశ్చాత్య శాస్తాలను ఆకళింపు చేసుకున్న మవోమేధావి. ఆధునిక వైజ్ఞానిక" ప్రగతి, దాని పర్యవసానాలు, పరిణామాలను సూక్ష్మ దృష్టితో తిలకించి విశ్లేషించిన (ద్రష్ట. ఇస్లాం తత్వాన్ని ఆధునిక శైలిలో, నేటి యువతరానికి అర్ధమయ్యే శాస్త్రీయ భాషలో బోధించిన విజ్ఞాని. ఆయన రచించిన ఈ పుస్తకాన్ని తెలుగు (పజలకు అందజేస్తూ నాలో సంతోషమూ దైవంపట్ల కృతజ్ఞతాభావమూ మేళవించిన భావాలు జనిస్తున్నాయి.
పాశ్చాత్య స్మామాజ్యవాదుల ధాటికి గురయి నేటివరకూ దాన్నుండి తేరుకోలేకపోయిన ప్రాచ్యదేశాల్లో ఉద్భవించిన ఆధ్యాత్మిక, నైతిక, సైద్ధాంతిక సమస్యలు ఈ (పాంతాల్లో అంతటా ఒకే రూపంలో (పత్యక్షమవుతున్నాయి. రచయిత ఈ పుస్తకంలో ఈజిన్ట్ యువతరాన్ని ఉద్దేశించి మాట్లాడినా, ఇందులో ఈజిప్ట్‌లోని సమస్యలూ, అక్కడి (పాంతీయరంగు కొంతవరకు చోటు చేసుకున్నా (ప్రస్తావించిన విషయాలు సార్వజనీనమయినవనడం సత్యదూరం కాదు. అందువల్ల ఈ పుస్తకం ఈజిప్ట్ యువతరానికి ఎంతవరకు వర్తిస్తుందో ఇతర (పాచ్యదేశాలకు కూడా దీని ప్రయోజనం అంతకంటే ఏ మ్మాతం తగ్గదు.
ఈ పుస్తకం (పముఖ (పపంచభాషల్లో అనువాదమయి అనేక ఎడిషన్లుగా వెలువడింది. అరబీలో దాని ఆరవ ఎడిషన్‌కు పీఠిక (వాస్తూ ముహమ్మద్ కుత్స్ వ్రాసిన ఓ విషయాన్ని ఇక్కడ (ప్రస్తావించడం ఈ పుస్తకం ప్రాముఖ్యాన్ని చాటుతుందని నా అభిపాయం. ఆయన ఇలా (వ్రాశారు:
“నేను ఈ పుస్తకం (వాస్తున్న రోజుల్లో దీన్ని ఎంతో ఉత్సాహంతో (పజలు స్వీకరిస్తారని నేను ఊహించనేలేదు. ఒకదాని తరువాత మరొకటి ఎన్నో ఎడిషన్లు (పచురణఅయి దాన్ని ప్రజలు ఆదరించినప్పుడు నా హృదయం కృతజ్ఞతా భావంతో దైవసన్నిధిలో మోకరిల్లింది. చదువరుల పట్ల ఆదరణ కృతజ్ఞతా భావాలు జనించాయి.........22202066666666202
“అయినప్పటికీ నేను దీన్ని ఇంకా (పచురించడంకన్నా ........... ఇస్లామీయ దృక్పథాలను విభిన్న జీవనరంగాల్లో విశదపరచే కార్యక్రమం చేపట్టాలని తలంచాను. నేను (వాసిన ఇతర పుస్తకాల్లో ఈ కోణాన్నే (పత్యేకంగా దృష్టిలో ఉంచుకున్నాను............
“కాని (ప్రఖ్యాత (పాచ్యశాస్తునిపుణుడు WILFRED CANTWILL SMITH తన (గంథం ISLAM IN MODERN HISTORY లో ఈ పుస్తకాన్ని మూడు చోట్ల (ప్రస్తావించి తీవమయిన పదజాలం - ఆ పదజాలాన్ని దూషణలు అని తప్ప మరేమీ అనలేము - లో అవమానపరచినప్పుడు నా అభిపాయాన్ని నేను మార్చుకున్నాను. ఈ |క్రెస్తవ కూసేడర్‌లో ఇంతగా ఆ(గహాన్ని తెప్పించిన ఈ పుస్తకం మరీ మరీ (పింటవ్వాలి, మరీ మరీ (ప్రజలు చదవాలి అన్న నిర్ణయానికి వచ్చాను.”
తెలుగు పజలూ దీన్ని సరయిన రీతిలో ఆదరించి, పాశ్చాత్య (పభావంతో మన నాట కూడా (పబలుతున్న ఆలోచనా రీతిలోని ఆంతర్యాన్ని దాని మర్మహేతువును (గ్రహించగలుగుతారని ఆశిస్తున్నాను.
సదా సకల స్తోతాలు దైవానికే బెల్లుతాయి. వుమనో మార్గమయినా ఆయన ద్వారానో (పాప్తమవుతుంది.
= మలిక్
మనిషి -
సవాజంగా సత్యానే షి సత్యాభిమాని సత్యం -
వస్తుతః సర్వకాలికం, సర్వజనీనం సత్యం జా
సర్వార్థ సాధనం, సర్వార్థయోజనం
సత్యజ్యోతికి అపార్జాల తెరలు అడ్డుపడితే
సత్యం కానని మనిషి జీవితం
అర్థరహితం, మార్గవిహీనం, గమ్యశూన్యం (sc) 0
సత్యకాంతిలో తమ జీవితాలను ధన్యం చేసుకోగోరే సత్య (ప్రియులకు పరమసత్యం ముఖాను సందడి అడ్డుతెరలను తొలగించే ఈ ఆయుధం ప్రేమతో - సమరి తం
= మలిక్
భూమిక
ఆధునిక విద్యావంతులయినవారు అధికంగా తీవ మతపరమయిన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. మతం వాస్తవానికి మానవ జీవితానికి సంబంధించిన యదార్థమా? గతంలో ఇది యదార్ధమే కావచ్చు. కాని నేడు, సైన్సు మానవ జీవన (సవంతి దిశనే పూర్తిగా మార్చివేసిన ఈ రోజుల్లోనూ, జీవితంలో సైన్సు చెప్పే యదార్భాలకే తప్ప మరి దేనికీ తావులేని ఈ కాలంలోనూ ఆ వాదన సరయినదేనా? మతం మనిషి సహజమయిన ఆవశ్యకతా? ఒకడు దీన్ని స్వీకరిస్తాడు, మరొకతను దీన్ని తిరస్కరిస్తాడు. ఇది కేవలం విభిన్న వ్యక్తుల నైజాన్ని వ్యక్తపరుస్తుందా? మనిషి దీన్ని స్వీకరించినందువల్లనో, తిరస్కరించినందువల్లనో అతని పరిస్థితిలో ప్రత్యేకమయిన మార్పు ఏదీ వాటిల్లదని దీనివల్ల రుజువవటం లేదా? మనం ఏ స్థితినయితే దైవ తిరస్కారం లేక కుఫ్ అని అంటామో, మరి దేన్నయితే దైవ విశ్వాసం లేక ఈమాన్ అని అంటామో వాటిలో వాస్తవికత దృష్ట్యా ఎలాంటి వ్యత్యాసం లేదని కూడా తేటతెల్లమవడం లేదా? అన్న (పశ్నలు సర్వసామాన్యంగా తలెత్తుతున్నాయి.
వీరు ఇస్లాంను గురించి మాట్లాడేటప్పుడు కూడా వీరిలో ఈ సంక్షోభ స్థితి నెలకొని ఉంటుంది. ఇస్లాం కేవలం ఓ విశ్వాసం కాదని, ఇంకా అది ఆధ్యాత్మిక పరిశుద్ధత, మానవీయ సద్గుణాల నిర్మాణం, వాటి సంస్కరణల వరకే పరిమితం కూడా కాదని, అది సర్వతోముఖ, సమన్విత ఏకాంకమని, అందులో న్యాయవంతమయిన ఆర్థిక విధానం, సమతూకం, సామరస్యం గల సామాజిక వ్యవస్థ, సివిల్, (క్రిమినల్, అంతర్జాతీయ శాసనాలు, నియమ నింబంధనలు, [పత్యేక జీవన తత్వం, శారీరక శిక్షణకై విశేషమయిన ఏర్పాట్లూ ఉన్నాయని, ఇవన్నీ దాని మౌలిక విశ్వాసానికి, నైతిక ఆధ్యాత్మిక స్వభావానికి ఉద్భవించిన కొమ్మలూ రెమ్మలే అని వారితో అంకే ఈ సోదరులకు విడదీయరాని చిక్కు ఎదురవుతుంది. ఎందుకంకే వారి (పకారం ఇస్లాం తన శక్తినీ ప్రయోజకత్వాన్ని శాశ్వతంగా కోల్పోయి చాలా కాలమయిపోయింది. అది ఇప్పుడు దాదాపు భూతలం నుండి చిరకాలానికి గాను కనుమరుగయిపోయింది. అందువల్ల వారితో, ఇస్లాం మృత ధర్మం
కాదు సజీవమయిన, శక్తి మాన్యమయిన, ఎదుగుతూ, పుష్పిస్తూ, ఫలిస్తూ ఉన్న జీవన వ్యవస్థ అని, ఇందులో ఉన్న ఆరోగ్యవంతమయిన అంశాలు, సోషలిజంలోగాని, కమ్యూనిజంలోగాని, మరే ఇజంలోగాని (ప్రాప్తంకావని అన్నప్పుడు వారి సహనం కట్టలుతెంచుకుంటుంది. వారు విరుచుకు పడతారు: “నీవు ఇదంతా ఏ మతం గురించి చెబుతున్నావు? బానిసత్వాన్ని, భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారీని ధర్మసమ్మతం చేసిన ధర్మం గురించేనా? (స్తీని పురుషుడిలో సగం అని బోధించి ఆమెను ఇంటి నాలుగు గోడల మధ్య బంధించే మతం గురించేనా? రాళ్ళు రువ్వి చంపడం, చేతులు నరకడం, కొరడా దెబ్బలు - ఇలాంటి అమానుషమయిన శిక్షలు విధించే మతం గురించేనా? తన అనుయాయులకు దానధర్మాలపై ఆధారపడి జీవించమని బోధించే మతం, మనుషుల్ని విభిన్న వర్గాలుగా విభజించి కొందరు ఇతరుల్ని తమ దోపిడీకి గురిచేసేందుకు వీలు కల్పించే మతం - దీన్ని గురించేనా? కష్టజీవులకు సుఖశాంతుల జీవితం గడిపే వోమీనివ్వలేని జీవన వ్యవస్థ - ఈ ఇస్లాం - గురించేనా నీవు ఇవన్నీ చెప్పేది? ఇది (ప్రగతిని సాధించడం, భావిలో కొంగొత్త విజయాలను పొందడం సుదూర విషయాలు. మాకయితే ఇప్పుడు దాని ఉనికికే తీవమయిన ప్రమాదం గోచరిస్తోంది. నేటి ప్రపంచంలో, విభిన్న సామాజిక, ఆర్థిక వ్యవస్థల మధ్య సైద్ధాంతిక సంఘర్షణ జరుగుతున్న ఈ తరుణంలో, ఇస్లాంలాంటి బూజుపట్టిన మతం మనగలగటం, అది విజయవంతం అవడం అన్న (పశ్నే తలెత్తదు.” కె
ముందుకు సాగేముందు, ఈ “విద్యావంతుల” యిన ఆశంకావాదుల్ని వారి వాస్తవ రూపురేఖల్ని కాస్త పరిశీలిద్దాం. వీరి ఈ ఆశంకలకు అనుమానాలకు మూలమేదో ఉద్భవస్థానమేదో చూద్దాము. వీరి ఉద్దేషణా తీరు వీరి స్వతంత్ర ఆలోచనల, పరిశీలనల ఫలితమా లేక ఇతరుల అంధానుసరణ వల్ల జనించిందా?
వాస్తవమేమంకే వీరు ఏ విధమయిన సందేహాలు, సంశయాలు ఇస్లాం గురించి వ్యక్తపరుస్తున్నారో అవి వీరి స్వతంత్ర అనుశీలనల ద్వారా, వీరి మస్తిష్కాల్లో ఉద్భవించినవి కావు. ఇవి ఇతరుల అరువు (ప్రశ్నలు. వీటి అసలు మూల స్థానాన్ని చూడదలిస్తే ఆధునిక యుగ చరితపై దృష్టి
సారించవలసి ఉంటుంది.
మధ్యయుగాల్లో యూరపు మరియు ఇస్లామీయ (పపంచం మధ్య భయంకరమయిన యుద్ధాలు (CRUSADES) జరిగాయి. ఆ తరువాత ఆసన్నమయిన కాలంలో బయటికి వీరిమధ్య సంధి కుదిరినట్లు కనిపించింది. కాని వాస్తవానికి వారి మధ్య స్థిరంగా సదవగాహన, సయోధ్యలాంటిది ఎన్నడూ కుదరలేదు. వారు ఒకరిపై మరొకరు శాశ్వతంగా కత్తులు దూస్తూనే ఉన్నారు. అందువల్లనే తొలి పపంచ సంగ్రామంలో బిటీషువారు ఎరుషలేమును స్వాధీనం చేసుకున్నప్పుడు (బిటీషు అధికారి లార్డ్ ఎలెన్ జై (ALLENBY) బాహాటంగా (పకటించాడు: “ఇక దీనితో నేటికి (కూసేడు యుద్ధాలు అంతమయిపాయ్యాయి” అని.
మనం మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. గత రెండు శతాబ్దాలుగా, ముఖ్యంగా యూరపు సామాజ్యవాదుల్లోనూ ఇస్లామీయ (పపంచంలోనూ నిరంతర సంఘర్షణ జరుగుతూ వచ్చింది. తౌఫీక్ పాషా చేసిన ద్రోహం వల్ల (బిటీష్ వాళ్ళకు ఈజిస్ట్‌లో కాళ్ళూనే అవకాశం లభించింది. తద్వారా వారు పరాబిపాషా నాయకత్వాన వెలసిన (కీ.శ. 1882 నాటి పజావిప్లవాన్ని వమ్ము చేసివేశారు. ఆ తరువాత రూపొందిన (బిటీష్ పాలసీ యొక్క మూల సూతం ఏమిటంటే, ఏ విధంగా నయినా సరే ఇస్లామీయ (పపంచాన తమ పట్టును అత్యధికంగా పటిష్టం చేస్తూ పోవాలి. ఇంకా సాధ్యమయిన విధానాలన్నింటినీ వినియోగించి ఇస్లామీయ ఉద్యమాన్ని, ఆ స్పృహను అణచివెయ్యాలి. అప్పుడే తమ అధికారం భదంగా, బలంగా ఉండగలుగుతుంది అన్నది. అందువల్లనే విక్టోరియా కాలంనాటి (పధానమంతి మిస్టర్ గ్గ్లాడ్‌స్ట్రోన్ (Mr. 116 510౧6) (బిటీష్ పార్లమెంటు (HOUSE OF COMMONS) లో దివ్యఖుర్‌ఆన్ (పతి నొకదాన్ని చేతుల్లో ఎత్తుకుని, సభ్యులనుద్దేశించి, “ ఈజిప్ట్ (పజల్లో ఈ (గంథం ఉన్నంత కాలం ఈజిన్ట్‌లో _పశాంతంగా మన ఏలుబడి మనగలగడం సాధ్యంకాదు” అని అన్నాడు.
ఈ కారణంచేతనే ఇంగ్లీషువారు ముస్లిముల్ని ఇస్లాంకు దూరంగా, దానికి వ్యతిరేకంగా మలచడానికి ఇస్లామీయ ధార్మిక చిహ్నాలను, (పబోధాలను అపహసించడం మొదలెట్టారు. ముస్లిముల ముందు ఇస్లామీయ చరితను వక్రీకరించి వీలయినంత అంధకారమయంగా
చితించారు - తమ పట్టు ఈజివ్చపై పటిష్టమవ్వాలని, తమ నీచమయిన ఆశయాలు నెరవేరాలని.
ఈజిప్ట్‌లో వారు అవలంబించిన విద్యావిధానం, ముస్లిం విద్యార్థులకు తమ ధర్మంపట్ల సరయిన అవగాహన పొందే అవకాశమే నివ్వలేదు. చివరికి (బిటీష్ సామాజ్యం స్థావించిన ధార్మిక పాఠశాలల్లో పట్టభ్యదులయినప్పటికీ వారు ఇస్లాం నిజ సారాన్ని (గహించలేక పాయ్యారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఇవ్వబడే ఇస్లాం బోధనల సంగ్రహ రూపం ఇది'ఖుర్‌ఆన్ దైవ్యగంథం. దాన్ని కేవలం పుణ్యఫలాపేక్షతో పారాయణం చేస్తారు. ఇస్లాం, ఇతర మతాల్లాగనే మనుషుల్ని మంచి మనుషులుగా అయ్యేందుకు, తమలో నైతిక గుణగణాలు పెంపొందించుకునేందుకు (శేరణ కలుగజేస్తుంది. ఇది కూడా ఇతర మతాల్లానే ఆరాధనలు, జపాలు, సంస్మరణలు, ఆధ్యాత్మికసాధనలు, మహత్యాలు, అద్భుతాల సమ్మి(శమం అంతే. పైగా, ఇస్లాం ప్రతిపాదించే సామాజిక ఆర్థికవ్యవస్థను, దాని పరిపాలనా రీతిని, దాని అంతర్జాతీయ విధానాన్ని దాని విద్యాశిక్షణల వ్యవస్థకు, అది అందజేసే జీవన్నపదమయిన, జీవనదాయకమయిన సందేశాన్ని విద్యార్థులకు తెలియపరచకపోవడమేకాక వాటిపట్ల, పాచ్యశాస్తు నిపుణులు (ORIENTALISTS) వ్యాపింపజేసిన అపోహలు, అపార్థాలు, సందేహాలు, కుశంకలు - అన్నింటినీ ఓ క్రమంలో చిన్నచిన్న మోతాదుల్లో వారి బ్యురల్లోకి ఎక్కించేవారు. తద్వారా విద్యార్థులకు ఇస్లాం పట్ల మొగ 'మొత్తి వారిలో ఏవగింపు కలిగేలా చేసి, వారిని తమ సామాజ్యపు దుష్టసంక ల్పాల పరిపూర్తి కొరకు పావులుగా వాడుకోవాలన్నది వారి పథకం.
స్మామాజ్యవాదులు నిర్మించిన ఆ విద్యాపథకం (ప్రకారం విద్యార్థులకు బోధించన విషయమేమిటంటే, ప్రపంచంలో వదయిన ఉత్తమ జీవన వ్యవస్థ ఉందంకే అది కేవలం యూరపులో మాత్రమే ఉంది. అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థ ఏదయితే ఉందో అది యూరపు ఆర్థిక వేత్తల మేధాకృషి ఫలితంగా ఉద్భవించిందే. ఇంకా ఆధునిక కాలానికి అత్యంత సముచితమయిన రాజ్యాంగ బద్ధమయిన (పభుత్వ విధానం ఏదయినా ఉంటే అది, శతాబ్దాల తరబడి (పయోగాలు చేసి, గడించిన అనుభవాల ద్వారా యూరపు (వజలు సాధించిన వ్యవస్థ ఒక్కరే అన్నది. ఆ విద్యా
వ్యవస్థ విద్యార్థుల మస్తిష్కాల్లో ఎక్కించిన విషయాలు ఇంకా ఇవి: మానవునికి ప్రాథమిక హక్కులు (ప(పథమంగా ఇప్పించింది (ఫెంచి విప్లవం. (ప్రజాస్వామ్యం, (ప్రజాస్వామిక జీవితం నేడు బహుళ (ప్రాచుర్యం పొందాయంటే, అవి దినదినాభివృద్ధి చెందుతున్నాయంకే ఇదంతా కేవలం (బిటిషు ప్రజల (పజాస్వామిక కృషి ఫలితాలే. అధునాతన సంస్కృతీ నాగరికతలకు అసలు పునాదులు రోమను సంస్కృతి, రోమను (పభుత్వం (పసాదించినవే. మొత్తానికి ఈ విద్యా వ్యవస్థ యూరపు మరియు యూరపు వజలకు సంబంధించిన ఎంతో ఆకర్షణీయమయిన, ఎంతో (ప్రభావవంతమయిన చిత్రాన్ని చూపెట్టింది. దాన్ని చూచిన తరువాత, యూరపు ఎవరికీ లొంగని ఓ (పచండశక్తి అని, దానిపై ఎవరికీ ఎలాంటి అధికారమో, ఆధిపత్యమోలేదని, దాని సంకల్పాల పరిపూర్తిని ఏ శక్తీ ఆపజాలదని, దాని మార్గంలో ఏ శక్తీ అడ్డు రాజాలదని మాతం భావించడమే సాధ్యం. దాని సదృశంగా (పాచ్య భూగోళాన్ని విద్యార్థులముందు నిత్యం, అత్యంత అల్పంగా నీచంగా చిత్రించటం జరిగింది.
అంకే ఇది ఓ మరుగుజ్ఞూ; యూరపులాంటి ఆజానుబాహువు సమక్షంలో దీనికి అసలు ఎలాంటి విలువేలేదు. నిజానికి దీని ఉనికి, దీని మనుగడ పూర్తిగా యూరపు (పజల కటాక్ష వీక్షణాలపైనే ఆధారపడి ఉన్నాయి. దీనికి తనదంటూ ఓ సంస్కృతి, నాగరికత లేదు. ఉన్నది కాస్తా ఎంతో అల్బ్పమయింది. ఇక ప్రాచ్యదేశాలకు, పాశ్చాత్య సామాజిక, సాంస్కృతిక భండారము నుండి విలువల్ని అరువు తెచ్చుకోవడం తప్ప గత్యంతరం లేదు.
సామాజ్యవాదుల ఈ రాజకీయ పన్నాగాలు చివరికి మంచి ఫలితాలనిచ్చాయి. ఈజిప్ట్ ముస్లిముల నవతరం జాతీయాభిమానం, స్వతంత్ర (పతిపత్తి, సాంస్కృతిక (ప్రత్యేకతా భావాల నుండి పూర్తిగా దూరమయిపోయింది. దాని మనో మస్తిష్కాలపై యూరపు, దాని నాగరికతల ముద చిరస్థాయిగా పడిపోయింది. వారు తమ సొంత కళ్ళతో చూడనూ లేరు, స్వతంత్రంగా ఆలోచించనూ లేరు. వారి ఆలోకన ఆలోచనల పరిధి పరిమితమయి, వారు తమ యూరపు (పభువుల ఇష్టాఇష్టాల కనుగుణంగా మెలగడం, వారి (ప్రయోజనాలకు లోబడి నడుచుకోవడం తప్ప మరేమీ చెయ్యలేని స్థితికి దిగజారిపాయ్యారు.
2)
ఈ చార్మితక పూర్వరంగాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే ముస్లిముల్లో ఆధునిక విద్యావంతులు స్మామాజ్యవాదశక్తుల రాజకీయ ఎత్తుగడల పతిభకు పతీకలు. వీరి కుటుల విజయానికి గొప్ప తార్కాణాలు. ముస్లిం సమాజంలో ఈ వర్గం భావాలు దృక్పథాలు స్మామాజ్యవాదుల నిజమయిన సంకల్పాలకు సరయిన నిదర్శనాలనడంలో సందేహంలేదు.
ఇస్లాం గురించి వీరికి తెలిసిన విషయాలు అసంపూర్ణమయినవి, తమ పాశ్చాత్య గురువులనుండి నేర్చుకున్నవి మాతమే. అలాగే మతం గురించి వీరి అభిపాయాలు, నిజానికి యూరపు మేధావులు లేవదిసిన సంశయాలు సందేవోల (ప్రతిధ్వనులు మాత్రమే. వీరు కూడా వారి అనుకరణలో ఇస్లాం పట్ల రకరకాల అర్ధంలేని ఆక్షేపణలు లేవనెత్తుతారు. ఒక్కోసారి, ఇస్లాం, రాజకీయ వ్యవవోరాల్లో జోక్యం చేసుకోనవసరం లేదని అంటారు. మరోసారి సైన్సుకు ఇస్లాంకు అసలు సయోధ్య కుదరదని (పచారం (ప్రారంభిస్తారు.
అజ్ఞానం వాళ్ళ కళ్ళను కప్పివేసింది. ఏ మతానికి వ్యతిరేకంగా తిరుగుబాటును (పకటించడం తప్ప యూరపుకు మరో మార్గం లేకుండా పోయిందో అదె ఇస్లాం కాదని బహుశా వారికి తెలీదు కాబోలు! అది ఇస్లాంకు పూర్తిగా భిన్నమయిన మతం. యూరపు (ప్రజల్లో తమ మతం పట్ల విసుగు పుట్టించిన పరిస్థితులూ, సంఘటనలు కేవలం యూరపు వరకే పరిమితం అన్న విషయాన్ని కూడా వారు మరచిపోతారు. (పపంచంలో మరే భూభాగాన కూడా యూరపులాంటి ఉదంతాల ఉదాహరణ ఒక్కటి కూడా కానరాదు. కనీసం ఇస్లామీయ చరిత అలాంటి పరిస్థితుల్ని, సంఘటనల్ని ఎరగనయినా ఎరుగదు. మున్ముందు కూడా ఇస్లోమీయజగత్తులో అలాంటి సంఘటనలు జరిగే ఏ అవకాశమూ అగుపించడంలేదు. కాని ఈ యూరపు గుడ్డి అనుయాయులు ముందూ వెనుక ఆలోచించకుండా ఇస్లాంను తమ సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవితంనుండి వెలివెయ్యడానికి కంకణ బద్భులయి ఉన్నట్లు తోస్తోంది. వీరి దృష్టిలో ఇస్లాం కాలంచెల్లినదిగా, రద్దు చెయ్యదగినదిగా, ఎందుకు రూపుదాల్చిందీ అంటే దానికి కారణం యూరవు (పజలు మతం అంకే 'మొగంమొత్తి విసుగు చెందారు. వారు తమ మతాన్ని పూర్తిగా దేశ బహిష్కరణ గావించారు కూడా. అందువల్ల వారి అడుగుజాడల్లో వీరుకూడా
తమ మతాన్ని రూపుమాపదలిచారు.
యూరపులో మతమూ సైన్సుల మధ్య వివాదం చెలరేగడానికి మూలం చర్చి చేసిన పొరపాటు మ్యాతమే. దాని కారణంగా చర్చి అధినేతలు, తమకు వారసత్వంగా లభించిన కొన్ని (గీకు శాస్తు విషయాలను తమ మతంలోని అంశాలుగా చితించి వాటికి మతం రంగు పులిమారు. వారి దృష్టిలో వాటిని తిరస్కరించడమంటే ధార్మిక యదార్భాలను సత్యాన్ని తిరస్కరించడమే. సైద్ధాంతికంగానూ, (పయోగాత్మకంగాను సైన్సువారి ఈ నమ్మకాల్లో గల లోపాలను ఎత్తి చూపినప్పుడయినా వారికి యదార్ధం బోధపడలేదు. వారు అప్పటికీ తమ తప్పుడు భావాలపై మొండికేశారు. పరిస్థితుల ఈ స్వరూపం యూరపులో చర్చి, చర్చీ అధిపతులు ఉభయుల గౌరవాన్ని మంటగలిపింది. కాని, ఎప్పుడయితే చర్చి తన “దైవిక అధికారాలను అత్యంత అన్యాయంగా, గుడ్డిగా వినియోగించసాగిందో అప్పుడు చర్చీ సైన్సు మధ్య సంఘర్షణ పతాకస్థాయికి చేరుకుంది. ప్రజల్లో చర్చి కొనసాగించే మతపరమయిన దౌర్జన్యాన్ని ఎదిరించాలని తీవమయిన (ప్రతిస్పందన రగుల్కొన్నది. చర్చినుండి విముక్తిని పొందే కోరిక బలం పుంజుకుంది. తన ఈ వైఖరి ద్వారా చర్చీ అధిపతులు యూరపు (పజల ముందుంచిన మతభావన అత్యంత ఏహ్యామయినది, అంధకార బంధురమయినదీ అనడంలో సందేహం లేదు. యూరపు (ప్రజలకు మతం పరమ పిశాచంలా సాక్షాత్కరించింది. అది మనిషిని పగల్లోనూ (పశాంతంగా పనిచెయ్యనివ్వదు, ర్యాతుల్లోనూ దాని బాధ తప్పదు అన్న అభిప్రాయం ధృడతరమయింది.
చర్చి, మతం పేరుతో (ప్రజలనుండి వసూలుబేసే పెద్దమొత్తాల కారణంగా (పజలు (కియాత్మకంగా చర్చికి బానిసలయ్యారు. చర్చి అధిపతులు తమ్ము తాము భువిలో దేవుని పతినిధులుగా భావించేవారు. (పజలు, తాము నుడివే పతి మాటను ఎదురు ప్రశ్న వెయ్యకుండా స్వీకరించాలని అభిలషించేవారు. తదనుగుణంగా ఏ శాస్తువేత్తలయితే వారి అభిపాయాలతో విభేదించారో వారిని వీరు అత్యంత ఘోరమయిన శారీరక హింసలకు గురిచేశారు. ఎంతో సాధారణ విషయాలపై వారిని సజీవంగా దహనం చేశారు. భూమి గుంంగా గోళాకారంలో ఉందని
(వకటించిన సైన్టిస్టుల ఒక్క ఉదాహరణ ఈ సందర్భంలో చాలు.
ఇంతకు, చర్చిచేసిన ఈ జుగుప్సాకరమయిన జులుం, అపరాధాలు చూచి యూరపు మేధావులు, స్వతంత్ర ఆలోచనాపరులు, సజీవ మనస్సాక్షి గలవారు చలించిపాయ్యారు. కలత చెందారు. వారు, ఈ రాక్షసత్వాన్ని గట్టిగా ఎదుర్కోవాలని దృఢ సంకల్పం చేసుకున్నారు. తద్వారా అది పూర్తిగానయినా అంతమయిపోవాలి, లేదా భావిలో (పజల్ని ఎన్నడూ బాధించకుండా, కలవరపరచకుండా ఉండేలా నిర్వీర్యమయినా అవ్వాలి, ఇంకా ప్రపంచంలో తన తప్పుడు దృష్టాంతం వల్ల మతం అంకే అసత్యం, వంచన అన్న అపార్థాన్ని వ్యాపింప జెయ్యకుండానయినా ఉండాలి అన్న నిర్ణయానికి వచ్చారు.
కాని ముస్లిములు, ఇస్లాంల మధ్య ఉన్న సంబంధం కూడా, యూరపు _(పజలకూ, చర్చీకి మధ్య ఉన్న సంబంధంలాంటిదేనా? లేదంకే ఇస్లాం మరియు సైన్సుకు మధ్య శ్యతుత్వం గురించి జరిగే ఈ గొడవంతా దేనికీ? వాస్తవానికి ఇస్లాం మరియు సైన్సుకు మధ్య ఎలాంటి వివాదం లేదు. ఇంతవరకు, ఇస్లాంను తిరస్కరించడం తప్పనిసరి అవడానికి కారణభూతం కాగల ఏ సైంటిఫిక్ యదార్థమూ వెలికి రాలేదు. ఇస్లాం ఛాయల్లో సాగిన సుదీర్ణ పరిపాలనాకాలంలో సైంటిస్టుల పట్ల జులుం జరిగిన సంఘటనగాని, వారికి పాశవిక శిక్షలు విధించిన ఉదంతాలు గాని ఎన్నడూ జరగలేదు. ఇస్లామీయ చరిత అంతా మన ముందుంది. ఇందులో వైద్యశాస్తుం, ఖగోళశాస్తుం, గణితశాస్తుం, భౌతికశాస్తుం, రసాయనిక శ్చాస్తాల్లో గొప్పగొవ నిపుణులు జన్మించారు. వీరిలో ఎవరినయినా కేవలం అతని దృకృథాల కారణంగా దౌర్జన్యానికి హింసకు గురిచేసినట్లు ఒక్క దృష్పాంతమూ కానరాదు. ఈ ముస్లిం సైంటిస్టులు ఎన్నడయినా ఇస్లాం మరియు సైన్సు మధ్య ఎలాంటి దూరమో, వైరుధ్యమో ఉన్నట్లు భావించలేదు. అలాగే ముస్లిమ్ పరిపాలకులు చర్చీ అధిపతుల్లా సైంటిస్టుల్ని తమకు విరోధులుగా భావించలేదు. అందుచేతనే ఇస్లామీయ చరిత్రలో సైంటిస్టుని ఏ అగ్నిగుండంలోనూ కాల్పలేదు, ఖైదులో వేసి యాతనలకూ గురి చెయ్యలేదు.
అయినప్పటికీ కొందరు ఇస్లాం మరియు సైన్సు పరస్పరం
విరుద్ధమయినవిగా రుజువు చెయ్యడానికే పతిజ్ఞ బూనినట్లున్నారు. వీరు' "ఇస్లాం పరిజ్ఞానాన్ని (గహించకుండానే అందులో తప్పులెన్నుతారు. ఈ | విషయాలన్నీ నిజానికి సామాజ్యవాదులు వారి నరనరాల్లో ఎక్కించిన ఆ విషపభావానికి కేవలం బాహ్యలక్షణాలే. కాని శోచనీయమయిన విషయమేమంకే వారికి దాని స్పృహ కూడా లేదు.
ఈ పుస్తకం వీరిని ఉద్దేశించి వ్రాసిందికాదు. ఎందుకంకే వీరితో ఏదయినా పలకడం కాస్త తొందరపాటు అనిపించుకుంటుందేమో అనినా అనుమానం. వీరు సన్మార్గానికి రావాలంటే, వీరి పోషక మహా ప్రభువులు తమ దైవరాహిత్య భౌతికతా (పధానమయిన సంస్కృతి పట్ల పూర్తిగా నిరాశచెంది, జీవితపు అన్ని రంగాలను ఆవరించి ఆత్మ, పదార్ధం, మరియు విశ్వాసం ఆచరణ - అన్నింటి విషయంలో మార్గం చూపే జీవన వ్యవస్థకై పరితపించే శుభఘడియకై నిరీక్షించవలసి ఉంటుంది. అప్పుడు వారిని చూచి వీరు కూడా సన్మార్గానికి రావడానికి అవకాశం ఉంది.
ఈ పుస్తకాన్ని నేను, కాంతిమయమయిన అంత రాత్మతో, చిత్తశుద్ధితో అలరారే యువకుల్ని ఉద్దేశించి (వాశాను. వీరు ఎంతో సౌమ్యంగా, గాంభీర్యంతో సత్యాన్నీ యదార్భాన్నీ అన్వేషిస్తున్నారు. కాని వంచనా ఇిల్బంలో ఆరితేరిన స్మామాజ్యవాద శక్తుల పన్నాగాలు, ద్యుష్పచారం వీరి మార్గంలో అంతరాయం సృష్టిస్తున్నాయి. తెల్ల స్మామాజ్యవాదులు, ఎర కమ్యూనిస్టు స్మామాజ్యవాదులు - కల్లోల జనకులయిన వీరివురూ, ఈ యువతరం ఇస్లాం యొక్క నిజసారాన్ని సరిగ్గాగ్రహించరాదని కోరుతున్నారు. వీరు, ఈ యువకులు స్యాతంత్యం, గౌరవం, జాన్నత్యం లభ్యమయ్యే మార్గాన్ని పొందరాదని సకల (ప్రయత్నాలూ చేస్తున్నారు. నేను ఈ యువ సోదరుల సమక్షంలో ఈ పుస్తకాన్ని సమర్పించుకుంటున్నాను. ఇస్లాం విషయంలో వీరి సందేహాలు సంశయాల నివృత్తి కొరకు ఇది వారికి దోహదపడగలగాలని దైవాన్ని వేడుకుంటున్నాను.
/ - ముహమ్మద్ కుత్స్
ఇసొ౦ అపారారి బు Noi వప గక గ
అల్లావా అపార కృపా*లుడు పరమ దయామయుని పేరుతో
1. ఇక మతం అవసరం లేదా?
ఆధునిక వైజ్ఞానిక శాస్తుం సాధించిన అద్భుతమయిన విజయాలు పాశ్చాత్యుల కళ్ళను చెదరగొట్టాయి. ఆ (పభావం వల్ల మతంలో (పయోజకత్వం అంతమయిపోయింది. సైన్సు మతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసివేసింది అన్న అభ్మిపాయం వారిలో సామాన్యంగా (పబలిపోయింది. (పముఖ మనస్తత్వ వేత్తలు, సాంఘిక శాస్త్రవేత్తలు దాదాపు అందరూ ఇలాంటి అభిపాయాన్నే వ్యక్తం చేశారు. ఉదాహరణకు (పఖ్యాత మనస్తత్వవేత్త (ఫాయ్‌డ్‌నే తీసుకుందాం. మత (ప్రబోధాలను సమర్ధించే పయత్నాలను అపహసిస్తూ, “మానవ జీవితం స్పష్టమయిన మూడు మానసిక దశలను దాటుకుంటూ పోతుంది: మూఢత్వం, మతం, సైన్సు. ఇది సైన్సు యుగం. మత విషయాలకు ఇప్పుడు కాలం చెల్లింది. మతానికి ఇక అర్థమే లేదు" అని అన్నాడు.
మూల కారణం
మేము భూమికలో పేర్కొన్నట్లు మతంపట్ల, యూరోపు శాస్త్రవేత్తల వ్యతిరేకతకు అసలు కారణం |క్రెస్తవ మతాధిపతులకూ విజ్ఞాన శాస్త్ర వేత్తలకూ మధ్య తలెత్తిన సంఘర్షణే. ఈ సంఘర్షణలో మతాధిపతుల పాత్రను క్షుజ్జంగా గమనించిన శాస్త్రవేత్తలు మతమంకే తిరోగ: ,నమని, అమానుషత్వమని, మూఢల్వ మని, వ్యర్థమయిన ఆలోచనలు ఆచరణల కలగూరగంప అని భావించారు. అందువల్ల దీన్ని శాశ్వతంగా అంతమొందించాలని, సైన్సును పురోగమింపచెయ్యాలని వారు తలచారు. ఈ విధంగా సైన్సు మార్గదర్శకత్వంలో మానవాళి, సంస్కృతీ నాగరికతల మార్గాన (పగతి సాధించగలదని అభిపాయ పడ్డారు.
ఇదీ మతంపట్ల యూరోపు శాస్త్రవేత్తల శ్యతుత్వానికి అసలు కారణం. కాని ఈ మూలకారణాన్ని అర్థంచేసుకోకుండా కొందరు (ప్రాచ్య
ఇక మతం అవసరం లేదా ? 13
(వముఖులు మతాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం (పారంభించారు. వీరు, పాశ్చాత్యదేశాల్లో పై సంఘర్షణాకాలం నాటి పరిస్థితుల్లోనూ తమ నాట ఉన్న పరిస్థితుల్లోనూ గల వ్యత్యాసాన్ని పరిగణణలోకి తీసుకోలేకపాయ్యారు. వీరి ఈ వ్యతిరేకత ఏదో పెద్ద అనుశీలన, పరిశీలన, పరిశోధనల ఫలితంగా ఏర్పడ్డది కాదు. (పాచ్య దేశాల్లో సర్వసాధారణమయిపోయిన యూరోపు అంధానుకరణకు ఫలితంగా ఏర్పడ్డది మాత్రమే. పగతికీ, పరిపూర్ణతకూ ఏకైక మార్గం, ఆధిక్యతగల యూరోపు జాతులు అనుసరిస్తున్న మార్గమే అన్న నిర్ణయానికి వచ్చారు వారు. ఏ విధంగానయితే యూరోపు మతాన్ని తోసిపుచ్చిందో అలాగే తాము కూడా చెయ్యాలని, లేకపోతే తమను తిరోగమనవాదులుగా, వెనకబడ్డ వారుగా, మూర్చులుగా జమకట్టడం జరుగుతుందని భయపడ్డారు.
దురదృష్టకరమయిన విషయమేమంకే వీరు ఒక విషయాన్ని మరచి పోతారు. పాశ్చాత్య పండితులూ శాస్త్రవేత్తల్లో కూడా మత వ్యతిరేకత పట్ల మునుపెన్నడూ ఏకాభిప్రాయం కుదరలేదు, నేడూ వారిలో ఏకాభి పాయం లేదు. వాస్తవానికి కొందరు ప్రముఖ యూరోపు శాస్త్రవేత్తలు నాస్తికత ఆధారంగా ఏర్పడిన సభ్యతా సంస్కృతుల్ని నిరసిస్తున్నారు. మతం అన్నది మనిషియొక్క అనివార్యమయిన మానసిక, బుద్ధిపరమయిన అవసరమనే యదార్థాన్ని ఘంటాపథంగా (ప్రకటించారు కూడా.
సరికొత్త దేముడు
ఈ శాస్త్రవేత్తల్లో బాగాపేరు (పఖ్యాతులున్న ఖగోళశాస్తుజ్ఞుడు జేమ్స్ జీన్స్ (JAMESJEANS) ఒకడు. ఇతను తన జీవితాన్ని నాస్తికుడుగా, ఆశంకవాదిగా ప్రారంభించాడు. కాని క్రమేణ, తన వైజ్ఞానిక పరిశోధనల పర్యవసానంగా, మతం మానవ జీవితానికి అనివార్యమయిన అవసరం అన్న నిర్ణయానికి వచ్చాడు. ఎందుకంకే దైవాన్ని విశ్వసించకుండా సైన్సుయొక్క మౌలిక సమస్యల్ని పరిష్కరించడమే సాధ్యపడదన్న
14 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
విషయాన్ని అతను తన పరిశోధనల ద్వారా తెలుసుకున్న యదార్ధం. (పముఖ సామాజిక శాస్త్రవేత్త జీన్స్ (బిడ్డ్ (JEANS BRIDGE) మతాన్ని సమర్థించడంలో ఎంతవరకు పొయ్యాడంకే, భౌతిక, ఆధ్యాత్మిక తత్వాల సమ్మేళనం ద్వారా విశ్వాసం, ఆచరణల సామరస్యం గల ఓ వ్యవస్థను సంస్థాపించినందుకు ఇస్లాంను మనస్ఫూర్తిగా (ప్రశంసించాడు. విఖ్యాత ఇంగ్లీషు సాహితీకారుడు సోమర్‌సెట్ మావామ్ (SOMARSET MAUGHAM) అయితే, మతంపట్ల ఆధునిక యూరపు అనుసరించే విలోమ వైఖరి నంతటినీ ఈ విధంగా వ్యాఖ్యానించాడు: “యూరపు పాత దైవానికి తిలోదకాలిచ్చి తనకంటూ ఓ కొత్త దేవుణ్ణి - సైన్సును - కనిపెట్టుకుంది.
కాని యూరోపు సృష్టించుకున్న ఈ కొత్త దేవుడు చాలా చంచల వృదయుడయ్యాడు. (పతిక్షణం మార్పుకు గురవుతుంటాడు. అనునిత్యం స్థానభంశం చెందుతూ ఉంటాడు. నేడు ఒక విషయాన్ని వాస్తవమని ధృవీకరిస్తాడు; రేపు దాన్ని అసత్యమని, (భమ అని, మిధ్య అని కొట్టిపారవేస్తాడు. ఈ పరివర్తనా చక్రం సాగుతూనే ఉంటుంది. అది ఒక్క నాటితో ఆగదు. ఆ దేవుని “ఆరాధకులు” కూడా శాశ్వతంగా అశాంతికి, అలజడికి లోనయి నిత్యం నిలకడలేని మనుగడను వెళ్ళదీస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇలాంటి చంచల స్వభావంగల దేవుని ద్వారా ఇంతకంటే గొప్పవరం మరేది లభిస్తుంది? ఆధునిక పాశ్చాత్య జగత్తులో నేడు సర్వవ్యాప్తంగా కానవస్తున్న అశాంతి అలజడులు, ఇంకా అది ఏ మానసిక రుగ్మతలకు లోనయి బాధపడుతున్నదో అవన్నీ దాని అసలు వ్యాధి - ఆధ్యాత్మిక వ్యాధి - యొక్క బాహ్య లక్షణాలు మ్యాతమే.
సైన్సు పపంచం సైన్సును దేవునిస్థానంలో (పతిష్టించినందుకు కలిగిన మరో
పర్యవసానం ఏమిటంకే మనం నివసించే ఈ (పపంచం తనదంటూ ఓ నిర్దిష్టమయిన, స్పష్టమయిన ఆశయాన్నీ, అర్థాన్నీ కోల్పోయింది. దీనికి
ఇక మతం అవసరం లేదా ? 15
ఉన్నతమయిన ఉద్దేశం లేదు. ఓ వ్యవస్థ అంటూ, దానికి మార్గం చూపగల శక్తీ, _వ్యక్తిత్వమంటూ ఏదీ లేకుండా పోయింది. ఇక్కడ పరస్పరం విరుద్ధమయిన శక్తుల మధ్య శాశ్వత సంఘర్షణ ఒకటి చెలరేగింది. పర్యవసానంగా ఇక్కడి (ప్రతివస్తువు నిరంతరం మార్పుకు గురవుతూ వుంటుంది. ఆర్థిక, రాజకీయ వ్యవస్థలయినా, పాలకులూ, పాలితుల మధ్య సంబంధాలయినా, చివరికి వైజ్ఞానిక “'యదార్థాల' యినా - అన్నీ మార్పుకు లోనవుతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో మార్గంచూపే ఏ వెలుగూ కానరాని అంధకారమయమయిన భయంకర జగత్తులో మనిషికి (పాప్తమయ్యేవి శాశ్వత అశాంతి, వ్యాకులతలు తప్ప మరేం కాగలవు? ముఖ్యంగా మనిషి జీవితపు కనికరంలేని సమస్యల వలయంలో చిక్కుకుని బిత్తరపోయినప్పుడు ఆ(శయించడానికి, ఓదార్చును ధైర్యాన్ని పొందడానికి ఓ ఉన్నత అస్తిత్వపు భావన కూడా లేనటువంటి వాతావరణంలో ఈ విషయం ఎంత జటిలంగా రూపొందుతుందో ఆలోచించండి.
మతం, కేవలం మతం మా(తమే (పపంచానికి అది కోల్పోయిన శాంతి సుఖాలను అందజెయ్యగలదు. అది మనిషి ఆంతర్యంలో మంచిపట్ల (పేమను సృజించి, చెడుకు, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పర్వతంలా నిల్చునే ధైర్య సాహసాలను (ప్రసాదిస్తుంది. మనిషి తన (ప్రభువు, తన స్వామి తన ఎడల (పసన్నుడవ్వాలని కోరితే, చెడు ఆధిక్యతను, దాని అధికార వ్మిగవోన్ని పిండి పిండి చేసి భువిలో కేవలం తన (ప్రభువు అధికారాన్ని స్థాపించాలని అది అతనికి బోధిస్తుంది. ఆ మార్గంలో ఎదురయ్యే సకల కష్ట నష్టాలను సహనస్థయిర్యాలతో ఎదుర్కోవాలని, కేవలం పరలోక ప్రతిఫలం మ్యాతమే దృష్టిలో పెట్టుకోవాలని అది అతన్ని (పేరేపిస్తుంది. అయితే నేడు (పపంచానికి భదత, తృప్తి, శాంతి, పశాంతతలు - ఒక్క మాటలో చెప్పాలంటే మతం అవసరం లేదా?
మతం లేకుండా
మతం లేకుండా జీవితానికి అసలు అర్థమేలేదు. మతం యొక్క
16 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
(పత్యేకత పరలోక భావన. ఈ విశ్వాసం ద్వారా భూలోకాన మానవ జీవితం కొత్త పరిధుల్ని ఆవిష్కరిస్తుంది, సరికొత్త అంచుల్ని అందుకుంటుంది. మానవుని ముందు అవకాశాలు కొంగొత్త రూపుధరించి (పత్యక్షమవుతాయి. ఇవే లేకపోతే మనిషి, శూన్యభావం, న్యూనతాభావాల వ్యధాభరితమయిన అనుభూతివల్ల తానే (కుంగి పోతాడు. మరణానంతర జీవితాన్ని తిరస్కరించడమంకే మనిషి మొత్తం జీవన వ్యవధిని తగ్గించి అతని వయసులోని పెద్దభాగాన్ని అతున్నుండి దూరం చెయ్యడమే. తద్వారా అతన్ని అతని గుడ్డి కోరికల చేతుల్లో, మూఢనమ్మకాల దయలేని కోరల్లో వదలడమే. ఆ తరువాత మానవుడు తన గొంతెమ్మ కోరికల పరిపూర్తిలో పడి తానే స్వయంగా గల్లంతయిపోతాడు. ఇక అతని కృషికి లక్ష్యం ఒక్కరే! ఏ మేరకు సుఖభోగాలను జూరుకోగలిగితే ఆ మేరకు అనుభవించాలి, మరెవరినీ ఆ భోగభాగ్యాల్లో భాగం పంచివ్వకూడదు అన్నది. అప్పుడే ఈర్చ్యాద్వేషాలు, మృగ్యపాయమయిన పోరాటాలు, యుద్దాలు జన్మ నెత్తుతాయి. ఎందుకంటే కోరికల దాసుల ఈ లోకంలో (పతిఒక్కడూ వడ్డించిన ఈ విస్తరిని చేతనయినంతవరకు తనకే సొంతం చేసుకోవాలని కోరుకుంటాడు. జీవితం పరిమితం గనుక వీలయినంత తక్కువ వ్యవధిలో వీలయినంత ఎక్కువ (పయోజనం తానే పొందాలని కాంక్షిస్తాడు. అతనికి మరే ఉన్నత శక్తి భయమూ ఉండదు. ఎందుకంటే ఈ లోకానికి దేవుడు ఎలాగూ లేడు, న్యాయబద్ధమయిన వ్యవస్థ, నిక్షించేనాధుడు అంతకన్నా లే౬..
పరలోక భావనలేని మనిషి ఆలోచనలు, అనుభూతులు అధఃపాతాళానికి దిగజారిపోతాయి. అతని ఆలోచనలకు బెన్నత్యం ఉండదు; అతని లక్ష్యాలు ఆచరణా విధానాలు అన్నీ సంకుచిత దృష్టికి, సాహసరాహిత్యానికీ తార్కాణాలయి నిల్చుంటాయి. మానవాళి శాశ్వతంగా పోరాట నిలయంగా మారిపోతుంది. ఆ తరువాత మనిషికి, ఉన్నత జీవన లక్ష్యాలకై కృషిచేసే అవకాశమే ప్రాప్తం కాదు. అలాంటి లోకంలో (పేమానురాగాలు, దయాసానుభూతులకే చోటు కొరవడుతుంది. భౌతిక రుచుల కాంక్ష కోరికల ఆధిక్యత మనిషిని లోబరచుకుంటాయి. అతడు
ఇక మతం అవసరం లేదా ? 17
జీవితపు ఉన్నత ప్రమాణాలకు, ఉత్తమ భావాలకు విలువనిచ్చే స్థితిలో ఉండడు.
మానవునిలో ఆశాజ్యోతి
భౌతికవాదాన్ని ఆ(శయించిన మనిషికి కొన్ని భౌతిక లాభాలు ఒనగూడుతాయనడంలో సందేహంలేదు. కాని నిజానికి భౌతికవాదం ఓ అభిశాపం లాంటిది. దాని కారణంగా, (పాప్తమయే్య ఆ కొన్ని పయోజనాలు సయితం నిరర్ధక మయిపోతాయి. ఆ భౌతిక పయోజనాల కొరకు మనిషి గుడ్డివాడయి పోతాడు; తోటి మానవ సోదరులతో నిరంతర ఘర్షణకు సమాయత్తమవుతాడు ; ఆశామోవాలు, ఈర్చ్యాద్వేషాలు, సుఖభోగలాలసత్వాల త్మీవమయిన భావాల తాకిడిని అతడు తట్టుకోలేడు. అతడు ఏనాటికీ వాటి బారినుండి తప్పించుకోలేడు.
ఏ జాతులయితే భౌతికవాదపు మార్గాన్ని అవలంబిస్తాయో అవి శాశ్వతంగా ఓ విధమయిన అంతర్ యుద్ధానికి గురయి ఉంటాయి. పర్యవసానంగా జీవన వ్యవస్థే ఛిన్నా భిన్నమయి పోతుంది. సైన్సు, అది సృష్టించిన భయంకర ఆయుగాలు మానవజాతి సేవకు బదులుగా దాని వినాశానికి ఉపయోగపడతాయి.
భౌతికవాదం మనిషియొక్క సంకుచిత దృష్టి మూలంగా ఉనికిలోకి వచ్చిందే. దాని చెడులనుండి తప్పించుకోడానికి మానవ మానసిక పరిధుల్ని విసృతపరచవలసి ఉంటుంది. ఇది కేవలం మతం మూలంగానే సాధ్యమవుతుంది. కేవలం మతం మా(త్రమే మానవతకు కొత్త పరిధుల్ని, సరికొత్త జెన్నత్యాలకు అందజెయ్యగలదు. ఎందుకంటే మతం దృష్టిలో జీవితమంకే ఈ (ప్రపంచంలోనే పరిమితం కాదు; దీని తరువాత కూడా జీవితం అనంతకాలం వరకు కొనసాగుతుంది. ఈ విశ్వాసం మనిషి ఆంతర్యంలో ఆశాజ్యోతుల్ని వెలిగిస్తుంది. అతన్ని చెడుకు, అన్యాయానికి,
18 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
అత్యాచారానికి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దృఢంగా నిల్పోడానికి వాటిని ధైర్యంగా ఎదుర్కోడానికి సాహసాన్ని (పసాదిస్తుంది. మానవులంతా తనకు సోదరులే అన్న భావం అతనిలో సృజిస్తుంది. (పేమ, సానుభూతి, విశ్వజనీన సోదరభావాల ఈ బోధనలు మానవాళిని శాంతి, సౌభాగ్యాలకు, నిజమయిన సంక్షేమం, (పగతీ వికాసాలతో సుసంపన్నం చేస్తాయి. ఈ యదార్థాలు ముందుంచుకుని కూడా మతం మానవుల అనివార్యమయిన ఆవశ్యకత కాదని ఎవరనగలరు? లేక మనిషి శతాబ్దాలకు పూర్వంలా నేడు కూడా మతావశ్యకతను కలిగిలేడని ఎవరనగలరు? మనిషిని జీవనరంగంలోని ఎనలేని సమస్యల్ని ఎదుర్కునేందుకు మతం ఏ విధంగా నయితే సమాయత్తపరుస్తుందో ఆ విధంగా మరేశక్తీ మనిషిపై (పభావం చూపజాలదు.
మతం మనిషికి, తనకోసం కాకుండా ఇతరుల కోసం (బతకడాన్ని నేర్పుతుంది. అతనికి పవ్యితమయిన, ఉన్నతమయిన జీవనలక్ష్యాన్ని ఇస్తుంది.'ఆ లక్ష్య సాధనలో కష్టనష్టాలను చిరునగువుతో ఎదుర్కోవ డాన్ని నేర్పుతుంది. మనిషి మతం (ప్రసాదించిన విశ్వాసం, నమ్మకాలను కోల్పొయ్యాడంకే అతడు తన సొంత విషయం తప్ప మరేదాన్నీ చూడలేడు. అతని జీవితమంతా స్వార్ధం, స్వపయోజనం, స్వార్ధ్థ్య్వపియత్వాలకు (పతీకగా రూపొందుతుంది. అతనిలోనూ అడవిమృగాల్లోనూ ఎలాంటి తేడా కానరాదు. అసంఖ్యాక మానవులు, సత్యంకొరకు, ఉన్నత ఆశయం కొరకు జీవితాంతం పోరాడుతూ గడిపారని, వారు తమ ప్రాణం సయితం ఆ ఆశయసిద్ధికై అర్చించారని చరిత. తెలుపుతుంది. ఆ వ్యక్తులకు, వారుచేసిన కృషికి (పతిఫలంగా ఎలాంటి భౌతిక ప్రయోజనం ఒనగూడలేదన్నది కూడా యదార్థమే. అయితే ఇప్పుడు ఒక (పశ్న. ఈ మహనీయులంతా ఈ పోరాటాన్ని కొనితెచ్చుకోడానికి, పర్యవసానంగా భౌతిక విజయం పొందకపోవడం అలా ఉంచి, తమ వద్ద ఉన్నది కాస్తా సంతోషంగా కోల్పోవడానికి వారిని (పేరేపించిన విషయం ఏమిటి? దీనికి సమాధానం ఒక్కరే - విశ్వాసం! ఆ పవ్మితజీవుల ఉనికి ఈ విశ్వాసం సాధించిన అద్భుతం. దీనికి భిన్నంగా దురాశ, వ్యామోహం, కాపట్యం, స్వార్ధం,
ఇక మతం అవసరం లేదా ? 19
విద్వేషం, వైషమ్యం - ఇవన్నీ ఎంతో క్షుదమయిన భావాలు. వీటిద్వారా నిజమయిన, సుస్థిరమయిన విజయం అన్నది (పాప్తం కాజాలదు. వీటి పై పైమెరుగులు తాత్కాలిక మయినవే. వీటి (పభావానికి లోనయి మనిషి సత్వరమే (పాప్త్రమయ్యే (పయోజనాలను కాంక్షిస్తాడు. దీని కారణంగా మనిషిలో ఆరోగ్యవంతమయిన శీల నిర్మాణం కాజాలదు. ఇంకా అతనిలో ఓ ఉన్నత ఆశయసిద్ధికై ప్రాపంచిక సుఖాలను త్యాగంచేసి సహన స్థయిర్యాలతో సుదీర్ణ కాలంవరకు నిరంతర కృషి సలిపే ఉత్తేజమూ పెంపొందదు.
పునాదులు వేరయితే.....
కొందరు “సంస్కర్త” లనబడే వారు (ప్రేమకు బదులు ద్వేషం ద్వారా (పపంచాన్ని “సంస్కరించాల” ని పయక్నిస్తున్న విషయం మనకు తెలుసు. ద్వేషమే వారి ఊపిరి. దాని ద్వారానే వారు శక్తినీ, భుక్తినీ పొందుతుంటారు. దీని ఆధారంగానే వారు కష్టనష్టాలు అలుముకున్నప్పుడు సాహసంతో, అచంచల ధైర్య స్థయిర్యాలతో తమ “సంస్క రణాకార్యాన్ని" కొనసాగిస్తూ ఉంటారు. ఈ విద్వేష దేవతా పూజారుల ద్వేషానికి లక్ష్యం, గురి వీరి కళ్ళు తెరచిన మానవ జాతియొక్క ఒక (పత్యేక వర్గమూ కావచ్చు, (పత్యేక చారిత్రక యుగమూ కావచ్చు, లేదా మొత్తం మానవాళియే కావచ్చు! ఇంతకు, మానవత అంటే గిట్టని ఈ సంస్కర్తల వర్గం కొన్ని లక్ష్యాలను సాధించుకోవడం కూడా సాధ్యమే. ద్వేషంలోని ఉత్తేజం, దాని దహనగుణం, అందులోని సహజమయిన దౌర్జన్యం, అత్యాచారాలు - వీటి మూలంగా ఈ వర్గంలోని వ్యక్తులు తమ లక్ష్యసాధనలో స్థిర చిత్తాన్నీ (పదర్శించవచ్చు; అనేక విధాల నష్టాలనూ భరించవచ్చు. అయితే ఏ విశ్వాసం పునాదుల్లోనయితే (ప్రేమకు బదులుగా ద్వేషం స్థానమేర్పరచు కుంటుందో దాని ద్వారా మానవతకు ఎన్నడూ మంచి అన్నది జరగజాలదు. దీనిద్వారా సమాజంలోని కొన్ని చెడులు, కొన్ని అన్యాయాలు కొంతవరకు దూరం కావచ్చు. కాని ఇది మానవుల్లోని ఈ రుగ్మతల్ని సమూలంగా,
20 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
శాశ్వతంగా నిర్మూలించజాలదు. ఈ కారణం చేతనే సమాజంలోని చెడుల నివారణకై తీసుకునే కొన్ని “సంస్కరణాత్మక” చర్యల మూలంగా అవి తగ్గడానికి, అదుపులోకి రావడానికి బదులుగా అవి ఎన్నో రెట్లు పెరుగుతూనే
ఉన్నాయి.
దీనికి భిన్నంగా, ఏ విశ్వాసమయితే త్వరితంగా (పాప్తమయేే ప్రాపంచిక (పయోజనాలను లక్ష్యంగా పరిగణించదో, ద్వేష వైషమ్యాలు దేనికయితే పునాదులు కావో, మరేదయితే మనుషుల్లో (పేమ, సోదరత్వం, త్యాగం, తోటి సోదరుల కోసం (పాణమయినా సరే పణంగా పెట్టి ఉత్తమ భావాలను పెంపొందిస్తుందో వాస్తవానికి అలాంటి విశ్వాసమే మానవాళిని నిజమయిన, సుస్థిరమయిన సౌభాగ్యాలతో సుసంపన్నం చేస్తుంది. అదే సుఖవంతమయిన భవిష్యత్తుకు, _పగతికి సోపానాలు నిర్మిస్తుంది. ఈ విశ్వాసానికి మూలం దైవ విశ్వాసం, దైవ(పేమ. ఇది మనిషి యొక్క వైయక్తిక జీవితంలో పవిత్రతను సృజిస్తుంది. వ్యక్తులు తమ కర్తతో సామీప్యం పొందే మార్గం చూపుతుంది. కాని పరలోక విశ్వాసం లేనిదే దైవ విశ్వాసం, దైవ (ప్రేమలకు అర్థమే లేదు. పరలోక భావన మనిషికి ఓ విధమయిన భ్యదతా అనుభూతిని కలుగజేస్తుంది. అది మనిషికి అనంత జీవితపు శుభవార్తనిస్తుంది. తద్వారా మనిషికి, తాను తనువు చాలిస్తే అంతమయిపోతానన్న భీతి తొలిగిపోతుంది. జీవనరంగంలో తాను సలిపిన నిరంతరకృషి నిష్ఫలం కాదనీ, తన జీవన సమరానికి _పతిఫలం ఇహలోకంలో దొరక్కపోయినా రాబోయే జీవితంలోనయితే తప్పక |ప్రాప్తమవుతుందని మనిషికి హామీ లభిస్తుంది.
ఇవి కేవలం దైవ విశ్వాసం, పరలోక విశ్వాసాల మూలంగా ఒనగూడే కొన్ని సుమధుర ఫలాలు. ఇస్లాం వీటితో ఆగదు. అది ఇంకా సుదూర తీరాలకు తీసుకు వెడుతుంది. ఇంకా ఎన్నో సుందరవనాలను సందర్శింప జేస్తుంది. ఇంపయిన గాథలను వినిపిస్తుంది.
ఇక మతం అవసరం లేదా ? 21 అపారం ధి
ఎవరయితే ఇస్లాంను గతించిపోయిన గాధగా భావిస్తారో, ఇంకా నేటి కాలంలో దాని (పయోజకత్వాన్ని, ఆవశ్యకతను కాదనీ అంటారో వారు అసలు ఇస్లాం నిజ ఆశయం ఏమిటో ఎరుగరు. జీవితంలో దాని పాత ఏమిటో వారికి తెలియదు. బాల్యంలో సామాజ్యవాదుల ఏజెంట్లు పాఠ్యపుస్తకాల్లో దేన్నయితే నేర్పారో దాన్నే వారు నేటికీ చిలకలా అప్పచెబుతున్నారు. వారి అభిపాయంలో ఇస్లాం రాకకు ముఖ్యోద్దేశం: “మానవుల్ని విగవారాధననుండి విముక్తి కలిగించడం. పరస్పరం సదా కలహించుకునే అరబ్బు తెగల్ని కలిపి, ఏకం చేయడం; మద్యపానం, జూదం, బాలికా సంహారం ఇత్యాది చెడుగుల నుండి వారి (పక్షాళన చెయ్యడం. ఇంకా ఇస్లాం అరబ్బుల అంతర్గత కలహాలను అంతం చేసి వారి శక్తి సామర్థ్యాలు వ్యర్థం కాకుండా కాపాడింది. తరువాత ఆ శక్తిని ప్రపంచంలో తన సందేశవ్యాషికై వినియోగించింది. ముస్లిములు ఈ ఆశయ సిద్ధికె ఇతర జాతులతో పోరాడటం కూడా తటస్థించింది. పర్యవసానంగా నేడు కనిపిస్తున్న సరిహద్దులతో ఇస్లామీయ జగత్తు (పపంచపటంలో వెలిసింది.” ఇదీ వారి ప్రకారం ఇస్లాం ధ్యేయం. ఇంకావారు ఇలా అంటారు: “అదో చారితక ధ్యేయం. అది పూర్తయిపోయింది. (పపంచంలో విగవోరాధన అంతమయిపోయింది. అరబ్బు తెగలు గొప్పగొప్ప జాతులుగా రూపొందాయి. అందువల్ల ఇప్పుడు ఇస్లాం ఆవశ్యకత ఏ మాతం లేదు. ఎందుకంకే, మద్యపానం జూదం విషయంలో, సంస్కృతీ సభ్యతలు అభివృద్ధిచెందిన ఈ రోజుల్లో ఎలాంటి ఆంక్షలు విధించడమూ సాధ్యం కాదు.”
ఒక్కమాటలో చెప్పాలంకే వారి దృష్టిలో “ఇస్లాం ఓ (పత్యేక కాలానికి ఎంతో అనువయిన జీవనవ్యవస్థగా అలరారింది. కాని నేడు (పపంచం ఎంతో (ప్రగతి సాధించింది. దాని మార్గదర్శకత్వపు ఆవశ్యకత (ప్రపంచానికి ఏ మాతం లేదు. అందువల్ల మార్గదర్శకత్వం కొరకు దాన్ని
22 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
అర్థించే బదులు ఆధునిక దృక్పథాలు, సరికొత్త జీవన తత్వాలద్వారా మార్గం చూపే వెలుగును అరువు తెచ్చుకోవాలి. అందులోనే మన మోక్షం, సాఫల్యం ఇమిడి ఉన్నాయి.”
పడమటిగాలి సోకిన తూర్పునాటి పెద్దమనుషులు, ఈ విధంగా తమ గురువులు బోధించిన వాక్యాలు చిలకల్లా అప్పజెప్పి అనాలోచితంగా తమ సంకుచిత దృష్టిని, అవివేకాన్నీ బట్ట బయలు చేసుకుంటున్నారు. పాపం, వీరు ఇస్లాం అంటే ఏమిటో ఎరుగరు, జీవితంలో దాని వాస్తవ పాత ఏమిటో అంతకన్నా ఎరుగరు. అందువల్ల ముందుకు సాగడానికి పూర్వం ఇస్లాం అంకే ఏమిటో, అసలు దాని సందేశం ఏమిటో, ఏ ఆశయానికై అది పిలుపు నిస్తుందో చూడటం మంచిది.
విమోచనం
ఒక్క వాక్యంలో చెప్పాలంటే, బానిసత్వపు (పతిభావన నుండి విముక్తిని పొందడమే ఇస్లాం అంటే. ఏ విధమయిన బానిసత్వమయినా మానవ (పగతికి ప్రతిబంధకంగానే పరిణమిస్తుంది, మానవాళికి రుజుమార్గాన్ని మంచిమార్గాన్ని అనుసరించ నివ్వదు. ఇస్లాం అంకే స్వాతంత్య పకటన. బలాత్కారం, దౌర్జన్యం, జులుం, నిరంకుశత్వాల నుండి స్వాతంత్యం. (పజల ధన, మాన, ప్రాణాలు, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం - అన్నింటినీ దోచుకుపాయ్యే నియంతల బారినుండి" విమోచనం. ఇస్లాం మానవులకు బోధించేదేమిటి? సర్వాధికారాలకు నిజస్వామి కేవలం దైవం మా(తమే. ఆయనే మానవుల నిజమయిన పరిపాలకుడు; మానవులంతా జన్మతః ఆయన పాలితులు; ఆయనే మానవుల విధాత; ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఎవరికీ ఎలాంటి లాభమూ చేకూర్చలేరు లేక ఏ విపత్తునూ, కష్టాన్నీ దూరం చెయ్యలేరు. (ప్రళయదినాన ఆదినుండి అంతంవరకు జన్మించిన మానవులందరూ ఆయన సమక్షంలో హాజరవుతారు. ఆయన వారిలోని (పతి ఒక్కరి జీవన కర్మపత్రాన్ని
ఇక మతం అవసరం లేదా ? 23
పరిశీలిస్తాడు. ఇస్లాం నేర్చే ఈ బోధనలు మనిషిని భయభాంతులు, అన్యాయం, జులుం, దోపిడీలనుండి విముక్తం చేస్తాయి.
అంతేకాదు ఇంకా ముందుకుపోయి, ఇస్లాం మనిషికి కోరికల దాస్యంనుండి, మనోవాంఛల బానిసత్వం నుండి స్వేచ్చను (పసాదిస్తుంది. చివరికి, జీవించే ఉండాలన్న బలమయిన కోరికపట్ల కూడా నిరపేక్షతను జనింపజేస్తుంది. ఈ “ప్రాణం తీపి” బలహీనతను వాడుకునే దౌర్జ్దన్యపరులయిన పాలకులు నిత్యం, అక్రమంగా ఇతర మనుషుల్ని తమకు కట్టు బానిసలుగా చేసుకున్నారు. మనిషిలో బలహీనతే లేకపోతే అతడు ఎవరి దాస్యాన్నయినా సరే ఏనాడూ స్వీకరించే వాడూ కాడు, అన్యాయం చేసే పైశాచిక శక్తుల విలయతాండవాన్ని సహించే వాడూ కాడు. అన్యాయం, అ(కమాలముందు తలవంచి (బతికే బదులు వాటిని సాహసంగా ఎదిరించి చావడం మేలని బోధించి ఇస్లాం, మానవాళికి మహోపకారం చేసింది. దివ్యఖుర్‌ఆన్ (పబోధం :
“ఓ (పవక్తా! వారితో చెప్పివెయ్యండి, ఒకవేళ మీ తండులు, మీ కుమారులు మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధుమిత్రులు, మీరు సంపాదించిన ధనరాసులు, మందగిస్తుందని మీరు భయపడుతున్న మీ వ్యాపారం, మీకు ఎంతో ఇష్టమయిన మీ గృవోలు, మీకు దైవం, ఆయన (ప్రవక్త, ఆయన మార్గంలో కృషి సలపడం కన్నా పియతమమయినవయితే - నిరీక్షించండి - అల్లావా తన నిర్ణయాన్ని (పకటించే వరకు! నిశ్చయంగా అల్లావా దౌర్దన్యపరులకు మార్గం చూపడు”. (9:24)
సత్యం, సదాచారం, సానుభూతి, దైవమార్గంలో కృషి - అంకే జీవితపు సకల ఉన్నత పవిత్ర లక్ష్యాల కొరకు జివోద్ లేక నిరంతర కృషి - కి మారుపేరే 'దైవపేమి. దీన్నే మనిషియొక్క అంతులేని కోరికలకు, మనోకాంక్షలకు ఎదురుగా నిలుపుతుంది ఇస్లాం. ఈ కోరికల్ని దైవ్యపేమకు లోబడి ఉంచాలని బోధిస్తుంది. గుడ్డికోరికల కళ్ళెంలేని గురాన్ని దైవ్యపేమ
3
24 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
ద్వారా అదుపులోకి తేవడాన్ని నేర్పుతుంది. జీవితంలో కేవలం దైవ(పేమకే ఆధిక్యత ఉండాలని, అదే అసలు కర్తత్వ్వ శక్తిగా నెలకొనాలని కోరుతుంది. ఈ భాగ్యానికి నోచుకోని వ్యక్తి అసలు ముస్లిం కాజాలడు.
జీవితాశయం
ఆశామోవోలకు, మనోకాంక్షలకు దాసుడయిన ఒక వ్యక్తి తన (హస్వదృష్టి కారణంగా, ఇతరులకంటే తన జీవితం ఎక్కువగా ఫలవంతమయిందని, సుఖసంతోషాలతో సౌభాగ్యాలతో విలసిల్లుతోందని (భమకు లోనవ్వడం సాధ్యమే. కాని ఈ తప్పుడు భావనకు శిక్ష అతడు అనతికాలంలోనే అనుభవించవలసి ఉంటుంది. అతడు ఏమరుపాటునుండి మేల్కొన్నప్పుడు, తాను మనోకాంక్షలకు కట్టు బానిస అయిన సత్యాన్ని గుర్తిస్తాడు. అలాంటి వ్యక్తికి అనంత శూన్యం, అంతులేని నిరాశా నిస్పృహలు, అంతంకాని అశాంతి తప్ప మరేదీ మిగలదు. ఎందుకంకే మనిషి ఒకసారి తన మనోకాంక్షల సన్నిధిలో మోకరిల్లాడంకే మరెప్పుడూ వాటిపై అదుపును సాధించలేడు. ఇంకా, కోరికలు ఎంతగా బలిసిపోతుంటాయో వాటి దాహం కూడా అంతే పెరుగుతూ పోతుంది. చివరికి మానవులు, పశుత్వపు నీచాతినీచ స్థాయికి దిగజారిపోతారు. రుచులు మరిగి వాటిలో ఎంతగా తేలియాడుతూ ఉంటారంటే, వారికి మరే వస్తువు స్పృహ కూడా ఉండదు. జీవితం పట్ల ఇలాంటి వైఖరి మానవాళిని (పగతి వైపుకు - అది భౌతిక (పధానమయినదయినా ఆధ్యాత్మిక మయినదయినా - గొనిపోజాలదు. ఏ విధమయిన (పగతి సాధించాలన్నా మనిషి తన పాశవిక కాంక్షల దాస్యం నుండి విమోచనం పొందడం మొదటి షరతు. ఆ తరువాతనే వైజ్ఞానిక, కళాత్మక, ధార్మికరంగాల్లో దేనిలోనయినా _పగతి అన్నది సాధ్యమవుతుంది.
అందువల్లనే ఇస్లాం, కాంక్షల దాస్యంనుండి విమోచనానికి ఎంతో (పాముఖ్యాన్నిచ్చింది. అయితే దానిగ్గాను సన్యాసత్వం వహించాలని అది కోరదు, లేక పరిశుద్ధమయిన వాటిని అనుభవించరాదని ఆంక్షలూ
ఇక మతం అవసరం లేదా ? Pin]
విధించదు. ఈ అతివాదాలను కాదని అది మధ్యేమార్గాన్ని ఎన్నుకుంటుంది. ఇస్లాం మనిషికి తెలిపేదేమంకే ఈ (పపంచం నీ కొరకేకాని నీవు మటుకు ఈ (పపంచం కొరకు కాదు. అందువల్లనే రుచులు మరగడం, కోరికల దాస్యం, మనిషి స్థాయికంకే ఎంతో అధమమయినవి. ఈ (పాపంచిక సరంజామా అంతా మనిషికి (పసాదించడానికి కారణం మనిషి వీటి ద్వారా తన ఉన్నత జీవితాశయాన్ని సాధించాలన్నదే. మానవుని జీవితాశయం, మానవాళికి పరిపూర్ణత సిద్ధింపజేసే దైవమార్గదర్శకత్వపు వెలుగును - దైవధర్మాన్ని - మానవులందరి మధ్యనే సర్వవ్యాప్తం చెయ్యడం తప్ప మరేమీకాదు.
ఇస్లాం దృష్టిలో మానవ జీవితానికి రెండు స్పష్టమయిన లక్ష్యాలున్నాయి. ఒకటి (పతి మనిషికి అతని వ్యక్తిగత జీవితంలో, పరిశుభమయిన, పరిశుద్ధమయిన జీవితం గడిపేందుకు అవసరమయిన వస్తుసామ(గి లభించాలన్నది. రెండవది, సామూహికరంగంలో, అతని శక్తి సామర్థ్యాలన్నింటినీ, మానవాళియొక్క సామాన్య (ప్రగతి వికాసాలకు వినియోగించే ఓ ఉత్తమ సమాజం ఉనికిలోకి రావాలన్నది; తద్వారా మానవ నాగరికతా మహా పస్థానం, ఇస్లాం వెలుగుబాటపై సాఫీగా కదలిపోవాలన్నది; వ్యక్తీ, సమాజాల మధ్య సమతూకం నెలకొని, వీటిలో దేని హక్కులు కూడా భంగపడకుండా పురోగమించాలన్నది.
భావ స్వాతంత్యం
మానవ చింతనా పథానికి విస్తృత స్వేచ్చ నివ్వడంలో, ఇస్లాం, పభావ వంతమయిన శక్తిగా ముందుకు వస్తుంది. ఇస్లాం, గుడ్డి నమ్మకాలకూ మూఢాచారాలకు బద్ధ విరోధిగా సదా నిలిచింది. చరిత గతిలో మానవాళి ఏ ఆలోచన, ఆచరణల మార్గవిహీనతలకు, వ్యకవైఖరులకు లోనవుతూ వచ్చిందో వాటిలో కొన్ని మానవుల కాల్పనిక శక్తిలోనుండి ఉద్భవించిన విషయం యదార్థమే. ఆనాటి (పజలకు దాని గురించి బాగా తెలుసు కూడా. కాని కొన్ని వ్యకమార్గాల వంశవృక్షం, మనిషి నిర్మించుకున్న “దేవతా
26 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
మూర్తుల కు చేష్టలతో పోయి కలుస్తుంది. అంటు ఇస్లాంకు పూర్వం మానవచింతనా గమనం చీకట్లలో దారి తెన్నూ లేని విధంగా సాగుతూ ఉండింది. ఇస్లాం ఆవిర్భవించి దానికి పాజ్ఞత, పటిష్టతలను (పసాదించింది. ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం, దేనమాల, గాధలు, ఇ్యససాయీలీయుల కట్టు కధలు, |క్రెస్తవ కల్పనలు - ఇవన్నీ అపరిపక్వమయిన, అపసవ్యమయిన దృక్పథాలను, ఆలోచనా విధానాలను సృజించాయి. వీటినుండి, వీటిరూపంలో పవంచాన వ్యాప్తిచెందిన అంధవిశ్వాసాలు, మూఢాచారాలనుండి మానవచింతనకు విమోచనం (పసాదించిందెి ఇస్లాం. మరోసారి మానవుల్ని వారి నిజధర్మం సమక్షంలో, వారి నిజ[పభువు సన్నిధిలో నిలబెట్టింది.
ఇస్లాం (పత్యేకత ఏమిటంటే దాని పరిభాష బోధనలు ఎంతో సాధారణమయినవి, సరళమయినవి, సుబోధకములయినవి. ఇందులో మింగుడు పడని విషయాలు లేవు చిక్కు వీడని ముడులూ లేవు. దీన్ని అర్థం చేసుకోవడమూ కష్టంకాదు, దాన్ని (గ్రహించి గుర్తించి విశ్వసించడమూ అసాధ్యం కాదు. ఇస్లాం కోరేదేమంకే, మనిషి తన సహజ శక్తి సామర్థ్యాలను పరిపూర్ణంగా వినియోగించి తనచుట్టూ వ్యాపించి ఉన్న జీవనకళ, విశ్వ వ్యవస్థలను గురించి ఇతోధికంగా జ్ఞానం సముపార్టించాలి. (పకృతి రహస్యాలను కనుగొనాలి. ఎందుకంకే ఇస్లాం మౌలికంగా, హేతువుకూ మతానికీ, ఆ మాటకు వస్తే సైన్సుకూ మతానికి సహజంగానే రాజీ కుదరదని, వైరం, వైషమ్యం ఉందన్న విషయాన్ని అంగీకరించదు. దైవ విశ్వాసం అంటే అర్థంకాని, చిక్కులతో కూడుకున్న నమ్మకాలను, దృక్పథాలను మనిషి విశ్వసించాలన్న కట్టడి కూడా అదిపెట్టదు. అదే విధంగా వైజ్ఞానిక యదార్థాలను నమ్మడానికి తప్పనిసరిగా దైవాన్ని తిరస్కరించి నాస్తికతను అవలంబించవలసిన అవసరముందని కూడా అది మనిషిని బలవంత పెట్టదు. అంతేకాదు ఇస్లాం మనిషికి విస్పష్టంగా చెబుతుంది: ఈ (ప్రపంచంలో మనిషికి లభ్యమయిన వస్తు సామ్యగి అంతా దైవం తన అపార కరుణాను (గ్రహాలతో (పసాదించినవే. అందువల్ల మనిషి తన వైజ్ఞానిక పరిశోధనల ద్వారా ఏ కొంగ్రొత్త నిధుల్ని కనుగొంటాడో ఏ (పయోజనాలు పొందుతాడో అవి కూడా వాస్తవానికి ఆ పరమ కృపాలుని అనంతకారుణ్య కటాక్షాలకు
ఇక మతం అవసరం లేదా ? 27
ఓ నిదర్శనం మ్యాతమే. అందువల్ల మనిషి ఆయనకు కృతజ్ఞుడయిన దాసునిగా మెలగాలి. ఇంకా ఇతోధికంగా కృషి జరిపి చిత్తశుద్ధి, త్యాగనిరతి గల దాసునిగా ఆ (పభువు సమక్షంలో నిరూపించుకోవాలి. ఇస్లాం, విజ్ఞానాన్ని, సైన్సును, చెడుగా, దైవ విశ్వాసానికి పతికూలమయిందిగా లేక దానికి భిన్నమయిందిగా భావించదు. దానికి బదులుగా విజ్ఞానం దైవ విశ్వాసంలో విడదీయరాని భాగంగా పేర్కొంటుంది.
పైన పేర్కొన్న సమస్యల పరిష్కారాలను మనిషి నేటికీ కనుగొనలేక పోతున్నాడు. ఉన్నతమయిన మానవ ఆశయాలు ఇంకా సిద్ధించలేదు. మనిషి నేటికీ అనేకానేక విధాలుగా అవకతవకలకు గురవుతున్నాడు. ఎన్నో రీతులుగా వంచనలకు లోనవుతున్నాడు. నిరంకుశ పాలకులు, నియంతల మధ్య నేటికీ ఊపిరి సలపని వాతావరణంలో మనిషి జీవిస్తున్నాడు. మానవత వారి అన్యాయాల, అ(క్రమాల (కింద ఇంకా ఆ(కందన చేస్తూనే ఉంది. మానవత అన్నింటా, పశు ప్రాయమయిన కోరికలు, రుచులకు దాసోహమంటున్నది. అందువల్లనే మానవునికి మార్గదర్శకత్వం వహించడంలో ఇస్లాం ఇంకా ఎంతో ఉజ్వలమయిన పాత నిర్వహించవలసి ఉంది.
కొత్త దేముడు
నేటికీ పపంచ జనాభాలో సగభాగం పూర్వకాలంలోనే విగవారాధనలో మునిగి తేలుతోంది. భారతదేశం, చైనా, ఇంకా (ప్రపంచంలో అనేక దేశాలను ఈ సందర్భంలో పేర్కొనవచ్చు. మిగతా (పపంచం కూడా అత్యధిక భాగం మరో మిధ్యా దైవం ఆరాధనా బంధాల్లో చిక్కుకుని ఉంది. ఈ కొత్త మిధ్యా దైవం మానవచింతన, భావనాలోకంలో అలజడి రేపడంలో తక్కువ తిన్నదేమీకాదు. ఈ సరికొత్త దైవమే ఆధునిక విజ్ఞానశాస్త్రం.
విశ్వవ్యవస్థకు సంబంధించిన విషయజ్ఞానానికి మార్గం కావడం చేత
28 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
సైన్సు శక్తివంతమయిన సాధనం. దీని దృష్ట్యా ఇంతవరకు అది సాధించిన ఘనకార్యాల పట్టిక కూడా ఎంతో ఘనంగానే ఉంది. కాని ఈ (పకాశవంతమయిస విజయాలన్నీ పాశ్చాత్యులు చేసిన ఓ ఘోరమయిన పొరపాటు కారణంగా నిరాశా నిస్పృహలుగా మారిపొయ్యాయి - వారు సైన్సును 'దైవం' స్థానంలో (ప్రతిష్టించారు. దాన్ని మనిషియొక్క భక్తీ (పతిపత్తులకు, విధేయతా స్వయం సమర్పణలకు ఏకైక కేం[దంగా (పకటించారు. పాశ్చాత్యులు చేసిన ఈ ఘోరమయిన పొరపాటుకు ఫలితంగా వారు అనుభవాత్మక (EMPIRICAL SCIENCE) సైన్సు యొక్క పరిశీలనల పరిమిత సాధనాలు తప్ప అపార విజ్ఞానానికి సాధ్యమయిన అనేక మార్గాలకు దూరమయ్యారు. మానవత తన ఆశయానికి, గమ్యానికి ఇంకా చేరువ కావలసిందల్లాపోయి అది ఇంకా సుదూరాలకు వెళ్ళిపోయింది. మానవుని ఎదుట, (పగతీ వికాసాలకు, కృషికి పాప్త్రమయిన అవధుల్లేని అవకాశాలు, పాశ్చాత్యుల సంకుచితదృష్టి, భౌతికతా (పధానమయిన సైన్సువల్ల జనించే అనివార్యమయిన పరిమితులకు గురయ్యాయి. ఎందుకంటే సైన్సు కేవలం బుద్ధి ఆధారంగానే పురోగమించగలదు. అది మానవత పయనించే ఉన్నత స్థానాలను చేరుకోజాలదు. మానవత బుద్ధి మరియు ఆత్మ రెంటి సహకారాన్నీ పొందుతుంది. అప్పుడే దానికి తన కర్త సామీప్యాన్ని, పరమసత్యం పట్ల (పస్ఫుటమయిన చైతన్యాన్ని పొందే అర్హత కలుగుతుంది.
సైన్సు ఆధిక్యతా వాదనను బలపరిచేవారు సైన్సు మాతమే జీవితం యొక్క మదిలో ఈ విశ్వం యొక్క రహస్యాలను ఛేదించి మానవునికి పరిచయం చెయ్యగలదని వాదిస్తారు. అందువల్ల వారి (పకారం, సైన్సు దేన్నయితే సమర్ధిస్తుందో అది మా(తమే వాస్తవం, సత్యం. మిగతాదంతా అర్థంలేని వ్యర్థం, చెత్త. తమ వాదనా ఆవేశంలో ఈ పెద్దమనుషులు, సైన్సు సాధించిన వింతయిన ఘనకార్యాలు ఎన్ని ఉన్నా అది ఇంకా శెశవదశలోనే ఉందన్న వాస్తవాన్ని మరచిపోతూ వుంటారు. ఇప్పటికీ అనేక విషయాల్లో దానికి తెలిసింది బహుస్వల్బం; విశ్వసించ దగనివి ఇంకా ఎన్నో! ఎందుకంటే దాని పరిధి పరిమితమయింది, దాని
ఇక మతం అవసరం లేదా ? 29
పరిశీలన స్థూలమయింది; వాస్తవికత లోతుల్లోకి పోయి పరిశీలించే యోగ్యతే దానికి లేదు. ఇదంతా తెలిసీ, చూస్తూ ఈ మహనీయులు “ఆత్మ” అన్నదేదీ అసలు లేనే లేదనే పిడివాదాన్ని మటుకు పట్టుకు (వేల్లాడుతుంటారు. వీరి దృష్టిలో మనిషి, తన జ్ఞానేందియాల అవధుల్ని దాటి అగోచరమయిన తెరల చాటున ఉన్న (పపంచంతో అసలు ఎలాంటి సంబంధమూ పెంపొందించుకోలేడు. ఆ సంబంధం స్వప్నావస్థలోనయినా లేక కెలివతి (TELEPATHY) * ద్వారానయినా సరే సాధ్యంకాదని అంటారు. ఆధునిక యుగంలో ఆత్మ ఉనికిని కాదనడానికి కారణం ఏ అనుభవమో, (పయోగమో, పరిశీలనో ఎంతసేపటికీ కాదు. అసలు కారణం అనుభవాత్మక విజ్ఞానం, దాని అసంపూర్ణమయిన, అసంగతమయిన, అననుకూలమయిన పరికరాల అసమర్థత మ్యాతమే. ఈ లోపాల కారణంగా అది సృష్టి రహస్యాలను కనుగొనడంలో తీవంగా విఫలమయింది. వైజ్ఞానికులు తమ సొంత బుద్ధీ వివేకాల ఆధారంగా (పపంచంలో ఆత్మకు అసలు స్థానమే లేదన్న నిర్ణయానికి వచ్చారు.
సామరస్యానికి ఒక్కతే మార్గం
ఇదీ ఆధునిక మానవుడు లోనయి ఉన్న విజ్ఞాన వంతమయిన
FN.* :-TELEPATHY అంటే ఓ వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఆలోచనల్ని చేరవెయ్యడం. దానికి సంబంధించిన చరిత (పసిదధ్ధమయిన దృష్టాంతం బహుశా హ(జత్ ఉమర్ (రజి అన్) కు సంబంధించిందే. ఆయన ఖలీఫాగా ఉన్నకాలంలో ఓసారి జుమ్మాపసంగం' సందర్భంలో తన ఉపన్యాసాన్ని విరమించి అకస్మాత్తుగా, వందలాది మై ళృదూరాన ఉన్న తన సేనాపతిని సంబోధించి “సారియా! కొండవైపుకు, సారియా కొండవైవుకు” అని కేక వేశారు. హ్యజత్ సారియా వందలాది మైళ్ళ దూరాన్నుండి ఆ మాటలు విని సైన్యాన్ని కొండవైపుకు మరల్పుకు పొయ్యారు. తద్వారా మాటువేసి కూచున్న శతుసైన్యం బారినుండి తప్పించుకున్నారు. ఆ తరువాత దానిపై విజయం కూడా సాధించారు. నేడు టెలిపతిని ఓ యదార్ధంగా గుర్తించినా ఆధునిక శాస్తుజ్జుడు తన దురభిమానం సంకుచితత్వం వల్ల అందులో "ఆత్మ" (ప్రమేయం ఉందనే విషయాన్ని ఏ మాతం ఒప్పుకోడు. దాన్ని అనిర్వచనీయమయిన ఆరవ ఇందియశక్తి యొక్క
పనితనంగా చెప్పుకుని తృప్తి చెందడానికి నిష్టల ప్రయత్నం చేస్తుంటాడు.
30 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
అజ్ఞానం . దీన్నిబట్టి, నేడు ఇస్లాం ఎంత అవశ్యమయిందో అంచనా వెయ్యవచ్చు. ఎందుకంకే దాని ద్వారానే మనిషి ఆధునిక మరియు (ప్రాచీన మూఢత్వాల ఊబినుండి విముక్తి పొందగలడు. మానవ బుద్ధీ వివేకాలు, ఆత్మకు నిజమయిన స్వేచ్చా స్వాతంత్ర్యాలు (పాప్తం కావాలంటే ఈ విమోచనం అవసరం. కేవలం ఇస్లాం మ్మాతమే మతం మరియు సైన్సు యొక్క సంఘర్షణను రూపుమాపి వాటిమధ్య శాంతి, సామరస్యాలను స్థాపించగలుగుతుంది. అప్పుడే నేటి బాధ్యాగస్త (పపంచంలో శాంతి సుఖాల సంపదలు వెల్లివిరుస్తాయి. అప్పుడే పాశ్చాత్యుల అవివేకంవల్ల జీవితంలో పొడసూపిన వ్యకవైఖరి అంతమయి మనిషి హేతువుకు అతని అంతర్గత (ప్రేరణలకు ఏర్పడ్డ వైరుధ్యం దూరమవుతుంది. అప్పుడే మనిషిలోని వైజ్ఞానిక తృష్టకు, దైవం కొరకు అతని తహతహకు మధ్య సామరస్యం ఏర్పడుతుంది.
దేవతలూ! తప్పుకోండి
చార్మితకంగా, ఆధునిక యూరపు సంస్కృతి, రోమను స్మామాజ్యం ద్వారా పాచీన (గ్రీకు సంస్కృతిని వారసత్వంగా తెచ్చుకుంది. పాచీన (గీకు సంస్కృతిలో మనిషీ అతని దేవతల సంబంధం శత్రుత్వం ఆధారంగా ఏర్పడుతుంది. వారి మధ్య నిత్యఘర్షణ, అనుదినం పోరాటం కానవస్తుంది. ఈర్వ్యా ద్వేషాలతో నిండిన ఈ దేవతలకే సాధ్యమయితే అవి మనిషిని సృష్టిలోని నిగూఢ రహస్యాలు కనుగొనే అవకావం ఇచ్చేవికావు. పర్యవసానంగా మనిషి నేడు సృష్టి సంపదల్ని కైవసం చేసుకుని పొందుతున్న సౌలభ్యాలు, సౌఖ్యాలు మనిషికి కరువయ్యేవి. ఈ (గీకు దృక్పథం దృష్ట్యా, మనిషి సాధించిన (పతి వైజ్ఞానిక విజయం, ఈర్చ్యాపరులయిన ఈ దేవతలపై మనిషి ఎగురవేసే సరికొత్త విజయపతాక అన్నమాట! ఓ కొత్త వైజ్ఞానిక ఆవిష్కరణ జరిగినప్పుడల్లా “దేవతలు మరోసారి ఓడి పొయ్యారు” అన్నమాట!
ఇక మతం అవసరం లేదా ? 31
(గీకు సంస్కృతి యొక్క ఈ అపరిశుద్ధాత్మయే ఆధునిక యూరపు అధః చేతనలో ఉండి అప్పుడప్పుడు వ్యక్తమవుతూ ఉంటుంది కూడా. ఒక్కోసారి యదార్థాలకు, భావార్థాలు కల్పించేటప్పుడు, అది (పస్ఫుటమవుతుంది. ఈ కారణంగానే ఆధునిక పాశ్చాత్య సైంటిస్టు సైన్సు విజయాలను ఓ పత్యేక రూపంలో బహిర్గతం చేస్తాడు - ఏదో గొప్ప శక్తితో మనిషి పోరాడి దాన్ని సాధించినట్లుగా, తత్ఫలితంగా సృష్టిశక్తులనే క్రమేణ తన అధీనంలోకి తీసుకుంటున్నట్లుగా (పకటిస్తాడు. దీని భావమేమంకే, ఇంతకాలం ఓ అగోచర దైవం ఎదుట మనిషి తలవంచుతూ వచ్చాడంకే దానికి కారణం, అతనిలో ఉన్న అశక్తతా భావం మా(తమే. అయితే సృష్టికి (పతిగా సైన్సు సాధించే అపూర్వ విజయాల ఫలితంగా మనిషిలోని ఈ అశక్తత క్రమేపి స్వయంగా దూరమయిపోతుంది - మనిషి దైవత్వానికి చేరువయిపోతాడు; సృష్టి, జీవన్మరణాలు అన్నింటి నిగూఢ రహస్యాలను తెలుసుకుంటాడు, (పయోగశాలలో జీవపదార్థాన్నే సృజించ గలుగుతాడు - ఈ ఘనకార్యం సాధించిన తరువాత అతనిలోనూ దైవం అనబడే శక్తిలోనూ ఇక ఎలాంటి వ్యత్యాసమూ మిగలదు! ఆ తరువాత మనిషికి తాను తప్ప ఇతరుల ఎదుట మోకరిల్లే ఆవశ్యకతే ఉండదు!! ఇదీ రోమను స్మామాజ్యం ద్వారా యూరపుకు అబ్బిన (గీకు సంస్కృతిలోని “అపరిశుద్ధాత్మ' తెచ్చే పరిణామం.
ఆధునిక పాశ్చాత్య జగత్తు నేడు ఏ ఆధ్యాత్మిక రుగ్మతలకు ఆలవాలమయి ఉందో వాటిలోకెల్ల ఇది అత్యంత అపాయకరమయింది. ఇది మానవ జీవితంలో విషాన్ని నింపింది. మానవతను ఛిన్నాభిన్నం చేసివేసింది. మానవులు పరస్పరం పీక్కుతినే స్థితికి దిగజారారు. జీవితంలో శాంతి, (పశాంతత, తృప్తి అన్నవి కరువయ్యాయి. మనుగడలో అందం ఆనందం పూజ్యమయ్యాయి. అయితే ఈ పరిస్థితుల్లోనూ ఓ ఆశాకిరణం తళుక్కుమంటుంది. అదే ఇస్లాం! దైవంలేని పాశ్చాత్య నాగరికత తెచ్చిన వినాశాన్ని తప్పించుకోవాలంకే దైవాదేశాల వైపుకు మరలడం తప్ప గత్యంతరం లేదు. అది మనిషికి ఓ ఆరోగ్యవంతమయిన జీవన దృక్పథాన్ని అందజేస్తుంది. అది మనిషికి తెలుపుతుంది: ప్రపంచంలో నీకు (పాప్రమయ్యే
32 స ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
శాస్త్రీయ, భౌతిక, ఆధ్యాత్మిక విజయాలు వాస్తవానికి దయామయుడయిన నీ పభువు కృపానుగహాల ఫలితంగానే లభించాయి. ఈ విజయాలను నీవు తోటి మానవ సోదరుల సేవలో వినియోగించావంకే ఆయన నీ ఎడల (పసన్నుడవుతాడు. నీకు బహుమానాలనిస్తాడు. విజ్ఞానాన్వేషణలోనూ, సృష్టిరహస్యాల ఆవిష్కరణలోనూ నీవు చేసే కృషివల్ల ఆ(గహం చెందడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన సృష్టిరాశిలోని వారెవరూ తన విజ్ఞానం కారణంగా ఆయన దైవత్వానికి ఎన్నడూ (పమాదంగా పరిణమించలేరని. మానవులు తమ విజ్ఞానాన్ని, (పావీణ్యాల్ని, వైజ్ఞానిక పాటవాన్ని తోటి మానవ సోదరుల (శ్రేయ సంక్షేమాలకు కాక వారి వినాశానికి వినియోగించినప్పుడే ఆయన ఆ(గహోద(గుడవుతాడు.
చిల్లర దేవుళ్ళు
నైతిక ఆచరణరీత్యా ప్రపంచం నేడు ఏ స్థానంలోనయితే ఉందో నేటికి 13 వందల ఏళ్ళ (క్రితం కూడా ఆ స్థానంలోనే ఉండింది. ఆనాడూ మనిషిపై మనిషి అత్యాచారం,జులుం చేశాడు. నేడూ అదే జరుగుతోంది. ఆనాడు దాన్ని మిథ్యాదేవుళ్ళ సంకెళ్ళ నుండి విమోచనం (పసాొదించింది ఇస్లామ్ మ్యాతమే. నేటి మిథ్యాదైవాల పంజానుండి మానవతకు ముక్తి నిచ్చేది కూడా ఇస్లామ్ ఒక్కరే. ఈ దేవుళ్ళు నేడు సరికొత్త రూపాలు ధరించారు. నేడు జులుం, అత్యాచారాలు, రాచరికం, సామ్యవాదం, పెట్టుబడిదారీ రూపాల్లో కానవస్తోంది. ఓ వైపున పాషాణ హృదయం గల పెట్టుబడిదారీ విధానం శ్రామికుల రక్తాన్ని పీల్చి తన బొక్కసాలను నింపుకుంటూ ఉంకే మరోవైపున శ్రామిక నియంతృత్వం పేరిట కొందరు తమ దైవత్వపు దర్చారును తీర్చిదిద్దుకుంటున్నారు. వీరు (పజాభ్మిపాయం పేరుతో ప్రజల స్వేచృల్ని కాలరాచి (ప్రజాభీష్టాన్ని పూర్తి చేస్తున్నట్లు (పకటిస్తారు.
ఇస్లామ్ మానవునికి స్వేచ్చా స్వాతంత్యాల సందేశాన్నిస్తుందన్న ఈ
ఇక మతం అవసరం లేదా ? 33
వాదన విని, ముస్లిం దేశాల్లో స్వయంగా ముస్లింలపై ఇస్లాం పేరుచెప్పి దురాగతాలను సాగిస్తున్న నియంతల పంజా నుండి విముక్తి ఎందుకు (పసాదించదు ఇస్లాం అని ఎవరయినా అడగవచ్చు. ఈ నియంతలు ఇస్లాం పేరును వినియోగించుకుంటున్నారన్న విషయం వాస్తవమే అయినా వీరి పరిపాలనలో వీరి జీవితాల్లోనూ ఇస్లాంకు ఎలాంటి స్థానం, అధికారాల్లేవన్నది కూడా యదార్ధమే. పేరుకు ముస్లిములయిన ఈ పెద్ద మనుషుల కోవకు చెందిన వారిని గురించి దివ్యఖుర్‌ఆన్ ఈ విధంగా (పకటిస్తోంది.
ఎవరయితే అల్లావా అవతరింపజేసిన శాసనం (పకారం నిర్ణయాలు చెయ్యరో వారే అత్యాచారులు, దౌర్జన్యపరులు. (5:44)
ఓ (పవక్తా! నీ (ప్రభువు సాక్షిగా, వీరు విశ్వసించిన వారు కాలేరు - తాము పరస్పరం విభేదించుకున్న విషయాల్లో నిన్ను న్యాయ నిర్ణేతగా అంగీకరించనంతవరకు. ఇంకా నీవు చేసిన తీర్పుపట్ల తమ ఆంతర్యాల్లోనూ వీరు ఎలాంటి సంకోచం కలిగి ఉండరాదు; దాన్ని పూర్తిగా శిరసావహించి దానికి లొంగిపోవాలి.
(4:65)
వీరిది ఇస్లాం కాదు
మేము ఏ ఇస్లాం వైపుకు (పజల్ని పిలిచి, ప్రజలు దాన్ని తమ జీవితాల్లో మార్గదర్శకంగా స్వీకరించాలని కోరుతున్నామో, దానికీ ఆధునిక ముస్లిం పాలకులు అనుకరించే “ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదు. ఈ పాలకుల హృదయాల్లో దైవాజ్ఞల కొరకు ఎలాంటి ఆదరాభిమానాలు లేవు. వారు, తాము కోరినప్పుడల్లా ఆయన ఆదేశాలను (తోసిరాజని ఇష్టారాజ్యం కొనసాగిస్తూ ఉంటారు. ఇలా చేసేటప్పుడు వారికి ఏ విధమయిన లజ్జ, అభిమానం అడ్డురావు. వారు తమకు ఇష్టమయింది
34 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
విది ఎక్కడ లభిస్తే దాన్నే (గహిస్తారు. అవి యూరపు దేశాల్లో మానవులు నిర్మించుకున్న శాసనాలయినా లేక షరీఅత్ చట్టాలయినా సరే. ఏదయితే వారి అభిలాషలకు, వారి (పయోజనాలకు (పతికూలమయిందో దాన్ని వారు (తోసిపుచ్చుతారు. వీరు ఇటు మానవులకూ విశ్వసనీయులు కారు అటు దైవానికీ కారు. వారు మానవుడు, దైవం-ఉభయులపట్ల అత్యాచారానికి, అపచారానికి ఒడిగడుతున్న అపరాధులు. ఎందుకంకే వీరు ఒక విషయాన్ని స్వీకరించడానికయినా, తిరస్కరించడానికయినా వినియోగించే ప్రమాణం సత్యం, సత్య(పియత్వం కావు - వ్యక్తిగత (పయోజనాలు, ఆశావ్యామోహాలే.
మాకు తెలిసిన ఇస్లాం, దురహంకారులయిన రాజులను, తలబిరుసు తనంగల పాలకులను అసలు ఏ మాతం సహించదు. అది వీరినీ సామాన్య (పజల మాదిరిగానే దైవశాసనాల బంధాల్లో బంధిస్తుంది. కాకపోతే వారిని శాశ్వతంగా అంతం చేస్తుంది. ఎందుకంటే:
ఏదయితే వ్యర్థమయిన పైనురుగో అదంతా ఎగిరి పోతుంది. మరేదైతే మానవులకు (పయోజనకరమయిందో అది భువిలో' నిలిచిపోతుంది. (37)
పరిపాలన * _పజలహక్కు
మరో విధంగా చెప్పాలంకే ఇస్లాం అహంభావాన్ని, నియంతృత్వాన్ని సహించేందుకు సిద్ధంగా లేదు. అలాగే అది మనిషికి, తనలాంటి మానవులపై దైవం, దైవ్యపవక్తల అభీష్టాన్ని కాదని తన సొంత ఆజ్ఞల్ని జారీచేసే అనుమతినీ ఇవ్వదు. దాని (ప్రకారం పాలకుడు దైవానికీ (పజలకూ జవాబుదారుగా నిలువాలి. ఈ జవాబుదారీ కారణంగానే అతడు మానవుల్లో దైవాజ్ఞల్ని చెలాయించేందుకు బాధ్యుడవుతాడు. అతడు తన ఈ విద్యుక్తధర్మాన్ని నిర్వర్తించడంలో ఏ మ్మాతం విఫలమయినా (పజల
ఇక మతం అవసరం లేదా ? 35
విధేయతను పొందే అర్హత కోల్పోతాడు. ఈ యదార్భాన్ని ఇస్లామీయ రాజ్యానికి తొలి ఖలీఫా అయిన హృ్మజత్ అబూబ్యక్ (రజిఅన్) తన ప(పథమ (పసంగంలో ఈ విధంగా (పస్తావించారు:
నేను దైవవిధేయతను పాటించేవరకు మీరు నన్ను అనుసరించండి. కాని నేను దైవ విధేయతా పరిధుల్ని అతి (కమిస్తే ఆ తరువాత నా విధేయత పాటించడం మీ బాధ్యతకాదు.
దీని ద్వారా తెలిసేదేమంకే ఇస్లాం ప్రకారం పాలకునికి, (పభుత్వ ధనాగారం పైనా, దేశ శాసన నిర్మాణ కార్యంలోనూ గల అధికారం, ఓ సాధారణ పౌరునికి గల హక్కుకన్నా ఏ మాతం అధికం కాదు. మరో విషయం ఏమంటే ఒక వ్యక్తి పాలనాధికారాలను పొందాలంకే సంఘసభ్యులు అతన్ని తమ స్వేచ్చ్భాభిమతంతో ఎన్నుకుని ఆ బాధ్యతను అప్పగించాలి. ఆ ఎన్నికలు, స్వేచ్చాయుత వాతావరణంలో, న్యాయవంతంగా, నిష్పాక్షికంగా జరగాలి. వాటిలో న్యాయం, సభ్యతా సంస్కారాలు, మంచితనం లాంటి ప్రామాణిక కట్టుబాట్లు తప్ప (పజలపై మరే విధమయిన నిర్భంధం ఉండరాదు.
స్నామాజ్యవాదానికి తిరుగుబాటు
ఇస్లామీయ రాజ్యం తన పౌరులకు కేవలం అంతర్గత దౌర్జన్యపరులయిన వారి బారినుండి రక్షణ నివ్వడం మ్యాతమే కాదు, వెలుపలి దురాక్రమణల నుండి కూడా భదత కల్పిస్తుంది - ఈ దుర్మాకమణ స్మామాజ్యవాదుల దోపిడి రూపంలో దాపురించినా లేక మరే రూపం :ధరించి వచ్చినానరే. ఎందుకంటే ఇస్లాం స్వయంగా మహోజ్వలమయింది, శక్తిమంతమయింది. మనిషి దిగజారి మిథ్యా దైవమయిన సామాజ్యవాదం ముందు మోకరిల్లడాన్ని అది ఏమ్యాతం సహించదు. ఇస్తాం మనిషికి ఎంతో సాధారణమయిన జీవన వ్యవస్థనిస్తుంది.
36 ఇస్లాం అపార్థాల మబ్బుల్లొ
మనిషి తన (పభువు (ప్రసన్నతను పొందడానికి మనస్ఫూర్తిగా ఆయన మార్గంలో నిరంతర కృషి జరపాలని అతనికి ప్రేరేపిస్తుంది. మనిషి తన ఇష్టాన్ని దేవుని ఉచృతర ఇష్టం సమక్షంలో పూర్తిగా సమర్పించుకోవాలని, ఆయన ఆజ్ఞాపాలనలో తన యావత్తు సాధనా సంపత్తిని వినియోగించి దౌర్జన్యాన్ని, సామాజ్యవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలని బోధిస్తుంది.
అందుకే అందరూ కలిసి ఇస్లాం ఆశయాన్ని పొందాలి. అప్పుడే పపంచం నుండి స్మామాజ్యపు చిహ్నాలన్నీ సమసిపోతాయి. మానవాళిని స్మామాజ్యవాదపు పిడికిలి నుండి రక్షించి, భూమండలాన్ని తన అత్యాచారాలకు ఆలవాలంగా చేసుకున్న రాక్షసం నుండి విముక్తిని సాధించి ఇవ్వగలిగే ఇదొక్క మార్గమే నేడు మిగిలింది. ఇస్లాం నుండే నిజమయిన స్వాతంత్యపు బాటలు బయల్దేరుతాయి. అందులోనే మానవులందరికీ ఆలోచన, ఆచరణ, సంపాదన, మతావలంబనకు పరిపూర్ణమయిన స్వేచ్చ లభిస్తుంది. అందరి గౌరవం, ఆత్మాభిమానాలు భ(దంగా ఉంటాయి. అప్పుడే మనం నిజమయిన దైవవిధేయులుగా తమ పభువుపట్ల భక్తి పరాయణులయిన దాసులుగా అలరారుతాము. ఆ (ప్రభువే కదా ఇస్లాంను మన కొరకు ధర్మంగ్సాజీవన వ్యవస్థగా నిర్ణయించింది:
నేడు నేను మీ జీవన ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం గావించాను. నా అనుగహవరాన్ని మీకు (ప్రసాదించి ముగించాను. మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా స్వీకరించాను. (5:3)
విశ్వజనీన సంస్కరణ ఇస్లాం తీసుకు వచ్చే ఈ విప్లవాత్మక సంస్కరణలు కేవలం ముస్లిం
సమాజంవరకే పరిమితం కావు. ఇది తన నైజం రీత్యా ఒక విశ్వజనీన కార్యక్రమం. నేటి బాధ్యాగస్త (ప్రపంచానికి, అంతరంగ యుద్ధాలకు,
ఇక మతం అవసరం లేదా ? క్రీ?
పరస్పర ఘర్షణలకు లోనయి మూడో (పపంచ సంగ్రామ (పమాదానికి గురి కాబోతున్నట్లున్న ఈ లోకానికి దీని ఉనికి ఓ మహో వర (పసాదం.
నేడు (పపంచం రెండు విభిన్న - కాపటలిజం, కమ్యూనిజం - శిబిరాల్లోకి చీలిపోయింది. (_పతిదీ పపంచంపై తన పెత్తనం చెలాయించాలని తహ తహ లాడుతోంది. (పపంచ వాణిజ్య కేందాలను, కీలకమయిన యుద్ధ స్థావరాలను కైవసం చేసుకోవాలని తాపషతయ పడుతోంది. ఇవి రెండు పరస్పరం ఎంతగా విభేదించుకున్నా ఈ రెంటిలో ఓ విషయం పట్ల ఏకాభిపాయం ఉంది. రెంటి దృక్పృథమూ స్మామాజ్యవాదమే. (పపంచజాతులను తమ బానిసలుగా చేసుకోవాలని కోరుకోవడంలో రెంటిలో ఏదీ దేనికీ తీసిపోదు. తదనుగుణంగానే ఉభయ శక్తులూ అత్యధిక మానవ, భౌతిక వనరుల్ని తమ అధీనంలోకి తీసుకోవాలని (పయాస పడుతుంటాయి. ఇతర మానవులు వీరి దృష్టిలో కేవలం మూగపశువుల కన్నా అధికం కాదు (వీరు తమ పరిభాషలో మానవుల సంఖ్యాబలాన్ని మానవ శక్తి (MAN POWER) గా పేర్కొంటారు). తమ నీచమయిన లక్ష్యాలను సాధించుకునేందుకు, మనుషులు వారి సమక్షంలో కేవలం పనిముట్లు మ్మాతమే!
ఇస్లామీయ జగత్తు ఈ స్మామాజ్యవాదుల రాక్షస (పాబల్యానికి, జులుంకు వ్యతిరేకంగా ఏకమయినట్లయితే అంతర్జాతీయ పోటీలు, ఘర్షణల కారణంగా [పపంచశాంతికి వాటిల్లిన (పమాదాన్ని గట్టిగా వారించడం సాధ్యమవుతుంది. ముస్లిం దేశాలు తను మధ్య ఐక్యతను సాధించగలిగితే అవి అతి నునాయానంగా ఓ వూడో-ఇస్లామీయ-బ్లాక్‌గా రూపొందగలుగుతాయి. ఒకవేళ ఇలాంటి బ్లాక్ ఒకటి ఉనికిలోకి వస్తే అది (పపంచ రాజకీయాల్లో కేంద్రీయ పాత నిర్వహించే అవకాశాలున్నాయి. ఎందుకంటే భౌగోళికంగా ఈ ముస్లిం దేశాలు (ప్రాక్ పశ్చిమాలకు సరిగ్గా నడుమన ఉన్నాయి. తమ ఈ స్థానాన్ని పురస్కరించుకుని ఇవి తమ జాతీయ, ముస్లిం సామాజిక (ప్రయోజనాల దృష్ట్యా ఏ శిబిరంతోనయినా సరే పొత్తు కుదుర్చుకోవడానికి స్వేచ్చను కలిగి ఉంటాయి. లేదా మరొకరి
38 ఇస్లాం అపార్భాల మబ్బుల్లో
ఎత్తుగడలకు పావులుగా మారడానికి బదులుగా, తమ నిజమయిన (వయోజనాల కొరకు ఉమ్మడి కృషి చేసుకోగలుగుతాయి. మానవాళి భవితవ్యం ముడివడి ఉన్న ఆశాజ్యోతి ఇస్లాం ఒక్కటు. నేటి సైద్ధాంతిక సంఘర్షణలో ఇస్లాం సైద్ధాంతిక 'పాబల్యమే మానవ మోక్షానికి మార్గం. ఇస్లాం విజయానికి ఎంత (పాముఖ్యం ఉందో దాన్ని సాధించడం కూడా అంతగానే సాధ్యం. పూర్వమూ అది సాధ్యమయింది. నేడు కూడా అది సులభసాధ్యమే . అయితే ఒక షరతు. ఇస్లాం అనుయాయులు నోటిమాటలు కట్టిపెట్టి ఇస్లాంకు (పపంచాన ఆధిక్యత, (పాబల్యం లభించేంతవరకు వ్మిశమించమని (పతినబూనాలి. దీనికి బాహ్యం నుండి మరే సహకారం అవసరం కూడా ఉండదు. ఒకటి మాతం నిజం. ఇస్లాం (పాబల్యం వహించడమంకే అర్థం - మూడో(పపంచ సంగామ (పమాదం అంతమయిందన్నమాట ! అనేక మానసిక రోగాలు, ఉదిక్తతల నివారణకు మార్గమేర్పడిందన్నమాట!! సంతోషం, శాంతి, సుఖాలు విలసిల్లే పశాంత జీవితం (పాప్తమయిందన్నమాట !!!
ఇవి (పగతీ వికాసాలా?
ఈ సమస్యకు సంబంధించిన విషయాన్ని మరో కోణంలో పరిశీలిద్దాము. ఆధునిక పాశ్చాత్య మండలాన్ని సైన్సు, భౌతికంగా సుసంపన్నమయితే చేసింది కాని మంచి మనుషుల్ని (పసాదించలేక పోయింది. మానవత్వపు (పగతి నిలిచిపోయింది. ఆంతర్యాలల్లో ఉన్నత మానవీయ విలువలకు ఆదరణ కరువయింది. ఆధునిక నాగరికత, ఆత్మ కంటే పదార్థానికి, ఆధ్యాత్మికతకు బదులుగా ఇర్యదియానుభూతులకు (ప్రాధాన్యత నిచ్చింది. పర్యవసానంగా వ్యక్తులు ఉన్నత సామూహిక (వయోజనాలకు మారుగా సొంత సుఖభోగాలను, స్వార్థ (పయోజనాలను పొందడమే పరమార్థంగా భావిస్తున్నారు.
పరిస్థితుల ఈ స్వరూపాన్ని మానవ (ప్రగతిగా, మానవత్వ వరిణామ్మకమంగా పేర్కొనలేము. ఎందుకంకే మానవత (పగతి అంకే
ఇక మతం అవసరం లేదా? 39
కేవలం భౌతిక _పగతి మ్యాతమే కాదు. నిజానికి ఇంయ్యదియ లోలత్వం, పాశవిక వాంఛల ఆధిక్యతనుండి సంపూర్ణమయిన స్వేచ్చ పొందడం కూడా ఈ భావంలోనే అంతర్లీనమయి ఉంది. ఈ విషయంలోనే ఇస్లాం మనల్ని ఆదుకుంటుంది. అది మాతమే మానవతకు నిజమయిన (పగతీ వికాసాలను అందజెయ్యగలుగుతుంది.
వేగంగా ఎగిరే విమానాలు, క్షణాలలో అంతా ధ్వంసం చేసే ఆటం బాంబులు, మాయలు పలికే రేడియో, కళ్ళు జిగేల్ మనిపించే విద్యుద్దీపాలను (పగతి అనడం, (పగతికి కొలమానాలనడం దృష్టి లోపమే.. నిజమయిన (పగతిని తెలుసుకోదలిస్తే చూడవలసిందేమంకే, మనిషి తన పాశవిక వాంఛలు, భావావేశాలపై అదుపును సాధించాడా లేక ఇంకా వాటి చేతుల్లో ఆటబొమ్మగానే ఉన్నాడా. ఒకవేళ మనిషి నేటికీ మనోవాంఛల సమక్షంలో అశక్తుడయి, అసమర్ధుడయి వాటికి అతీతంగా ఆలోచించలేకపోతే మనిషి నిజమయిన (ప్రగతికి ఇంకా ఎన్నో ఆమడల దూరాన ఉన్నాడని (గహించవచ్చు. వైజ్ఞానిక రంగంలోని విజయాల దృష్ట్యా మనిషి ఎంత ముందంజ వేసినా మానవునిగా అతని పరిస్థితి, దయనీయమయిందేనని చెప్పాలి - పైగా అతన్ని (పగతి గడించిన వాడని, సాఫల్యం సాధించిన వాడని కూడా అనడమా?!
సహజమయిన _పమాణాలు
“'పగతి' కి పైన ఉదాహరించిన (పమాణం మతం, నైతికతలు స్వయంగా కల్పించుకున్నదో లేక బయటినుండి తెచ్చి మనిషిపై రుద్దినదో, లేక కేవలం ఊహాజనితమో కూడా కాదు. ఇది యదార్ధం. దీని (వేళ్ళు మానవ నైజంలోను విశ్వం యొక్క మౌలిక వాస్తవికతలోనూ నిబిడికృతమయి ఉన్నాయని చరిత చాటి చెబుతోంది. ఈ (పమాణాన్ని (తోసి రాజని ఏ జాతి అయినా సుఖభోగాలకు లోనయితే అది తిరిగి తన వైభవాన్ని, (పాభవాన్ని, గౌరవస్థానాన్ని పొందలేకపోయింది. ఇంకా మానవ (పగతీ
40 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
శేయాలకై ఏ కార్యాన్నీ సాధించలేకపోయింది. ఇది చరత పలికే కాదనలేని యదార్థం. (ప్రాచీన (గీకు అయినా, పర్షియా అయినా, రోమను సామాజ్యమయినా, అబ్బాసీ పరిపాలన అయినా అన్నిటా కానవచ్చేది ఒక్కటే; భోగవిలాసాలూ, రుచులూ మరిగినందుకు పరిణామం సర్వనాశనం తప్ప మరేమీకాదు. ఆధునిక చరితలో భోగవిలాసాలకు లోనయిన (గెంచి ప్రజల లజ్ఞా విహీనమయిన పాతను ఎవరు మరువగలరు? వారు రెండో పపంచ మహా సంగ్రామంలో ఒకే దాడిలో శతువుకు లొంగిపోవడానికి ఎంతమా(తం జంకలేదు! వారికి తమ దేశరక్షణ కంపే తమ ధనప్రాణాలు, వ్యక్తిగత సుఖభోగాలు ముఖ్యమయి పొయ్యాయి. తమ జాతీయ (ప్రాభవ (పతిష్టలకన్నా తమ రాజధాని పేరిస్, దాని నృత్యశాలల భ(దత వారిని అమితంగా బాధించింది.
లోతుగా పరిశీలిస్తే
ఈ సందర్భంలో కొందరు సరిగ్గా ఆలోచించకుండా అమెరికాను దృష్టాంతంగా పేర్కొంటారు. వారు చెప్పేదేమంటే, అక్కడి (పజలు (పాపంచిక రుచుల్లోనూ, ఇంద్రియ భోగాల్లోనూ పూర్తిగా మునిగి తేలుతున్నారు, అయినప్పటికీ వారికి (పపంచంలో వైభవ (_పాభవాలు పాప్తమయ్యాయి, ఉత్పాదన దృష్ట్యా ఆ దేశం (ప్రపంచంలో అత్యున్నత స్థానాన్ని అలంకరించిందీ అని. ఈ మాటలన్నీ యదార్భాలే - సందేహం లేదు. కాని ఇలా వాదించే వారు మరచిపాయ్యేదేమంకే భౌతికత రీత్యానూ, నైతికత దృష్ట్యాను అమెరికా (పపంచ జాతుల్లో ఇంకా “ప్రఫుల్ల శక్తి” అనే చెప్పవచ్చు. సాధారణంగా యవ్వనంలో, అంతర్గత రుగ్మతలు అణగి ఉంటాయి. వాటి రోగ లక్షణాలు కూడా బయట పడవు. (ప్రఫుల్ల సామాజిక వ్యవస్థలో విభిన్న వ్యాధుల బాహ్య లక్షణాలను బయల్పడకుండా చేసే భ్యదతాశక్తి ఇంకా మిగిలి ఉంటుంది. కాని చూడగల న్మేతం సమాజంలోని ఇలాంటి మెరుగుల్ని చూచి (భమలకు లోనవదు. మనోజ్ఞమయిన, మనోహరమయిన ఈ బాహ్యా తెరల వెనక దాగి ఉన్న భయంకర రోగాల లక్షణాలు దాని దృష్టికి
ఇక మతం అవసరం లేదా ? 41
అందకుండా పోవు. నైతికంగా అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలకన్నా ఏ మాతం భిన్నంగా లేదన్న యదార్భాన్ని చాటి చెప్పడానికి రెండు సంఘటనలు మాతం పేర్కొంటున్నాము. ఈ వార్తల ద్వారా మరో విషయం కూడా బోధపడుతుంది. ఎన్ని (పగతి సోపానాలు అధిరోహించినా సైన్సు, నేటికీ మానవ నైజంలో ఏ విధమయిన మౌలికమయిన మార్పునూ తీసుకురాగల సామర్థ్యం పొందలేదు. ఎందుకంకే స్వయంగా సైన్సు దైవశాసనానికి లోబడిన అంశమే -
దైవ నియమంలో మార్పు జరిగినట్టు నీవు ఎన్నడూ చూడలేవు. (35 : 43)
మొదటివార్త: కొన్నాళ్ళ (క్రితం పత్రికల్లో వచ్చిన వార్త (పకారం, అమెరికా విదేశాంగశాఖ తన 33గురు ఉద్యోగుల్ని, అవాంఛనీయ (పవర్తన కారణంగా, దేశ రహస్యాలు శత్రువులకు సరఫరా చేసిన ఆరోపణల కారణంగా ఉద్యోగాలనుండి బర్తరఫ్ చేసింది.
మరోవార్త (పకారం, ఒక లక్షా20 వేలమంది అమెరికన్ సైనికులు సైన్యాన్ని వదలి పారిపాయ్యారు. అమెరికా సైన్యం పూర్తి అంగబలం దృష్ట్యాను అమెరికా జాతి ఇంకా యవ్వన దశలోనే ఉండి, (పపంచ నాయకత్వం చేపట్టాలని కలలు కంటున్న దృష్ట్యాను పారిపోయిన వారి ఈ సంఖ్య గణణీయమయినదే.
నిజానికి ఇదంతా ఇంకా (పారంభమే. ఒకవేళ అమెరికన్ జాతి, జీవితంపట్ల తన భౌతికతా (పధానమయిన వైఖరిని మార్చుకోలేకపోతే, అనివార్యమయిన అంతం ఎంతో దూరంలో లేదు.
ఇది కేవలం ఒక రూపం మాత్రమే. మరో కోణంలో చూస్తే కనిపించే దేమిటి? భౌతిక (ప్రగతి, యవ్వనదశ, అపారమయిన వనరులు ఇవన్నీ ఉన్నప్పటికి అమెరికన్ జాతి ఉన్నత నైతిక విలువలు, సిద్ధాంతాల
42 ఇస్లాం అపార్భాల మబ్బుల్లో
క్షేతంలో శూన్యంలో కొట్టుమిట్టాడుతోంది. ఎందుకంటే ఓ జాతిగా అది పూర్తిగా భౌతిక రుచులు, వాంఛలలో తేలియాడుతోంది. ఇంతవరకు పాశవిక స్థాయినుండి పైకి లేచి సమస్యల్ని అనుశీలించే భాగ్యం దానికి బహుశా (ప్రాప్తం కానేలేదేమో! నల్లవారయిన అమెరికనులపట్ల జరిగే అమానుషమయిన (పవర్తన అమెరికా జాతి యొక్క శోచనీయమయిన ఆధ్యాత్మిక స్థితిని, దిగజారిన నైతికావస్థను (పతిబింబిస్తోంది. పాశవిక కోరికల తృప్తికోసం మనిషి వాటిని ఆరాధించే స్థితికి పతనమవడం మూలంగా మానవత (పగతీ వికాసాలను' ఎన్నడూ సాధించలేదు.
నేటి ప్రపంచపు ఈ చితపటం బహుధా అంధకారమయమయి ఉంది. కాని ముక్తికి ఓ మార్గం నేటికీ ఉంది. అదే ఇస్లాం. ఏ విధంగానయితే 1300 ఏళ్ళకు పూర్వం అది మానవుణ్ణి పాశవిక కోరికల అధీనం నుండి విముక్తం చేసిందో అదే విధంగా నేడు కూడా అది మానవతకు మనోకాంక్షల నుండి మోక్షం (ప్రసాదిస్తుంది. తద్వారా మానవాళి తన మనో మస్తిష్కాల శక్తులన్నింటినీ జీవితంలో సదాచారాలు, సత్కార్యాలను నింపుకోడానికి వినియోగించుకునేలా సహాయపడుతుంది.
ఇస్లాం పునరుజ్జీవనోద్యమం
ఇదంతా విని, ఇస్లాం పునరుజ్జీవనం అన్నది నేడు కాని పని అని, అందువల్ల దానికై కృషి చెయ్యడం నిష్పయోజనం అని ఎవరయినా చెప్పవచ్చు. కాని ఒకటి మ్యాతం వారు తెలుసుకోవాలి. గతంలో సాధ్యమయినది నేడు కూడా అది పునరావృతం కావడం సాధ్యమే. ఎందుకంకే మానవనైజంలో మౌలికంగా ఎలాంటి మార్పు వాటిల్లలేదు. ఇస్లాం ఆవిర్భావ కాలంలోనూ, నేటి మాదిరిగానే ప్రపంచ నైతిక స్థితి ఎంతో దిగజారి ఉండింది. పాచీన-ఆధునిక పతనావస్థల్లో వాటి బాహ్య రూపాల్లో తప్ప మౌలికంగా ఎలాంటి మార్పు లేదు. (ప్రాచీన రోము, నైతిక పతనం దృష్ట్యా నేటి లండన్, పేరిస్ మరియు అమెరికా మహానగరాలకు వ
ఇక మతం అవసరం లేదా ? 43
విధంగానూ తీసిపోదు. అదే విధంగా ప్రాచీన పర్షియా, నేటి కమ్యూనిస్టు దేశాల మాదిరిగానే లైంగిక విశ్చంఖలత్వానికి గురయి ఉండింది. ఇలాంటి చార్మితక పూర్వ రంగంలోనే ఇస్లాం ఆవిర్భవించింది. అది వచ్చీరాంగానే తన అనుయాయుల నైతిక స్థితిని విప్లవాత్మకంగా అధః పాతాళాన్నుండి ఉచ్చస్థితికి లేవనెత్తింది. జీవితానికి ఓ ఉన్నత ధ్యేయాన్ని_పసాదించింది. నిత్యగమనశీల, (కియాశీల భావాన్ని నూరిపోసింది. మంచి తనానికా, సత్యానికై నిరంతరంగా పోరాడే ఉన్నత భావశీలాన్ని సృజించింది. మానవతను ప్రగతి, సుఖశాంతులతో విలసిల్లజేసింది. పాక్ పశ్చిమాలకు బహుకాలం వరకు (_పభావితం చేస్తూ ఉన్న ఓ శ్మాస్తీయ, ఆధ్యాత్మిక ఉద్యమాన్ని లేవనెత్తింది. ఫలితంగా పపంచం ఓ మహోజ్వలమయిన ఆలోచనాత్మక విప్లవాన్ని చూచింది. ఇస్లామీయ (పపంచం వెలుగుకు, మార్గదర్శకత్వానికి, (పగతికి (పతీకగా రూపొందింది. దాని ద్వారా శతాబ్దాల తరబడి మానవతకు కాంతి, మార్గదర్శకత్వాలు సంపాప్తమయ్యాయి. తన ఆధిక్యత, వైభవ [పాభవాల కాలంలో ఇస్లామీయ జగత్తు, భౌతికంగా గాని, శాస్త్రీయంగా గాని, ఆధ్యాత్మికంగా గాని ఏమ్మాతం వెనుకబడి ఉండలేదు. ఎందుకంటే ఇస్లాం, నైతిక మార్గ (భష్టత్వాన్ని, లైంగిక అరాచకత్వాన్ని, భర్మవిహీనతను ఏ రూపంలోనూ సహించదు; వాటిని తలెత్తే అవకాశాన్నీ ఇవ్వదు. తదను గుణంగానే ఆ కాలంలో సచ్చీలత, సదాచారం, మానవీయ కృషికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ ముస్లిములు (పపంచ జాతులకు మార్గదర్శకులుగా ఆదర్శపాయులుగా నిలిచారు. ఆ తరువాత ఎప్పుడయితే వారు [క్రమేపి ఇస్లామీయ సిద్ధాంతాలకు, సూతాలకు దూరమవుతూ పాయ్యారో, ఎప్పుడయితే ఉన్నత ఆశయాలు, సి సిద్ధాంతాల ఛాయలు కూడా మిగల్లేదో వారు క్షుదమయిన కోరికలకు జోశమూలకు దాసులయ్యారు.
ఈ ఘోరమయిన నేరానికి ఫలితంగా, దైవం నిర్ణయించిన ఎదురులేని చట్టం ప్రకారం, చివరికి వారికి ఈ ప్రపంచంలోనే శిక్ష కూడా లభించింది; వారి వైభవ పాభవాల సూర్యుడు కడకు అస్తమించాడు.
44 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో ఆధునిక ఇస్లామీయ ఉద్యమం
ఆధునిక ఇస్లామీయ ఉద్యమం క్షణంక్షణం ముందుకే మున్ముందుకే పురోగమిస్తోంది. శక్తిమంతంగా పటిష్టంగా రూపొందుతోంది. అది తన గతాన్నుండి ఆధ్యాత్మిక శక్తిని _గహిస్తోంది. వర్తమానంలోని అన్ని పరిశుద్ధమయిన, ధర్మ సమ్మతమయిన సాధనాలను, వనరుల్ని వినియోగిస్తోంది. భవిష్యత్తుపై దృష్టి కేందీకరించి గమ్యం వైపుకు పురోగమిస్తోంది. దాని భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. దాని ద్వారా పూర్వం కానవచ్చిన మహత్తు మరోసారి పపంచం చూడటం సాధ్యం కాబోతోంది. ఆ తరువాత మనిషి పాశవిక వాంఛలకు అతీతంగా, ఉన్నతంగా ఎదిగి, కాళ్ళు నేలపై ఆనించి, చూపు నింగిపై నిలిపి పైపైనే పయనించాలని ఉద్యుక్తుడవుతాడు.
అంతమాత్రాన ఇస్లాం కేవలం ఆధ్యాత్మిక సిద్ధాంతం మ్యాతమే అని లేక కేవలం నైతిక వ్యవస్థ అని, లేక భూమ్యాకాశాల శాస్త్రీయ పరిశోధనకు మారుపేరు అని కూడా అర్ధంకాదు. ఇస్లాం, ఆచరణాత్మక జీవన వ్యవస్థ. అది (పపంచపు అన్ని రంగాలను, సకల సమస్యల్ని ఆవరించి ఉంది; అది మానవ జీవితపు సకల సంబంధాలను (కమబద్ధం చేస్తుంది; అవి రాజకీయవుయినవయినా, ఆర్థికవుయినవయినా, సామాజిక మయినవయినా వాటి కొరకు యుక్తమయిన నియమాలు నింబంధనలు సమకూర్చి వాటిని (క్రియారూపంలో అమల్లోకి తెస్తుంది. దాని విశిష్టత ఏమిటంటే, ఈ వ్యవస్థ ద్వారా, వ్యక్తి సమాజం, బుద్ధి-అంతర్చేరణ, ఆచరణ - ఆరాధన, భూమి - ఆకాశం, ఇహం-పరం, వీటన్నింటి మధ్య అద్వితీయమయిన, అపురూపమయిన సామరస్యాన్ని, సమతూకాన్ని సృజిస్తుంది ఇస్లాం. జీవితపు వివిధ కారణాలకు సంబంధించిన ఈ విషయాలన్నీ ఓ సమతూకం గల సమన్వయం గల పరిపూర్ణ ఏకత్వం లోని*విఖిన్న అంశాలుగా రూపొందుతాయి.
ఇక మతం అవసరం లేదా ? 45
ఈ అధ్యాయంలో ఇస్లాం (పతిపాదించే సమగ జీవన వ్యవస్థను వివరంగా చర్చించే అవకాశం లేదు. అయితే రాబోయే అధ్యాయాల్లో, ప్రాచ్య శాస్త్ర నిపుణులయిన పాశ్చాత్య పండితులు వ్యాపింపజేసిన అపోహల్ని చర్చించేటప్పుడు ఇస్లామీయ వ్యవస్థయొక్క కొన్ని విలక్షణమయిన (పత్యేకతల్ని పేర్కొనడం జరుగుతుంది. (ప్రస్తుతం కేవలం కొన్ని విషయాలు క్లుప్తంగా స్పర్శించదలిచాము.
మొదటి _పత్యేకత:
మొట్టమొదట ఇస్లాం గురించి తెలుసుకోవలసిన ముఖ్యవిషయం ఏమిటంకే ఇది కేవలం సిద్ధాంతం మాతం కాదు; ఓ ఆచరణాత్మకమయిన జీవన వ్యవస్థ. ఇది మానవ జీవితపు ఏ అవసరాన్నీ ఉపేక్షించక పోవడమే కాక దాన్ని సాధించే మార్గాలను సయితం విశదీకరిస్తుంది.
రెండవ _పత్యేకత:
రెండవ విషయం ఏమిటంటే ఇస్లాం మానవ నైజం యొక్క పరిమితుల్ని ఏ క్షణాన కూడా విస్మరించదు. అది జీవన సంస్కరణను “వ్యక్తి” నుండి (పారంభిస్తుంది. అతని జీవితంలో శరీరం, ఆత్మ, బుద్ధి, కోరికలు-వీటన్నిటి విభిన్న అవసరాల మధ్య సమతూకాన్ని, సామరస్యాన్ని, సమన్వయాన్ని స్థాపిస్తుందిా- అందులో ఏదీ తన నిర్ణీత హద్దుల్ని అతి (కమించకుండా ఉండేందుకు. ఉన్నత ఆధ్యాత్మిక స్థానాలను పొందడానికి పాశవిక (పేరణల్ని అణచివెయ్యదు ఇస్లాం. అలా అని, మనిషి రుచుల ఆస్వాదనలో మునిగి తేలుతూ పశువుగా తయారవడాన్ని కూడా శ్లాఘించదు. దానికి భిన్నంగా ఇస్లాం ఆత్మ మరియు శరీరం రెంటిలో సామరస్యాన్ని సృజిస్తుంది. వాటి యుక్తమయిన వాంఛల్ని పూర్తి చేస్తుంది. ఆత్మ మరియు శరీరాల మధ్య సమన్వయం కుదుర్చడం మూలాన, మానవ వ్యక్తిత్వం, పరస్పర విరుద్ధ భావాల రణరంగంగా మారకుండా, పర్యవసానంగా
46 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
ముక్కలు చెక్కలవకుండా భ్యదంగా ఉంటుంది. ఈ విధంగా వ్యక్తిగత జీవితం ఆరోగ్యవంతమయిన పునాదులపై రూపుదెద్దుకున్న తరువాత ఇస్లాం, వ్యక్తి మరియు సమాజాల అవసరాల మధ్య సామరస్యాన్ని, సమన్వయాన్ని సృజించేందుకు సమాయత్తమవుతుంది. ఆ విధంగా అది ఓ వ్యక్తికయినా లేక సమాజానికయినా అన్యాయం చేసే అవకాశాన్ని ఏ వ్యక్తికీ ఇవ్వదు. మరోవైపు ఏ వ్యక్తి హక్కునయినా హరింపజీసే హక్కును సమాజానికీ ఇవ్వదు. ఒక వర్గం లేక ఒక జాతి మరోవర్గం, లేక జాతులపై తమ దైవత్వాన్ని, అధికారాన్ని, స్వామ్యాన్ని చెలాయించడాన్ని కూడా ఇస్లాం సహించదు. ఒక్కమాటలో చెప్పాలంటే, సామూహిక జీవితంలో పనిచేసే, పరస్పర వ్యతిరేకశక్తుల కళ్ళెం తన చేతుల్లో ఉంచుకుంటుంది. అవి పరస్పరం ఘర్జించుకోకుండా కాపాడుతుంది. ఇంకా వాటిమధ్య సానుకూలతను ఏర్పరుస్తుంది. అవన్నీ కలసి మనిషి మరియు మానవత యొక్క ఉన్నత (పయోజనాలకై కృషి చేసేలా వాటిని |కమబద్ధం చేస్తుంది.
దీనికి తోడుగా ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, మానవీయ శక్తుల మధ్య కూడా సమతూకాన్ని పెంపొందిస్తుంది ఇస్లాం. కమ్యూనిజం మాదిరిగా జీవితంలో, మానవీయ అంశాలపై ఆర్థిక అంశాల నిర్ణయాత్మక ఆధిక్యతను ఇస్లాం అంగీకరించదు. అయితే అదే విధంగా, ఆధ్యాత్మిక లేక సైద్ధాంతిక వాదుల అభ్మిపాయం (పకారం, మానవ జీవితాన్ని కేవలం ఆధ్యాత్మిక లేక ఉన్నత ఆదర్శాల, దృకృథాల ఆధారంగా మ్యాతమే వ్యవస్థీకరించడం సాధ్యం అన్న వాదంతోనూ ఏకీభవించదు. ఎందుకంకే, సమాజం అంకే ఇస్లాం పకారం, వీటిలో ఏదో ఒక్కకోణమో లేక కొన్ని కోణాలో అన్న భావం సరయినది కాదు; వీటన్నింటి కలయిక, మ్మిశమమే అని అది అభిపాయ పడుతుంది. తదనుగుణంగా వీటిని క్రమబద్ధం చేసి, సమంజసమయిన రీతిలో ఏరి కూర్చి సముచితమయిన ఓ సమ్మగ స్వరూపాన్ని రూపొందిస్తుంది.
ఇక మతం అవసరం లేదా ? 47 మూడవ (ప్రత్యేకత:
బాగా గుర్తుంచుకోవలసిన మూడో విషయం ఏమిటంకే, ఓ సామాజిక సిద్ధాంతంగా, ఓ ఆర్థిక వ్యవస్థగా, ఇస్లాం తనదంటూ ఓ విలక్షణమయిన రూపం కలిగి ఉంది. కొన్ని నిమ్న విషయాల్లోనూ, వివరాల్లోనూ బయటికి కనిపించే పోలికలు కొన్ని ఉన్నప్పటికీ ఇస్లాంకు అటు కమ్యూనిజంతోనూ ఇటు కాపటలిజంతోనూ ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఈ రెండు వ్యవస్థల మంచి విషయాలున్నా వాటి బలహీనతలు, లోపాలనుండి ఇది సురక్షితంగా ఉంది. ఇది ఆధునిక పాశ్చాత్య విధానంలో మాదిరిగా “వ్యక్తికి మితిమీరిన (పాముఖ్యాన్నిచ్చి అతని సమక్షంలో 'సమాజా' న్ని నిర్వీర్యం చేయడాన్ని, “వ్యక్తి' పై ఎలాంటి అదుపు లేకుండా ఉండటాన్నీ అంగీకరించదు. వ్యక్తి యొక్క హద్దుపద్దులేని ఈ స్వేచృవల్లనే మనిషి, ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలో బరి తెగించి, ఇతర వ్యక్తుల కొరకు చివరికి తన్ను పెంచి, పోషించి, వ్యక్తిత్వాన్నిచ్చిన సమాజం కొరకు కూడా (పమాదకరంగా పరిణమిస్తున్నాడు.
మరోవైపున సామాజిక జీవితాన్ని చర్చిస్తూ మరో అతివాదానికి పోదు. ఇలా చెయ్యడం కమ్యూనిస్టు (పభుత్వాల _పత్యేకత. ఈ _పభుత్వాల్లో సామూహిక వ్యవస్థే జీవితానికి మూలం. వ్యక్తికి దాని సమక్షంలో ఎలాంటి స్థానం, పాముఖ్యం లేదు. ఫలితంగా వ్యక్తికి సమాజం యొక్క (పాబల్యాన్ని, ఆధిక్యతను, శక్తినీ, స్వేచ్చను ఛాలెంజి చేసే అధికారమూ లేదు, తన కోరికల్ని వ్యక్త పరచేందుకు అనుమతీ లేదు. ఈ దృక్పథం గర్భాన్నే కమ్యూనిజం జన్మించింది. వ్యక్తుల భవితవ్యానికి ఏకైక “స్వామి” రాజ్యం అన్నది దాని వాదన. అది తన (ప్రజల్ని తాను కోరిన విధంగా మలచుకునేందుకు పరిపూర్ణమయిన స్వేచ్చ, అవధుల్లేని అధికారాలూ కలిగి ఉంది.
కమ్యూనిజం మరియు క్యాపటలిజం యొక్క ఈ రెండు అతి
48 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
వాదాలను కాదని ఇస్లాం మధ్యే మార్గాన్ని అవలంబిస్తుంది. ఇది వ్యక్తికి, సమాజానికి సమంగా (పాముఖ్యాన్నిస్తుంది. వీటి మధ్య సామరస్యాన్ని సృజిస్తుంది. ఈ వ్యవస్థలో వ్యక్తికి తన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకునే స్వేచ్చ అయితే లభిస్తుంది, కాని అతనికి ఇతర వ్యక్తుల హక్కుల్ని హరించేందుకు గాని, ఇతరులపై దౌర్జన్యం చెయ్యడానికి గాని అనుమతి ఉండదు. మరోవైపు ఈ వ్యవస్థ, సమాజానికి లేక దాని పరిపాలనా వ్యవస్థ అయిన రాజ్యానికి సామాజిక, ఆర్థిక సంబంధాల వ్యవస్థీకరణ విషయంలో విస్తృత అధికారాలనిస్తుంది. తద్వారా మానవజీవితంలో సామరస్యం, సమ న్వయం స్థాపిస్తుంది. ఇస్లాం (పతిపాదించే ఈ సామాజిక వ్యవస్థకు ఆధారం, వ్యక్షీ-సమాజాల మధ్య పరస్పర (పేమానురాగాల సంబంధం. కమ్యూనిస్టు సమాజంలో మాదిరిగా ఇది పరస్పర ద్వేషం, వర్గపోరాటం వల్ల ఉనికిలోకి వచ్చేది కాదు.
దైవదత్తం ఈ జీవన విధానం
ఇక్కడ మరో విషయం కూడా అర్ధం చేసుకోవడం అవసరం. ఇస్లాం (పతిపాదించే ఈ విలక్షణమయిన జీవనవ్యవస్థ ఆర్థిక కారణాల వల్లనో లేక పరిస్థితుల పరిణామంగానో ఉనికిలోకి వచ్చిందికాదు. దీని ఉనికికి విభిన్న వర్గాల, విరుద్ధ (పయోజనాల పరస్పర ఘర్షణ కూడా కారణం కాదు. ఇది దైవదత్తమయిన జీవన వ్యవస్థ. ఇది ఏనాడయితే తొలుత మనిషికి ప్రాప్తమయిందో ఆనాడు మానవ జీవితంలో ఆర్థిక కారణాలకు (ప్రత్యేక ప్రాముఖ్యత ఏదీ లేదు. ఇంకా “సామాజిక న్యాయం' అన్న దానికి నేడున్న భావం కూడా ఆనాటి మనిషికి తెలీదు. కమ్యూనిజం, కాపిటలిజం రెండున్నూ ఇస్లాంకు తరువాత చాలా కాలానికి ఉనికిలోకి వచ్చాయి.
జీవితపు ప్రాథమిక అవసరాల విషయాన్నే తీసుకోండి. తిండి, నీడ, లైంగిక తృప్తి - ఈ మూటినీ పాథమిక అసరాలుగా పరిగణించి, పభుత్వం తన పరిధిలో నివసించే మానవులందరికీ వాటిని సమకూర్చే బాధ్యత
ఇక మతం అవసరం లేదా ? 49
స్వీకరించాలని (పకటించిన తొలి వ్యక్తి కార్ల్ మార్క్స్ అని సాధారణంగా అనుకుంటారు. ఈ (పకటన మానవ చింతనా పథంలో ఎంతో గొప్ప విప్లవాత్మకమయినదని కూడా భావిస్తారు. కాని వాస్తవమేమంటే కార్ల్ మార్క్స్ పుట్టక 13 శతాబ్దాలకు పూర్వమే ఇస్లాం ద్వారా ఈ విప్లవాత్మ కమయిన (పకటన (ప్రపంచానికి పరిచితమయింది. ఈ సందర్భంలో ఇస్లాం పవక్త (సఅసం) (పవచించినట్లు ఉల్లేఖనం ఉంది; ఆయన ఇలా అన్నారు: “ఏ వ్యక్తయితే మన (ఇస్లామీయ (ప్రభుత్వ) సిబ్బందిగా పని చేస్తున్నాడో అతనికి భార్య లేకపోతే పెళ్ళి చెయ్యాలి. అతనికి ఇల్లు లేకపోతే ఇల్లు సమకూర్చాలి. అతనికి సేవకులు లేకపోతే సేవకుల నియమించాలి. అతనికి వాహనం లేకపోతే దాని ఏర్పాటు చెయ్యాలి.” మహనీయ ముహమ్మద్ (సఅసం) చేసిన చార్మితాత్మక (వకటనలో, ఆ తరువాత ఎన్నడో కార్ల్‌మార్క్స్ చేసిన (పకటనలోని (ప్రాథమిక మానవ అవసరాలే కాదు ఇంకా అనేకం ఉన్నాయి. అయితే వ్యత్యాసమేమంకే ఇస్లాం, వీటికి (పతిమూల్యంగా వర్గ విద్వేషాన్నీ, రక్తపాతం నిండిన విప్లవాన్నీ, ఉన్నత జీవన (పమాణాలను ఒక్కపోటుతో పరిహరించడాన్నీ అభిలషించదు.
ఇస్లాం (ప్రతిపాదించే జీవనవ్యవస్థకు సంబంధించిన కొన్ని విశేషమయిన (పత్యేకతలు ఇవి. వీటి పరిశీలన ద్వారా ఒక్క విషయం మ్మాత్రం విశదమవుతుంది. ఇస్లాం కొన్ని సమ(గమయిన, సార్వజనీనమయిన స్యూతాల, నియమాల పరిధిలోనే మానవ జీవితపు విభాగాలన్నింటినీ- భావోదేకాలను, ఆలోచనల్ని, ఆచరణల్ని, ఆధ్యాత్మిక అనుభవాల్ని సామూహిక బాధ్యతల్ని అన్నింటినీ - సమన్వయపరచి ఓ సుందరమయిన జీవన నందనవనాన్ని రూపొందిస్తుంది. ఇలాంటి విశష్టమయిన జీవన వ్యవస్థ ఏ కాలంలోనయినా తన _పయోజకత్వాన్ని కోల్పోతుందా? నిజానికి మనిషి దీనికి దూరమయి (బతగ్గలడా? భూమండలంపై జీవకళ ఉన్నంతకాలం ఈ వ్యవస్థ కూడా స్థిరంగా ఉంటుంది. సుస్థిరత, నిత్యత పుణికి పుచ్చుకున్న అందమయిన ముద ఎన్నటికీ చెరగదు.
50 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో కీయాశీల వ్యవస్థ
ఆధునిక కాలంలో ఎదురవుతున్న పరిస్థితుల్ని, నేడు ఉత్సన్నమయిన (పశ్నల్ని, సమస్యల్ని చూచి, ఏ హేతువు ఆధారంగా ఆధునిక మనిషి, ఇస్లాంను, అది అందజేసే జీవనవ్యవస్థను కాదనగలడు? విద్య, విజ్ఞానాల అభివృద్ధికి పతీక అయిన ఈ కాలంలోనూ మానవత, వర్ణ విద్వేషపు జుగుప్సాకరమయిన స్థితికి గురయి ఉంది. ఒక్క అమెరికా, దక్షిణా(ఫికాలనే చూడండి, అంతా బట్టబయలవుతుంది. నీతి, సంస్కృతి, మానవతలకు సంబంధించిన రంగాల్లోనూ ఇరువయ్యో శతాబ్ది మనిషి ఇస్లాం ద్వారా ఎంతో నేర్చుకోవలసిఉంది. శతాబ్దాలకు పూర్వం ఇస్లాం ఆవిర్భవించి మానవాళికి సమస్త వర్ద వివక్షతల నుండి, దురభిమానాలనుండి విముక్తిని పసాదించింది. నేడు కూడా కేవలం ఇస్లాం మ్మాతమే _పపంచాన్ని ఈ విద్వేష కూపంనుండి వెలికి తీయగలదు. ఎందుకంటే ఇస్లాం కేవలం సమానతల అందమయిన స్యూతాలను వల్లించి కూర్చోలేదు, (కియా జగత్తులో ఆ పరిపూర్ణమయిన సమానతను స్థాపించి మరీ చూపింది. దానికి సమానమయిన మరో దృష్టాంతం చరితలో కానరాదు. ఇస్లాం ఏలిన ఆ ఆదర్శయుగంలో నల్లని వారయినా తెల్లని వారయినా ఎ్యరని వారయినా ఎవరికీ ఎవరిపైనా వంశం, వర్ణం, వర్గం ఆధారంగా ఎలాంటి ఆధిక్యత లేదు. ఇస్లాంలో ఆదరణ గౌరవాలు ఏవయినా ఉంకే వాటికి ఆధారం, మనిషిలోని మంచితనం, దైవభక్తి పరాయణతలు. తదనుగుణంగా ఇస్లాం బానిసల్ని బానిసత్వం నుండి విముక్తం చెయ్యడమేకాదు వారికొరకు (పగతి, వృద్ధీ వికాసాల అవకాశాలనూ సువిశాలం చేసింది. చివరికి వారు రాజ్యాధినేతగా ఉన్నత పదవుల నలంకరించే వాక్కునూ అంగీకరించింది. మవహానీయ మువామ్మద్ (సఅసం) (ప్రవచించారు: “బాగా వినండి, మీ అమీర్ (అధినేత) కు విధేయులయి మెలగండి - అమీర్‌గా నియుక్తుడయిన ఆ వ్యక్తి నీీగో బానిస అయినా సరే- అతను దైవశాసనం ప్రకారం మిమ్మల్ని పరిపాలించి నంతకాలం అతని విధేయతను పాటించండి.”
ఇక మతం అవసరం లేదా ? క్
మరోకోణంలో చూసినా నేటి (పవంచం ఇస్లాంను ఉపేక్షించజాలదు. సామాజ్యవాదం, అన్యాయం, అ్యకమాల మూలంగా మానవాళి నేడు ఏ బాధలకు గురయిఉందో, ఏ అమానుష చర్యలకు బలవుతూ ఉందో వాటి నుండి రక్షణకు ఇస్లాం తప్ప మరో మార్గం ఏ కోశాన కానరావడం లేదు. ఎందుకంకే ఇస్లాం, స్మామాజ్యవాదాన్ని, అది జరిపే దోపిడినీ త్మీవంగా వ్యతిరేకిస్తుంది. ఇస్లాం అధికారం చెలాయించిన కాలంలో ముస్లిం పరిపాలకులు తమ పరిపాలనలోని ముస్లిమేతర (వజలతో వ్యవహరించిన తీరు, కనబరిచిన విశాల హృదయత, అవలంబించిన ఉన్నత మానవీయత అనన్యమయింది. నేటి యూరవులోని మరుగుజ్జు మేధావుల దృష్టి ఆ బెన్నత్యాలను అందుకోజాలదు. ఈ సందర్భంలో రెండవ ఖలీఫా. ఉమర్ ఖత్తాబ్ (రజి అన్) జరిపిన ఓ న్యాయవిచారణ, అప్పుడు ఇచ్చిన తీర్పు ఉదాహరించడం సబబుగా తోస్తోంది. ఒక కిబ్తీ(ఈజిష్టియన్)ని అకారణంగా కొట్టి బాధించినందుకు, స్వయంగా ఈజిప్ట్ విజేత, గవర్నర్ అయిన అ(మ్‌బిన్ ఆస్ కుమారుణ్ణి కొరడా దెబ్బలు వేయించారు ఆయన. అంతేకాదు స్వయంగా అంత గొప్ప తండిని కూడా శిక్షించడానికి సిద్ధ మయ్యారు. ఈ ఒక్క దృష్టాంతం వల్లనే తెలుస్తోంది, ఇస్లామీయ రాజ్యంలో పౌరులకు లభించిన పౌరహక్కులు ఏ స్థాయికి చెందినవో అన్న విషయం.
నేడు పెట్టుబడీదారీ వ్యవస్థ ఓ అభిశాపంలా (పపంచాన్ని అలుము కుంది. అది జీవితాన్ని విషభరితం చేసివేసింది. దాన్నుండి రక్షణ కావాలంటే ఇస్లాం తప్ప గత్యంతరం లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు మూలాధారమయిన వడ్డీ వ్యవస్థను, నిత్యావసర వస్తువుల నిల్తువుదలను, అపరిమితంగా ధనం కూడ బెట్టడాన్ని ఇస్లాం త్మీవంగా వ్యతిరేకిస్తుంది. వాటిని నిషేధిస్తుంది. మరోమాటలో చెప్పాలంకే నేటి (వపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ తెచ్చిపెట్టిన చెడులను దూరం చెయ్యాలంకే అది కేవలం ఒక్క ఇస్తాంకే సాధ్యం అన్నమాట.
అలాగే భౌతికతా (పధానంగా, దైవ నిరాకరణ ఆధారంగా ఉనికిలోకి వచ్చిన కమ్యూనిజం దోపిడి వ్యవస్థను నిర్మూలించడం కూడా ఇస్లాం చేతుల మీదుగానే సాధ్యం. ఎందుకంటే ఇస్లాం కేవలం పరిపూర్ణ సామాజిక
52 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
న్యాయాన్ని స్థాపించడం, దాన్ని సుస్థిరం చెయ్యడంతో ఆగదు, ఉన్నత మానవీయ, ఆధ్యాత్మిక (పమాణాలను కూడా పరిరక్షిస్తుంది. అది కమ్యూనిజంలా సంకుచిత దృక్పథానికి కట్టుబడి లేదు, దాని (కియా (పపంచం కేవలం ఇంద్రియ పరిధుల మేరకే పరిమితమయి అంతకన్నా లేదు. పైగా ఇస్లాం తన మాటను బలవంతాన ఒప్పించాలని కోరదు. నమ్మకాలు, దృక్పథాల విషయంలో అది ఎలాంటి బలాత్కారాన్నీ సహించదు. అందువల్ల దానికి (పోలికేరియన్ డిక్టేటర్ షివ్ (శ్రామిక నియంతృత్వం) అనబడే ఉక్కు పంజా అవసరమే కలగదు. ఈ విషయం లో దాని దృక్పథం ఇలా ఉంది :
“ధర్మం (జీవనమార్గం) విషయంలో ఎలాంటి బలాత్కారం లేదు. రుజుమార్గం తప్పుడు బాటనుండి (పస్ఫుటంగా వేరుపరచి చూపడం జరిగింది.” (2 : 256)
నేడు (ప్రపంచంపై మూడో (ప్రపంచ సంగామ నీలిమేఘాలు అలుముకున్నాయి. వీటిని దూరం చెయ్యాలన్నా ఇస్లాం (పభాకరుడు ఉదయించడం తప్ప మార్గాంతరం కానరావడం లేదు. కాని ఇది ఎలా సాధ్యమవుతుంది? మానవాళి ఇస్లామ్‌ను తన జీవన మార్గంగా స్వీకరించాలి, నిజమయిన శాంతి (శ్రేయాల ఈ మార్గాన నడవడానికి సిద్ధమవ్వాలి.
ఇస్లాం కాలం చెల్లలేదు. మరో మాటలో, ఇస్లాం యుగం ఇప్పుడు (ప్రారంభమవుతోంది. ఇది నిర్జీవమయిన సిద్ధాంతం కాదు. ఇది సజీవమయిన, సంచలనాత్మకమయిన శక్తి. ఒకనాటి యూరపు చిమ్మ చీకటి గుహల్లో తచ్చాడుతూ ఉండగా (పపంచమంతా దీని జ్యోతిలో వెలుగొందింది. దీని గతం ఎంత వైభవోపేతమయిందో దాని భవిష్యత్తు కూడా అంతే దేదీప్యమానంగా భాసిల్లుతుంది.
2, బానిసల సమస్య
ముస్లిం యువకుల్ని పెడతోవను పట్టించి, వారిని వారి ధర్మానికి దూరంగా, వ్యతిరేకంగా మలచడానికి కమ్యూనిస్టులు (పయోగించే అత్యంత నీచమయిన ఆయుధం ఈ బానిసల సమస్య. వారు చెప్పేదేమంకే, ఇస్లాం జీవితపు అన్ని కాలాలకు అనువయినది, అన్ని అవసరాలకు అనుగుణమయినదే అయితే అది మానవుల్ని బానిసలుగా చేసేందుకు అనుమతి నిచ్చేదీకాదు, బానిస వృత్తిని సహించేదేకాదు. అందువల్ల ఇది ఓ (పత్యేక చార్మితక స్థితికి వర్తించే ధర్మం. ఇప్పుడు దీనికి కాలం చెల్లింది. ఇది తన బాధ్యతను ఆనాడు నెరవేర్చింది. ఇప్పుడు పొతబడిపోయింది. అందువల్లనే ఇది అన్ని కాలాలకూ అన్ని పరిస్థితులకూ చెల్లదు.
సందిగ్ధంలో యువతరం
సందేవోలు, సంశయాల వాతావరణంలో ఇలాంటి మాటలకు చిత్తశుద్ధిగల ముస్లిం యువకులు కూడా (పభావితులు కాక మానరు. వీరి హృదయాల్లోనూ అనేక సందేహాలు, సంశయాలు జనిస్తుంటాయి. ఇస్లాం దైవం అవతరింపజేసిన ధర్మమే - సందేహం లేదు. అన్ని కాలాల్లోను, అన్ని దేశాల్లోనూ మానవాళిని సాఫల్యం వైపుకు గొనిపోవడమే దీని లక్ష్యం - అందులోనూ సందేహం లేదు. అయితే అది ఈ బానిస వృత్తిని ఎందుకు సహించింది? ఇస్లాం పునాదుల్లోనే మానవుల పరిపూర్ణ సమానత్వపు సూూతాలున్నాయి. అది మానవాళినంతటినీ ఒకే తల్లిదండుల సంతానమని భావిస్తుంది. అది ఈ స్యూతాల ఆధారంగా సామాజిక జీవితపు నవు నిర్మాణాన్ని (కియారూపంలో చేసి చూపింది కూడా. అలాంటి ఇస్లాం తన సామాజిక వ్యవస్థలో బానిస వ్యవస్థకు చోటు ఎందుకు కల్పించింది? దానిగ్గాను వివిధ నిబంధనలు, శాసనాలు కూడా ఎందుకు నిర్మించింది? మానవాళి అంతా స్వాములని, బానిసలని శాశ్వతంగా రెండు వర్గాల్లో విభక్తమయి ఉండాలన్నది దేవుని కోరికా? మానవుల్లో ఓ వర్గాన్ని నోరులేని
54 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
పశువుల్లా సంతలో అమ్మకానికి, కొనుగోలుకు పెట్టడమే అల్లావాకు ఇష్టమా? ఆయన తన దివ్య (గంథంలో ఏమన్నాడు? -
నిస్సందేహంగా మేము ఆదమ్ సంతానానికి గౌరవ మర్యాదల నిచ్చాము. (17 :70)
ఒకవేళ అలా జరగడం దైవానికి ఇష్టం లేదంకే ఆయన ఈ బానిసత్వం పట్ల నిషేధాన్ని స్పష్టంగా ఎందుకు ప్రకటించలేదు - మద్యపానం, జూదం, వడ్డీ విషయంలో చేసినట్లు? ఒక్కమాటలో చెప్పాలంటే నేటి ముస్లిం యువకునికి, ఇస్లాం సత్యధర్మమని బాగా తెలుసు. అయితే అతను హ్యజత్ ఇబాహీం (అస్సలాం) మాదిరిగా సందిగ్ధంలో పడ్డాడు. ఈ స్థితినే దివ్యఖుర్‌ఆన్ ఈ విధంగా అభివర్ణించింది :
ఇ(బాహీమ్ (అస్సలాం) ఇలా కోరిన వేళ: “నా (ప్రభూ! నాకు చూపించు, నీవు మృతుల్ని ఎలా (బతికిస్తావో? (దేవుడు) అడిగాడు, నీవు (దీన్ని) నమ్మడం లేదా? అని. (ఆయన) విన్నవించుకున్నాడు, “నమ్మకమయితే నాకు ఉంది కాని నా మనస్సుకు తృప్తిని కలిగించడానికి (ఇలా అడుగుతున్నాను) ;
దీనికి భిన్నంగా ఎవరయితే స్మామాజ్య శక్తుల పన్నాగాలకు, వారి కుటలకు తమ బుద్ధిని అమ్ముకున్నారో, ఎవరయితే విశ్వాసాలు సిద్ధాంతాల విషయంలో చంచల మనస్కులో వారిలో సత్యాన్ని (గహించడానికి కావలసిన సహనస్థయిర్యాలే కానరావు. అందువల్ల ఇలాంటి వారు తమ భావోదేకాల వెల్లువలో కొట్టుకుపోతారు. పర్యవసానంగా ఆలోచించకుండా అర్ధం చేసుకోకుండా ఇస్లాం గతించిపోయిన ఓ గాథ, ఇప్పుడు దాని ఆవశ్యకత తీరి పోయింది, దానికి కాలం చెల్లింది అన్న నిర్ణయానికి వచ్చేస్తారు.
బానిసల సమస్య కర్ శాస్త్రీయ వంచన
కమ్యూనిస్టు (పచారకులు తాము బోధించేది సశాస్తీయమయిన సిద్ధాంతాలని (పజలను మోసగిస్తూ ఉంటారు. కాని వారి “సైంటిఫిక్ సిద్ధాంతాల' వాస్తవికత ఏమంకే ఇవి వీరి సొంత మేధనుండి ఉత్పన్నమయినవి కావు. అవి వారు తమ విదేశీ స్వాములనుండి అరువుతెచ్చుకున్నవి. ఏ సత్యాన్ని వారు కనుగొన్నట్లు (పగల్ఫాలు పలుకుతున్నారో అది తార్కిక భౌతిక వాదం (DIALECTICAL METERIALISM) అనే సిద్ధాంతం. ఈ సిద్ధాంతం (పకారం మానవ జీవితం కొన్ని (పత్యేక, అనివార్యమయిన ఆర్థిక దశలను దాటుకుపోతుంది. మొదటి దశ కమ్యూనిజం: రెండవది బానిసత్వం, భూస్వామ్యం, కాషిటిలిజం. మూడవది లేక చివరిది రెండవ కమ్యూనిజం (ఇది చివరి ఘట్టమన్నమాట).
ఈ సిద్ధాంతం చెప్పేదేమంకే మానవాళికి చరిత గతిలో ఎదురయిన సకల విశ్వాసాలు, సిద్ధాంతాలు, ఆలోచన ఆచరణల వ్యవస్థలు సర్వం వాస్తవానికి ఆయా కాలాల (పత్యేక ఆర్థిక వ్యవస్థల్ని లేక సామాజిక పరిస్థితుల్ని సంఘటనల్ని _పతిబింబిస్తాయి. గతంలో ఉత్పన్నమయిన విశ్వాసాలు, సిద్ధాంతాలు, తత్వాలు, ఆయా కాలాలకు సరయినవే. ఎందుకంటే అవి, ఆనాటి ఆర్థిక చటం, ఆర్థిక పరిస్థితులతో పూర్తిగా సామరస్యం కలిగి ఉండేవి. కాని ఆ తరువాత వృద్ధి చెందిన కాలాలకు అవి ఏ విధంగానూ సరిపడవు. పతి దశలోనూ ఆయా కాలపు తత్వ వ్యవస్థ దానికి మునుపటి దానికంటే ఎంతో మేలయినదిగా ఉంటుంది. దీనివల్ల తేలిందేమంకే మానవ జీవితం కొరకు (పత్యేకమయిన, శాశ్వతమయిన, రాబోయే కాలాలన్నింటికి సరిపడే ఏ జీవనవ్యవస్థను రూపొందించడమయినా దుర్లభమే.
“ఇస్లాం వచ్చిన నాటికి బానిసత్వపు కాలం తన అంతిమ దశలో ఉండింది. అప్పుడప్పుడే భూస్వామ్య వ్యవస్థ రూపు దిద్దుకుంటూ ఉండింది.
56 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
అందువల్ల ఇస్లాం (పతిపాదించిన విశ్వాసాల్లోనూ, జీవన వ్యవస్థలోనూ ఆ కాలపు (పత్యేక ఆర్థిక పూర్వరంగం కొట్టవచ్చినట్టు కానవస్తుంది. ఈ కారణం చేతనే ఇస్లాం, ఆనాఢు చెలామణిలో ఉన్న బానిసత్వాన్ని ధృవీకరించింది. భూస్వామ్య వ్యవస్థను యధాతథంగా ఉండనిచ్చింది. ఎందుకంటే ఘనత వహించిన కారల్ మార్క్స్ గారి మనోజ్ఞసూక్తి (పకారం, నేడు లేని, రేపు రాబోయే అధికతర (పగతినొందిన ఆర్థిక పరిస్థితుల్ని ఊహించి ఆ అవసరాలకనుగుణమయిన చట్టాలను చెయ్యడమయినా జీవన నియమావళిని సమకూర్చడమయినా కానేరని కార్యం.”
కమ్యూనిజం చేసే ఈ వాదనలో ఎంతవరకు సత్యముంది అన్న విషయాన్ని తెలుసుకోడానికి బానిసత్వపు సమస్య ఏమిటో, దాని నిజమయిన చార్మితక, సామాజిక, మనోశాస్తు పరమయిన నేపథ్యమేమిటో అన్వేషించడం, యదార్జాన్ని అర్ధం చేసుకోవడం ఎంతో అవసరం.
భయంకర చితం అపార్థానికి మూలం
నేటి మానవుడు, 20వ శతాబ్దిలో కూచోని, బానిసత్వ సమస్యను పరిశీలించినప్పుడు, ఆ చరిత్రలో మనుషుల్ని వ్యాపార వస్తువుగా క్రయ వికయాలకు గురిచేసిన రోమను యుగం, అసహ్యకరమయిన అపరాధాలతో మలినమయి ఉండటం గమనిస్తాడు. అతనికి బానిసత్వపు చరిత అత్యంత జుగుప్సాకరమయినదిగా, భయంకరమయినదిగా దర్శనమిస్తుంది. ఇస్లాం ప్రతిపాదించే సిద్ధాంతాలు, చట్టాలు మనిషిని అన్నిరకాల బానిసత్వాల నుండి విముక్తం చేసే మౌలిక భావన ఆధారంగా రూపొందినవే అయినప్పుడు అది ఇలాంటి బానిసత్వాన్ని ధర్మబద్ధం చేస్తుందంకే అతనికి నమ్మ శక్యం కాదు. కాని ఇక్కడ ఓ పొరపాటు జరిగింది. ఇస్లాంను గురించి పరిపూర్ణ అవగాహన లేకపోవడం చేతనే ఇలాంటి భావం ఏర్పడింది. ఎందుకంకే బానిసత్వపు ఈ జాగుపాకరమయిన భావనకు ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదు.
బానిసల సమస్య 57
ఈ విషయంలో చరిత్ర సాక్ష్యాధారాలను పరిశీలించడం ఉత్తమం. రోమను స్మామాజ్యంలో బానిసలు ఏ విధంగా జీవించేవారో అర్ధం చేసుకోడానికి మన వద్ద సాక్ష్యాలు, వివరాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని ముందుంచుకుని చూస్తేనేగాని ఇస్లాం బానిసల విషయంలో తెచ్చిన మహత్తర విప్లవం (పస్స్ఫుటం కాదు. ఇస్లాం కేవలం బానిసల “విడుదల” లేక విముక్తికి మాతమే కృషి చెయ్యలేదు, సకల మానవ స్వేచ్చా స్వాతంత్యాలకు సంబంధించిన సరయిన భావనను కూడా (పతిపాదించింది. అంతేకాదు, ఆ భావనకనుగుణంగా ఆచరించి మరీ చూపింది. ఈ మహోత్కృష్టమయిన విప్లవం సంభవించిన తరువాత (పపంచం ఈ విషయంలో మరో చర్య ఏదీ తీసుకునే అవసరం లేకుండా పోయింది.
వారికన్నా పశువులే సయం
రోమను పాలనాకాలంలో బానినల్ని మానవులుగా కాక వ్యాపార వస్తువుగా భావించేవారు. వారికి ఎలాంటి హక్కులూ ఉండేవికావు; కఠినమయిన విధులు, అలవికి మించిన బాధ్యతలతో, వారిని అణచి వేసేవారు. అసలు ఈ బానిసలు ఎలా లభించేవారు. వారు లభించే పెద్ద మార్గం యుద్ధాలు-అవి ఏదో గొప్ప ధ్యేయం కొరకో, ఉన్నత సిద్ధాంతాల కొరకో చేసే యుద్ధాలు కావు. ఇతరుల్ని బానిసలుగా చేసి వారిని తమ స్వార్ధ (ప్రయోజనాల కొరకు పావులుగా ఉపయోగించుకోవడానికి చేసేవి. ఆ యుద్ధాల్లో పట్టుబడే ఖైదీలందరినీ బానిసలుగా మార్చుకునేవారు] యుద్ధాల లక్ష్యం, రోమనుల కొరకు విలాస సామి, చల్లని, వెచ్చని స్నాన వాటికలు, ఆడంబర అంబరాలు, స్వాదిష్టముయిన ఆహారాలు, జీవితపు ఇతర రుచులు సమకూర్చుకోవడం తప్ప మరేదీకాదు. తత్కారణంగా వ్యభిచారం, మధుపానం, నృత్యగాన కచ్చేరీలు, ఇతర “సాంస్కృతిక సమావేశాలు, సంతలు గటా విరివిగా సాగేవి. భౌతిక సౌలభ్యాలు, భోగవిలాసాల ఈ సామగిని పొందడానికి రోమనులు ఇతర జాతుల వారిపై దాడులు జరిపేవారు, వారిని బానిసలుగా చేసుకుని నిర్ణయగా
58 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
తమ విషయలాలస, విషయలోలత్వపు వాంఛల పరిపూర్తికై వాడుకునేవారు. రోమనులు జరిపే అత్యాచారాలకు, వారి వాతనబడ్డ ఈజిప్ట్ (పబల నిదర్శనం. ఇస్లాం విచ్చేసి ఈజిప్ట్‌ను రోమనుల బారినుండి విముక్తం చేసింది. రోమను స్మామాజ్యం కొరకు ఈ దేశం కేవలం గోధుమల్ని సరఫరా చేసే గోదాముగా లేక ఇతర భౌతిక అవసరాలను తీర్చే మార్గంగా మాతమే పనికి వచ్చేది.
కాంక్షాదాసులయిన రోమన్ స్మామాజ్యవాదుల కొరకు భోగ విలాస సామిని సమకూర్చేందుకు బానిసల “మందలు” పగలంతా పొలాల్లో పశువుల్లా నిమగ్నులయి ఉండేవారు. అయినా వారికి కడుపు నిండా కూడు కూడా (పాప్తమయేేది కాదు. ఊపిరి నిలుపుకునేందుకు ఎంతో కొంత వారిముందు పడేసేవారు. దాని ఆధారంగా వారు తమ (పభువుల సేవచేస్తూ ఉండవలసి వచ్చేది. (ప్రాణంలేని చెట్లకన్నా, జంతువులకన్నా వారి పరిస్థితి అధ్వాన్నంగా తయారయింది. పగల్లో పనివేళల్లో కాళ్ళకు బేడీలు వేసేవారు - వారు తమ కాపరుల చూపు తప్పించుకు పారిపోకుండా ఉండేందుకు. వారి వీపులపై కొరడా దెబ్బలు లెక్కలేకుండా పర్షించేవి. నిజానికి వారి యజమానికి లేక కాపరికి అలా చావబాదడంలో, బాధించడంలో ఎంతో ఆనందం తృప్తి లభించేవి. సాయంతానికి పని ముగిసినప్పుడు పదేసిమందిని, ఒకొక్కప్పుడు యాభయ్యేసి మందిని వివిధ (గూపులుగా చేసి పశువుల్లా దుర్వాసనా భరితమయిన, అసహ్యకరమయిన, ఎలుకలు, గండుచీమలు ఇతర కీటకాలతో నిండిన దొడ్లల్లో వేసి బంధించేవారు. చేతులకు, కాళ్ళకు ఆ స్థితిలోనూ బేడీలు తప్పేవికావు. జంతువులే నయం. వాటికయినా విశాలమయిన దొడ్లు లభించేవి. కాని ఈ జనం. ఆ సౌలభ్యానికీ నోచుకోలేదు.
ఉల్లాసానికి, కాలక్షేపానికి
బానిసల విషయంలో రోమనుల వైఖరి ఎంత జుగుప్సా
బానినల సమస్య 59
కరమయినదిగా ఏహ్యామయినదిగా ఉండేదో నిరూపించే చిం, వారి ప్రియాతి పియమయిన కాలక్షేపంలో కానవచ్చేది. దాని ద్వారా రోమనుల సంస్కృతిలో ఊపిరిగా అలరారిన మృగత్వం, రాక్షసత్వం, చండాలత్వం వ్యక్తమవుతాయి. ఆధునిక యుగంలో యూరపు మరియు అమెరికా కూడా తమ సకల స్మామాజ్య వాదపు సాధనా సంపత్తితో పాటు వీటిని కూడా వారసత్వంగా పుణికి పుచ్చుకు తెచ్చాయి.
(పభువులవారి కాలక్షేపం కొరకు కొందరు బానిసలకు కత్తులు, కరవాలాలు, బల్లెములూ ఇచ్చి ఓ మైదానంలో వదిలేవారు. మైదానానికి నలువైపులా టపేక్షకుల కొరకు కూర్చునే ఏర్పాట్లు ఉండేవి. వాటిపై బానిసల యజమానులు, తరచుగా స్వయాన రోము చక్రవర్తి ఆసీనులయి తమాషా తిలకించేవారు. ఆట మొదలయిందంకే బానిసలు ఆ కత్తులు కటారులు తీసుకొని ఒకరిపై మరొకరు విరుచుకు పడేవారు. పర్యవసానంగా చివరికి వాళ్ళంతా నుజ్జు నుజ్జు అయ్యేవారు. అదృష్టవంతులు ఎవరయినా ఆటలో [బతికి బయటపడితే వారిని విజేతలుగా నిర్ణయించేవారు. వారిని బాగా _పశంసించేవారు. బాగా చప్పట్లు చరచి, ఆనందాతిశయంతో కేకలువేసి, నవ్వుల తోరణాలు విసిరి వారిని స్వాగతం పలికేవారు.
రోమనుల జగత్తులో బానిసల సామాజిక స్థితి ఇదే. ఈ సందర్భంలో రోమను శాసనాల్లో సూచించబడిన బానిసల స్థితిని గురించిగాని, యజమానుల (పచండ అధికారాలను గురించిగాని (పస్తావించడం అనవసరమని భావిస్తున్నాము. ఆ చట్టాల (_పకారం బానిసల జీవన్మరణాలు యజమానుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండేవి. యజమానులు నిర్ణయంగా, నిర్భయంగా తమ నీచ లక్ష్యాలకుగాను వారిని వాడుకునే అధికారం కలిగి ఉండేవారు. ఎందుకంకే బానిసలకు సమాజంలోని ఏ వర్గం మద్దతు కూడా లభించేది కాదు.
పర్షియా, భారతదేశం ఇంకా ఇతర (పపంచదేశాల్లోనూ బానిసలపై
60 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
జరిగే జులుంలోగాని, దాని ఎడల బానిసల అశక్తతలోగాని పెద్ద వ్యత్యాసం ఉండేదికాదు.ఏదో కొంత స్వల్పమయిన తేడా తప్ప (పపంచంలోని విభిన్న దేశాల్లో బానిసల స్థితి, వారి సామాజిక స్థాయి విషయంలో పద్ద న్యత్యాస ముండేదికాదు. బానిసల (పాణానికి విలువేలేదు. వారిని హతమార్చిన రక్తపరిహారంగాని మరే విధమయిన శిక్షగాని విధించేందుకు అదొక అపరాధంగానే పరిగణించేవారు. కాదు. వారిపై బాధ్యతలు, విధుల భారమేకాని వారికి హక్కులు మాతం పూజ్యం. (పపంచ దేశాల్లో బానిసలను గురించి దృక్పథం రీత్యాను, వారి సామాజిక హక్కుల రీత్యాను ఎలాంటి వ్యత్యాసముండేదికాదు. ఏదయినా వ్యత్యాసముంకే అది బానిసల పట్ల యజమానుల వైఖరిలోని కారిన్యంలోను, దౌర్జన్వపరత్వపు తీవతలోను కానవచ్చేది. ఒక్కోచోట బానిసలు అన్యాయం, అత్యాచారాల జుగుప్సాకరమయిన వ్యవహారానికి గురయితే మరోచోట కాస్తంత తక్కువ స్థాయి అక్రమాలకు లోనయ్యేవారు.
విప్లవాత్మకం ఈ పిలుపు ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లాం ఆవిర్భవించింది. అది బానిసలకు వారు కోల్పోయిన మానవీయ ఘనతను వారికి అనుగహించింది. అది యజమానుల్ని బానిసల్నీ సమంగా బోధించి స్పష్టంగా _(పకటించింది: “మీరంతా ఒకే వర్గానికి చెందినవారు.” (4 :25) ఇంకా ఇలా (పకటించింది: “ఎవరయితే బానిసని హత్యచేస్తారో అతనికి బదులుగా వారినీ హతమార్చడం జరుగుతుంది. ఎవరయితే అతని ముక్కును
కోస్తారో వారి ముక్కునూ కొయ్యడం జరుగుతుంది. ఎవరయితే అతన్ని నపుంసకుణ్జి (57౬౧1౬౬) గా చేస్తారో వారినీ అలా
బానినల సమస్య 61 చెయ్యడం జరుగుతుంది.”
ఇస్లాం బానిసలు, యజమానులు, ఒక్కమాటలో మానవులందరికీ ఉమ్మడి (పారంభం, ఉమ్మడి నివాసం, ఉమ్మడి పరిణామం ఉందని విశదీకరించింది:
“మీరంతా ఆదం సంతానమే. ఆదం మన్నుతో సృజించబడ్డాడు.”)
అందువల్ల అది యజమానికి బానిసపై, కేవలం యాజమాన్యం ఆధారంగా ఎలాంటి ఘనతను గొప్పదనాన్ని ఆపాదించలేదు. గొప్పదనానికి పునాదులు కేవలం భయభక్తులు, రుజువర్తనం మాతమే అని చాటింది:
“ అరబ్బుకు అరబ్బేతరునిపైగాని, అరబ్బేతరునికి అరబ్బు పైగాని, నల్లవానికి తెల్లవానిపైగాని, తెల్లవానికి నల్లవానిపైగాని ఎలాంటి పాధాన్యత లేదు - భయ భక్తుల ఆధారంగా తప్ప”!
ఇస్లాం, బానిసలపట్ల న్యాయవంతమయిన, ఉత్తమమయిన రీతిలో వ్యవహరించమని యజమానులకు బోధించింది.
“తల్లి దండులతో మంచిగా వ్యవహరించండి. బంధువులు, అనాధలు, నిరాధారుల ఎడల ఉత్తమ రీతిలో వ్యవహరించండి. పొరుగున వున్న బంధువుతో, పరిచయంలేని పొరుగువారితో, తోడుగా ఉండేవారితో, (పయాణీకునితో, మీ అధీనంలో ఉండే బానిసలతో ఉత్తమ రీతిలో వ్యవహరించండి. బాగా తెలుసుకోండి. అల్లావా అహంకారులను గర్విష్ణలను ఇష్టపడడు.” (4:36)
(1) పవక్త (పవచనం - హదీసు - బుఖారి.ముస్లిం, అబూదావూద్, తిర్మిజి, నసాయి. (2) హదీసు - ముస్లిం, అబూదావూద్. (3) హదీసు - బుఖారి. "
62 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
ఇస్లాం మరో విషయాన్ని కూడా బోధించింది. యజమాని, బానిసల మధ్య సంబంధం యాజమాన్యం మరియు బానిసత్వాలదో, లేదా అధికారి, విధేయుడిదో కాదని, సోదరత్వం, బంధుత్వాల సంబంధం అని నొక్కి చెప్పింది. యజమానులు తమ బానిసల్ని పెళ్ళి చేసుకోవడం పట్ల ఇలా
ఉద్బోధించింది :
“మీలో ఎవరయితే ముస్లిములయిన కుటుంబ (స్త్రీలను పెళ్ళి చేసుకునే స్తోమత కలిగి ఉండడో అతడు మీ అధీనంలో ఉండే ముస్లిములయిన బానిస (స్తీలను పెళ్ళి చేసుకోవాలి. అల్లావాకు మీ విశ్వాసం గురించి బాగా తెలుసు. మీరంతా ఒకే వర్గానికి చెందినవారు. అందువల్ల వారి (బానిసల) పోషకుల అనుజ్ఞ పాంది వారితో పెళ్ళి చేసుకోండి. ఇంకా మామూలు రీతిలో వారి
మహర్‌ని చెల్లించండి.” (4 :25)
బానిసలు మీ సోదరులని ఇస్లాం యజమానులకు తెలియపరిచింది. మహాపవక్త (సఅసం) ఇలా (పవచించారు:
మీ బానిసలు మీ సోదరులు. అందువల్ల మీలో ఎవరి అధీనంలోనయినా అతని సోదరుడు ఉన్నప్పుడు, అతడు తాను తినే తిండిని, తాను తొడిగే బట్టను, అతనికీ తినిపించాలి, తొడిగించాలి. అతడు చెయ్యనలవికాని ఏ పనినీ అతనికి పురమాయించరాదు. ఒకవేళ ఎప్పుడయినా అలాంటి పని తటస్థవడితే తానూ అతనికి చేయూత నివ్వాలి”
అంతేకాదు ఇస్లాం, బానిసల భావోదేకాలను అనుభూతులను కూడా గౌరవించింది, ఆదరించింది. దైవ సందేశహరుని _పబోధం:
బానినల సమస్య 63
“మీలో ఎవ్వరూ మీ బానిసల ఎడల వీరు నా బానిసలని, బానిస స్తీ అని సంబోధించరాదు. “వీరు నా పనిమనిషి (సహాయకుడు) పనికత్తె (సహాయకురాలు)' అని చెప్పాలి.”
ఈ బోధన, శిక్షణల (పభావమే ఒకసారి హ్మజత్ అబూ హురైరా చేత ఇలా చెప్పించింది:
ఒకసారి ఒకవ్యక్తి గురాన్నెక్కి పోతూ ఉండగా అతని బానిస గ్యురం వెనుక నడుస్తూ పోవడాన్ని అబూ హురైరా చూశారు. అప్పుడు ఆయన స్వారి చేస్తున్న యజమానిని ఉద్దేశించి “ఇతన్ని గురంపై నీ వెనకాల కూర్చోబెట్టుకో, అతడూ నీ సోదరుడే, అతనికీ నీలాంటి ప్రాణమే ఉంది” అని ఆదేశించారు.
తొలిసారిగా అన్ని హక్కులు
బానిసల సంక్షేమం కొరకు ఇస్లాం చేసిన సేవ ఇంతమ్మాతమే కాదు. ఆ గాధ ఎంతో నిడివయినది. కాని ముందుకు సాగేముందు, ఇస్లాం మూలంగా మొదటి దశలో బానిసల సామాజిక స్థానం, స్థాయిల్లో ఎంత బృహత్తర పరివర్తనం వ్యక్తమయిందో దానికి మూల కారణమయిన ఆ మహోన్నత విప్లవం యొక్క రూపు రేఖల్ని క్లుప్తంగా చర్చించడం అవసరం.
ఇస్లాం ఆవిర్భావం తరువాత బానిసల స్థితిలో వచ్చిన మార్పుకు పర్యవసానంగా వారు వ్యాపార వస్తువుగా కాక మొదటిసారిగా పూర్తిగా మానవతా హక్కుల్ని గౌరవాదరణల్ని పొందారు. ఇస్లాంకు పూర్వం వారిని మానవులుగా కాక క్రుదమయిన సృష్టిగా పరిగణించేవారు. వారు కేవలం ఇతరుల సేవచేయడానికే పుట్టినట్లు, ఇతరులు జరిపే అవమానం, పరాభవాలను ఓరిమితో, కృతజ్ఞతతో భరించడం సహించడం మాతమే వారి విధి అయినట్లు భావించేవారు. బానిసల ఎడల ఈ దృక్పథం కారణంగానే బానిసల్ని నిస్సంకోచంగా హతమార్చేవారు. అనాగరిక
64 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
శిక్షలకు గురిచేసే వారు. వారిచేత అత్యంత కఠినమయిన, అసహ్యాకరమయిన పని చేయించేవారు.* ఇంత జరిగీ ఒక్కని మనస్సాక్షిలోనయినా, ఏ కాస్త అయినా, స్వల్పమయిన బాధకూడా రగిలేదికాదు. ఇస్లాం, బానిసలను ఈ అత్యంత నీచమయిన స్థాయినుండి లేవనెత్తి, స్వతంత్ర మానవుల స్థాయికి చేర్చింది. ఇస్లాం చేసిన ఈ మహత్కార్యాలు కేవలం అందమయిన (పకటనలే కాదు చరిత కాదనలేని సత్యాలు. చరిత పుటలే దానికి సాక్ష్యం.
సర్వా సమానత
ఇస్లాం అంకేనే మండిపడే యూరపు పండితులు సయితం, ఇస్లాం (పారంభ కాలంలో బానిసలకు లభించిన ఉన్నత సామాజిక స్థాయిని (పపంచంలో మరెక్కడా, మరే జాతిలోనూ (ప్రాప్తం కాలేదన్న యదార్థాన్ని ఒప్పుకున్నారు. ముస్లిం సమాజంలో బానిసలకు గౌరవ్యపదమయిన స్థానం లభించింది. బానిసత్వపు బంధనాలనుండి విముక్తులయిన బానిసలకు తమ మాజీ యజమానుల పట్ల (దోహం తలపెట్టి ఆలోచన కూడా వచ్చేది కాదు. నిజానికి మాజీ యజమానుల పట్ల వారికి ఏ విధమయిన భయమో, లేక వారి సహాయ సహకారాల ఆశో వారికి లేకపోయినా వారు కక్ష సాధింపు వైఖరిని అవలంబించలేదంకే కారణం వారు తమ మాజీ
* భారతదేశంలో బానిసలు (శూదులు) దేవుని పాదాల నుండి వుట్టారన్న భావన ఉండేది. అందువల్ల వారిని నీచంగా తక్కువగా చూసే వారు. తమ జన్మ కారణంగా వారు ఎన్నటికీ మారే (పసక్తే లేదన్న భావం కూడా (పబలిఉండేది. పర్యవసానంగా వారికి మిగిలింది ఒకే దారి. ఈ వరాభవాన్ని జుగుప్సాకరమయిన (పవర్తనను వారు సహనంతో భరించాలి - వచ్చే జన్మలో నయినా మేలయిన సృష్టిగా పుష్టే ఆశతో. ఈ విధంగా వారి చేత శారీరకంగా దాస్యం చేయించుకోవడమే కాక, ఆ దాన్యం పట్ల తృప్తి చెంది దాన్ని తమ కర్మగా భావించి వడి ఉండేలా వారి మానసిక తర్ఫీదు కూడా చెయ్యడం జరిగింది. వారు ఆ అన్యాయపు వ్యవస్థకు తిరగబడి తమ భవితవ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశమే లేకుండా పోయింది.
బానిసల సమస్య 65
యజమానులకు సమానులుగా అవడమే. వారిపష్పుడు యజమానుల కుటుంబంలోని సభ్యులుగా రూపొందారు. ఇస్లాం వారి మధ్య “విలాయత్' సంబంధాన్ని ఏర్పరచింది. అది రక్త సంబంధానికి ఏ విధంగాను తక్కువయింది కాదు.
మరో విషయం ఏమిటంటే, బానిసల ప్రాణం కూడా స్వతంత వ్యక్తుల (ప్రాణానికి సమానంగా ఆదరణీయమని గౌరవనీయమని (ప్రకటించటం జరిగింది. స్వయంగా చట్టమే వారి ప్రాణాలను కాపాడే బాధ్యత తనపై వేసుకుంది. బానిసలకు (పతికూలంగా మాటలచేత నయినా చేతల వల్లనయినా ఏ విధమయిన అత్యాచారం జరపడం కూడా అపరాధంగా పరిగణించబడింది. వారిని బానిసలుగా పిలువడం కూడా నిషేధించారు మహా(పవక్త (స అసం). వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా, వారి మధ్య మానసిక దూరాలు తగ్గేలా వారు తమను తమ యజమానుల కుటుంబ సభ్యులుగా భావించేలా వారిని సంబోధించాలని ఆయన బోధించారు. “దైవం మిమ్మల్ని వారి యజమానులుగా చేశాడు. ఆయన సంకల్పిస్తే మిమ్మల్ని వారి చేతుల్లో బానిసలుగా చేసి ఉండేవాడే” అని కారుణ్యమూర్తి పలికారు. భావమేమంకే సందర్భవశాత్తు వారు బానిసలయ్యారు లేకపోతే నిజానికి వారికీ వారి యజమానులకూ మధ్య మానవులవడం రీత్యా ఎలాంటి వ్యత్యాసమూ లేదు అన్నమాట. ఈ విధంగా ఇస్లాం యజమానుల అనవసరమయిన గర్వాన్ని అణచింది. మరోవైపు బానిసల సామాజిక స్థాయిని పెంచి వారిని కేవలం మానవత ఆధారంగా తమ యజమానులతో కలిపివేసింది. పర్యవసానంగా బానిసలు, యజమానులు చేరువయ్యారు. వారి మధ్య (పేమానురాగాలు పెరిగాయి. ఈ (ప్రేమే మున్ముందు సకల మానవీయ సంబంధాలకు మూలాధారంగా రూపొందింది. శారీరక బాధ లేక నష్టానికి సంబంధించినంతవరకు బానిసలకు యజమానులకు అందరికీ ఒకే చట్టం ఏర్పరచడం జరిగింది. ఈ రూపంలో వారి మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని వివక్షతను పాటించే ఆస్కారం లేకుండా చూడటం జరిగింది. ఇస్లాం శాసనాంగం (పకారం, “బానిసని చంపినవాడు,
EN
ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
చంపబడతాడు' అన్నది, దాని విస్తృత (పభావ పరిధి దృష్ట్యా ఎంతో స్పష్టమయిన చట్టం. * యజమాని, బానిసల మధ్య సంపూర్ణమయిన సమానతను నెలకొల్పడమే దీని లక్ష్యం. వారికీ జీవితంలో సకల అవకాశాలూ సమానంగా లభించాలన్నదే దాని ధ్యేయం.
మానవ హక్కులు
ఇస్లాం బోధనల (ప్రకారం _పస్ఫుటమయిన యదార్ధం ఏమిటంటే బానిసలు కేవలం తమ ఈ (పస్తుత పరిస్థితుల కారణంగా ఏ మానవీయ హక్కుల్ని కోల్పోరాదు. ఇస్లామీయ షరీఅత్ _పసాదించిన ఈ హక్కులు కేవలం బానిసల ప్రాణాలను కాపాడటం మా(తమే కాక అవి ఎంతో విశాల హృదయాన్ని, ఢ్రేష్టమయిన (ప్రమాణాలను సూచిస్తున్నాయి. అలాంటి అనుపమ హక్కుల్ని ఇస్లామ్‌కు పూర్వపు చరితగాని తరువాతి సమాజాలు కాని సూచించలేకపాయ్యాయి. ఈ సందర్భంలో ఇస్లాం ఎంతవరకు వెళ్ళిందంకే తన బానిసకు ఒక చిన్న చెంప దెబ్బ అర్హతకూడా యజమానికి లేకపోయింది - ఏదో తప్పు చేసినప్పుడు శిక్షించడానికి వినా. అయితే ఈ శిక్షకు కూడా కొన్ని అతిక్రమించరాని పరిధులు హద్దులు నియమించడం జరిగింది. ఆ శిక్ష చిన్న పిల్లలకు పెద్దలు విధించే శిక్ష కంటే పెద్దది కాదు. కాని ఈ నిబంధనే ఆ తరువాత బానిసల విముక్తి కొరకు ఒక చట్టబద్ధమయిన కారణంగా పరిణమించింది. ఇక ఆ తరువాత (పాప్తమయిన నిజమయిన స్వేచ్చ విముక్తులను గురించి చర్చిద్దాము.
సర్వ స్వతంతత వైపుకు
తన సంస్కరణోద్యమం తొలిదశలో ఇస్లాం, బానిసలకు మానసిక
* ఇమామ్ గజాలి (వానిన “ఇన్‌యా ఉల్ ఉలూముద్దీన్" లో బానిసల అధ్యాయం
చూడండి.
బానిసల సమస్య 67
మయిన ఆధ్యాత్మికమయిన స్వేచృను స్వతంతతను (ప్రసాదించింది. వారు కోల్పోయిన మానవతా స్థానంలో వారిని పునస్థాపించింది. ఒకే మూలం- మానవతకు సంబంధించిన వారవడంచేత వారూ వారి యజమానులూ అందరూ సమానంగా ఒకే విలువను కలిగి ఉన్నారు. వారు స్వేచ్చను కోల్పోయినంతమ్మాతాన మానవతనూ కోల్పోలేదు. ఒక్క “బానిసత్వం' తప్ప వారు సకల విధాలా ఇతర మానవులకు సమానమయిన వారే. ఈ విధంగా వారికి తమ (పభువులకు ఉన్న హక్కులన్నీ లభించాయి. ఇది తొలి దశ.
ఇస్లాం అంతటితో ఆగిపోలేదు. ఎందుకంకే అది ఆకాంక్షించేది సంపూర్ణ మానవ సమానత్వం. ఆ సంపూర్ణ స్వతం[త్రస్థాయిలో వారు అందరితో పాటు సమానంగా సకల హక్కులూ కలిగి ఉండాలన్నదీ దాని అభిలాష. అందువల్ల ఇస్లాం బానిసల అసలయిన స్వేచ్చా స్వతంతతల వైపుకు పురోగమించింది. ఈ లక్ష్యసిద్ధికి రెండు మార్గాలు అవలంబించింది. (1) అల్ ఇత్క్ - అంటే యజమానుల తరఫున బానిసల స్వచృంద స్వేచ్చ. (2) ముకాతబత్ - అంటే యజమానులూ బానిసల మధ్య స్వేచృకు సంబంధించిన వాతమూలకమయిన ఒప్పందం.
అల్ ఇత్క్
షరీఅత్‌లో అల్ ఇత్క్ అంకే ఒక యజమాని తన బానిసను సంతోషంగా స్వచ్చందంగా విడుదల చేసే చర్య అని అర్ధం. దీన్ని ఇస్లాం ఎంతో (ప్రోత్సహించింది. స్వయంగా (పవక్త మహనీయులు (సఅసం) ఈ విషయంలో తన సహచరుల సమక్షంలో ఉన్నతమయిన ఆదర్శాన్ని నెలకొలిపారు. ఆయన తన బానిసలందరినీ విడుదల చేసివేశారు. -ఆయన, సహచరులు కూడా ఆయన అనుసరణలో తమ తమ బానిసలకు స్వేచ్చను (ప్రసాదించారు. ఇంకా హ్యజత్ అబూబ(క్ అయితే తన సంపదలో అత్యధిక భాగాన్ని బానిసల్ని వారి యజమానుల నుండి కొని
68 క ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
విడుదల చెయ్యడంలోనే వినియోగించారు. బైతుల్ మాల్ (ఇస్లామీయ రాజ్య ధనాగారం) లో కూడా ఈ ఉద్దేశానిగ్గాను కొంత ధనం కేటాయించడం జరిగింది. దాని ద్వారా బానిసల్ని కొని వారికి స్వేచ్చను _పసాదించడం జరిగేది. యవ్యాబిన్ సయీద్ ఉల్లేఖనం (పకారం “ఒకసారి హ్మజత్ ఉమర్ బిన్ అబ్బుల్ అజీజ్ (రజిఅన్) నన్ను జకాత్ వసూలు చెయ్యడానికి ఆఫికా పంపారు. నేను జకాత్‌ను వసూలు చేసి దాన్ని పంచిపెట్టడానికి అర్హులయిన అగత్యపరులకొరకు అన్వేషించడం మొదలెట్టాను. నాకు జకాతను పొందే అర్హుడయిన వ్యక్తి ఒక్కడయినా తటస్థించలేదు. ఎందుకంకే హ(జత్ ఉమర్‌బిన్ అబ్బుల్ అజీజ్ ప్రజలకు ఆ విధంగా సౌభాగ్యవంతులుగా చేశారు. అప్పుడు నేను ఆ మొత్తాన్ని బానిసల్ని కొని విడుదల చెయ్యడానికి వినియోగించాను.”'
మహనీయ ముహమ్మద్ (సఅసం) నిర్ణయించిన. నియమాల్లో ఒకరేమంకే ఒక బానిస పదిమంది నిరక్షరాస్యులకు చదవనూ వాయనూ నేర్పిస్తే లేక అలాంటిదే మరేదయినా సాంఘిక సేవచేస్తే అతను బానిస బంధనాలనుండి విముక్తి పొందగలడు. అలాగే దివ్యఖుర్‌ఆన్‌లో, కొన్ని పాపపు కార్యాలకు పాయశ్సిత్తం బానిసల్ని విడుదల చేయించడం అని కూడా నిర్ణయించింది. స్వయంగా దైవ సందేశహరులు (సఅసం) కూడా, కొన్ని అపరాధాలకు (పాయక్సొత్తం బానిసల్ని విముక్తి కలిగించడమని బోధించారు. తదనుగుణంగా అసంఖ్యాకమయిన బానిస గణం స్వేచ్చా వాయువు పీల్చుకోగలిగారు. దైవ పవక్త (సఅసం) ఒకసారి ప్రవచించారు, “ఆదం సంతతిలో పాపాలకు అతీతుడయిన వాడెవడూ లేడు” అని. తప్పు చేసిన వ్యక్తి పాప పరిహారంగా బానిసల్ని విడుదల చేయించేవాడు. ఈ సందర్భంలో మా ఉద్దేశ్యాన్ని విశదీకరించడానికి, ఒక ముస్లింని పారపాటుగా చంపే తవ్న్పును ఇక్కడ (వస్తావించడం భావ్యమనుకుంటున్నాము. ఇస్లాం (పకారం ఒక ముస్లింని మరొక ముస్లిం పొరపాటుగా చంపివేస్తే పాపపరివారంగా ఒక బానిసను విడుదల చేయించాలి. ఇంకా హతుని వారసులకు రక్త పరివారాన్నీ చెల్లించాలి. దైవ (గంథంలో ఇలా ఉంది:
బానిసల సమస్య 69
మరెవరయినా ఒక మోమిన్‌ని పొరపాటుగా చంపి వేసినట్లయితే
దాని పాయశ్స్బొత్తం: ఒక మోమిన్‌ని బానిసత్వపు బంధనాల నుండి విముక్తం చెయ్యడం, ఇంకా హతుని వారసులకు రక్త పరివారాన్ని చెల్లించడం. (4:92)
ఒక వ్యక్తిని పారపాటుగానయినా సరే హత్య చేసిన హంతకుడు, వాస్తవానికి సమాజంకోసం పాటుపడే ఓ వ్యక్తిని లేకుండా చేశాడు. తద్వారా అతను హతుని వారసుల హక్కుల్ని, సమాజపు హక్కుల్ని కాజేశాడు. వాటి పరిహారంగా హంతకుడు వారసులకు నిర్ణీత రక్త పరిహారం చెల్లించాలని, సమాజానికి మరో వ్యక్తినాస్వేచ్చ పొందిన బానిసను - అందజెయ్యాలని కోరుతుంది. మరో మాటలో చెప్పాలంటే, ఒక బానిసను విడుదల చేయించడం ఇస్లాం దృష్టిలో ఒక మానవుణ్ణి (బతికించడానికి సమానమన్నమాట. దీనివల్ల తెలిసేదేమంకే, బానిసలకు _అది అన్నుగహించిన ఇన్ని భృదతలు ఉన్నా, ఇస్లాం దృష్టిలో బానిసత్వం అనేది మృత్యువుతో సమానమయిందే. అందువల్లనే ఇస్లాం, మానవుల ఈ దళిత, బాధిత వర్గానికి స్వేచ్చా స్వతంతతల జీవనదాయకమయిన భావనలతో భాసిల్ల జెయ్యడానికి, సజీవ వ్యక్తుల్లో స్థానం కల్పించడానికి లభించిన (పతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంది.
చరిత మనకు తెలిపేదేమంకే ఈ “అల్ ఇత్క్' విధానం ద్వారా బానిసత్వపు సంకెళ్ళనుండి విడుదల పొందినంతమంది మరే (పాచీన లేక ఆధునిక జాతిలోనూ బానిసత్వం నుండి బయటపడలేదు. అయితే ఈ సందర్భంలో మరో విషయం కూడా కనుమరుగు కారాదు. ముస్లిములు ఇంత అధిక సంఖ్యలో బానిసల్ని విడుదల చేశారంటే అది ఏదో భౌతిక ప్రయోజనాల కొరకు కాదు. వారి ఈ చర్యకు (పేరేపణ కేవలం దైవ పసన్నత పొందాలన్న భావం మాతమే.
70 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో ముకాతబత్
బానిసల్ని బంధ విముక్తులుగా చెయ్యడానికి ఇస్లాం అనుసరించిన రెండో విధానం ముకాతబత్ విధానం. అంకే (వాత మూలకంగా ఒప్పందం. బానిస ఎవరయినా తన యజమానిని స్వేచ్చను అర్ధిస్తే యజమాని ఈ ముకాతబత్ నిధానాన్ని అనుసరించి ఆ బానిసను నిర్ణీత రొక్కం తీసుకుని విడుదల చెయ్యాలి. రొక్కం ఎంత ఉండాలన్నది యజమాని, బానిసల మధ్య పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్ణయమయ్యేది. ఒకవేళ యజమాని కాదంకే బానిస కోర్టు ఎక్కేవాడు. నిర్ణీత రొక్కం వసూలు చేసి బానిసను విడుదల చేసేందుకు న్యాయస్థానానికి పూర్తి హక్కులుండేవి.
ఈ ముకాతబత్ విధానం వల్ల స్వేచృనుకోరే బానిసలందరికీ స్వేచ్చా స్వాతం[త్యాలు పొందే మార్గం సుగమం అయింది. ఆ తరువాత వారు యజమానుల దయాదాక్షిణ్యాలు, మంచితనం, దైవభీతిలాంటి గుణాలపై ఆధారపడి బానిసత్వం నుండి విముక్తికై నిరీక్షించే అవసరం లేకుండా పోయింది.
ఒక బానిస ముకాతబత్ ద్వారా తన విముక్తిని వాంఛిస్తే యజమాని విదయినా (పతీకార చర్య తీసుకుంటాడన్న భయం కూడా బానిసకు లేకుండేది. ఎందుకంకే ఇస్లామీయ (పభుత్వమే బానిసలకు అండగా నిలబేది. ఈ ఒప్పందం కుదిరిన తరువాత యజమాని తన బానిసకు అతని అదనపు సేవలకు (పతిఫలంగా కొంత వేతనం ఇచ్చేలా చూడటం పభుత్వం బాధ్యత అయింది. యజమాని ఇలాంటి అదనపు పనికి వేతనం ఇచ్చేందుకు ఇష్టపడకపోతే బానిసకు వేరే జీవనోపాధిని కల్పించడం కూడా (పభుత్వ బాధ్యతే. తద్వారా అతను తన యజమానికి చెల్లించ వలసిన రొక్కం కూడబెట్టి విముక్తిని పొందగలిగేపాడు. సరిగ్గా ఇదే పరిస్థితి యూరపులో ఎదురయింది. ఎప్పుడు? 14 వ శతాబ్దంలో! అంకే ఇస్లాం తన అధికారపరిధిలో దాన్ని అమలు పరచిన 7 వందల ఏళ్ళ తరువాత
బానిసల సమస్య 71
అన్నమాట. అప్పటికి ఇస్లామీయ రాజ్య పరిధిలో బానిసత్వం అసలు నామరూపాల్లేకుండా పొయ్యింది.
ఇస్లామీయ (పభుత్వానికి ఈ విషయంలో మరో (పత్యేకత కూడా ఉంది. ఈ (పత్యేకత మరెక్కడా కానరాదు. స్వేచ్చను కోరే బానిసలకు (పభుత్వ ధనాగారం నుండి ధన సహాయం. దీనికి బదులుగా ఎలాంటి భౌతిక (పయోజనం అది కోరదు - కేవలం విశ్వ (పభువు ఆదేశాలను పాలించి ఆయన (పసన్నతను పొందాలన్న వాంఛ తప్ప. జకాత్ ఫండును ఖర్చుచేసే పద్దుల్ని (పస్తావిస్తూ దివ్య ఖుర్‌ఆన్ ఇలా (పకటిస్తుంది:
సదకాత్ (జకాత్) అయితే కేవలం నిరుపేదల కొరకు, అగత్య పరులకొరకు, జకాత్ వసూలు చేసే కార్యకర్తల SOR: య ఇంకా బానిసల్ని విడుదల చేయించ డానికి ఖర్చు చెయ్యాలి. (9:60)
ఈ ఆయత్‌లో, తమ సొంత సంపాదనతో స్వేచ్చను పొందలేని బానిసలకు. ధన సహాయం చెయ్యాలన్న ఆదేశం స్పష్టంగా ఉంది.
సాలెగూడు పటాపంచలయింది
ఇస్లామీయ వ్యవస్థలోని ఈ రెండు వ్యవస్థలు, అల్ ఇత్క్, ముకాతబత్ - బానిసత్వపు భయంకర చరితలో మహోన్నతమయిన క్రియాత్మక విప్లవాన్ని సూచిస్తున్నాయి. మిగతా (పపంచం (పగతి శీలకమయిన ఈ స్థాయికి చేరేవరకు కనీసం7 శతాబ్దాలు దాటిపాయ్యాయి. అంతేకాదు, బానిసలకు (పభుత్వం తరఫున రక్షణ కల్పించి, ఇస్లాం (పపంచానికి ప్రగతిశీల దృక్పథం అంటే ఏమిటో తెలిపింది. ఎలాంటి రాజకీయ, ఆర్థిక వత్తిడులకు గురిచెయ్యకుండా, ఎలాంటి (పలోభాలు ఆశలు చూపకుండా, స్వచృందంగా బానిసల్ని విడుదల చెయ్యాలని ఇస్లాం
72 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
ముస్లిముల్ని (పేరేపించింది. ఇలాంటి ఒక్క నిదర్శనమయినా చూపగలదా నేటి సభ్య సమాజం?
ఈ యదార్థాలు చాకేదేమిటి? కమ్యూనిస్టులు ఇస్లాంను గురించి చేసే ప్రచారం అంతా బూటకమని! తార్కిక భౌతికవాదం (పకారం ఇస్లాం ఇతర జీవన విధానాల పూదిరిగానే, మానవ చరిత్ర యొక్క ఓ (పత్యేక కాలానికి చెందిన ఆర్థిక పరిస్థితుల (పభావంవల్ల ఉనికిలోకి వచ్చిందని, అందువల్ల అది రాబోయే ఏ అభ్యుదయ ఆర్థిక అవసరాలతో సరిపడ జాలదని వారు వాదించారు. కాని వారి ఈ బూటకపు (పచారాన్ని ఇస్లాం కుండబద్దలు కొట్టినట్టు బహిర్గతం చేసింది. నిజానికి నేటికీ ఇస్లాం ఉనికియే కమ్యూనిస్టుల వంచనపూరిత [పచారానికి గట్టికియాత్మ కమయిన జవాబు. ఇస్లాం అరేబియా ద్వీపకల్పంలోనూ దీవి వెలుపలనూ ఏ విధంగా శక్తి కీర్తీ పాభవాలతో భాసిల్లిందో అది కార్గ్‌మార్క్స్ సిద్ధాంతానికి చెంపపెట్టు లాంటిది. బానిసలపట్ల ఇస్లాం వైఖరి అయినా లేక జీవితపు ఇతర విషయాల్లో దాని వ్యవహారమయినా, సంపద పంపిణి అయినా పాలక పాలితుల, సేవక సేవితుల సంబంధాల నిర్ణయమయినా ఇస్లాం (పత్యేకత (ప్రతిచోటా కొట్టవచ్చినట్లు కానవస్తుంది. ఇస్లాం తన సామాజిక ఆర్థిక వ్యవస్థల కట్టడాన్ని స్వచృందంగా సంతోషంగా అనుసరించే ఓ వ్యవస్థకు ఆధారంగా నిర్మించింది. వివిధ సామాజిక వ్యవస్థల చర్మితలో ఈ అనుపమ వ్యవస్థకు సాటి రాగల వ్యవస్థ మరొకటి నేటి వరకు ఉనికిలోకి రాలేదని చెప్పవచ్చు.
సమస్య * సమ్మగ పరిశీలన ఈ సందర్భంలో ఓ (పశ్న ఉత్పన్నం కావచ్చు. బానిసల స్వేచ్చా
స్వాతంత్యాల ధ్వజవాహిక అయిన ఇస్లాం, వారి విముక్తి కొరకు, ఎలాంటి రాజకీయ ఆర్థిక వత్తిడి లేకుండానే ఇన్ని విప్లవాత్మక చర్యల్ని తీసుకు
బానినల సమస్య 73
రాగలిగిన ఇస్లాం, బానిసత్వాన్ని శాశ్వతంగా ఎందుకు రూపుమాపలేదు? అప్పుడే కదా మానవాళికి దాని సకలశుభాలూ అందగలిగేది! అప్పుడేకదా, ఇస్లాం నిజానికి ఓ పరిపూర్ణ ధర్మమని, తన సృష్టి నంతటిపై మానవాళికి విశిష్టత ప్రసాదించిన దైవం మానవుల మార్గదర్శకత్వం కొరకు పంపిన ధర్మమని నిర్ద్వంద్వంగా రుజువయ్యేది!
ఈ (పశ్నకు సమాధానాన్ని తెలుసుకునేందుకు బానిసత్వం వల్ల జనించే అనేక మానసిక, సామాజిక, రాజకీయ సమస్యల్నీ అర్ధం చేసుకోవలసి ఉంటుంది. ఎందుకంకే ఈ కారణాల వల్లనే ఇస్లాం, బానిసత్వంపై వెంటనే చివరిదెబ్బ తీయలేదు. దాన్ని కొంతకాలం వరకు వాయిదా వేసింది. సమస్యను ఈ కోణంతో పరిశీలించేటప్పుడు గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించడంలో జరిగే ఈ అసాధారణమయిన జాప్యం నిజానికి ఇస్లాంలో అభిలషనీయం కాదు. తన విధానాలకు భిన్నమయిన వాటితో రాజీపడని దాని పరిశుద్ధ నైజం వల్ల అది సాధ్యపడేదీకాదు. జాప్యానికి అసలు కారణం తరువాతి కాలంలో ఇస్లాం పరిశుద్ధ సెలయేరును కలుషితం చేసిన మార్గ విహీనత, మార్గ (భష్టతల పోకడలు.
ఇస్లాం ఆవిర్భావం జరిగినప్పుడు (పపంచమంతటా బానిసత్వం మూడు పువ్వులు ఆరు కాయలుగా పరిఢవిల్లుతూ ఉండింది. ఆ కాలపు సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అది దాని అనివార్యమయిన అంశంగా రూపొందింది. పరిస్థితుల ఈ స్వరూపాన్ని మార్చాలంటే, బానిసత్వాన్ని సంపూర్ణంగా తుడిచిపెట్టాలంకే సుదీర్ణకాలంవరకు వివిధ దశల్లో కృషి చెయ్యటం అవసరం. ఇలాంటి దశల వారీగా సంస్కరించే, దీర్ణకాలికమయిన విధానం ఇతర ఇస్లామీయ శాసనాల అమలులో సయితం కానవస్తుంది. ఉదాహరణకు, మద్యపానం ఓ వ్యక్తిగతమయిన చెడుగు, పైగా అజ్ఞాన కాలంలోనూ. అరబ్బుల్లో కొందరు మద్యపానాన్ని మానవ గౌరవానికి, సంస్కారానికి పతికూలమయినదిగా భావించి దానికి దూరంగా ఉండేవారు. అలాంటి దాన్నే ఒకేసారి నిషేధించడం జరగలేదు. నిషేధానికి పూర్వం కొన్నేళ్ళపాటు మానసికమయిన మార్చునకై కృషి చెయ్యడం జరిగింది. కాని
74 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
బానిసత్వం విషయం అలాకాదు. ఈ విషయంలో వారి దృక్పథం పూర్తిగా భిన్నమయింది. ఆ కాలపు సామాజిక వ్యవస్థలో, ఆనాటి (పజల నైజంలో, వారి అంతరాళాల్లో దాని వేర్లు లోతుగా నాటుకు పొయ్యాయి. ఎందుకంటే వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక జీవితానికి సంబంధించిన అనేక యదార్థాలు, అనేక మూల హేతువులు దానితో ముడివడి ఉన్నాయి. ఈ కారణాల వల్ల మద్యపానం మాదిరిగా బానిసత్వాన్ని చెడుగుగా భావించడమో లేక దాన్ని ఇష్టపడక పోవడమో అన్నమారే తలెత్తలేదు. ఈ కారణంగానే దాని సంపూర్ణ నిర్మూలనం కొరకు మవ్యపవక్త దైవదౌత్య కాలంకంకే, అంకే దైవాదేశాల అవతరణ కాలంకన్నా కూడా అధిక కాలం కావలసి వచ్చింది; అప్పటిగ్గాని దాన్ని తుదముట్టించడం సాధ్యపడలేదు.
సకల సృష్టిరాశికి కర్త, వాటి సహజ (ప్రవృత్తుల నెరిగిన స్వామి అయిన దైవానికి బాగా తెలుసు, మద్యపానాన్ని నిషేధించే లక్ష్యం కేవలం కొన్ని సంవత్సరాల్లోపల నోటి ఆదేశాల ఆధారంగా నెరవేరగలుగుతుందని. అందుచేత ఆ సమయం ఆసన్నం కాగానే ఆయన దాన్ని పూర్తిగా నిషేధించే ఉత్తరువుల్ని (పకటించాడు. అలాగే బానిసత్వాన్ని నిషేధించేందుకు పరిస్థితులు అనుకూలంగా అనువుగా ఉంటే, కేవలం ఓ ఆదేశం ద్వారా దాన్ని అరికట్టడం సాధ్యం కలిగేలా ఉంటు సర్వశక్తి మాన్యుడయిన మహోన్నత (ప్రభువు ఎలాంటి జాగు చెయ్యకుండా స్పష్టంగా, పస్ఫుటమయిన ఆదేశాలద్వారా తన సపదాయం (పకారం చిరకాలానికి దాన్ని నిషేధించి ఉండేవాడు. కాని అలా వీలు లేదు కాబట్టే ఆయన అలా చెయ్యలేదు. *
* మద్యపానం, బానిసత్వాల్లో మరో వ్యత్యాసం కూడా ఉంది. మద్యం ఎన్నడూ మనిషి యొక్క అనివార్యమయిన అవసరాల్లోకి చేరలేదు. అది ఓ చెడుగు. దాన్ని మానుకోవడం వల్ల వ్యక్తిలోగాని సమాజంలోగాని ఎలాంటి 'వెలితి ఏర్పడదు. నిజానికి దాని నిషేధం వల్ల దౌష్ట్యానికి ఓ మూలకారణం దూరమవుతుంది. కాని ఇస్లాం ఆవిర్భావ కాలంలో బానిసత్వం ఒక ఆర్ధిక, సామాజిక,సామూహిక, రాజకీయ అవసరం. దాన్ని ఒక్కసారిగా రద్దుచేసినట్లయితే అనేక చెడుగులకు పుట్టినిల్లు కాగల ఓ వెలితి ఏర్పడేది. ఇస్లాం అనుసరించిన పద్ధతివల్ల బానిసత్వపు చెడు (పభావాలు దూరమవడమే కాకుండా సంఘంలో ఎలాంటి కొరత కూడా ఉత్పన్నం కాలేదు. (అను)
బానినల సమస్య 75 పరిణామం, పగతి, పరిణతిమార్గం = ఇస్తాం
ఇస్లాం మానవాళి నంతటికీ వర్తించే ధర్మమని, అన్ని కాలాల (పజలు దాని బోధనల్ని దాని ఆరోగ్యవంతమయిన సిద్ధాంతాలను అనుసరించి పవిత్ర జీవితం గడపగలుగుతారని అంటే దానికి భావం, ఇస్లాం చలనంలేని, పరిణామ (పగతుల్లేని జీవన వ్యవస్థ అని, అది మానవ జీవితానికి సంబంధించిన అల్ప స్వల్ప విషయాలన్నింటినీ ముందే నిర్ణయించి వేసిందని ఏ మాతం కాదు. నిత్యం మారే పరిస్థితులూ జీవిత సమస్యలకుగాను ఇస్లాం కొన్ని సూత పాయమయిన ఆదేశాలనిచ్చి వివరాల విషయంలో స్వేచ్చ నిచ్చింది. ఆ స్మూత [పాయమయిన ఆదేశాల వెలుగులో జీవన (పగతి కొనసాగాలన్నది దాని ఉద్దేశ్యం. బానిసత్వపు మస్యపట్ల ఇస్లాం ఈ విధానాన్నే అనుసరించింది. అది బానిసల స్వేచ్చ్నకై గట్టి పాతిపదికలు “అల్ ఇత్క్' , 'ముకాతబత్' రూపంలో (పవేశపెట్టడమే కాక చిక్కులతో కూడుకున్న ఈ ప్రాచీన సమస్యను భావికాలాల కొరకు శాశ్వతంగా పరిష్కరించడానికి శాశ్వత (పాతిపదికపై ఓ సుస్థిరమయిన పరిష్కారాన్నీ సూచించింది.
మనిషిలో మాసవత
ఇస్లాం మానేవ నైజాన్ని మార్చడానికి ఆవిర్భవించలేదు, దాన్ని సంస్కరించడానికే అది వచ్చింది. ఎన్నో పరిమితులకు లోనయిన మానవ నైజం ఎలాంటి బాహ్యపేరణ, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరిణత మానవతా స్థాయిని పొందగలగాలన్నది దాని ఆశయం. మానవశీల నిర్మాణంలో విపష్లవాత్మకమయిన విధానాలను అనుసరించి ఇస్లాం అద్భుతమయిన ఫలితాలను సాధించగలిగింది. అలాగే సామాజిక సంస్కరణ విషయంలోనూ అనన్యసామాన్యమయిన .ఫలితాలు దాన్ని ఆ_శయించాయి. అయినా మానవుల వ్యక్తిత్వాన్నే పూర్తిగా మార్చివేసి వారు తమ పరుగులో మానవ అవధులనే అధిగమించి చేరలేని కెన్నత్యాలను అందుకునేలా చెయ్యాలన్నది
76 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
మ్మాతం దాని అభిమతం కాదు. ఎందుకంకే (ప్రపంచంలో ఇలాంటి మానవాతీత సృష్టినే సృష్టించదలిస్తే అల్లావా మనుషుల్ని కాదు, దైవదూతల్ని సృష్టించి ఉండేవాడు. వారికి దైవదూతలు మాతమే ఆచరించ గలిగే ఆదేశాల నిచ్చేవాడు. దైవదూతలను గురించి దివ్య(గంథం ఇలా వివరిస్తుంది:
వారికి ఏ ఆదేశమయితే ఇవ్వడం జరుగుతుందో ఆ ఆజ్ఞాపాలనలో వారు దైవాజ్ఞను ఏ మాతం జవదాటరు. ఇంకా ఏ ఆదేశమయితే ఇవ్వడం జరుగుతుందో దాన్ని వెంటనే అమలు పరుస్తారు.
(5 : 66)
మనిషిని దైవ దూతలుగా చెయ్యడం దేవుని ఉద్దేశ్యం కాదు - ఉత్తమ మానవులుగా చెయ్యడమే అసలు ఉద్దేశ్యం. ఆయన భువిలో మనుషులనే సృజించాడు. ఆయనకు మనుషుల శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. తాను ఇచ్చే ఆదేశాలను ఉత్తర్వుల్ని అర్ధంచేసుకుని ఆచరించేందుకు వారి సహజమయిన శక్తి సామర్థ్యాలు పెంపొంది వికసించడానికి ఎంతకాలం పడుతుందో కూడా ఆయనకు తెలుసు.
మానవ చర్వితలో మొదటిసారిగా బానిసత్వానికి వ్యతిరేకంగా ఎలుగెత్తి చాటింది ఇస్లాం. అంతేకాదు, వారి విముక్షికె ఓ విలక్షణమయిన ఉద్యమాన్ని మానవ నైజానికి అతి సమీపమయిన పంథాలో లేవనెత్తింది. అయితే బానిసత్వానికి మరోకారణం లేకుండా ఉన్నట్లయితే బానిసత్వం ఓ అభిశాపంలా (పపంచాన్ని బహుకాలం వరకు వేధిస్తూ ఉండేది కాదు. బానిసత్వాన్ని కూకటి (వేళ్ళతో పెకళించడానికి అడ్డుగోడగా నిలిచిన ఆ కారణం యుద్ధాలు విరివిగా నిరంతరంగా సాగిన మహో సంగామాలు. యుద్దాలే ఆ కాలంలో బానిసత్వానికి పట్టుగొమ్మలుగా తయారయ్యాయి.
మాౌనసికమయిన అవాంతరాలు
బానిసత్వపు సమస్యను చర్చించేటప్పుడు మనం ఒక సత్యాన్ని
బానినల సమస్య ఖ్
ఎప్పుడూ విస్మరించరాదు. స్వాతంత్యం అన్నది ఎవరో దయదలిస్తే లభించే దానం కాదు, దాన్ని తమ బాహుబలంతో కృషించి సాధించవలసి ఉంటుంది. అందువల్ల కేవలం ఓ చట్టాన్ని చెయ్యడం ద్వారానో ఓ ఆదేశాన్ని (ప్రకటించడం మూలంగానో శతాబ్దాల తరబడిగా వస్తున్న బానిసలు వారంతటవారే స్వయంగా విమోచనం పొందలేరు. అమెరికాలో జరిగిన (పయోగం, దాని అనుభవాలు, పర్యవసానాలు యదార్భానికి (పత్యక్ష తార్కాణాలు. అమెరికా అధ్యక్షులు అ(బవాం లింకన్ ఒక్క ఫర్మానా ద్వారా బానిసల విడుదలకై ఆదేశాలను జారీచేశారు. జరిగిందేమిటి? శతాబ్బాల తరబడి అణచివేతకు, పీడనకు గురవుతూ వస్తూన్న బానిసలు నిజానికి స్వేచృను పొందారా? లేదు. ఎందుకంకే మానసికంగా ఆధ్యాత్మికంగా వారు స్వేచృకై సిద్ధంగాలేరు. తత్కారణంగా, చట్ట బద్ధంగా స్వేచ్చ పొందిన తరువాత కూడా వారు తమ మాజీ యజమానుల వద్దకు పోయి వారిని ఇండ్లనుండి వెళ్ళగొట్టవద్దని, తిరిగి బానిసలుగా తమ వద్ద ఊడిగం చేయించుకునేందుకు ఉంచుకొమ్మని (బతిమాలిన సందర్భాలు కూడా అనేకం కానవచ్చాయి.
ఈ విషయాన్ని సూలంగా చూస్తే వింతగా అగుపించినా, మానవ మానసికావస్థ దృష్ట్యా కాస్త లోతుగా పరిశీలిస్తే అది అంతగా ఆశ్చర్యకరమయిందిగా తేలదు. మానవ జీవితంలో కొన్ని (ప్రత్యేకమయిన పరిస్థితులకు (పముఖ పాత్ర ఉంటుంది. అతడు నివసించే వాతావరణం అతని ఆలోచనల్ని, భావాలను ఇంకా అతని సంపూర్ణ మానసికావస్థను (పభావితం బేస్తుంది.* బానిసల మానసిక స్థితి, వారి నైజం తరతరాల
*
భౌతిక వాదుల (పకారం మానవ ఆలోచనా జగత్తును వారున్న పరిస్థితులే సృజిస్తాయి. “కాని ఈ వాదన కేవలం ఒక అపోహ మా(త్రమే. యదార్థమేమంటే, జీవితంలో ఒకానొక మానసికావస్థ (పాతివదికగా ఉన్నప్పుడే పరిస్థితులు తమ (పభావం చూపగలుగుతాయి. అందువల్ల ఆలోచనలపై చింతనా పరిధులపై భౌతిక పరిస్థితుల (వభావం ఉంటుందన్నది వాస్తవమే అయినా ఆలోచనలు, దృక్పథాలు కేవలం భౌతిక పరిస్థితుల మూలంగానే ఉనికిలోకి వస్తాయన్న మాట మటుకు సరయింది కాదు. మనో పీఠంపై మౌలిక విషయం ఉన్నప్పుడే పరిస్థితులు (పభావం చూపుతాయి.
78 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
మానసిక శిక్షణ మూలంగా ఓ స్వతర్యత మనిషి యొక్క మానసిక స్థితికి పూర్తిగా ఖిన్నమయి ఉంటుందన్నది మాతం యదార్థం. కాని పూర్వీకులు, ఛాందసులు భావించినట్లు, స్వతం(త, బానిస వ్యక్తుల్లోని ఈ మానసిక వ్యత్యాసం, మనుషుల వుట్టుకకు సంబంధించిన మౌలిక వ్యత్యాసం వల్ల ఏర్పడిందన్న వాదన మటుకు ఎంతమ్మాతం సరయిందికాదు. చిరకాలంగా బానిసత్వపు బంధనాల్లో చిక్కుకుని ఉండటం మూలాన, బానిసత్వం బానిసల మానసిక జీవితాన్ని ఓ (పత్యేకమయిన నైజంలోకి మలచివేస్తుంది. ఈ నైజంలో విధేయతా భావమే తప్ప స్వేచ్చాయుత, బాధ్యతాయుత భావాలకు తావే ఉండదు. బానిస ఓ స్వతం్యత సమాజంలో బాధ్యతాయుత వ్యక్తిగా తన బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించే మానసిక స్థితిని, ఆ యోగ్యతను కలిగి ఉండడు. అతడు స్వతం(తంగా ఆలోచించనూలేడు, తనంతట ఎలాంటి (క్రియాశీలతను (INITIATIVE) చూపనూలేడు.
ఒక బానిస, తాను స్వతం్యతంగా ఆలోచించే అవసరం లేనంతవరకు సరిగ్గా పనిచెయ్యగలుగుతాడు. అతని బాధ్యత, తన యజమాని ఆదేశాలను ఆజ్ఞల్ని కేవలం పాటించేంతవరకు పరిమితమయినప్పుడే అతని'కార్య నిర్వహణ సరిగ్గా ఉంటుంది. కాని ఎప్పుడయినా అతను స్వయంగా నిర్ణ యాలు గ్రైకొనవలసివస్తే అతని పరిస్థితి వర్ణనాతీతం. అతని నిర్ణయశక్తి స్థంభించిపోతుంది. తన జీవితంలోని ఎంతో సాధారణ విషయాల్లోనూ అతను ఎలాంటి నిర్ణయం గ్రైకొనడానికి, లేక దాని ఫలితాలను ధైర్యంగా ఎదుర్కొనడానికీ సాహసించలేడు. ఈ పరిస్థితికి కారణం అతనిలో ఏదో శారీరక మానసిక బలహీనత ఉండటం కాదు. మనస్తత్వ్యభాషలో చెప్పాలంకే అతను తన చేష్టల పరిణామాలను ఎదుర్కొనే నైతికబలాన్ని కోల్పోయి ఉంటాడు. ఏవో అర్థంలేని భయాలు, ఆందోళనలు, కష్టాలు అతన్ని భీతా వహుణ్జి చేసివేస్తాయి. అందువల్ల వాటిని అదువులోకి తీసుకోవడం తన వల్ల అయ్యేపని కాదని ఉత్తుత్తి భమలకు లోనవుతాడు. ఇలా ఆలోచించు కుంటూ అతడు తనలో తానే కుంచించుకుపోతాడు. చివరికి ఈ “విపత్తు” నుండి తన్ను కాపాడుకునే (పయత్నంలో జీవన రంగం నుండే
బానిసల సమస్య 79 మెల్లిగా తప్పుకుంటాడు.*
(పాచ్యదేశాల సమీప గతాన్ని దాని చరితను ఒక్కసారి పరికించి చూస్తే పాశ్చాత్య సామాజ్యవాదులు ఈ దేశాలపై మోపిన మానసిక శారీరక బానిసత్వపు భారం కారణంగా ఇక్కడి (పజల జీవితాలు ఎంతగా నిరుపయోగంగా, నిరర్థకంగా తయారయ్యాయో తెలుసుకోవచ్చు. పాశ్చాత్య సామాజ్య వాదులు తమ నీచమయిన (ప్రరోజనాలకొరకు ఓ నిర్జీత పథకం (ప్రకారం ఇక్కడ మానసికమయిన శారీరకమయిన బానిసత్వాన్ని నెలకొలిపారు. పోతూ పోతూ కూడా (పాచ్యదేశాలను ఆ బానిసత్వ బంధనాల్లో గట్టిగా కట్టి పడేసి మరీ పాయ్యారు. ఈ మానసిక బానిసత్వమే మనలోని పాశ్చాత్య పభావితు లయిన వారి సంవాదనల్లో, సంభాషణల్లో , ప్రసంగాల్లో (పతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ కారణం చేతనే వారు కొన్ని చట్టాలను నేడు అనాగరికమయినవని, ఆచరణయోగ్యం కానివనీ అంటూ ఉంటారు. అలా భావించినప్పుడు వారి హృదయాంతరాళాల్లో పనిచేస్తూ ఉండేది ఆ బానిసత్వపు భావమే. ఆ భావం మనసులో నాటుకుపోతే మనిషి స్వేచ్చగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని, వాటి పరిణామాలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్నే కోల్పోతాడు. ఈ కారణంగానే ఒక (బిటిషు లేక అమెరికన్ న్యాయవేత్త అక్కడ ఏదయినా అత్యంత అసహ్యకరమయిన చట్టాన్ని (పవేశపెట్టినప్పుడు ఇలాంటి మన (ప్రబుద్ధులు, దాన్ని ఇక్కడ కూడా అమలు జరపాలని ఇట్టే సిద్ధమవుతారు. ఎందుకంటే వారికి, తమ స్వేచ్చాయుత ఆలోచనతో, స్వతంతంగా నిర్ణయం తీసుకుని, తమశక్తి సామర్థ్యాల ఆధారంగా చట్టం చేసి అమలు జరిపే బాధ్యత తప్పుతుంది. (పాచ్యదేశాల్లో నేడు మనకు గోచరించే బ్యూర్యోకసీ కూడా ఆ బానిసత్వపు కాలంలోని అవశేషమే. ఈ కార్యాలయాల బాధ్యతారహితమయిన కార్య
* మన నాట దళిత (పజలు, నేటికీ పాలకవర్గమయిన అ(గకులాలనబడే వారి రాజకీయ ఎత్తుగడలకు ఎలా పావులుగా మారుతారో, తమకు లభించిన రాజ్యాంగ బద్ధమయిన కొన్ని సౌకర్యాలను సౌలభ్యాలను కూడా తమ మానసిక అపరిపక్వత కారణంగా ఎలా ఉపయోగించుకోలేక పోతున్నార్లో ఈ సందర్భంలో గమనించవచ్చు.
(అను)
80 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
నిర్వహణ, భయకంపితులయిన గుమాస్తాలు - దీన్నంతటినీ చూచి, ఆ బానిసత్వపు ముదనష్టపు ఛాయలు నేడుకూడా (పాచ్యదేశాల (పజల హృదయాలను ఏమేరకు ఆ(కమించుకుని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగుల్లో ఏ ఒక్కరిలోనూ స్వతంత్రంగా నిర్ణయాలు చేసే యోగ్యత కానరాదు. పై అధికారుల నుంచి స్పష్టమయిన ఆదేశాలు రానంతవరకు వారు బాధ్యతాయుతంగా ఏ నిర్ణయమూ గైకొనలేరు. వీళ్ళ ఉన్నతాధికారుల సంగతి కూడా అంతకంటే మెరుగ్గాలేదు. వారూ మానసిక స్థితి బానిసత్యపు కోరల్లో చిక్కుపడి ఉండకపోతే వీరు ఇలా నిర్ణీవమయిన యంతాల్లా తయారయ్యేవారు కారు, ఇలా అశక్తతతో ఇతరులపై ఆధారపడి వుండేవారు కారు. వీరి_వత్యేకమైన బానిస మనస్తత్వం ఇతరుల ఆదేశాలను అమలు జరవడానికయితే ఎంతో అనువుగా ఉంది కాని స్వతం్యతంగా నిర్ణయాలు శైకొనే విషయంలో పూర్తిగా నిరుపయోగం. _ ఇలాంటి మానసికావస్థలో స్వేచ్చా స్వాతంత్యాలు లభించినా అవి సద్వినియోగం కావు. నిజానికి స్వేచ్చాయుత జీవితం గడపడమూ సాధ్యపడదు. ఈ కారణంగానే బావ్యాంలో వీరు స్వతం్యతులుగా అగుపించినా వాస్తవానికి వీరి స్థితి బానిసలకన్నా ఏమా(తం భిన్నంగా లేదు.
ఈ బానిస మనస్తత్వం వల్లనే ఒక వ్యక్తి బానిసగా రూపొందుతాడు. ఇది (పారంభంలో బాహ్యపరిస్థితుల (పభావంవల్ల ఏర్పడినా కాల్మకమేణ దాని పట్టు మనిషివై పటిష్టమవుతూ ఉంటుంది. చివరికి అది శాశ్వ తస్థాయిని సృజించుకుంటుంది. ఏ విధంగానయితే ఒక చెట్టు కొమ్మ భూమిపై కొన్నాళ్ళు అనుకూల వాతావరణంలో వడి ఉంకే అది (కమేణ భూమిలో తన వేర్లను పరచుకుంటూ పోతుందో, అదేవిధంగా మానవ మానసికావస్థ కూడా ఓ వాతావరణానికి అలవడితే కమేణ అది దాని నైజమయిపోతుంది.
సంస్కరణ * సహజరీతిలో
అందువల్ల ఇలాంటి బానిస మనస్తత్వాన్ని రూపుమాపడానికి బానిసత్వానికి వ్యతిరేకంగా కేవలం చట్టాలు చెయ్యడం మూలాన దూరం
బానినల సమస్య 81
కాదు. దీన్ని నిర్మూలించాలంకే విప్లవం లోనుండి రావాలి. కొత్త వాతావరణాన్ని పరిస్థితుల్ని సృజించాలి. అప్పుడే బానిసల మానసిక, స్వాభావిక స్థితిని కొత్త రూపంలో మలచడం సాధ్యమవుతుంది. అతని వ్యక్తిత్వంలో ఓ స్వతం(త జీవికి అనివార్యమయిన కొత్త కోణాలను పెంపొందించడం కూడా అప్పుడే సాధ్యమవుతుంది.
అందువల్ల ఇస్లాం సరిగ్గా ఈ ఆచరణా విధానాన్నే అనుసరించింది. (పారంభంలో అది బానిసలపట్ల న్యాయవంతంగా, ఉత్తమ మానవీయ పద్ధతులతో, ఉదారబుద్ధితో వ్యవహరించమని బోదించింది. అది బాగా దెబ్బతిన్న బానిసల మానసికావస్థను సరిదిద్దడానికి, వారిలో మానవీయ జాన్నత్యం, ఆత్మగౌరవం, ఆత్మాభిమానాలను సృజించడానికి ఉత్తమ రీతిలో ఉపకరించింది. ఎందుకంకే మనిషి ఒకసారి స్వేచ్చ, మానవ గౌరవ బెన్నత్యాలను సరిగ్గా అర్థంచేసుకుంకే ఆపైన అతను వాటివల్ల వాటిల్లే బాధ్యతలనూ అర్ధం చేసుకోగలడు. అంతేగాని అమెరికాలో విమోచనం పొందిన అప్పటి నవ విముక్త బానిసల్లా తిరిగి బానిసత్వంలోనే శరణు షాందాలని అభిలషించడు.
బానిసలపట్ల ఉత్తమరీతిలో వ్యవహరించే విషయంలోనూ వారి మానవ స్థానాన్ని పునరుద్ధరించడంలోనూ ఇస్లాం చేసిన కృషికి అనుపమ దృష్టాంతాలను చర్విత పుటలు భ్యదవరిచాయి. పైన కొన్ని దివ్యఖుర్‌ఆన్ ఆయత్‌లను, (పవక్త (పవచనాలను (ప్రస్తావించడం జరిగింది. దిగువన ఆచరణాత్మక ఆదర్శాలు కొన్ని ఇస్లాం (పారంభద శలోనివి ఉదాహరిస్తున్నాము.
బానిసలు కాదు సోదరులు
మక్కానుండి మదీనా వచ్చిన తరువాత (ప్రవక్త మహనీయులు (సఅసం) ముస్లిముల మధ్య ఏర్పరచిన సోదరత్వంలో ఆయన అరబ్బు
82 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
నాయకమన్యుల్ని స్వేచ్చ పొందిన బానిసల సోదరులుగా చేశారు. రిబావా కుమారుడు బిలాల్‌ను ఆయన రువైహతల్ ఖన్‌అమ ఖాలిద్ సోదరునిగా నిర్ణయించారు. తాను స్వయంగా స్వేచ్చ నిచ్చిన బానిస జైదను తన బాబాయి హమ్జాకు సోదరుని గాను, ఖారిజాబిన్ జెదను హ్మజత్ అబూబ్యక్ సోదరునిగాను ఆయన ఏర్పరిచారు. సోదరత్వపు ఈ సంబంధం నిజమయిన రక్తసంబంధంకన్నా ఏ విధంగానూ తక్కువ కాదని చెప్పవచ్చు. ఈ విధంగా సోదరులుగా చెయ్యబడ్డవారు రక్త సంబంధీకుల మాదిరిగానే తమ ఈ సోదరుల ఆస్తులకు వారసులుగా కూడా ఖరారయ్యారు.
అంతేకాదు. ఇస్లాం సంస్కరణోద్యమం మరో అడుగు ముందుకు వేసి సమత్వాన్నీ సోదరత్వాన్నీ (పస్ఫుటంగా అభివ్యక్తం చేసే అతి నాజూకయిన వివాహ సంబంధాల్లోనూ బానిసల్ని సముద్ధరించడానికి ఉపక్రమించింది. దైవ సందేశహరుడు (సఅసం) తన మేనత్త కూతురు జైనబ్ వివాహం తాను విముక్తం చేసిన బానిస హ్మజత్ జైద్‌తో చేశారు. కాని పెళ్ళి అన్నది మనిషి, అందునా (స్తీయొక్క అతి సూక్షమయిన భావాలతో, అనుభూతులతో సంబంధం కలిగి ఉంటుందన్న యదార్ధం మనం మరువరాదు. దైవ (పవక్త ఆదేశం మేరకు హ్యజత్ జైనబ్ బానిసతో పెళ్ళి అయితే చేసుకున్నారు కాని సామాజిక స్థాయిలోని వ్యత్యాసం ఆమె ఆంతర్యం నుండి దూరం కాలేక పోవడం చేత వారిరువురి మధ్య సమన్వయం కుదరలేదు. అయితే (ప్రవక్త మహనీయుని దృష్టిలో ఉన్న అసలు ఉద్దేశ్యం నెరవేరింది. (పవక్త తన సొంత కుటుంబంలోని మహిళ పెళ్ళి బానిసతో చేసి, బానిసత్వపు అంధకార బంధురమయిన పాతాళాల నుండి, పీడిత వ్యక్తులయిన బానిసల్ని మానవ గౌరవోన్నతుల శిఖరాలకు లేవనెత్తారు. ఒక బానిస కురైషీ నాయకుల కుటుంబంలోని మహిళకు భర్త అయి, వారితో సమాన స్థానాన్ని పొందగలడన్న (పమాణం కయాత్మకంగా రుజువయింది.
ఇస్లాం బానిసలకు సైన్యాధి ప త్యాన్నీ, జాతీయ నేతృత్వాన్నీ, ఉన్నత
బానిసల సమస్య 83
పదవుల్నీ (పసాదించింది. దైవ (పవక్త అన్సార్, మువాజిర్లలోని గొప్ప గొప్ప నాయకులతో కూడిన ఓ సైనిక బృందాన్ని తయారు చేసినప్పుడు దానికి తన బానిస జైద్‌ని నాయకుడుగా చేశారు. జైద్ మరణానంతరం సైన్యాధిపతి పదవిని జైద్ కుమారుడు హజత్ ఉసామాకు అను(గహించారు. ఆ సైన్యంలో హ్మజత్ అబూబ|క్, హ్యజత్ ఉమర్ (రజిఅన్) లాంటి గొప్పగొప్ప గుర్తింపు పొందిన నాయకులూ ఉన్నారు. వారు మవా(పవక్త జీవితంలో ఆయనకు ముఖ్య సలహాదారులు,ఆయన తరువాత ఆయన స్థానంలో ఇస్లామీయ రాజ్యానికి ఖలీఫాలుగా వ్యవహరించిన మహనీయులు. ఈ విధంగా ఆయన (సఅసం) బానిసల్ని స్వతంత్ర మనుషులకు సమానంగానే కాక వారి నాయకులుగా కూడ నియమించారు. ఈ విషయంలో దైవ్యపవక్త చేసిన తాకీదు చాలా ముఖ్యమయింది. ఆయన ఇలా బోధించారు: “వినండి, మీ నాయకులకు విధేయులయి ఉండండి - మీ నాయకుడు ఎండు (దాక్షలాంటి తల గల నీగ్రో బానిస అయినా సరే! అతను మీ మధ్య దైవాదేశాలను జారీ చేసేంతవరకు మీరు అతనికి విధేయులుగా ఉండండి. ” అంటే అర్థం ఏమిటీ? ఓ బానిస అయినా ఇస్లామీయ రాజ్యంలో అత్యున్నత పదవిని అలంకరించడానికి హక్కు కలిగి ఉన్నాడన్న విషయాన్ని ఇస్లాం గుర్తించిందన్న మాట. హ్మజత్ ఉమర్ తన తరువాత ఖలీఫాగా నియమించవలసిన అవసరం ఏర్పడినప్పుడు, “అబూహుజై ఫా బానిస 'సాలిమ్' [బతికి ఉన్నట్లయితే నేను నా తరువాత ఖలీఫాగా నియమించేవాణ్ణి” అని అన్నారు. దైవ్యపవక్త బోధన, సంప్రదాయాలకు అనుగుణంగా, వాటి విశదీకరణగా ఆయన సహచరుల జీవితాల్లో ఆచరణ రూపేణ ఇలాంటి మహత్తర ఆదర్శాలు కానవస్తాయి.
హజత్ ఉమర్ జీవిత వివరాలను పరిశీలిస్తే ఇస్లామీయ సమాజంలో బానిసలకు (ప్రాప్తమయిన ఉన్నతస్థానాన్ని అర్థం చేసుకోవడానికి అది దోహదపడుతుంది. “ఫయ్' *” విషయంలో ఆయనకు ఒక మాజీ బానిస హజత్ బిలాల్‌కు భేదాభిపాయం వచ్చినప్పుడు, ఆయన, హ్మజత్
(1) బుఖారి (2) ఫయ్ = యుద్ధంలో గెలుచుకున్న సాగుభూములు
84 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
బిలాల్‌ను సంతృప్త పరచడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా
దైవాన్ని ఇలా ప్రార్థించారు. “అల్లావా, బిలాల్ మరియు అతని సహచరులు నాపై చేస్తున్న దానికి నాకు (పపతిఫలాన్నివ్వు”. ఎంత దయనీయ మయింది ఈ వ్యవస్థ! ఒక ఖలీఫాకు తన ప్రజల్లో ఓ వ్యక్తి అదీ మాజీ బానిస సమక్షంలో ఎంత నిస్సహాయత !!
ఇస్లాం ఒకవైపు ముస్లిములను (పేరేపించింది - స్వచృందంగా తమ బానిసలకు విమోచనమివ్యాలని, రెండోవైపు బానిసల మానసిక, నైతిక స్థాయిని పెంచేందుకు (శద్ధ వహించింది. తాము కోల్పోయిన స్వేచ్చను, హక్కుల్ని సౌలభ్యాలనన్నింటినీ పొందవచ్చు అన్న హమీనిచ్చింది. ఈ మానసిక శిక్షణ ద్వారా వారిలో విమోచనా కాంక్షను జాగృతం చేసింది. స్వేచ్చ తెచ్చే బాధ్యతలను ఎదుర్కొనేలా వారిని సమాయత్తవరిచింది.
మనుషుల్లో స్వేచ్చా స్వాతం్యాల వాంఛను రేకెత్తించి, వారి స్వాతంత్యతా భావానికి భాషనిచ్చి, దాన్ని సాధించే మార్గాలు సుగమం చేసి, వారు దాన్ని కోరగానే వారి స్వేచ్చను వారికి అప్పగించే ఓ వ్యవస్థలోనూ, బానిసల్ని శాశ్వతంగా బానిసత్వపు బంధనాల్లో కట్టి ఉంచి, వారిని బలహీనులుగా, అశక్తులుగా చేసి, బాహ్యంలో ఆర్థిక, సామాజిక విప్లవాల ఒత్తిడి రానంతవరకు, లక్షలాది (పజలు మృత్యువు ఒడిలో చేరనంతవరకు, వారు తమ స్వేచ్చా స్వాతం త్రాల కొరకు నోరు విప్పకుండా అణచిపెట్టి వ్యవస్థలోనూ - ఈ రెండింటిలోనూ వ్యత్యాసమంటూ ఏమీ కానరావడం లేదా?
చేదు ఫలాలు బానినత్వాన్ని నిర్మూలించడంలో ఇస్లాంకు ఇతర వ్యవస్థలపై గల
ఆధిక్యత: అనేక కోణాలనుంచి పరిశీలనార్హమయింది. బానిసల్ని బాహ్యరూపంలోనూ అంతర్గతంగానూ విమోచనాన్ని ప్రసాదించడం ఇస్లాం
బానిసల సమస్య 85
ఉద్దేశ్యం. అ(బ హాం లింకన్‌లా బానిసల్ని మానసికంగా స్వేచ్చా స్వాతం త్ర్యాల కొరకు సమాయత్త పరచకుండానే కేవలం కొన్ని సద్భావాలపై ఆధారపడి ఒక్క ఉత్తర్వును జారీ చెయ్యడంతో సరిపుచ్చలేదు ఇస్లాం. ఇస్లాం అనుసరించిన విధానాన్ని చూస్తే దానికి మానవ మనస్తత్వం యొక్క అవగాహన ఏ మేరకు ఉందే, ఇంకా అది తన లక్ష్యసాధనకై ఏ విధంగా లభించిన సాధనాలను మార్గాలను _ పూర్తిగా వినియోగించుకున్నదో ద్యోతకమవుతుంది. యూరపవులో మాదిరిగా మానవహక్కుల కొరకు అక్కడి బానిసలు ప్రాణాలను ఒడి గజ్టేందుకు సిద్ధం కానంతవరకు గత్యంతరంలేని పరిస్థితిలో స్వేచ్చ నివ్వలేదు ఇస్లాం. యూరపులో మాదిరిగా వర్గపోరాటాలు ఉత్పన్నమయేేవరకు, ఘర్షణలు జరిగి సమాజంలో వెగటు చోటు చేసుకునే వరకు నిరీక్షించకుండా స్వయంగా ముందుకువచ్చి బానిసలకు దాస్యబంధనాల నుండి విమోచనం కలిగించింది ఇస్లాం. ఆ వర్గ పోరాటానికి పర్యవసానంగా మానవుల్లోని ఆధ్యాత్మిక, (పేమైకధార ఇంకిపోయింది. నైతిక ఆధ్యాత్మిక వికాసానికి ఎనలేని నష్టం వాటిల్లింది.
మూఢ సంప్రదాయాలు
ఒక్క యుద్ధం తప్ప బానిసత్వానికి మూలకారణాలయిన వాటినన్నింటి ద్వారాలను ఇస్లాం శాశ్వతంగా మూసివేసిందని లోగడ మనం పరిశీలించాము. యుద్ధాన్ని అంతమొందించడం (కియాత్మకంగా కొరకరాని కొయ్యలా తయారయినందువల్లనే ఇలాంటి పరిస్థితి ఎదురయిందన్నదీ గమనించాము. ఆ సమస్యను కూడా ఇస్లాం ఏ రూపంలో పరిష్కరించడానికి కృషి చేసిందో చూద్దాము.
(పాచీనకాలంలో (ప్రపంచంలో ఓ విధానం చెలామణిలో ఉండేది. యుద్ధరంగంలో పరాజితులయిన సైనికుల్ని - మినహాయింపు లేకుండా అందరినీ నిర్భయంగా చంపడమో లేక వారిని బానిసలుగా చేసుకొనడమో
86 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
జరిగేది. * కాలక్రమేణ యుద్ధానికి సంబంధించిన ఈ సర్యపదాయం ఒక యదార్ధంగా, అనివార్యమయిన అవసరంగా రూపొందింది.
ఈ సామాజిక పూర్వరంగంలో ఇస్లాం ఆవిర్భవించింది. అది తన విరోధులతో ఎన్నో యుద్ధాలు చెయ్యవలసి వచ్చింది. ఈ యుద్ధాల్లో ఖైదీలుగా పట్టుబడ్డ ముస్లిముల్ని విరోధులు బానిసలుగా చేసుకునేవారు. వారిని, ఆ కాలంలో బానిసల విధిరాతగా తయారయిన బాధలు యాతనలన్నింటికి గురిచేసే వారు. ఖైదీ స్త్రీల మానభంగంలో విజేతలకు ఎలాంటి జంకూ వంకూ, సిగ్గూ శెరము ఉండేవి కావు. ఒక్కొక్కసారి తండి, కొడుకు ఇతర మి(తబృందం అందరూ కలిసి ఒకే (స్త్రీని తమ కామానికి బలిగొనేవారు. ఆమె వారందరికీ ఉమ్మడి ఉంపుడుకత్తెగా వ్యవహరించేది. (స్తీ గౌరవమో, ఆమె కన్య కావడమో లేక వివాహిత (స్తీ కావడమో ఏదీ అడ్డు వచ్చేదికాదు. యుద్ధాల్లో పట్టుబడే బాలలకు కూడా ఇదే గతిపట్టేది.
అపజయమే వారి అపరాధం
ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లాం తన విరోధీ ఖై దీలనందరినీ పట్టుకున్న వెనువెంటనే విడుదల చెయ్యడమన్నది సాధ్యమయ్యే పనికాదు. ఒకవేళ ఇలా చేసి ఉన్నట్లయితే అది వివేచనారహితమయిన చర్యగానే పరిగణించ బడుతుంది. దానివల్ల విరోధులకు ఇంకా కాస్త సాహసం కలిగేది. వారు ఎలాంటి (పతీకార చర్యకు భయపడకుండా ముస్లిముల బంధువులూ ఆత్మీయుల్ని బానిసలుగా చేసుకుని నిర్ధాక్షిణ్యంగా, ద్వేషం చల్లారేవరకు తమ దౌర్జన్యకాండను, (ప్రతీకార చర్యల్ని కొనసాగనిచ్చేవారు. ఇలాంటి
* UNIVERSAL HISTORY OF THE WORLD అనే పుస్తకంలో 2273వ పుటలో ఈ విధంగా ఉంది. (క్రీ.శ 599లో రోమను చక్రవర్తి మారియున్ (MARIVS) లక్షలాది యుద్ధ ఖై దీలను పట్టుకున్నాడు. కాని ఆయన వారిని విడుదల చెయ్యడానికో, వారికి బదులుగా పరిహారాన్ని స్వీకరించడానికో అంగీకరించలేదు. వారందరి ఇరచ్చేదనం చేయించాడు.
బానినల సమస్య 87
పరిస్థితిలో ఇస్లాం అనుసరించగల మార్గం ఒక్కరే. విరోధుల చేతుల్లో చిక్కుకున్న తన ఖైదీలపట్ల విరోధులు ఎలా (పవర్తించాలని అది కోరుకుంటుందో కనీసం అలాంటి (పవర్తనే అది తన చేజిక్కిన ఖైదీల పట్ల అనుసరించవలసి ఉంటుంది. యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసే ఈ సంపదాయాన్ని శతుపక్షం కూడా ఇస్లాంతో సహకరించనంతవరకు అంతమొందించడం సాధ్యమయ్యేదికాదు. అందుచేతనే ఇస్లాం, బానిసత్వాన్ని పూర్తిగా అంతమొందించేందుకు పరిస్థితులు అనుకూలించనంతవరకు, (పపంచ (పజలంతా యుద్ధ ఖైదీల విషయంలో ఓ ఉమ్మడి కార్యాచరణ విధానం పట్ల అంగీకారానికి రానంతవరకు భరించింది.
(పాచీనకాలం నుండి నేటివరకు యుద్ధాల చరిత ఒక జాతిపై మరో జాతి జరిపిన మోసం, జులుం, దౌర్జన్యాల గాథలతో, ఓ జాతిని మరోజాతి బానిసగా చేసుకున్న ఉదంతాలతో, జాతుల విస్తీరణా వాదపు సంకల్పాలతో, రాజుల, సేనానాయకుల స్వార్థపూరిత (ప్రతీకార కాంక్షల పర్యవసానాలతో నిండి ఉంది. ఈ యుద్ధాల్లో పట్టుబడే ఖైదీలను బానిసలుగా చేసుకోవడానికి కారణం పరాజితజాతి విశ్వాసాలో, నిమ్నోన్నతా విభేదాలో, శారీరక మానసిక శక్తి సామర్థ్యాలు కొరవడటమో - ఏదీకాదు. వారు పరాజిత జాతికి చెందిన వారవడం ఒక్కరే వారి అసలు అపరాధం. అందువల్ల విజేతలకు, తమ ఇష్టం వచ్చినట్లు వారితో వ్యవహరించే సకల అధికారాలూ ఉన్నాయి. వారిని అడ్డుకునే వాడెవడూ లేడు. ఉత్తమ సిద్ధాంతం, ఉన్నత ధ్యేయం, ఉజ్వల జీవన సూూతాలేవీ వారిముందు లెవ్వుగనుక వారు ఆడిందే ఆట, పాడిందే పాట, పలికిందే వేదం, చేసిందే ధర్మం!
యుద్ధం కాదు “జిహాద్
ఇస్లాం ఆవిర్భవించి ఈ చెడులన్నింటినీ అంతమొందించింది. అది దైవమార్గంలో “జిహాదో చెయ్యడం తప్ప అన్ని యుద్దాలనూ ఖండించింది.
88 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
వాటిని నిషేధించింది. జివోద్‌ను మాతమే ధర్మబద్ధం చేసింది. ఎందుకంకే మనిషిని అన్యాయం, అఇకమం, అత్యాచారాలనుండి కాపాడటం దాని ఉద్దేశ్యం. సత్యాన్వేషకుల మార్గంలో అవరోధాలు సృష్టించి, దైవదాసుల్ని దైవానికి దూరంచేసి తామే దైవాలుగా తయారయి కూర్చున్న నిరంకుశ పాలకుల్ని శక్తినుపయోగించి అంతమొందించటం ఎంతో అవసరం. అప్పుడే మనుషులకు నిజమయిన స్వేచ్చా స్వతంతతలు (ప్రాప్తిస్తాయి. అప్పుడే వారు తమ ఇష్టాయిష్టాల (పమేయంతో సత్యాన్ని దర్శించగలుగుతారు. దివ్యఖుర్‌ఆన్‌లో ఈ విషయాన్ని (పస్తావించడం జరిగింది:
ఇంకా మీతో కయ్యానికి దెగేవారితో అల్లావా మార్గంలో మీరూ పోరాడండి. అయితే అన్యాయం చెయ్యకండి. అల్లావా అన్యాయం చేసేవారిని ఇష్ట పడడు ( 2:19)
(మానవుల జీవనమార్గం) ధర్మం పరిపూర్ణంగా అల్లావా కొరకే ఏకోన్ముఖం కానంతవరకు మీరు వారితో పోరాడండి. (8:39)
ఇస్లాం సందేశం శాంతిశేయాల సందేశం. అది (పతి వ్యక్తికీ అవసరమయిందే. అందువల్ల దాని సందేశాన్ని విని, అర్థం చేసుకుని (గహించగలిగే మార్గం సుగమం కావాలి.
ముస్లిం జగత్తులో నేటికీ (క్రైస్తవులూ, యూదులు గణనీయమయిన సంఖ్యలో ఉన్నారన్న వాస్తవం, వారు తమ ధర్మంపై పూర్తి స్వేచ్భతో స్థిరంగా ఉన్నారన్న యదార్ధం చాటేదేమిటి? ఇస్లాం తన విశ్వాసాలను ఇతరులపై బలవంతంగా రుద్దదనడానికి, ఈ విషయంలో అది ఎలాంటి ఓత్తిడినీ, బలాత్కారాన్నీ అంగీకరించదనడానికి ఇది కాదనలేని తార్కాణం కాదా ?*
* పభఖ్యాత చరితాచార్యుడు, రచయిత ఆర్నాల్డ్ తన్మగంథం THE PREACHING 0౧15౬14 లో ఇస్లాం చేసే ఈ వాదాన్ని నిర్ధారించడమే కాదు బలపరిచాడు కూడా.
బానినల సమస్య 89 ముస్లిమేతరులు ా ఇస్తాం” యుద్ధం
(పజలు ఇస్లాం అందజేసే సందేశాన్ని స్వీకరించి అది (పకటించే యదార్భాలను విశ్వసిస్తే వారికీ ముస్లిములకు మధ్యనుండే శత్రుత్వం అంతా సమసి పోతుంది. అంతేకాక వారు స్వయంగా ముస్లిం సమాజంలో ఓ భాగంగా రూపొందుతారు. ఇక వారిని బానిసలుగా చెయ్యడం ధర్మసమ్మతం కాజాలదు - అలా చేసే ప్రశ్నే తలెత్తదు. ఇతర ముస్లిములకు లభించే హక్కులే వారికి లభిస్తాయి. అరబ్బుకు అరబ్బేతరునిపైగాని అరబ్బేతరునికి అరబ్బు. పైగాని ఎలాంటి ఆధిక్యత లేదు. ఇక్కడ ఆధిక్యత అంటూ ఏదయినా ఉంకే అది కేవలం మనిషిలోని బుజువర్తనం ఆధారంగాను, భయభక్తుల ఆధారంగా మ్యాతమే ఉంటుంది. దీనికి భిన్నంగా (పజలు ఇస్లాంను ధర్మంగా స్వీకరించకుండా ఇస్లామీయ రాజ్యం నీడలో ముస్లిములతో పాటు శాంతియుతంగా ఉండగోరితే ఇస్లాం వారిని బలాత్కరించి తమతో ఏకీభవించేలా చెయ్యదు. వారినుండి ఓ (పత్యేక రుసుము వసూలు చేసి _ వారి భద్రతా బాధ్యతను పూర్తిగా తన తలపై వేసుకుంటుంది. దీన్నే “జిజ్‌యా' అనంటారు. దీన్ని వసూలు చేసేటప్పుడు ఇస్లామీయ (పభుత్వం తన బాధ్యతా ఛాయల్లో శరణుపొందిన వారితో ఒప్పందం చేస్తుంది. దాని (ప్రకారం ఇస్లామీయ (పభుత్వం బయటి దుర్మాకమణనుండి వారిని రక్షించలేకపోతే ఈ రుసుము మొత్తాన్ని వాపసు చెయ్యడం జరుగుతుంది.*
* ఇస్లామీయ చర్మితలో ఇలా జరిగిన దృష్టాంతాలనేకమున్నాయి. ఈ సందర్భంలో
ఇక్కడ T.W.ARNOLD రచించిన THE PREACHING OF ISLAM (ASHR'AF'S EDITION 1965) ఆఅనే వుస్తకంనుండి కేవలంరెండింటిని ఉదాహరిస్తున్నాము. ఈ పుస్తకం 61వ పుటలో శ్రీ ఆర్నాల్డ్ ఇలా (స్తున్నారు: “హిరవా చుట్టు (పక్కల (గ్రామాలతో ఖాలిద్ (బిన్ వలీద్) ఒప్పందం చేసుకున్నారు. అందులో “మేము మిమ్మల్ని రక్షించ గలిగితే జిజియా మాదవుతుంది. కాని ఒకవేళ మేము మిమ్మల్ని రక్షించలేకపోతే దానికి (జిజ్‌యాకు) మేము 'ఆర్హులము కాము. ఇంకా కాస్త ముందుకు సాగి ఆయన ఇలా (వాశారు: అప్పుడు జనరల్ అబూ ఉబై దా సిరియాలోని
90 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
ఇతర మతావలంబీకుల రక్షణ విషయంలో గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే రక్షణపొందే మతంకన్నా ఇస్లామే ఉత్తమమయిందని అది నమ్మినా తన పరిధిలోని ఇతర మతాలవారి రక్షణా భారం అది తానే వహిస్తుంది. కాని ఒకవేళ ఏ (పజలయినా అటు ఇస్లాంను తిరస్కరించి ఇస్లామీయ (ప్రభుత్వానికి, ఇటు జిజ్‌యా చెల్లించకుండా ఉంకే ఇస్లాం అలాంటి (ప్రజల్ని తన వ్యతిరేకులుగా పరిగణిస్తుంది. అంకే ఇలాంటి (వజలు తమ మంకుతనం కారణంగా ఇస్లాంతో వైషమ్యాన్ని కొనసాగిస్తూ అది అందించే శాంతి హస్తాన్ని అందుకోడానికి సంధిని కుదుర్చుకోడానికి సిద్ధంగా లేరన్నమాట. ఇలాంటి వారే అన్ని కాలాల్లోనూ తమ భౌతికశక్తిని, ధన సంపత్తుల్ని వినియోగించి సత్యానికి పెద్ద అవరోధాలయి నిలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి వారికి వ్యతిరేకంగానే ఇస్లాం కరవాలాన్నెత్తే అనుజ్జనిస్తుంది - అదీ పరిస్థితుల్ని మెరుగు పరిచే మార్గాలన్నీ మూయబడిన తరువాత ఇంకా (కమబద్ధంగా అల్టిమేటం ప్రకటించిన తరువాతే. రక్తపాతాన్ని వీలయినంత మేరకు ఆపగలిగితే ఆపాలని శాంతిని సుస్థాపితం చెయ్యాలని ఇలాంటి చివరి (పయత్నాలన్నీ జారవిడుచుకోదు. దైవాదేశం :
వారు సంధి ఒడంబడికకై సిద్ధమయితే మీరున్నూ సంధికై సిద్ధపడండి. అల్లావాపై భరోసా కలిగి ఉండండి. (8:61)
నగరాల గవర్నర్లందరికి (వాత మూలకంగా ఆదేశం పంపారు, జిజ్‌యా మూలకంగా వసూలయిన మొత్తాన్ని ఆ నగరాల (పజలకు వాపసు ఇచ్చి వెయ్యాలని. అప్పుడు ఆయన ఆ ప్రజలకు ఇలా వాశారు, “మేము మీ ధనాన్ని మీకు వాపసు చేస్తున్నాము. ఓ (బహ్మాండమయిన సైన్యం మాపై దండెత్తి వస్తోందని మాకు సమాచారం అందింది. ఇప్పుడు మేము మా ఒప్పందం (పకారం మిమ్మల్ని రక్షించే స్థితిలో లేము. కాబట్టి మీనుండి వసూలు చేసిన ధనాన్ని మీకు వాపసు చేస్తున్నాము. ఒకవేళ మేము శతుసైన్యాన్ని జయిస్తే మన మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఇంకా పటిష్టమవుతుంది. దాని షరతు లన్నింటికీ మేము బద్భులవుతాము.”
బానిసల సమస్య 94 ధర్మపథంలో అనివార్యమయి ......
ఇదీ ఇస్లామీయ యుద్ధాల గాథ. మానవాళి బుజు మార్గాన పయనించాలన్న భావమే వాటికి మూల(పేరణ. ఈ ధ్యేయ సాధనలో శాంతియుత మార్గాలు పయోజనకరం కాకపోతే గత్యంతరం లేక ఇస్లాం శక్తిని వినియోగిస్తుంది. ఇస్లాం చేసే ఈ యుద్ధాలు సైనిక వీరుని స్వార్థమో రాజ్యవిస్తీరణా తృష్టయో లేదా ఇతరుల్ని తనకు బానిసలుగా చేసుకోవాలన్న దురహంకారమో సృజించినవి కావు. ఈ యుద్దాలు ఏ (పజనూ లొంగ దీసుకుని అణచివెయ్యడానికి జరగలేదు. వీటి అసలు (పేరణ దైవ ప్రసన్నత పొందే సద్భావమే తప్ప మరేమీకాదు. అయితే కేవలం “సద్భావం' మాతమే కాదు అది నెరవేరడానికి, యుద్ధాలకు సంబంధించిన స్మూతొలు, నియమాలు కూడా ఖరారు చేసింది ఇస్లాం. దైవ (పవక్త (సఅసం) ముస్లిములకు బోధించారు, “అల్లావా నామం స్మరిస్తూ వెళ్ళండి; ఆయన మార్గంలో పోరాడండి; దైవాన్ని ధిక్కరించే వానితో పోరాడండి; ఒప్పందాన్ని భంగ పరచకండి; చ్మితవధ చెయ్యకండి; కళేబరాలను వికృతం చెయ్యకండి; బాలల్ని హతమార్చకండి.” * అలాగే ఆ ఆదర్శమూర్తి ముస్లిముల కెదురుగా పోరాటంలో పాల్గొన్న వారు తప్ప ఇతర శాంతియుత _పజలపై ఆయుధాన్ని గురిపెట్టడాన్ని నిషేధించారు. సామ(గి సంపత్తులను నాశనం చెయ్యడాన్ని, గౌరవభంగం చెయ్యడాన్ని కూడా ఆయన నిషేధించారు. వారు ఎలాంటి చెడును, కల్లోలాన్నీ (పోత్సహించరాదని (పబోధించారు, ఎందుకంటే :
అల్లావా కల్లోల జనకులంకే ఇష్టపడడు (5 : 64)
ముస్లిములు తాము పాల్గొన్న యుద్ధాలన్నింటిలోనూ వంచనాగేసరులయిన (కూసేడర్స్ కెదురుగా పోరాడవలసి వచ్చిన
* ముస్లిం, అబూదావూద్, తిర్మిజి.
92 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
యుద్దాల్లోనూ - తమ ఈ ఉన్నత సంప్రదాయాలను కాపాడుకుంటూ వచ్చారు. (క్రైస్తవులు ఎరుషలేముపై దురాక్రమణ జరిపినప్పుడు, అక్కడి ముస్లిం పౌరులను వారు నానా విధాలుగా దౌర్జన్యం, అత్యాచారాలకు గురిచేశారు. వారి మాన గౌరవాలను కాలరాచారు. వారి (స్తీ పురుషుల్ని విచక్షణా రహితంగా చంపారు. చివరికి నగరంలోని మహోన్నతమయిన మస్టిద్ కూడా వారి 'హస్తలాఘవం' నుండి తప్పించుకోలేక పోయింది. కాని ముస్లిములు ఆ నగరాన్ని తిరిగి హస్తగతం చేసుకున్నప్పుడు వారు దౌర్జన్యపరులపై ఎలాంటి (ప్రతీకార చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి అన్యాయం అక్రమం జరిగినప్పుడు (ప్రతీకారం తీర్చుకునే అధికారం, హక్కు వారికి దైవం తరఫుననే ఇవ్వడం జరిగింది.
ఎవరయితే మీపై దౌర్జన్యం చేస్తారో వారిపట్ల మీరు కూడా అంతే బలాన్ని పయోగించండి (2 :194)
కాని ముస్లిములు తమ శ్యతువులపట్ల కనబరచిన ఉదారగుణం నేటికీ అనన్యంగా, అసమానంగా, అద్వితీయంగా చరిత్రలో నిలిచిపోయింది.
విలక్షణమయిన పంథా
“వ గహారాధనాభి శాపంలో పడి కొట్టుమిట్టాడుతున్న వారు, సత్యాన్నీ, సదాచారాన్నీ వ్యతిరేకించేవారు అసలు మానవులే కారు; అనాగరికులు, అడవి మనుషులు. ఆ కారణంగా వారు బానిసలుగా ఉండదగిన వారే ; వారు మానవ గుణగణాల రీత్యా మానసిక స్థితి దృష్ట్యా అధములు కాకపోతే సత్యాన్నీ, (వకాశాన్నీ వ్యతిరేకించేవారుగా ఎందుకు తయారయ్యేవారు? సత్యానికి ఎదురుగా ఎందుకు ఉద్యమించేవారు ? వీరి ఈ చర్య మానవతాస్థాయికి అవమానకరంగా ఉంది కాబట్టి ఈ జనులు ఎలాంటి గౌరవ మర్యాదలకూ అర్హులు కారు; వారికి స్వేచ్చను పొందే
బానినల సమస్య 93
హక్కూ లేదు - ఇవన్నీ కేవలం స్వతం్యత (ప్రజలకే (పత్యేకం, వారిదే ఈ మహాభాగ్యం” అనే వాదనను, దృక్పథాన్ని బలపరచినా అప్పట్లో చెల్లేదే.
కాని అది ఎన్నడూ అలా చెయ్యలేదు. ముస్లిములు యుద్ధ ఖైదీలను గత్యంతరం లేక బానిసలుగా చేసుకున్నా అది కేవలం వారి విరోధులు తమకు చేజిక్కిన ముస్లిం యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసుకోవడం వల్లనే. అలాకాక ఇస్లాం ఏకపక్షంగా బానిసత్వాన్ని నిర్మూలిస్తున్నట్లు (పకటించి ఉన్నట్లయితే ముస్లిముల శృతువులు బలవడేవారు. వారు ఎలాంటి హద్దు పద్దు లేకుండా తమకు యుద్ధ ఖైదీలుగా (పాప్త్రమయిన ముస్లిములనందరినీ సిగ్గువిడిచి సకల విధాల సంకటాలకు, బాధలకు, పరాభవాలకు గురి చేసేవారు
ఈ సందర్భంలో ఖైదీలపట్ల వ్యవహరించే తీరును బోధించే దివ్యఖుర్‌ఆన్ (ఆయత్) వాక్యాన్ని ప్రస్తావించడం అవసరం :
ఆ తరువాత, వారిని మంచితనంతో వదలి వెయ్యండి లేదా పరిహారం తీసుకుని వదలండి - పోరాడేవారు ఆయుధ విసర్జన చెయ్యనంతవరకు (4 :47)
ఈ ఆయత్‌లో ఖైదీలను బానిసలుగా చేసే ప్రస్తావనే లేదు. ఆ (పస్తావనే గనక ఉంటే అది ఇస్లామీయ యుద్ధ నియమాల్లో భాగంగా శాశ్వతంగా నిలిచిపొాయ్యేది. ఇందులో రెండు విధానాలు సూచించబడ్డాయి. పరివారం తీసుకుని వదలి వెయ్యడం లేక పరిహారం తీసుకోకుండా ఉచిత రీతిన విడుదల చెయ్యడం. ఈ రెండు మార్గాలే ఇస్లామీయ యుద్ధ శాసనంలో చోటు చేసుకున్నాయి గనుక వీటిని మ్మాతమే అవలంబించడం సాధ్యం. దీని ద్వారా తెలిసేదేమంకే (పారంభంలో ముస్లిములు యుద్ధ ఖైదీలను బానిసలుగా చేశారంటే అది సమకాలీన పరిస్థితుల వెలుగులో ఆనాటి అవసరాల కనుగుణంగా ముస్లిములు అవలంబించిన పాలిసీ
94 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
(కార్యాచరణ విధానం) లోని భాగం మ్యాతమే. ఆచరణలో ఆదర్శం
ఎన్ని అవసరాలున్నా ఎన్ని కారణాలున్నా, యుద్ధ ఖైదీలను తప్పని సరిగా బానిసలుగా చెయ్యాలన్నది ఇస్లాం అభిమతం ఎన్నటికీ కాదు. దీనికి భిన్నంగా యుద్ధాలు ముగిసి శాంతి నెలకొన్నప్పుడు ఎవరినీ బానిసలుగా చెయ్యడం జరిగేది కాదు. స్వయంగా మహనీయ ముహమ్మద్ (సఅసం) బట్ యుద్ధంలో పట్టుబడ్డ ఖురైష్ నాయకుల్ని కొందరిని పరిహారం తీసుకుని మరి కొందరిని పరిహారం లేకుండానే విడుదల చేశారు. అలాగే ఆయన నజ్‌రాన్ కైస్తవ బృందంతో కుదిరిన ఒప్పందం (ప్రకారం వారిని ఇస్లామీయ రాజ్య పరిధిలో చేర్చుకుని వారినుండి జిజియా (గహించి వారి ఖైదీల నందరినీ విడుదల చేశారు. ఇస్లాం అనుసరించిన ఈ వెలుగు బాటను చూచే మానవాళి (క్రమేణ గతంలోని చీకటి బంధనాలనుండి విముక్తమయి యుద్ధఖైదీల సమస్యను కేవలం మానవతా దృష్టితో పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది.
వివిధ యుద్ధాల్లో ముస్లిముల చేజిక్కిన ఖైదీల విడుదలకు ఒకే ఒక షరతు (పతిపాదించడం జరిగింది - వారు స్వేచ్చను పొంది అది తెచ్చే బాధ్యతల్ని, తెచ్చే సమస్యల్ని ఎదుర్కొనే యోగ్యతను సంపాయించుకోవాలి. ఆ విధంగా వారిలో ఎవరయినా ఈ (పమాణాల రీత్యా యోగ్యులుగా తోస్తే వారిని జాప్యం చెయ్యకుండా విడుదల చేసేవారు. నిజానికి వారిలో కొందరు ముస్లిముల శై దీలవడానికి పూర్వం తరతరాలుగా బానిసలుగానే (బతుకుతూ వచ్చారు. వీరిని పర్షియన్ మరియు రోమన్ సామాజ్యాలు ఇతర దేశాలనుండి పట్టుకువచ్చి, ముస్లిములకు ఎదురుగా పోరాడేందుకు వినియోగించుకునేవారు. అలా రణరంగంలోకి వచ్చి ముస్లిములకు పట్టుబడ్డ వీరిని వారి యోగ్యతా యోగ్యతల పరిశీలన తరువాత విడుదల చెయ్యడం జరిగేది.
బానినల సమస్య 95
మహిళా బానిసలు
పోతే మహిళల విషయంలో, బానిసలయినా యుద్ధఖై దీలయినా వారి (స్త్రీత్వపు గౌరవాన్ని పూర్తిగా కాపాడింది ఇస్లాం. వారు యుద్ధంలో పట్టుబడిన వారయినా వారిపట్ల అగౌరవంగా (పవర్తించడానికి, వారి మానభంగం జరపడానికి ఎవరినీ అనుమతించలేదు ఇస్లాం. రణరంగంలో లభించిన యుద్ధ 'సొమ్ముగా భావించి ఎవరికి వారు, వారిపై స్వామ్యం చెలాయించడానికి ముస్లిములెవరికీ అనుమతి నివ్వలేదు ఇస్లాం. ఇలాంటి ఖైదీ (స్త్రీలను “ఉమ్మడి సరకు' గా ప్రకటించి ఇష్టమయిన వారు అడ్డు లేకుండా తమ కామాగ్నిని చల్లార్చుకునేందుకు వీలు కల్పించలేదు ఇస్లాం. దీనికి భిన్నంగా ఇస్లాం వారిని కొందరి పోషణలో పెట్టి అలాంటి యజమానుల వద్దనే సేవకురాండుగా ఉండే ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇతరులెవరూ వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ధర్మ సమ్మతం కాదని (పకటించింది. వారు కూడా 'మకాతబత్ ద్వారా విడుదల పొందే అవకాశాలు కల్పించింది. ఇంకా ఏ బానిస (స్తీ అయినా తన యజమానివల్ల సంతానవతి అయినట్లయితే తనంతట ఆమె విడుదలయినట్లు, ఆమె, ఆ పుట్టే శిశువు కూడా స్వతంతులయినట్లు నిర్ణయించడం జరిగింది. దీని ద్యారా ఖైదీ మహిళల పట్ల వారు ఖైదీలుగా ఉన్నంతవరకు ఇస్లాం ఎంత ఉదారంగా ఉదాత్తంగా పవిత్రంగా (పవర్తించిందో ద్యోతకమవుతోంది.
ఇస్లాంలో బానిసత్వానికి సంబంధించిన గాధ ఇది. ఇది మానవ చర్మితలో ఓ కాతిమయమయిన అధ్యాయం. సూత్రపాయంగా బానిసత్వాన్ని ఇస్లాం ఎన్నడూ సమ్మతించలేదు. తాత్కాలికంగా గత్యంతరం లేక దాని ఉనికిని అది సహించినా తరువాత (ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చి ఓ పరిష్కారానికి సమ్మతించినప్పుడు ఇస్లాం దానికి స్వాగతం పలికింది. ఎందుకంటే ఇస్లాం (ప్రతిపాదించే జీవన వ్యవస్థలోని (పాథమిక స్యూతాల (పకారం స్వేచ్చా స్వతంత్రతలు, సర్వ సమానతలు సకల మానవుల (పాథమిక హక్కులు.
96 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
ఆధునికి యుగంలో బానిసత్వం
ఆ తరువాత ముస్లిం రాజ్యాల్లో కనిపించే బానిసత్వం, మనుషుల (కయ వ్మికయాలు, మనుషుల వ్యాపారం - వీటితో ఇస్లాంకు ఎలాంటి సంబంధంలేదు. బానిసత్యవు ఈ రూపాలు ఇస్లాం సూచించే జిహాద్‌కు పర్యవసానంగా ఉనికిలోకి వచ్చినవికావు. ఇస్తాం పేరు మీదుగా నేటికీ ముస్లిం పరిపాలకులు చేసే అనేక అపరాధాల కోవకు చెందిన అపరాధమే అదీను. నేడు వీరు చేసే అవరాధాలను ఇస్లాంకు అంటగట్టడం ఏ విధంగా అసమంజసమో అలాగే చరి(తలో జరిగిన బానిసత్వవు గాధల్ని ఇస్లాంతో ముడిపెట్టడం కూడా అసంబద్ధమే.
బానిసత్వం అంతమయిందా?
బానిసత్వపు సమస్యను పరిశీలించేటప్పుడు (క్రింది యదార్థాలు మన కనుమరుగవరాదు.
(1) ఇస్లాం తరువాతి కాలాల్లో పపంచమంతటా విభిన్న పరిపాలకులు బానిసత్వాన్ని సమర్థించారు. దాని విభిన్న రూపాలను విఖిన్న విధాలుగా మిగులనిచ్చారు. నిజానికి ఆ కాలాల్లో ఎలాంటి బలవత్తర కారణమూ లేకపోయినా దాన్ని వారు పోషించారు. దానికి అసలు కారణం రాజ్య విస్తీర్ణా కాంక్ష అధికార పిపాస మ్మాతమే. ఈ కారణంగా (వతి జాతి మరో జాతిని, (వతి వర్గం మరో వర్గాన్ని తన దాస్య బంధనాల్లో బిగించి ఉంచాలని (పయత్నించింది. ఇంతేకాక బానసత్వానికి మరో కారణం బీదరికం, ఆకలిదప్పులు. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన వారిని, వ్యవసాయ కూలీలుగా పనిచేసే వారిని నీచంగా చూసేవారు. వారిని బానిసలుగా భావించి వారిచేత దాస్యం చేయించుకునేవారు. ఇస్లాం బానిసత్వవు ఈ రూపాలన్నింటినీ నిర్మూలించాలనే కోరింది. అందువల్ల ఈ రూపాలన్నింటినీ అంతమొందించింది. తన అదుపులో లేని (యుద్ధ ఖైదీల) ఒక్క రూవం తప్ప ! దానికి అప్పట్లో పరిస్థితులు అనుకూలంగా
బానినల సమస్య 97
ఉండేవికావని ముందే చూశాము.
(2) యూరపులో ఎలాంటి బలవత్తరమయిన సామాజిక అవసరం లేకపోయినా చాలా కాలంవరకు బానిసత్వం కొనసాగింది. చివరికి దాని నిర్మూలనం జరిగినా, అది చిత్తశుద్ధితో చేసిన పనికాదు. గత్యంతరం లేక చేసిన పని. ఈ విషయంలో స్వయంగా పాశ్చాత్య పండితుల రచనలే దీనికి (పబల సాక్షాలు.“"యూరపులో బానిసత్వపు నిర్మూలనకు అసలు కారణం అక్కడి ఆర్థిక పరిస్థితులు. అప్పుడు బానిసలు తమ యజమానుల సంపదను పెంచడానికి బదులు, వారిపై ఆర్థిక భారాన్ని పెంచే వారుగా తయారయ్యారు. ఎందుకంటే వారిలో తమ యజమానుల కొరకు కష్టించాలన్న భావమూ సన్నగిల్లింది, కష్టించేందుకు శక్తీ సన్నగిల్లింది. బానిసల ఆహారం, వారి భ్యదతకు అయ్యే ఖర్చు వారి సంపాదన కన్నా ఎన్నో రెట్లు పెరిగిపోయింది. తలకు మించిన ఈ భారాన్ని మొయ్యలేక లాభనష్టాల జేరీజు వేసుకొని చేసిన “వ్యాపార” ఉద్యమం అది! యూరపులో బానిసల విమోచనోద్యమం! ! దీనికీ ఇస్లాం చూపిన పవిత్రమయిన మార్గానికీ ఎలాంటి సంబంధమేలేదు. ఈ కారణం వల్లనే యూరపు విమోచనోద్యమ చర్విత నెత్తుటి చారలతో ఎరుపెక్కిన సాంఘిక విప్లవాలతో నిండిపోయింది. ఇస్లామీయ విమోచన చరిత్రలో అలాంటి ఓ చిన్న సంఘటన కూడా మచ్చుకయినా కానరాదు. ఆ విప్లవాలు జరిగిన మీదట యజమానులు బానిసల్ని తమ' ఇదుపులో ఉంచుకునే పరిస్థితిలోనే లేకపాయ్యారు. పర్యవసానంగా, ఇష్టంలేకపోయినా వారిని స్వతంతులుగా చెయ్యవలసి వచ్చింది.
ఈ సాంఘిక విప్లవాల తరువాత కూడా యూరపు బానీనలకు తమ స్వేచ్చ భ్యదంగా ఉందన్న గ్యారంటీ ఎప్పుడూ (ప్రాప్తం కాలేదు. ఈ విప్లవాల పరిణామంగా దాస్యం, లేమి, బీదరికాలు తమ పంజాను వారిపై ఇంకా పటిష్టం చేశాయి. బానిసలు కట్టు బానిసలయ్యారు. వారి భవితవ్యం వారి వ్యవసాయ భూములతో ముడివడిపోయింది. భూములు అమ్ముడు పోయి నప్పుడల్లా దానితోపాటు వారు కూడా అమ్ముడుపాయ్యేవారు. ఈ వ్యవసాయ
98 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
కూలీలకు ఆ భూములు వదలి మరెక్కడికయినా పొయే అనుమతి, అధికారం లేవు. వారిలో ఎవరయినా ఇలాంటి చేష్టకు పాల్పడితే చట్టం రీత్యా అతను ఫరారీ అయిన నేరస్థుడుగా పరిగణించబడేవాడు. అతను పట్టుబడితే వాతలు పెట్టేవారు. కాళ్ళకు బేడీలు వేసి తిరిగి వారి యజమానులకు అప్ప జెప్పేవారు. ఈ రకపు బానిసత్వం (వెట్టి చాకిరి) యూరపు 18వ శతాబ్దంలో సంభవించిన (ఫెంచి విప్లవం వరకు కొనసాగింది. అంటే యూరపుకు బానిసల్ని ఆ బంధనాల నుండి విముక్తి చేసే సద్బుద్ధి, బానిసల విమోచనా (ప్రణాళిక ఇస్లాం ప్రకటించిన 11 శతాబ్దాలకు గాని కలగలేదన్న మాట.
(3) అయితే కాస్త నిదానంగా చూడాలి. అందమయిన పేర్లు, మనోహరమయిన పదాలు, మనోజ్ఞమయిన పద బంధాలు చూచి మోసపోరాదు. (ఫెంచి విప్లవం తరువాత యూరపులోను, అ(బవాం లింకన్ జారీ చేసిన ఆదేశాల తరువాత అమెరికాలోనూ బానిసత్వం అంతమయిపోయిందన్న మాట అయితే బాగానే (పచారంలోకి వచ్చింది. (పపంచం బానిసత్వాన్ని నిరసిస్తూ తన తీర్చును కూడా ఇచ్చింది. అయితే వాస్తవం, ఈ పదాల్లో కానవచ్చేంత ఆహ్లోదకరంగా లేదు. ఎందుకంటే బానిసత్వపు దౌర్భాగ్య రూపం నేటికి ప్రపంచంలో దర్శనమిస్తూ ఉంది. అలా కాకపోతే దౌర్జన్యం, అత్యాచారం, అన్యాయం, నేడు వేషాలు మార్చి బహురూపాల్లో (ప్రపంచమంతటా స్వేచ్చగా విలయ తాండవం చేస్తూ కాన వచ్చేదికాదు. ఒకవేళ బానిసత్వం అంతమయిపోతే అల్జీరియాలో ఫ్రాన్స్ సాగించిన ఘోర కలికి ఏమని పేరుపెట్టగలం? ఆమెరికా తన దేశ వాసులయిన నల్లవారిపట్ల జరిపే చీకటి నేరాలను ఏమని పిలువగలం? దక్షిణ్మాఫికాలో నల్లవారయిన (పజలపట్ల యూరపు అవలంబించే (కూర వైఖరికి ఏ పేరుపెట్టి పిలువగలం?
అందమయిన తెరల చాటున
బానిసత్వం అంటే ఏమిటి? ఒకజాతి మరోజాతిని లోబరచుకుని
బానినల సమస్య 99
దాని మానవహక్కులన్నింటినీ హరించి వేసి పీడించడం! ఇదే బానిసత్వానికి నిజమయిన నిర్వచనం. మనం సొగసయిన నినాదాల వల్ల మోసపోరాదు. అసలు విషయమేమిటో (గహించడానికి (పయత్నించాలి. బానిసత్వపు ఈ విభిన్న రూపాలపై స్వాతంత్యం, సౌ(భాతృత్యం, సమానత్వం అన్న అందమయిన లేబిళ్ళను అంటిస్తూ తిరగరాదు. ఎందుకంకే అందమయిన లేబిళ్ళ వల్ల ఒక వస్తువులోని కుళ్ళు తాజాదనంగాను, చెడుగు మంచి తనంగానూ మారవు. అలాగే జుగుప్సాకరమయిన ఘోర నేరాలపై రంగుల తెరలు వేసి వాటిని మరుగుపరచడమూ మంచిది కాదు. అది సాధ్యపడదు కూడా. ముఖ్యంగా, మానవాళి ఇలాంటి చేదు ఫలాలను ఒక్కసారి కాదు మాటిమాటికీ అనుభవించి ఉండగా ఇలాంటి సత్యాలు ఎంత దాచినా దాగవు.
తన ఉద్దేశాన్ని, అభిమతాన్ని (ప్రకటించడంలో ఇస్లాం ఎన్నటికీ వెనుకాడదు. ఎల్లవేళలా స్పష్టంగా భావ్యపకటన చేసింది - తన అసలు లక్ష్యం, సంకల్పం ఏమిటో(పస్సుటంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో బానిసత్వం పట్ల తన దృక్పథం ఏమిటో వ్యక్త పరచింది. దాని మూలకారణాలను సూచించింది. దాన్ని వారించే దారి చూపింది. దాని నిర్మూలనకు మార్గం సుగమం చేసింది. తాను చెప్పిందే చేసింది. చేసినదాన్ని మరుగు పరచకుండా చెప్పుకుంది.
దీనికి భిన్నంగా కృష్రిమత కుత్సితత పూసుకున్న అందమయిన ఆధునిక సంస్కృతి తన ఉద్దేశ్యంలోనూ కార్యాచరణ విధానంలోనూ అస్పష్టతే తన (పత్యేకతగా అలరారుతోంది. దాని నిజమయిన రూపం ఏమిటో అది తెలియపరచదు. దాని విధానమేదో స్పష్ట పరచదు. దాని ప్రత్యేకత ఏమిటంటే జిగేలు మనిపించే ముఖం, అంధకార కుహరమయిన ఆంతర్యం! టునీషియా, అల్జీరియా, మొరాక్కోలలో ఈ సంస్కృతీ వారసులు వేలాది ప్రజల్ని, కేవలం స్వేచ్చను, స్వాతంత్రాన్ని కోరినందువల్ల మానవతా గౌరవాదరణలు కావాలన్నందువల్ల, తమ దేశంపై తమ సొంత (పభుత్వం
100 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
నెలకొల్పుకోవాలన్నందువల్ల, తమ భాషలో మాట్లాడు కోవాలని సంబరపడినందువల్ల (ప్రపంచంలోని ఇతర జాతుల్లా తమ దేశమూ సర్వస్వతం(త్రం కాగలగాలని అభిలషించినందువల్ల ఎలాంటి పరదేశ జోక్యం లేకుండా తమ దేశంలో తమ ధర్మం తమ నమ్మకాల కనుగుణంగా జీవితం గడపాలని కాంక్షించినందువల్ల తమకు ఇష్టమయిన రీతిలో ఇతర దేశాలతో ఆర్థిక రాజకీయ సంబంధాలు కుదుర్చుకోవాలని కోరుకున్నందువల్ల లో నిర్దాక్షిణ్యంగా మట్టుపెట్టారు. ఈ ఆధునిక సంస్కృతీ ధ్వజవాహకులు, అమాయకులయిన ఈ (పజల రక్తంతో తమ చేతులు కడుక్కున్నారు. (కుళ్ళి, కంపుకొట్టే శిక్షా గృహాల్లో (TORTURE H0USE5) లో బంధించారు. వారి మానాన్ని దోచుకున్నారు. వారి (స్త్రీల మానాన్ని కొల్లగొట్టారు. గర్భంతో ఉన్న (స్త్రీల కడుపుల్ని పందెం కాసి మరీ చీల్చారు. ఇరవయ్యో శతాబ్దపు ఈ ద్వంద్వ, అమానుష నాగరికత్మాపియులు జుగుప్సాకరమయిన ఈ నేరాలన్నింటినీ చేశారు. కాని ఎక్కడికి వెళ్ళినా చేసే (పకటన ఏమిటి? (పపంచానికి స్వాతంత్యం, సొభాతృత్వం, సమానత్వం బోధించింది తామేనని, వీరు తాము చేసిన ఈ ఘోర కృత్యాలకు, (కుళ్ళు నేరాలకు కాంతి అని, శాంతి అని గొప్ప గొప్ప పేర్లు పెడతారు. కాని నేటికి 14 వందల ఏళ్ళ (కితం ఇస్లాం ఎలాంటి ఒత్తిడికి, ఎలాంటి బలవంతపు స్థితికి లోనవకుండా కేవలం మానవతా గౌరవభావం నిండిన గుండెలతో బానిసలపట్ల చేసిన ఉదార్నప్రవర్తనను, బానిసత్వం మానవ జీవితంతో శాశ్వతంగా ముడిపెట్టుకున్న అంశంకాదని, ఇది కేవలం తాత్కాలిక స్థితి మ్యాతమే అని చేసిన (పకటనను ఈ (ప్రబుద్ధులు అనాగరికత అని, తిరోగమనమని, మూఢాభ్యిపాయమని చితిస్తారు.
నాగరికతా సదనంలో బానిస వదనం అమెరికనులు తమ వినోదగృవాలపై “కేవలం తెల్లవారి కొరకే”
అని, “నల్ల వారికి, కుక్కలకు (పవేశము లేదు” అని బోర్డులు తగిలిస్తున్నారు నేటికీ. ఈ నాగరిక అమెరికనులు నలుగురికి, వర్ణంగల వ్యక్తి (00[౬-
బానినల సమస్య 101
0౧౯౦) కనిపిస్తే అతన్ని పట్టుకుని తమ (క్రూరత్వం, మృగత్వానికి (LYNCHING) గురిచేస్తారు. అతన్ని రోడ్డుపై బూటుకాళ్ళతో బంతిలా ఎగురవేస్తూ ఉంటారు - అతని పంచ్యపాణాలు భవ బంధాలను తెంచుకుని ఊర్థ్వ లోకాలకు ఎగిసిపోయేవరకు. తమాషా ఏమిటంకే ఈ అమానుషత్వాన్ని ఘోరకృత్యాలను పోలీసు వినోదంలా కిమ్మనకుండా చూస్తూ ఉంటుంది. నిజానికి ఆ దౌర్భాగ్యుడు భాషరీత్యా, మతంరీత్యా, మానవత దృష్ట్యా వారిలోని వాడే, వారి దేశస్థుడే. ఆధునిక నాగరికతా వారసుల జీవితం ఈ ఘోరమయిన నేరాల చెరగని మ్యుదలతో నిండిపోయింది. అయినా వారు నాగరికులవడంలో, సంస్కారవంతులవడంలో, ఉదాత్త చరితులవడంలో, (పగతిశీలురవడంలో ఎలాంటి లోటురాదు! వారి సభ్యతా సంస్కృతులపై, వారి వృద్ధీ వికాసాలపై ఎలాంటి మచ్చరాదు.
ఒకవైపున ఆధునిక నాగరికతా వారసుల వైఖరి ఇలా ఉంటే, ఇస్లామీయ చరిత్రలోని దేదీప్యమానమయిన దృష్టాంతాలు మరో వైపున ఆలోచనకై ఆవ్వోనిస్తున్నాయి. ఆ కాలపు ఖలీఫా హ్యజత్ ఉమర్ పరిపాలనా కాలంలో ఒక బానిస వ్యక్తి ఆయన్ని చంపి వేస్తానని బెదిరిస్తాడు. అన్నీ చెల్లి ఉన్నా, అధికారమున్నా ఆయన అతనికి ఏమీ చెయ్యలేదు. ఖైదులోనూ వెయ్యలేదు, దేశాన్నుండి బహిష్కరించనూలేదు, అనాగరికుడు అంటూ అతన్ని (ప్రాణాంతకంగా హింసించేవారి పారల్టెయ్యలేదు. ఆ బెదిరింపుకు బదులుగా కేవలం ఈ మాటలు పలికారు. “ఈ బానిస నన్ను బెదిరిస్తున్నాడు”. అంతే అతని స్వేచృపై ఎలాంటి (పతిబంధకాలూ విధించలేదు. అతనిపై ఖలీఫా హత్యానేరం మోపబడింది - అయితే ఎప్పుడు? వాస్తవంగానే అతను ఆ ఘోరాన్ని (క్రియారూపంలో చేసివేసినప్పుడు!
ఆ(ఫికాలో నల్లవారిపట్ల ఇంగ్లీషు (ప్రజలు వ్యవహరించే తీరు, (బిటన్ పేపర్ల మాటల్లో చెప్పాలంటే, “ఏ విధంగానయితే వారిని జంతువుల్లా వేటాడారో, వారి మానవ హక్కుల్ని ఏ విధంగా కాలరాచారో అదంతా ఇంగ్లీషు ప్రజల న్యాయబుద్ధికి, ఆధునిక సభ్యతా సంస్కృతులకు తార్కాణం.
102 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
ఇక్కడ మన బిటిషు వారి న్యాయం, సభ్యతా సంస్కారాలు తమ అసలు రూపంలో, పతాకస్థాయిలో దర్శనమిస్తాయి.” ఈ “ఉన్నతి మయిన “'మహోజ్వల' మయిన జీవన సూతాల ఆధారంగానే పాశ్చాత్యులు (పపంచ జాతులపై తమ ఆధిక్యతను చాటుతారు, పెత్తనం చెలాయిస్తారు. కాని యుద్ధ ఖైదీలుగా లభించిన శృతువుల్ని సయితం సమాన స్థాయినిచ్చి, తాత్కాలికంగా బానిసలుగా చేసే అనుమతి నిచ్చినందుకు ఇస్లాంను వారు అనాగరికమని, తిరోగమనవాదమని అమానుష విధానమని తిట్టిపోశారు. వారి అభిపాయంలో ఇస్లాం అనాగరికమయిన ధర్మం - ఎందుకంకే అది మనుషుల్ని జంతువుల్లా వేటాడేందుకు అనుమతించలేదు. కేవలం నల్ల తోలు కారణంగా ఎవరి నిండు ప్రాణాలనూ బలిగొనేందుకు ఒప్పుకోలేదు. అంతేకాదు దాని "'మూఢత్వం' ఏ స్థాయికి చేరుకుందంటే, స్పష్టంగా (పకటించింది: “వినండి, మీరు మీ నాయకుని మాట వినాలి; అతని విధేయత పాటించాలి - అతడు, ఎండిన (దాక్ష పండులాంటి తల గల నల్ల
(బానిస) వాడయినా సరే”. మహిళా “విమోచనం”
ఖైదీ (స్తీల విషయం పూర్తిగా భిన్నమయింది. యుద్ధంలో ఖైదీలుగా వచ్చే (స్తీల సమస్యను పరిష్కరించడానికి ఇస్లాం వారిని ముస్లిముల్లో ఓ పద్ధతిలో పంచి వేసింది. అవకాశాన్ని బట్టి, ఒక్కో వ్యక్తికి ఒకరికంకే అధికంగా కూడా ఈ (స్త్రీలను ఇవ్వడం జరిగేది. ఆ (స్త్రీలపై వారికి యాజమాన్యపు హక్కులు (పాప్తమయ్యేవి. ఆ యజమానికి తన బానిస స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకోడానికి హక్కు ఉండేది. ఇంకా అతడు కోరితే వారిలో తనకు నచ్చిన (స్త్రీతో నియమబద్ధంగా నికావా చేసుకునేవాడు. ఆధునిక యూరపు, ఇస్లాం అప్పుడు అనుసరించిన ఈ పద్ధతిపట్ల అసహ్యం (పకటిస్తుంది. కాని తమ పాశ్విక కోరికల సంతృప్తి కొరకు పరస్పర అక్రమ సంబంధాలు ఏర్పరచుకునే (స్తీ పురుషులు ఏ చట్టాన్ని ఉల్లంఘించినా, ఎలాంటి మానవీయ (పమాణాలనూ ఖాతరు
బానినల సమస్య 103
చెయ్యకపోయినా అది పట్టించుకోదు. దాని అంతరాత్మ ఏమ్మాతం చలించదు. విశ్చంఖల కామ్మకీడలు దాని దృష్టిలో ఏ విధమయిన అపరాధం కావు. నిజానికి ఇస్లాం చేసే “క్షమించరాని నేరం” ఏమిటంకే అది అసభ్యకరమయిన చేష్టలకు, నీతి బాహ్యమయిన పనులకు అనుమతి నివ్వదు. బహుశా ఈ కారణాల మూలంగానే నవనాగరిక యూరపు ఇస్లాం అంటే ఆ(గహోద్యగమయిపోతుంది.
ఇతర జాతుల్లో యుద్ధ ఖైదీ (స్త్రీలతో అత్యంత లజ్ఞా విహీనమయిన రీతిలో వ్యవహరించడం జరిగింది. ఆ ఖైదు తరువాత, వేశ్యా వృత్తిలో జుగుషప్సాకరమయిన జీవితం గడపడం తప్ప ఆ సస్తీకి గత్యంతరం లేకపాయేది. ఎందుకంకే సమాజంలో వారికి ఎలాంటి విలువ గౌరవాలుండేవికావు. వారి మానాన్ని, శీలాన్ని కాపాడటానికి, వారిని తన- యాజమాన్యంలో తీసుకుని వారి రక్షణా పోషణా భారం వహించే ఏ అధికారమూ ఏ శక్తీ లేక పోయింది. తరచుగా స్వయంగా వారి యజమానులు బానిసల్ని వేశ్యావృత్తికై బలాత్కరించేవారు. కాని “అనాగరిక, (పగతి నిరోధకమయిన' ఇస్లాం తన కాలంలో నీతి బాహ్యమయిన పనులు, వ్యభిచార కార్యకలాపాల ఈ ద్వారాన్నీ మూయించింది. దాని చట్టం (వకారం, వారి యజమానులు మ్యాతమే బానిసలతో లైంగిక సంబంధం కలిగి ఉండగలరు. ఆ యజమానులే వారి పోషణ, సంరక్షణ భారం కూడా వహించాలి. ఆ విధంగా బానిసలు ఆర్థిక వత్తిడులకు లోనయి గత్యంతరం లేక వ్యభిచార వృత్తికి, చెడు నడతకు పాల్పడకుండా చూడటం జరిగింది. ఇంకా వారు తమ యజమానుల అండన పవ్మితమయిన పరిశుద్ధమయిన జీవితం గడిపే వీలు కల్పించడం జరిగింది.
కాని యూరపు యొక్క అతి “సున్నితమయిన అంతరాత్మ ఇస్లాం చేసే “ అనాగరికతను, అమానుషత్వాన్ని” సహించలేదు. దాని దృష్టిలో ఇస్లాం తీసుకునే ఈ చర్య మూఢకాలపు అవశేషము. అందువల్ల అది నీతి బాహ్యతను, శీల విక్రయాన్నీ న్యాయ బద్ధమనడమే కాక దానికి చట్టం
104 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
రీత్యా భదత కూడా అందజేస్తుంది. తన ఏహ్యమయిన స్మామాజ్యవాదపు దుష్ట సంకల్పాల పరిపూర్తికై పపంచాన్నంతటినీ ఈ రొంపిలోకి, ఈ జాడ్యంలోకి దింపాలని కోరుతోంది. అందుచేతనే నేటికీ ఈ అభిశాపం మానవాళిపై (పపంచంపై ఇంకా తిష్టవేసే ఉంది. అయితే దీనికి కొత్త నామధేయాలు (ప్రాప్తమయ్యాయి. దానిపై రకరకాల, రంగు రంగుల తెరలు వెయ్యబడ్డాయి. మహిళా విమోచనపు వాదనలెన్ని ఉన్నా (స్త్రీ నేటికీ అన్యాయానికి గురవుతూనే ఉంది. పురుషునికి విలాస వస్తువుగానే పరిగణించబడుతోంది. నవనాగరిక కాలంలో ఎంతో సింగారించుకుని హుందాగా వేశ్యావృత్తి చేసే (స్ర్తీని నిజభావంలో స్వేచ్చ కలిగి ఉన్న (స్తీ అని అనగలమా? ఇస్లాం, బానిస (స్త్రీలు వారి యజమానుల మధ్య ఏ మానవీయ నైతిక సంబంధాలను రూపొందించిందో వాటిలోని పరిశుద్ధత, ఉదాత్తతకు నవనాగరెకతా ఛాయల్లో జరిగే శీల వ్యికయంలోని
అసహ్యమయిన వ్యాపారానికీ ఏదయినా సంబంధం ఉందా? ఆధునిక వెలియాలి
ఇస్లాం తన దృక్పథాల విషయంలోనూ, సిద్ధాంతాల విషయంలోనూ స్పష్టంగా (ప్రకాశవంతంగా భాసిల్లుతోంది. కాని నవనాగరికతకు ఈ విశిష్టత లోపించింది. భావాల్లో గమ్యరాహిత్యం, సంకుచిత ఆలోచనా సరళి నేటి ప్రత్యేకతలు. దీనికి ఒక్క ఉదాహరణ వ్యభిచార వృత్తి, శీల విక్రయ. వ్యాపారం. నవనాగరికత దీన్ని బానిసకాలపు అవశేషంగా గుర్తిస్తుంది. కాని దాని మనుగడను, అది ఒక “అనివార్యమయిన సామాజిక అవసరమ” ని సహిస్తుంది. ఈ “అనివార్యమయిన సామాజిక అవసరం” ఏమిటో కూడా కాస్త పరిశీలించండి. దాని కారణంగా యూరపు వ్యభిచార కార్యకలాపాలను ఎందుకు కొనసాగనివ్వాలని పట్టుబడుతోందో తెలుసుకుందాం.
నేడు వ్యభిచార వృత్తికి పెద్దకారణం నవనాగరికతలో అంతర్లీనమయి ఉన్న స్వార్థ పియత్వం. దీని కారణంగా ఆధునిక యూరపులోని ఏ నాగరిక
బానిసల సమస్య 105
వ్యక్తి అయినా సరే తన సొంత అవసరాలు తప్ప మరెవ్యరి - వారు తన భార్య, పిల్లలయినాసరే - ఆర్థిక బాధ్యతల్ని స్వీకరించడానికి సిద్ధంగాలేడు. అతడు రుచులు మరిగాడు. అయితే ఏ విధమయిన బాధ్యతల్నీ తలమీద చేసుకోడానికి తయారుకాడు. తత్కారణంగా అతనికి తన లైంగిక తృష్ణ తీర్చే (స్తీ - ఆమె శరీరం మాతం కావాలి.
ఇదీ ఆ “అనివార్యమయిన సామాజిక అవసరం”. దీని(పాతిపదికగానే నేటి అభ్యుదయవాదులు (స్తీ బానిసత్వాన్ని న్యాయబద్ధ మయినదిగా నిరూపించడానికి కృషి చేస్తూ ఉంటారు. కాని ఇది వట్టి (భమ మ్మాతమే. ఎందుకంటే నిజానికి వ్యభిచార వృత్తికి అసలు కారణం కేవలం ఆధునిక మనిషిలోని కోరికల దాస్యం, అతని దృష్టిలోపం మ్మాతమే. అందువల్ల మనిషిలో మానవతా స్థాయి ఎదగనంతవరకు వ్యభిచార వృత్తి అభిశాపానికి విరుగుడు లేదు.
ఈ సందర్భంలో మరో విషయం విశదమవడం అవసరం. పాశ్చాత్య దేశాల్లోని నాగరిక (పభుత్వాలు కొన్ని, తరువాతి కాలంలో వ్యభిచార వృత్తిని నిషేధించినా దాని అసలు (పేరణ వేశ్య యొక్క (స్తీత్వాన్నీ, మానవతను గౌరవించాలన్న పవిత భావం కాదు. ఇంకా ఆ (వజల్లో ఏదో నైతిక, మానసిక, ఆధ్యాత్మిక పరివర్తన కలిగిందనడానికీ అది తార్కాణం కాదు. ఈ నిషేధానికి అసలు కారణం ఏమిటంకే సకల సింగారాలతో దర్శనమిచ్చే సొసైటీ గర్ల్స్ రంగంలో దిగిన తరువాత ఈ వేశ్యల “సామాజిక ఆవశ్యకత” అంతగా గోచరించలేదు. పైగా ఈ వ్యభిచారం పట్ల. (వజల్లో అపరాధ భావం కూడా మిగల్లేదు. వారి స్థితి ఇంత దిగజారినా వారు నేటికీ ఇస్లాంను ఎత్తిపొడుస్తూ ఉంటారు. అలాచేస్తూ వారు ఓ విషయాన్ని మరచిపోతూ ఉంటారు - మానవోన్నతికి చిహ్నంగా, పరిణతి పొందిన శాశ్వత నాగరికతా ఏ ఇరువయ్యో శతాబ్దపు నాగరికతను పొగుడు తుంటారో దానికి ఎన్నో రెట్లు వరిశుద్ధమయింది, సహజమయింది, సంపూర్ణమయింది ఇస్లాం నేర్చిన నాగరికత అని.
ఆధునిక పాశ్చాత్య సమాజంలో రుచులవేటలో విలాసాల తోటలో
106 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
బరితెగించి తిరగాడే సొసైటి గర్ల్ ఏ “స్వేచ్చ' తో తమ శరీరాలను ఇతరులకు అప్పజెప్పుతుంటారో అది స్వేచ్చ కాదు, బానిసత్వం. ఈ కోవకు చెందిన బానిసత్వంలో బానిస స్వయంగా తానే బానిసత్వపు గుదిబండను తన మెడలో వేసుకుంటుంది. ఈ బానిసత్వం బానిసలకు ఎంతో అందంగా మనోహరంగా ఆహ్లాదకరంగా అగుపించేలా చేస్తాడు, ఆధునికత, నవ నాగరికత అబ్బిన వాళ్ళ కొత్త యజమాని. అయితే ఇలాంటి కొందరు బానిస నైజంగల (స్త్రీలను, వారు తమ స్వేచ్చాయుత స్థితిని వదలుకోవడాన్ని ఆధారం చేసుకుని వారిని ఇలా బానిసత్వపు కూపంలో శాశ్వతంగా (మగ్గనివ్వడం అన్నది ఇస్లాం దృష్టిలో న్యాయబద్ధంకాదు. అంతే కాదు (పపంచంలోని మరే మతమయిన్నా మరే జీవన తత్వమయినా ఈ కారణాలవల్ల వారి బానిసత్వాన్ని ధర్మబద్ధంగా భావించజాలదు.
పరిస్థితుల స్వరూపాన్ని చూస్తే తేలేదేమిటి? మనుషులు గత్యంతరం లేక స్వేచ్చాస్వాతంత్రాలకుబదులుగా బానిసత్వాన్ని కోరుకునేలా ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక, చింతనాత్మక వాతావరణాన్ని సృజించడం, ఎంత వినాశకరమయిన జీవనవ్యవస్థను సూచిస్తున్నదో విశదమవుతోంది. వాస్తవంగా యూరపు నాగరికత నేటివరకు సాధించిన ఘనకార్యం యొక్క వడ్డూ పొడుగును బేరీజు వేస్తే తేలేది:
నిరుద్యోగం, బీదరికం, మద్యం అశ్లీలం !!
ఇదీ యూరపులో బానిసత్వపు సంక్షిప్త గాధ. దాని చరిత - పురుషులు, స్తీలు, జాతులు, వర్గాలు - అందరి, అన్ని రకాల బానిసత్వపు చర్మితకు నిర్వచనం. అక్కడ బానిసత్వానికి పలు కారణాలున్నా ఆ తరువాత, బహుకాలం వరకు ఎలాంటి సామాజిక అవసరం లేకపోయినా దాన్ని కొనసాగనివ్వడం జరిగింది. యూరపులో బానిసత్వం ఇలా కొనసాగడం దాని నాగరికతలోని అసభ్యతకు, మానవతా విరుద్ధ నైజానికి తార్కాణం .
బానినల సమస్య 107 ఇది మరో బానిస గాధ
చివరన ఆధునిక సామ్యవాద (కమ్యూనిస్టు) దేశాల గురించి కూడా కొన్ని మాటలు చెప్పాలని మా అభిలాష. ఆ దేశాల ప్రజలపై కూడా బానిసత్వం అభిశాపంలా అలుముకుంది. వారు కమ్యూనిజం నిరంకుశ రాక్షసి పాదాల (క్రింద నలిగి పోతున్నారు. వారి దేశాల్లో యజమాని ఒక్కడే - అదే (పభుత్వం. ఇతర (పజలంతా నోరెత్తకుండా దాని విధేయతను పాటించవలసిందే. చివరికి ఆ దేశాల పౌరులకు తమకు ఇష్టమయిన వృత్తిని, ఉద్యోగాన్ని ఎన్నుకునే స్వేచ్చ కూడా లేదు. ఎందుకంటే వారు బానిసలు. బానిసలకు ఇచ్చ, కోరిక లేమిటి? ఈ విషయంలో కమ్యూనిస్టు దేశాల్లోనూ కాపటలిస్టు దేశాల్లోనూ ఎలాంటి వ్యత్యాసం లేదు. ఒక వ్యవస్థలో (పభుత్వం అధికారాలకు శక్తికీ కే్యదమయితే మరో వ్యవస్థలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, శక్తిని అధికారాన్ని చేజిక్కుంచుకుని ఉంటారు, శ్రామికులు వారి దయాదాక్షిణ్యాలపై (బతకవలసి ఉంటుంది.
విషయాన్ని ముగించేముందు పాఠకులతో కూడా ఒక మాట మేము చెప్పదలిచాము. పెట్టుబడి దారీ వ్యవస్థ సమర్ధకులు, కమ్యూనిజం సమర్థకులు ఉభయులూ తమతమ జీవిత సిద్ధాంతాల గురించి నోటి తడి ఆరకుండా పొగడుకుంటూ కనిపిస్తారు. అయితే పాఠకులు మేము సమర్పించిన వాదనను దృష్టిలో ఉంచుకుంకే వారు ఈ ప్రజల వంచనలకు గురికాకుండా ఉండగలరు. మేము సమర్పించిన ఈ వివరణల ద్వారా, పేర్లు నిర్వచనాలు వేరయినా కమ్యూనిజమయినా, కాపటలిజమయినా వాస్తవంగా (పాచీన బానిసత్వపు సరికొత్త రూపాలే అన్న యదార్థాన్ని పాఠకులు (గహించి ఉంటారు. బానిసత్వపు ఈ కొత్తరూపాలు, నిజానికి నాగరికత, సామాజిక (పగతి తెరల వెనకాల సురక్షితంగా సుస్థిరంగా మనగలుగుతున్నాయి. ఇస్లాం చూపిన బుజామార్గాన్ని కాదని మానవాళి (పగతిని సాధించిందా లేక క్రమేణ ఆధ్యాత్మిక పతనానికి, నైతిక అధోగతికి లోనయిందా దాన్ని కూడా పాఠకులు అంచనా వెయ్యగలరు. నేడు కూడా మానవాళికి ఇస్లాం మార్గదర్శకత్వం ఎంత అవసరమో వారే నిర్ణయించుకోగలరు.
3. భూస్వామ్య వ్యవస్థ
ఒక విద్యార్థి ఎం.ఏ పట్టం పొందడానికి (వాసిన పరిశోధనా వ్యాసంలో ఇస్లాం ఓ భూస్వామ్య వ్యవస్థ అని రుజువు చేశాడని ఇటీవలనే విన్నాను. నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. విద్యార్ధి కొంతవరకు పాపం, మన్నింపదగిన వాడే. అతని ఉద్దేశ్యం ఇస్లాంను అప్రతిష్ట హళల్టేయడం కావచ్చు. లేదా అతనికి నిజంగానే అసలు విషయం తెలీదేమో. కాని అతనికి పట్టం (పదానం చేసిన ఆచార్యుల మారేమిటీ? వారి వైఖరినేమనాలి? ఇస్లాం సామాజిక, ఆర్థిక వ్యవస్థ విషయంలోను, ఇస్లామీయ చర్మితపట్ల వారు కనబరచిన ఉపేక్షాభావాన్ని ఏమని సమర్థించగలం?
కాని ఈ (పముఖ ఆచార్యులెవరు? వీరిని ఏ విధంగా తయారు చెయ్యడం జరిగింది? అన్న ఆలోచనరాగానే నా ఆశ్చర్యమంతా తొలిగిపాయ్యింది. ఆచార్యుల ఈ బృందం కళ్ళు ఇతరుల పాపగాండావల్ల చెదిరిపొయ్యాయి. ఇతరుల ఆలోచనలో సిద్ధాంతాలకు వారి మనోమస్తిష్కాలు పరాధీనమయ్యాయి. వీరి భావనా (పపంచమంతా పరదేశీ (పయోగాల ద్వారా ఉనికిలోకి వచ్చినదే. మిస్టర్ డన్లవ్ * (ప్రత్యేక (శద్ధకు కేంద బిందువులు వీరే. వీరు సప్తసముదాలుదాటి ఆధునికశ్యాస్త అధ్యయనం చేసివచ్చారు. దాని లక్ష్యం, వారిని తమ సంస్కృతీ, సభ్యతలకు, నాగరికతకు, తమ పరంపరకు, సపదాయాలకు దూరం చెయ్యడం. ఈ విధంగా వీరిని తమ ధర్మాన్ని, తమ చరెతను, తమ విశ్వాసాలను ద్వేషించేవారుగా, తమ పాశ్చాత్య (వభువుల అనుకరణే గర్వకారణంగా గౌరవకారణంగా భావించే మేధావులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇలాంటి మేధావులు చరితను, వాస్తవాలను తారుమారుచేసే వన్నాగంలో భాగం పంచుకుంటూ అగుపిస్తే అందులో ఆశ్చర్య పడవలసిన అవసరమేముంది.
* మిస్టర్ డన్లవ్ (DUNLOP) బిటిష్ స్కామాజ్యం తరఫున ఈజిప్ట్ విద్యా విధానాన్ని రూపొందించేందుకు నియుక్తుడయిన ఇంగ్లీషు ఆఫీసర్.
భూస్వామ్య వ్యవస్థ 109 భూస్వామ్య వ్యవస్థ
అసలు విషయాన్ని చర్చించే సమయంలో భూస్వామ్యం అంకే ఏమిటో ఓ స్పష్టమయిన భావన మన ముందుంకే బాగుంటుంది. ఈ విషయంలో మనం డా!! రాషిదుల్ బరావి రచించిన “కమ్యూనిస్టు వ్యవస్థ" అనే పుస్తకం నుండి ఓ భాగాన్ని చూద్దాము. రచయిత భూస్వామ్య వ్యవస్థను (పస్తావిస్తూ ఇలా (వాశారు :
“భూస్వామ్య వ్యవస్థ ఓ ఉత్పాదక వ్యవస్థ. దాని విశేషమేమిటంకే, అందులో, నిత్యం ఒక బానిస వర్గం తప్పక ఉంటుంది. ఈ వ్యవస్థలో జమీందారు లేక అతని సిబ్బంది ఉత్పత్తిలోని నిర్జీతభాగం రైతునుండి వసూలు చేస్తూ ఉంటారు. జమీందారులకు కొన్ని పత్యేక ఆర్థిక సౌకర్యాలు కూడా ఉంటాయి. జమీందారు ఆ రైతు ద్వారా ఏ విధమయిన సేవ చేయించుకో దలచినా అలా చేయించుకునే అధికారాలు అతనికి ఉంటాయి.
"అతను కోరితే రైతునుండి ధనరూపేణ లేక వస్తు రూపేణ పన్ను కూడా వసూలు చెయ్యగలడు. భూస్వామ్య వ్యవస్థలో సమాజంలోని వ్యక్తుల్ని రెండు విశేషమయిన వర్గాలుగా విభజించడం జరుగుతుంది. (1) జమిందారులు, జాగీర్ణారులు (2) వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు. వీరి సామాజిక స్థాయి, పని, విధులు, బాధ్యతల మార్చు ద్వారా సదా మారుతూ ఉంటుంది. రైతు, వ్యవసాయ కూలి, బానిస అనేవి ఈ సామాజిక పరివర్తనలకు వేర్వేరు దశలు. ఇందులో కొన్ని వర్గాలు పూర్తిగా అంతమయ్యాయి. మిగిలినవి (క్రమేణ అంతమవుతున్నాయి.
“రైతులు భూమిని దున్ని విత్తనం నాటి పంట పండిస్తారు. అందువల్ల వారికి పంటలో కొంతభాగాన్ని ఇచ్చి వేస్తారు. దాని ద్వారా వారు తమ భార్యా బిడ్డల భృత్తికై ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే వారు పొలాల్లోనే గుడిసెలు చేసుకునేందుకు భూమి కూడా కేటాయించడం జరుగుతుంది. ఈ సౌకర్యాలకు _(పతిమూల్యంగా వారు తమ వ్యవసాయపు పనిముట్లతో
110 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
పశువులతో పాటుపోయి జమిందారుల పొలాలు దున్నుతారు. నారు నాటడం మొదలుకుని కోతల సమయం వరకు వీరు జీతంలేని కూలీలుగా పనిచెయ్యాలి. అప్పుడప్పుడు కమతం దార్ల సన్నిధిలో ముడుపులు కూడా చెల్లించుకోవాలి. ఇంతేకాక వారు తమ ధాన్యం జమిందారుగారి మిల్లుల్లోనే మర వేయించుకోవాలి. (దాక్ష పళ్ళరసం తీయించదలిస్తే కమతం దారుగారి మిషన్ల ద్వారానే అదీ జరగాలి. *
“భూస్వామ్య వ్యవస్థలో జమిందారుగారికి తమ జాగీరులో నివసించే రైతులపై పెత్తనం చెలాయించే, చట్టాలు చేసే అన్ని అధికారాలూ ఉంటాయి. ఈ వ్యవస్థలో ఉత్పాదనకు మూల కారణమయిన వ్యవసాగుగారులకు, మనం నేడు చెప్పుకునే భావంలో స్వేచ్చా స్వాతంత్యాలు ఉండేవి కావు. రైతు ఏ భూములు సాగుబడి చేసేవాడో వాటిపై అతనికి యాజమాన్యపు హక్కులుండేవి కావు. అతడు దాన్ని అమ్మగలిగే వాడూ కాదు, అది అతని తరువాత సహజంగా అతని సంతానానికి వారసత్వంలో (పాప్తమయ్యేదీ కాదు. అతని యజమాని (అంకే జమిందారు) తాను కోరినప్పుడల్లా అతని చేత వెట్టి చాకిరి చేయించుకునేవాడు. దాన్ని కాదనే హక్కు రైతుకు ఏ మ్యాతంలేదు -దాని మూలంగా అతను ఎంత పెద్ద నష్టాన్ని భరించవలసి వచ్చినా సరే. పైగా తన విధేయత, భక్తి (పతిపత్తుల్ని పదర్శించుకునేందుకు అతను జమిందారు గారికి పెద్దపెద్ద మొత్తాల్లో పన్నులు చెల్లించుకోవడం కూడా తప్పేదికాదు. ఆ పన్ను లెంత ఉండాలి? అన్న విషయం జమీందారుగారే తమ ఇష్టానుసారం తన అవసరం మేరకు నిర్ణయిస్తారు. జమీందారు ఒకవేళ తన భూముల్ని మరో భూస్వామికి అమ్మివేసినట్లయితే ఆ భూములపై సేద్యం చేసే కట్టుబడి రైతు కూలీలు కూడా అమ్ముడు పాయ్యేవారు. వారు కొత్త జమీందారు గారి 'సాత్తు' గా పరిగణించబడేవారు. పొట్ట పోసుకునేందుకు మరెక్కడయినా పనిచేసుకోడానికి కూడా వారికి హక్కు లేకుండేది. వారు
* యూరపు వ్యవస్థను దృష్టినందుంచుకుని చేసిన రచన ఇది అని మరువరాదు (అను)
భూస్వామ్య వ్యవస్థ 111
తమ ఇష్టంతో తమ యజమానిని కాదని మరో జమీందారు గారి కొలువులో కూడా చేరలేరు. భూస్వామ్య యుగంలోని. (క్రింది తరగతి (పజల్ని, ప్రాచీనకాలపు బానిసలకూ ఆధునిక కాలపు రైతు కూలీలకూ మధ్య 'సంధివర్గం' అని చెప్పుకోవచ్చు.
“రైతుకు సేద్యం చేసే అనుమతి నివ్వడమో కాదనడమో జమీందారు గారి ఇష్టం. ఏ రైతుకు ఎంత భూమినివ్వాలి అన్న విషయం నిర్ణయించేది కూడా ఆయన ఒక్కడే. రైతుల విధులూ బాధ్యతలు కూడా ఆయనే నిర్ణయిస్తాడు. ఇలాంటి ముఖ్యమయిన నిర్ణయాలు గైకొనేటప్పుడు కూడా అతనికి రైతుల వాస్తవమయిన అవసరాలేమిటి? వారి హక్కులేమిటీ అన్న ధ్యాస ఉండదు. ఇలాంటి నిర్ణయాల వల్ల పారుగు జమీందారులపై ఎలాంటి (పభావం పడుతుందిఅన్న చింత కూడా అతనికి ఉండదు.”
పలాయనం * పర్యవసానం
రచయిత ఇంకా ఇలా (వాశాడు : ' ఈ కారణాల మూలంగా 13వ శతాబ్దంలో, “వ్యవసాయ కూలీల ' నే వర్గానికి జన్మనిచ్చిన “ ఫరారీ ఉద్యమం” ఉనికిలోకి వచ్చింది. ఈ ఉద్యమం చరిత్రలో “రైతుల ఫరారీ” అని పిలువబడుతుంది. ఫలితంగా జమిందారులు తమ మధ్య ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని (పకారం ఫరారీ అయిన తన రైతుల్ని జమీందారు తిరిగి వాపసుకోరే హక్కును పొందాడు. ఈ ఒప్పందం (వకారం, తమ జాగీరులో (ప్రవేశించే రైతుల నందరినీ నిర్బంధించే అధికారం కూడా జమీందారులకు లభించింది. కాని ఈ ఉపాయం కూడా రైతుల పరారీని వారించలేకపోయింది. ఇంకా ఈ విషయం శృతిమించి రాగాన పడింది. చివరికి “ఫరారీ' అన్నది ఆ కాలపు ఓ విశిష్టతగా రూపొందింది. ఈ కారణం వల్ల జమిందారులు తమ భూములు సేద్యానికి గత్యంతరం లేక అత్యధికమయిన జీతాలిచ్చి కూలీలను నియమించుకోవలసి వచ్చింది. ఈ వ్యవసాయ కూలీలపైనే ఆధారపడవలసి వచ్చింది. జమిందారులు చేసుకున్న ఒడంబడికలు విలువలేకుండా పొయ్యాయి.
112 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
అంటే వారి మధ్య మునుపటిలా సహకార వాతావరణం కూడా అంతరించి పోయిందన్నమాట. తద్భలితంగా జరిగిన మరో ముఖ్యమయిన పరిణామం ఏమిటంటే పొలాల్లో వెట్టి చాకిరి చేయించుకోవడం మానుకుని, జమీందారులు, అక్కడ పనిచేసేవారికి రొక్కం రూపంలో వేతనాలు చెల్లించడం మొదలెట్టారు.
“ఆ తరువాత కాల్మ్యకమేణా రైతులు ఆర్థికంగా బలపడసాగారు. మరోవైపు పురాతన జాగీర్జారులు, జమీందారులు తమ అవసరాలను పెంచుకుంటూ పొయ్యారు. వారి సకల సాధనా సంపత్తులు కూడా వాటిని పూరించలేక పొయ్యాయి. రైతులు ఈ అనుకూల పరిస్థితులను బాగా వినియోగించుకున్నారు. అప్పుడు తమ మాజీ యజమానులకు నగదు రూపేణ మూల్యం చెల్లించి వారినుండి చిరకాలానికిగాను విమోచనాన్ని పొందారు. 13వ శతాబ్దం చివరన “రైతు కూలీల స్వేచ్చ” గుర్తింపు పొందినంతవరకు ఈ పరిస్థితి కొనసాగింది. ఆ తరువాత పరిస్థితుల్లో వచ్చిన మార్పుల్లో విశిష్టత ఏమిటంతే భూస్వామ్య వ్యవస్థ పునాదులు కదలిపాయ్యాయి. ఆ తరువాత శతాబ్దాల్లో అది పూర్తిగా శిధిలమయి
పొయింది.” *
ఇదీ భూస్వామ్య వ్యవస్థ యొక్క నిజ స్వరూపం. మేము ఈ సుదీర్ణ్వమయిన భాగాన్ని ఎందుకు ఉదాహరించామంటేతద్వారా పాఠకులు భూస్వామ్య వ్యవస్థను దాని _పత్యేకతలను బాగా ఆకళింపు చేసుకోవాలని, కేవలం బాహ్య సారూప్యత కారణంగా మరే వ్యవస్థతోనూ దాన్ని పోల్చి చూసే పొరపాటు చెయ్యరాదని మా ఉద్దేశ్యం. ఈ (పత్యేకతలు, ఈ ఘనకార్యాలు చేసిన భూస్వామ్య వ్యవస్థ ఇస్లామీయ చరిత్రలో ఎక్కడ, ఎప్పుడు కాన వచ్చింది? అన్నదే ముఖ్యమయిన (పశ్న.
* “కమ్యూనిస్టు వ్యవస్థ” (రచయిత రాషిదుల్ బరావి) పుటలు : 22.23.
భూస్వామ్య వ్యవస్థ 113 అపార్థానికి మూలం
ఏ బాహ్య సారూప్యత వల్ల తరచుగా ప్రజలు మోసపోయి, అపార్థానికి గురయ్యారో, అవకాశవాదులు, కాలానికి దాసులయిన వారికి ఇస్లాం పట్ల అపోహలు సృష్టించడానికి వీలు కలిగిందో అది ఒక చారిత్రక వాస్తవం. పారంభంలో ఇస్లామీయ సమాజం భూమికి సంబంధించినంత వరకు రెండు వర్గాలుగా ఉండింది. (1) భూమిగల వాళ్ళు (2) రైతులు - వీరు భూస్వాముల భూముల్లో పనిచేసేవారు. కాని ఇది కేవలం స్థూలమయిన సారూప్యత. దీని ఆధారంగా ఇస్లాం (పతిపాదించే వ్యవసాయ వ్యవస్థను భూస్వామ్య వ్యవస్థగా పేర్కొనడం అన్యాయం.
పైన ఉదాహరించిన వ్యాసభాగం ద్వారా ద్యోతకమయ్యే భూస్వామ్య వ్యవస్థ (పత్యేకతల్ని సంక్షిప్తంగా ఇలా పేర్కొనవచ్చు:
(1) శాశ్వతమయిన వ్యావసాయిక బానిసత్వం (కట్టుబడి రైతు) (2) రైతులపై విధులూ బాధ్యతల భరించరాని భారం. దాని (ప్రకారం (పతి రైతు (కింది విధులు నిర్వర్తించాలి. (అ) వారంలో ఒకరోజు పూర్తిగా జమిందారు పొలాల్లో వెట్టి చెయ్యాలి. (ఆ) సేద్యం, పంటలకోతలు అన్ని సమయాల్లోనూ ఎలాంటి జీత వేతనాలు లేకుండా జమిందారుగారి నౌకరి చెయ్యాలి. (ఇ) మత సంబంధమయిన పండుగల్లో లేక ఇతర సంతోష కరమయిన వేడుక దినాల్లో తాను బీదరికంలో, లేమిలో (మగ్గుతున్నా సకల విధాలా సంపన్నుడయిన యజమాని (జమీందారు)కి విలువయిన కానుకలు సమర్పించుకోవాలి. (ఈ) తన ధాన్యం కేవలం జమీందారుగారి మిల్లులోనే పట్టించుకోవాలి. (3) జమీందారుకు విస్తృతమయిన అపరిమితమయిన అధికారాలు: (అ) విభిన్న రైతులకు తా దలచినంత భూమిని తన ఇష్టాయిష్టాల
114 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
(పకారం కేటాయించగలడు. (ఆ) రైతుల విధుల్నీ బాధ్యతల్ని నిర్ణయించగలడు. (ఇ) రైతులు చెల్లించవలసిన పన్నులు నిర్ణయించగలడు.
(4) జమీందారుకు అపరిమితమయిన పాలనాధికారాలు, న్యాయాధికారాలు ; వాటినిఅతడు దేశంలోని చట్టాలననుసరించి కాకుండా ఇష్టమయిన రీతిలో వినియోగించుకునేవాడు.
(5)భూస్వామ్య వ్యవస్థ పతనావస్థకు చేరుకున్నప్పుడు, రైతులు, తాము విమోచనం పొందగోరితే, ముందు జమిందారుకు ఓ నిర్ణీత రొక్కం తప్పకుండా చెల్లించడం తప్పింది కాదు.
భూస్వామ్య వ్యవస్థలోని ఈ (ప్రత్యేకతల్ని చూస్తూ, ఎవరయినా, దీనికి ఇస్లాంతో సంబంధముందని ఎలా అనగలరు? ఇస్లామీయ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ ఇలాంటి ఓ వ్యవస్థ చూచాయగా కూడా కానరాదే?
వ్యావసాయిక కట్టు బానిసత్వం * టి
ఇస్లాం వ్యావసాయిక కట్టు బానిసత్వాన్ని సుతరామూ సహించదు. మేము గత అధ్యాయంలో సవివరంగా చర్చించిన ఆ ఒక్క కోవకు చెందిన బానిసత్వాన్ని తప్ప మరే విధమయిన బానిసత్వాన్నీ ఇస్లాం గుర్తించదు. ఇస్లామీయ చర్వితలో దాని ఉనికికి గల కారణాలు, సంఘటనలు అన్నీ మేము చర్చించాము. వాటి దృష్ట్యా, వ్యావసాయిక కట్టు బానిసత్వానికి ఏ విధమయిన అనుమతి లభించదు. ఈ బానిసత్వం (పకారం రైతులు ఓ (ప్రత్యేకమయిన భూమితో కట్టబడిపోతారు. ఇస్లామీయ చరిత ద్వారా తెలిసేదేమంటే, వివిధ యుద్ధాల్లో పట్టుబడి వచ్చే యుద్ధ ఖైదీలను మ్యాతమే ఓ విధమయిన బానిసత్వంలో నిర్బంధించడం జరిగేది. అలాంటి బానిసల పట్ల ముస్లిములు ఎలా (ప్రవర్తించే వారో వివరాలు గత అధ్యాయంలోనే [పస్తావించాము. (ప్రారంభ ఇస్లామీయ సమాజంలో
FN* వ్యావసాయిక కట్టు బానిసత్వం అన్నపదాన్ని మేము ఇంగ్లీషు పారిభాషిక పదం SERFDOM కు బదులుగా (పయోగించాము (అను)
భూస్వామ్య వ్యవస్థ 115
స్వల్పమయిన బానిసల సంఖ్యను స్వేచ్చాయుత పౌరులసంఖ్యతో పోలిస్తే భూమ్యాకాశాల తేడా ఉండేదని ద్యోతకమవుతుంది. ఈ బానిసలు తమ యజమానుల పొలాల్లో పనిచేసేవారు. వారిని యజమానులు సంతోషంగా విడుదల చెయ్యడమో లేక వారు స్వయంగా “ముకాతబత్' పద్ధతి ద్వారా తమ. విడుదలను కోరుకోవడమో జరిగేది. పాశ్చాత్యుల భూస్వామ్య వ్యవస్థలో బానిసల ఈ విధమయిన విడుదల, స్వతంతత కునుచూపు మేరలో కానరాదు. ఎందుకంటే ఆ వ్యవస్థలో రైతుల్నీ, రైతు కూలీలను స్వాతం్యత్య (పియులుగా మార్చే ఉద్దేశ్యమే లేదు. దీనికి భిన్నంగా ఆ భూస్వామ్యవ్యవస్థ బానిసల్ని శాశ్వతంగా ఆ బంధనాల్లోనే బిగించి ఉంచాలనే (పయత్నించింది. తద్వారా, ఒకవేళ ఎప్పుడయినా రైతులు స్వేచ్చను పొందగోరినా దానికి అవకాశం లభించకుండా చేసింది. పాశ్చాత్య దేశాల్లో రైతును వ్యావసాయిక కట్టు బానిసగా ఖావించేవారు. వారూ భూమి మాదిరిగానే క్రయవిక్రయాలకు లోనయ్యేవారు. తదనుగుణంగా భూస్వామి ఎప్పుడయినా ఏ భూభాగాన్నయినా విక్రయిస్తే దానితోపాటు అందులో పనిచేసే రైతులందరు కూడా అమ్ముడుబొయ్యేవారు. వారు భూమికి కొత్తగా ఏర్పడిన యజమాని యొక్క సొత్తుగా మారిపాయ్యేవారు. ఈ కట్టు బానిసలు ఏ భూమిని సేద్యం చేసేవారూ కారు, దాన్ని వదలి మరెక్కడికయినా పోగలిగే వారూ కారు లేక జమీందారుగారి వెట్టిచాకిరిని కాదనగలిగే వారు కూడా కాదు.
దాస్యం ఆయనకే
ఇస్లాంకు ఇలాంటి కట్టు బానిసత్వం అంటే పూర్తిగా గిట్టదు. జీవన్మరణాల కర్త అయిన. ఆ దైవం ఒక్కని దాస్యం తప్ప మరే దాస్యం, మరే విధేయతనూ అది గుర్తించదు. అన్ని దాస్యాలనూ తిరస్కరిస్తుంది. వాటిని త్మీవంగా ఖండిస్తుంది. ఇస్లాం (పకారం, ఏ మనిషికీ తనలాంటి మరో జీవినీ తన దాసుడుగా చేసుకునే హక్కులేదు. ఇలా జరగడం అసహజం, అసమంజసం. ఇలా జరిగిందంకే దానికి కారణాలు నిత్యం కొన్ని
116 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
ఇస్లామేతర అంశాలేకాని మరేమీ కావు. అది తన శక్తినంతా ఉపయోగించి వాటిని అంతమొందించాలని అభిలషిస్తుంది. అందుగ్గాను అది బానిసల్లో, స్వేచ్చను విమోచనాన్ని పొందే (పబల కాంక్షను సాహసాన్ని సృజిస్తుంది, దానిగ్గాను దీనికి తోడుగా దాస్య బంధనాల నుండి విముక్తం కాగోరే బానిసలకు సకల విధాలా సహకారం అందజెయ్యాలని అది (ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తెస్తుంది.
ఆర్థిక పరిధిలోనూ, మనుషులు తమలాంటి ఇతర మనుషుల దాస్యం చెయ్యడాన్ని ఇష్టపడదు ఇస్లాం. యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసే అనుమతి అది సంతోషంగా ఇవ్వలేదు. పరిష్కారం సాధ్యమయ్యే పరిస్థితులు ఏర్పడగానే, బానిసల్లో ఆధ్యాత్మికంగా, మానసికంగా స్వేచ్చాయుత సమాజంలో స్వతం్యత పౌరులుగా (బతికే సంస్కారం జనించగానే ఇస్లాం వారిని విడుదల చేసి వారి స్వేచ్చను పునరుద్ధరించింది.
బాధ్యతాయుత భూస్వామి, స్వేచ్చాయుత రైతు
ఇస్లాంలో ఆర్థికవ్యవస్థకు పునాదులు, స్వేచ్చాయుత వ్యవవోరం, పరిపూర్ణ సహకారం, పరస్పర సేవా సహాయాలు. అందువల్ల ఇస్లామీయ (వభుత్వం, అర్థపరమయిన పరుగులో వెనకబడ్డవారి హక్కుల్ని, సమంజసమయిన జీవన సదుపాయాలకు ఏ కారణాలవల్లనయినా దూరమయిన వారి [ప్రయోజనాలను కాపాడే బాధ్యత తనపై వేసుకుంటుంది. ఇస్లామీయ సమాజంలో ఏ వ్యక్తీ జమిందారులకు కట్టుబానిస అయి జీవించడానికి బద్భుడు కాడు. ఎందుకంటే (పభుత్వం తన వనరులు, సాధనాలనన్నింటిద్వారా అతనికి అండగా నిలుస్తుంది. ఇస్లామీయ రాజ్య పరిధిలోని పౌరులందరికీ నిత్యావసరాలను అందజేసే బాధ్యత (వభుత్వానిదన్న విషయం ఇక్కడ మరువరాదు.
ఇస్లాం తన ఆధ్యాత్మిక స్వభావం రీత్యాను, తన ఆర్థిక వ్యవస్థ
భూస్వామ్య వ్యవస్థ TE
దృష్ట్యాను భూస్వామ్య వ్యవస్థకు పూర్తిగా విరుద్ధమయింది. మానవాళి ఇంకా వ్యావసాయిక కట్టు బానిసత్వవు కోరల్లో చిక్కుకొనక పూర్వమే ఇస్లాం దాన్ని ఆ వ్యవస్థలోని దోపిడి నుండి రక్షణ కల్పించింది.
భూస్వామ్య వ్యవస్థలో రైతుపై విధులు, బాధ్యతల భారం అతని నడుం విరిచి వేసేది. కాని ఇస్లామీయ చరిత్రలో అది ఏ కోశానా కానరాదు. ఇస్లామీయ వ్యవస్థలో, ఒక రైతు అపరాధిగా రుజువయిన పక్షంలో భూమిగలవాడు అతన్నుండి తన భూమిని వాపసు తీసుకుని ఇతరులకి అప్పజెప్పగలడేకాని, ఆ రైతుపై ఏ విధమయిన బలాత్కారంగాని, దౌర్జన్యంగాని జరిపేందుకు అతనికి ఎలాంటి అధికారమూ లేదు. ఎందుకంకే భూమిగలవాడు మరియు అతని రైతుల మధ్య సంబంధాన్ని, ఇస్లాం, యజమాని, బానిసల రూపంలో కాక స్వతంత్రత, సమానతల ఆధారంగా నిర్మిస్తుంది.
ఇస్లాం దృష్టిలో రైతు, భూస్వామి మధ్య ధర్మ బద్ధమయిన చట్టపరమయిన సంబంధాలు రెండు విధాలుగా సాధ్యం : (1) కాలు (2) పాలు. కౌలు కిచ్చిన రూపంలో, రైతు భూమిలో పండిన మొత్తంలోనుండి నిర్జీతభాగం భూస్వామికి భూమికి అద్దెగా చెల్లించేందుకు బాధ్యుడవుతాడు. అది పోగా మిగతా ఉత్పాదన అతని సాంతమవుతుంది. దాని ద్వారా అతడు తన కుటుంబ అవసరాలను తీర్చుకుంటాడు. ఈ విధంగా ఇస్లామీయ వ్యవస్థలో రైతు స్వేచ్చా స్వతంత్రతలు భ్యదంగా ఉండడమేకాక, భూమి, దాని సేద్యం విషయంలో అతను స్వేచృగా తనకు భావ్యమనితోచిన పద్ధతుల్ని అవలంబించగలడు కూడా.
పాలికిచ్చిన పక్షంలో అతడు పంటలో భూస్వామితో సమానంగా భాగస్వామి అవుతాడు. సేద్యం విషయంలో అయ్యే ఖర్చులన్నీ భూస్వామియే భరించవలసి ఉంటుంది. రైతు బాధ్యత కేవలం భూమిని సాగు చెయ్యడం, దాని. సేద్యం విషయంలో, దాని పైరు పంటల విషయంలో జ్యాగత్తలు తీసుకోవడం, కృషి చెయ్యడం, కాపలా కాయడం వరకు మా(తమే
118 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో పరిమితం. వ్యావసాయిక వ్యవస్థ
®
ఈ రెండు పద్ధతుల్లోనూ వెట్టిచాకిరీకి, కట్టు బానిసత్వానికి, భూస్వామి బెదిరించి జీతభత్యాల్లేకుండా రైతుద్వారా సేవచేయించుకోడానికి ఎలాంటి తావులేదు. ఇందులో, కమతందారు, నిరంకుశ అధికారాలతో, హద్దులేని హక్కులతో హక్కులూ, సదుపాయాలు లేని విధుల నియమాల్లో రైతుల్ని బంధించే భయమూ లేదు. ఎందుకంకే భూస్వామి మరియు వ్యవసాయ దారుల మధ్య సంబంధాలు సమాన (ప్రతిపత్తి, సమానస్వేచ్చ, సమాన విధులూ, సదుపాయాలు - ఇచ్చి పుచ్చుకునే సమాన (పమాణాల (ప్రాతిపదికగా ఏర్పడుతాయి.
ఇస్లామీయ వ్యవస్థలోని మొదటి ప్రత్యేకత ఏమిటంకే ఇందులో రైతు తనకు నచ్చిన భూభాగాన్ని కౌలుపై సాగుబడికై ఎన్నుకునే పూర్తి స్వేచ్చ ఉంటుంది. ఇంకా అతడు ఏ భూస్వామి వద్ద వాలుకు కుదర దలుస్తాడో తన ఇష్టం (ప్రకారం కుదరగలడు. తాను కోరినప్పుడు వదలుకోగలడు.
రెండో (పత్యేకత ఏమిటంకే భూస్వామితో రైతు కౌలు (ఒప్పందం) చేసుకునేటప్పుడు అతను భూస్వామితో సమానస్థాయి కలిగిఉంటాడు, అతడు ఒత్తిడికిలోనయి లేదా భయవడి ఒప్పందం కుదుర్చుకోవలసిన అవసరముండదు. ఎందుకంటే అతడు ఇస్లామీయ సమాజంలో ఓ స్వతం(త పౌరుడు. అతను ఆ ఒప్పందం తనకు లాభదాయకం కాదని భావిస్తే దాన్ని రద్దుచెయ్యగలడు. భూస్వామి ఎలాంటి ఒప్పందాన్ని అతనిపై బలవంతంగా రుద్దలేడు. అతను నిరాకరిస్తే ఎలాంటి (పతీకార చర్యకు గురి చెయ్యనూలేడు. పాలికాపుగా కూడా రైతుకు, భూస్వామికి సమానంగా చట్టపరమయిన రక్షణలుంటాయి. వారుభయులూ పరస్పరం సమానంగా
భూస్వామ్య వ్యవస్థ 119
భాగస్వాములయి ఉంటారు. భూమినుండి లభించే ఉత్పత్తిని ఉభయులూ సమంగా పంచుకుంటారు.
వాణిజ్య వ్యవహారం కాదు సేవాతత్సరత
పాశ్చాత్య భూస్వామ్య వ్యవస్థలో మత సంబంధమయిన పండుగల్లో ఇంకా ఇతర వేడుకల్లో బీద రైతులు సంపన్నులయిన భూస్వాములకు ముడుపులు చెల్లించుకోవడం తప్పనిసరి అయ్యే విషయాన్ని మనం ఇది వరకే పరిశీలించాము. కాని ఇస్లామీయ వ్యవస్థలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నమయింది. ఇక్కడ పేదరైతు భూస్వాములకు కానుకలు ఇచ్చుకోవడం జరుగదు, వారి నుండి కానుకలు పుచ్చుకుంటాడు. సంపన్నులయిన భూస్వాములు, పండుగలు పబ్బాలకు, పెళ్ళీ పేరంటాలకు ముఖ్యంగా రమజాన్ పవిత మాసంలో తమ నిరుపేద రైతు సోదరులకు కానుకలు విరివిగా పంపేవారు. వారికి విందులు చేసేవారు. సమాజంలోని అగత్యపరులు, నిరుపేదలకు సవోయం చేసేవారు. మరో మాటలో చెప్పాలంటే ఇస్లామీయ వ్యవస్థలో సంపన్నులు నిరుపేదల్ని, “నాగరిక” యూరపు మాదిరిగా కానుకల పేరిట దోచుకునే వారుకారు; పైగాతమ సిరి సంపదల్ని వారి సంక్షేమం, సుఖసంతోషాల కొరకు ధారాళంగా ఖర్చు చేసేవారు. పాశ్చాత్య భూస్వామ్య వ్యవస్థలో మాదిరిగా రైతులను వెట్టి చాకిరికి గురిచేసి వారిపై అనవసరమయిన బాధ్యతల భారం మోపి, బేడీలు తొడిగించి, గుదిబండలు వేసి వేధించేందుకు ఇస్లాంలో ఏ మాతం తావులేదని దీనివల్ల ద్యోతకమవుతోంది.
యూరపు భూస్వామ్య వ్యవస్థలో జమీందారులు, రైతుల్ని అన్యాయంగా తమ దాసులుగా చేసుకుని వెట్టి చాకిరి చేయించుకున్నందుకు గాను ఇతరులు ఆ రైతులపై దౌర్జన్యం చెయ్యకుండా వారిని బాధించకుండా కాపాడటానికి కొంతవరకు బాధ్యత తీసుకునేవారు. ఇస్లామీయ వ్యవస్థలో ఈ కోణంలో చూసినా ఎలాంటి వెలితి మనకు కానరాదు. ముస్లిమ్
120 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
భూస్వాములు రైతులనుండి వెట్టిచాకిరి లాంటి మూల్యం ఏదీ (గహించకపోయినా ఈ బాధ్యతను వారు స్వచృందంగానే నిర్వర్తించేవారు. వారి ఈ సేవకు కేవలం దైవ్యపసన్నత బడయటం మ్యాతమే అసలు (పీరణ. పవిత్రమయిన విశ్వాసం పాతిపదికగా రూపొందే జీవన వ్యవస్థను ఇతర జీవన వ్యవస్థలతో వేరుచేసే అసలు మౌలిక విషయం ఇదే. ఈ వ్యవస్థలో మనిషి తనతోటి సోదరులతో మంచిగా మెలగడం, వారికి మేలు చెయ్యడం దైవారాధనగా భావించి మరీ చేస్తాడు. తద్వారా దైవ సాన్నిధ్యం పొందాలని ఆశిస్తాడు. అయితే ఇతర జీవన వ్యవస్థల్లో, తోటి సోదరులపట్ల చేసే సత్కార్యం కూడా ఓ విధంగా వాణిజ్య వ్యవహారంగా రూపొందుతుంది. ఈ వ్యవహారంలో భాగస్వాములయిన వారు పతి ఒక్కరూ తామే అత్యధిక లాభం కాజెయ్యాలని, ఇతరులకు అనివార్యమయినంత మేరకు ఇవ్వడం తప్ప గత్యంతరం లేని పక్షంలో మ్మాతమే ఇవ్వాలని కోరుకుంటాడు, అలాగే (పయత్నిస్తాడు కూడా. అందువల్ల లాభనష్టాల ఈ పరుగులో నిర్ణయాత్మక మయిన వస్తువు భౌతిక వనరులు మ్యాతమే. ఎవరివద్ద ఇవి అధికంగా ఉంటాయో అతనిదే పై చెయ్యి. జీవితంలో సకల లాభాలూ తనకే దక్కాలని అతను కృషి చేస్తాడు.
అధికారాలు ఏకపక్షం కావు
భూస్వామ్య వ్యవస్థలోని మూడే (వత్యేకత! భూస్వామి తాను కోరిన వారికి కోరినంత భూమి సేద్యానికి కేటాయించే హక్కు అధికారాలు కలిగి ఉంటాడు. ఆ తరువాత అతను తన ఇష్టం _పకారమే వెట్టి చాకిరికి సంబంధించిన విధులు, బాధ్యతల నిడువయిన ఓ పట్టిక తయారు చేసి దాన్ని రైతుల తలపై రుద్దుతాడు. ఇదె పూర్తిగా యూరపులోని యజమాని, బానిస భావనల్లో నుండి పుట్టుకు వచ్చిన (ప్రత్యేకత. ఇస్లాంకు ఇది పూర్తిగా అపరిచితం.
భూమి కౌలుకు తీసుకున్న పక్షంలో, ఇస్లాం (ప్రకారం, రైతుల హక్కుల్నీ, అధికారాలను నిర్ణయించేది రైతు ఇష్టం లేక అతని ఆర్థిక
భూస్వామ్య వ్యవస్థ 121
పరిస్థితి. భూస్వామిని రైతుతో పోల్చి చూస్తే ఎలాంటి (పత్యేకత, ఆధిక్యతలతో కూడుకున్న సౌకర్యాలుండవు. భూస్వామికి ఒకే హక్కు. కౌలుపై భూమి తీసుకున్నప్పుడు రైతు చేసుకున్న ఒప్పందం (ప్రకారం రొక్కం లేదా ధాన్యం చేరుతుందా లేదా అని చూసుకోవడం.
అలాగే పాలి ఒప్పందం చేసుకున్న పక్షంలో ఏ రైతు ఎంత భూమిని తీసుకోవడానికి అర్హుడు? అన్న విషయం కూడా ఇస్లామీయ వ్యవస్థలో కేవలం భూస్వామి ఇష్టాయిష్టాలకు వదలడం జరగదు. రైతు స్వయంగా తన ఇష్టం (పకారం నిర్ణయించుకుంటాడు. అతని కుటుంబంలోని వ్యక్తులు ముఖ్యంగా కొడుకులు భూమి దున్నడంలోనూ, పంట పండించడంలోనూ అతనికి తోడుగా ఉన్నట్లయితే, అతను ఎక్కువ భూమిని సాగుబడి చెయ్యగలనని భావిస్తే అతను అలా చెయ్యగలడు. అతనికి ఎలాంటి (పతి బంధకం ఉండదు. వ్యవసాయదారునిగా అతని బాధ్యతలు అతని సాగుబడిలో ఉండే భూభాగం వరకు మామే పరిమితమయి ఉంటాయి. అందులో పంటలు పండేవరకు ఆ భూములు అతనికీ ఆ భూస్వామికీ మధ్య ఉమ్మడి సొత్తుగా పరిగణించబడతాయి. అయితే భూస్వామి యొక్క ఇతర భూములపట్ల, జాగీర్ల పట్ల వ్యవసాయ దారునిగా అతనికి ఎలాంటి బాధ్యత ఉండదు. లేక అతను యూరపు వ్యవసాయిక కట్టు బానిసల్లా అక్కడికి పోయి సేద్యం చెయ్యడానికి ఇతర పనులు నిర్వహించడానికీ బాధ్యుడు కాడు.
న్యాయం నిష్పాక్షికం
ఇస్లాం మరియు భూస్వామ్య వ్యవస్థల మధ్య వ్యత్యాసానికి మౌలిక అంశం ఏమిటంకే భూస్వామ్య వ్యవస్థలో భూస్వాములకు రైతులపై చెలాయించేందుకు పాలనా పరమయిన న్యాయపరమయిన అధికారాలు పాప్తమయి ఉండటం అన్నది తమ జాగీరు పరిధిలో సామాజిక రాజకీయ జీవన వ్యవహారాలన్నింటిలోనూ వారిదే పైచెయ్యి. మంచీ చెబ్బరలన్నీ వారి అధీనంలోనే ఉండేవి. ఇస్లాం వచ్చి, భూస్వాముల ఈ “దైవత్వ” పు
122 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
కట్టడాన్ని తునాతునకలు చేసి వేసింది. ఎందుకంకే ఒక వర్గం పై మరో వర్గానికి ఇలాంటి _పాధాన్యతకు, (పత్యేక సౌలభ్యాలకు ఇస్లాంలో అసలు తావే లేదు. ఇలాంటి కల్తీలనుండి మానవ జీవితాన్ని పరిశుద్ధం చెయ్యడం దాని పధాన లక్ష్యాల్లో ఒకటి.
యూరపులో సరయిన న్యాయవ్యవస్థ కూడా లేకపోయింది. - భూస్వామి, రైతులమధ్య పరస్పర సంబంధాలను నిర్ణయించి వాటిని సుసంగరితం చెయ్యడానికి. పాశ్చాత్య శాసన నిర్మాణానికి మూలాధారమయిన రోమను చట్టంలో జాగీర్దార్లకు అపరిమితమయిన అధికారాలుండేవి. వారు తమ జాగీరు పరిధుల్లో నిరంకుశ _పభువులుగా చెలామణి అయ్యేవారు. వారు తమ 'పాలితుల' కొరకు చట్టాలు చెయ్యడమే కాక “వాటిని తమకు ఇష్టమయిన రీతిలో అనువయిన రీతిలో అన్వయింప జీసుకునేవారు కూడా. ఈ జమీందారులు, జాగీర్జారులు, శాసనకర్తలు గానే కాక పాలనాధికారులు, న్యాయాధిపతులుగా కూడా వ్యవహరించేవారు. ఇలా ఓ విధంగా వారు (ప్రభుత్వం పరిధిలోనే మరో (పభుత్వాన్ని స్థాపించుకున్నారు. అవసరం కలిగినప్పుడు వారు దేశ సైనిక, ఆర్థిక ఆవశ్యకతల్ని నెరవేర్చేంత వరకు (పభుత్వం వారి జోలికి పాయ్యేదికాదు.
ఇది ఇస్లామ్‌కు సరళత నా పడని జీవిత విధానం. ఇస్లామీయ వ్యవస్థలో కేంద (పభుత్వం ఒకటి 'ఉంటుంది. దేశంలో శాసనాన్ని అంకే షరీ అత్‌ని (ఇస్లామీయ శాసనాంగాన్ని) అమలు జరపడం దాని బాధ్యత. దాని దృష్టిలో పౌరులందరూ సమాన గౌరవాదరణలకు అర్హులు. ఏ పౌరునికయినా శిక్ష విధించాలంకే అతని నేరం వాస్తవంగా రుజావయి నప్పుడు మాతమే అది సాధ్యం. కాలక్రమేణ (పభుత్వ వ్యవస్థ తన ఇస్లామీయ (పాతిపదికలకు దూరమయి అనువంశిక రాచరిక వ్యవస్థగా రూపొందినప్పుడు కూడా అందులో ఇస్లామీయ (పభుత్వపు కొన్ని లక్షణాలు మిగిలాయి. ఉదాహరణకు, అది' తన పరిపాలనా. పరిధిలో జీవించే (పజలందరికి (పాధమిక అవసరాలను అందజేసే (పయత్నంజేసేది. సువిశాలమయిన ఇస్లామీయ రాజ్య పరిధిలో ఒకే శాసనం (LAW OFTHE
భూస్వామ్య వ్యవస్థ 129
LAND) చెలామణిలో ఉండేది. కాగా ఈ శాసనబద్ధమయిన పరిపాలనే రైతుల్ని, భూస్వాముల అత్యాచారం, దౌర్దన్యాల నుండి, దోపిడినుండి, వారి గొంతెమ్మ కోరికల నుండి, వారి మూఢనమ్మకాల నుండి కాపాడగలిగింది. అక్కడ జమీందార్ల, జాగీర్జార్ల చట్టాలు కాదు, దైవం నిర్ణయించిన చట్టాల (వకారం పరిపాలన జరిగేది. దాని దృష్టిలో ఒక్క జమీందారులు, రైతులే కాదు మానవులందరూ సమానులే. వారంతా ఒకే విధమయిన వ్యవహారానికి
అర్హులు.
ముస్లిముల చర్మితలో అక్కడక్కడ, కొందరు ముస్లిం న్యాయ మూర్తులు న్యాయ వక్షంగా కాక అధికారులకు అనుకూలంగా తీర్పులు చెప్పినటువంటి నిదర్శనాలున్న మాట వాస్తవమే. వారు తెలిసీ అధికారుల, భూస్వాముల (పయోజనాలను కాపాడే ఉద్దేశ్యంతో అలా చేశారు. కాని ఇలాంటి దృష్టాంతాలు ఇస్లామీయ చరితలో బహుస్యల్పం. కొందరు యూరపు పండితులే వాసినట్లు ఇలాంటి ఉదంతాలు మినహాయించదగ్గవే. రెండవ విషయం ఏమిటంకే ఇలాంటి ఒకటీ అర సంఘటనలకంకే వీటికి భిన్నమయిన నిదర్శనాలే ఇస్లామీయ చరిత అంతటా నిండి ఉన్నాయి. వాటిలో కాజీలు (న్యాయమూర్తులు) జమీందారులకు, గవర్నర్లకు మం(తులకు మ్మాతమేకాదు, సర్వాధికారి అయిన ఖలీఫాలకు కూడా (పతికూలంగా నిరుపేదలు, కూలీలకు అనుకూలంగా తీర్పులు చెప్పారు. అయినప్పటికీ ఏ ఒక్క కాజీనీ బర్తరఫ్ చెయ్యడమో, అలాంటి కాజీపట్ల (వతీకారంగా అధికారులు చర్య తీసుకోవడమో ఎన్నడూ జరగలేదు.
స్వేచ్చ, (పగతులు తోడునీడగా
ఇస్లామీయ చర్మితలో, యూరపులో మాదిరి “రైతుల ఫరారి లాంటి ఉద్యమం ఒక్కటీ కానరాదు. ఎందుకంటే ఇస్లామీయ వ్యవస్థలో, ఒక్క జాగీరు నుండి మరో జాగీరుకే కాదు, సువిశాల ఇస్లామీయ రాజ్య పరిధిలో ఎక్కడయినాసరే నిరాఘాటంగా తిరిగే స్వేచ్చ (వతి పౌరుడికీ ఉండింది. అయితే ఈజిప్ట్ రైతుల్లా స్వయంగా వారే మరో చోటికి మారడం ఇష్టపడకపోతే అది వేరే విషయం. ఒక్క ఈజిప్ట్‌ను వదలి ఇస్లామీయ
124 ఇస్తాం అపార్థాల మబ్బుల్లో
జగత్తులోని దాదాపు అన్ని దేశాల రైతులు రాకపోకల ఈ స్వేచ్చను బాగా వినియోగించుకున్నారు. ఎందుకంకే వారు ఈజిప్ట్ రైతుల్లా ఓ (వత్యేక భూభాగం పట్ల గుడ్డి (ప్రేమలో పడిపోనూ లేదు, లేదా వారి మార్గంలో యూరపు మాదిరిగా చట్టపరమయిన, సామాజికమయిన ఎలాంటి (వతిబంధకాలుండేవీ కావు.
యూరపులో భూస్వామ్య వ్యవస్థ చివరి కాలాన రైతులు (పతిమూల్యం చెల్లించి తమ స్వేచ్చను కొనుక్కోవలసి వచ్చింది. కాని ముస్లిముల చర్మితలో, ఇలాంటి ఉదంతం ఒక్కటీ కానరాదు. దానికి కారణం చాలా సాధారణమయింది. ఇస్లామీయ వ్యవస్థలో రైతుల్ని కట్టుబానిసలుగా భావించడం ఎన్నడూ జరగలేదు. వారు స్వ్యతం్యతులుగానే పుట్టారు. సమాజంలో మరే ఇతర వర్గానికి ఉన్న హక్కులన్నీ వారికీ ఉండేవి. అందువల్ల మూల్యం చెల్లించి స్వేచ్భనుకొనే దౌర్భాగ్యం వారికి ఎన్నడూ దావురించలేదు.
మరో విషయం ఏమిటంకే ఇస్లామీయ జగత్తులో అన్ని కాలాల్లోనూ అనేక జాగీరులు - చిన్నవి, పెద్దవీ - నిత్యం ఉంటూ వచ్చాయి. వాటి రాబడిని జాగీర్జారులు స్వయంగా తమ అవసరాలకై ఖర్చు చేసుకోవడమేకాక నౌకా వాణిజ్యం, పర్మిశమల స్థాపనకు కూడా వెచ్చించేవారు. తద్వారా వారు సమాజ వికాసానికి సంక్షేమ (పగతులకు తోడ్పడ్డారు. దీనికి భిన్నంగా యూరపులో భూస్వామ్య వ్యవస్థ ఉనికిలోకి వచ్చినప్పుడు, ఆ వరద, అక్కడ ముందునుంచి ఏర్పడి ఉన్న పరిశమల్ని కూడా ముంచివేసింది. ఆ తరువాత యూరపు భూభాగాన ఆధ్యాత్మిక పతనం, శ్యాస్తీయ అచేతనావస్థలు సుదీరమయిన చీకటిర్మాతిగా ఆవరించాయి. చివరికి ఇస్లాం ఆవిర్భవించి దాన్ని ఆ చీకటినుండి, అజ్ఞాన కుహరం నుండి వెలికి తీసింది. జ్ఞాన జ్యోతిని (పవేశపెట్టింది. (కూసేడ్స్ (క్రైస్తవ యుద్ధాల) ద్వారా యూరవు ఇస్లామీయ జగత్తుకు సన్నిహితమవడంతో ఈ మార్పుకు మార్గమేర్చడింది. రెండవ అవకాశం, స్పెయిన్‌లో ఇస్లామ్ ను యూరపు రెండవసారి ఎదుర్కొన్నప్పుడు _పాప్తమయింది. ఇస్లాం యూరవుల ఈ సంబంధం పునరుజ్జీవనోద్యమానికి నాందిపలికింది.
భూస్వామ్య వ్యవస్థ 125
తద్వారా యూరవు శతాబ్దాల శాస్త్రీయ అచేతనావస్థకి స్వస్తి పలికి మత వరమయిన అజ్ఞానం నుండి _కమేణ మేల్కొన్నది.
విశ్వాసం బలహీసమయితే ... పతనం !
ముస్లిం (పవపంచంలో ఇస్లాం, ఆధిక్యతతో అధికార శక్తిగా రంగంలో ఉన్నంతవరకు ఏ ముస్లిం దేశంలోనూ భూస్వామ్య వ్యవస్థ నెలకొనలేక పోయింది. ఇస్లాంకు అవకాశం లభించినప్పుడల్లా అది భూస్వామ్య వ్యవస్థ స్థాపనకు దోహదవడే కారణాలను, వరిస్థితుల్ని - అన్నింటినీ అదుపులోకి తెచ్చింది. బనూ ఉమయ్య, బనూ అబ్బాస్ వంశాల పరిపాలనా కాలంలో కానవచ్చే భూస్వామ్య వ్యవస్థ పరిధి చాలా పరిమితమయింది. పైగా ముస్లిముల సామాజిక జీవితంలో ఓ శాశ్వత అంశంలా రూపొందగల (పజాదరణ దానికి ఎన్నడూ (పాప్తం కాలేదు.
ఉస్మానియా (OTTOMAN) (పభుత్వ పతన కాలం చివరన మటుకు ఇస్లామీయ జగత్తులో భూస్వామ్య వ్యవస్థ ఛాయా (ప్రాయంగా గోచరిస్తుంది. కాని ఆ కాలంలో ముస్లిముల ధార్మిక విశ్వాసాలు బలహీనమయ్యాయి. వారి సామూహిక వ్యవహారాల న్యూతధారులు నామ్‌కేవాస్తే ముస్లిములుగా చెలామణి అయినటువంటి వారయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే పాశ్చాత్యుల సంస్కృతి - దైవాన్ని మరచిన, భౌతికారాధన నిండిన దుర్మాకమణ భావాల సంస్కృతి - విజయఢంకా (మోగిస్తూ ఇస్లామీయ (వపపంచంలో (పవేశించింది. అప్పుడే పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. ఈ కొత్త నాగరికత ముస్లిం దేశాల్లో సైనిక విప్లవాలను సృష్టించింది. ముస్లిముల ఆధ్యాత్మిక నైతిక (పమాణాలను కాలరాచింది. సహాయ సహాకారాల భావాలను రూపుమాపింది. వాటిస్థానే పెట్టుబడిదారీ లక్షణాలయిన స్వార్థం, దోపిడి విధానాలకు వృద్ధీ వికాసాలు లభించాయి. ఫలితంగా ఇక్కడి పేద వర్గాల (పజలు అంతులేని లేమికి, హద్దులేని బీదరికానికి గురయ్యారు. దాని (పభావం నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ భూస్వామ్య వ్యవస్థ నిజానికి యూరపు నుండి దిగుమతి
126 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
అయినా తన మూలంలోని (పత్యేకతలతో సవా నేటికీ కొన్ని ముస్లిం దేశాల్లో నిక్షేపంగా రాజ్యమేలుతోంది. నేడు ముస్లిం దేశాల్లో దాని ఉనికికి ఇస్లాంపై ఏ విధమయిన బాధ్యతా లేదు. ఈ ముస్లిం దేశాల్లో ఇస్లామీయ వ్యవస్థ రంగంలో ఉండి ఉన్నట్లయితే, దాని చట్టాలు దేశంలో చెలామణి అవుతూ ఉంకే అట్టి పరిస్థితిలోనూ ఈ అసహ్యకరమయిన వ్యవస్థ మనగలిగి ఉంకే, ఆ బాధ్యత ఇస్లాంపై వెయ్యడంలో అర్థముంది. నిజానికి నేడు ఏ “ముస్లిమ్” పాలకులు ఈ దేశాలను పరిపాలిస్తున్నారో వారు తమ (పభుత్వ కార్యకలాపాలన్నింటినీ ఇస్లాంకు బదులుగా, యూరపు దేశాల నుండి అరువు దెచ్చుకున్న విభిన్న రాజ్యాంగాల ఆధారంగా, శాసనాల ఆధారంగా నడుపుకుంటున్నారు.
చర్చయొక్క సారాంశం
ఈ చర్చవల్ల అనేక యదార్థాలు బయల్పడ్డాయి. అవి ఆధునిక (పపంచంలో సాగుతున్న సైద్ధాంతిక సంఘర్షణ మొత్తానికి మూలపదార్థాలు, కేంద బిందువులనడం సత్య దూరం కాదు. వాటిలో (పస్తావించ దగ్గవి ఇవి:
1. భూస్వామ్యవ్యవస్థనుపెంచి పాషించడంలో కేవలం “వ్యక్తిగత ఆస్తి' అన్న ఒక్క అంశానికే (పాధాన్యత లేదు. ఇందులో మనిషి చేసే వేరే కృషికి ఎలాంటి (ఉపమేయం లేదనడానికి వీల్లేదు. భూస్వామ్య వ్యవస్థ వాస్తవానికి, సమాజంలో నెలకొన్న ఆస్తికి సంబంధించిన విధానాలు, ఇంకా భూస్వాములూ, భూమి లేని వారిమధ్య ఏర్పడే పరస్పర సంబంధాల ఆధారంగా పెంపొందుతుంది. ఈ కారణంగానే ఇస్లామీయ వ్యవస్థలో “వ్యక్తిగత ఆస్తి' ఉన్నప్పటికీ జమీందారీ, జాగీర్జారీలు ఏర్పడి వర్ధిల్లడానికి అవకాశం లభించలేదు. ఇస్లాం, సైద్ధాంతికంగాను, ఆచరణాత్మ కంగాను సమాజంలోని వ్యక్తుల మధ్య ఏర్పరిచే సంబంధ బాంధవ్యాల కారణంగా అక్కడ భూస్వామ్య వ్యవస్థ తలెత్తడానికి తావే ఉండదు.
భూస్వామ్య వ్యవస్థ 127
2
యలు
. యూరపు భూస్వామ్య వ్యవస్థ అభిశాపానికి గురయినంత మా(తాన
మానవ (పగతి మార్గంలో ఇది కూడా అనివార్యమయిన దశ అనడానికి ఏ ఆధారమూ లేదు. యూరపు ఈ అభిశాపానికి లోనయిందంటే, దానికి అసలు కారణం, దానివద్ద, మానవాళిమధ్య సంబంధ బాంధవ్యాలను చక్కదిద్దే మార్గదర్శకత్వం, అవసరమయిన విశ్వాసమూ జీవన వ్యవస్థల్లేవు. ఇస్లామీయ (ప్రపంచానికి ఈ మవో వరపసాదం లభ్యమయింది. యూరపుకు అలాంటి వ్యవస్థ ఏదయినా లభించి ఉంటే అక్కడ కూడా భూస్వామ్య వ్యవస్థ మూడు పువ్వులు ఆరుకాయలుగా పరిఢవిల్లేది కాదు.
.కమ్యూనిస్టులు (ప్రతిపాదించే గతి తార్కిక భౌతికవాదం (0146౬071
CAL MATERIALISM) లోని మానవ చరిత్రకు అనివార్యమయిన అంశాలు ఆర్థిక పరిణామ (కమంలోని విభిన్న దశలు ప్రారంభ కమ్యూనిజం, బానిసత్వం, భూస్వామ్యం, పెట్టుబడిదారీ వ్యవస్థ, రెండవ కమ్యూనిస్టు వ్యవస్థ - వగైరా నిజానికి యూరపు చర్వితలో తప్ప మరెక్కడా మచ్చుకయినా కానరావు. అందువల్ల ఈ తత్వంలో వాస్తవికత అసలే లేదు. ఇస్లామీయ జగత్తుకు అది ఏ మాతం వర్తించదు. దీని చర్మితలో భూస్వామ్య దశ ఎన్నడూ రాలేదు. కమ్యూనిస్టు వ్యవస్థ అంతకన్నా లేదు. ఇంకా మున్ముందు ఎప్పుడయినా సరే ఇలాంటి దశ వచ్చే అవకాశమూ లేదు.
4.పెట్టుబడిదారీ వ్యవస్థ లబ ®
పెట్టుబడిదారీవ్యవస్థ ఇస్లామీయ జగత్తులో కాదు, యూరపులో పుట్టింది. ఇది 'యంతం' ఆవిర్భవించినదానికి ఫలితం. యంతాన్ని కాక తాభీయంగా యూరపులో కనిపెట్టడం జరిగింది. అక్కణ్దుంచే పపంచమంతా వ్యాపించింది.
ఇస్లామీయ (పపంచానికి _ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిచయ మయ్యేనాటికి అది (పత్యేకమయిన యూరపు రంగు పూర్తిగా పులుముకుంది. సరిగ్గా ఆ సమయాన ఇస్లామీయ జగత్తును పతనం, క్షిణదశలు ఆ(క్రమించుకున్నాయి. ఫలితంగా అక్కడ ఎటు చూచినా అజ్ఞానం, అవిద్య, బీదరికం, వెనకబడ్డతనం తాండవమాడుతున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ రాకతో ఇస్లామీయ జగత్తులో కొంత భౌతికషపగతి జరిగినమాట వాస్తవమే. దానివల్ల కొందరికి ఓ అపోహ కలిగింది-ఇస్లాం పెట్టుబడిదారీని సమర్థిస్తుందని, ఇంకా ఇస్లాం దృష్టిలో దాన్ని _పస్తుత స్వరూపంలో, అందులోని చెడులతో సహా స్వీకరించడంలో ఎలాంటి తప్పులేదని, పెట్టుబడిదారీ మరియు ఇస్లామీయ విశ్వాసాలూ చట్టాల్లో ఎలాంటి వైరుధ్యంలేదని; పైగా ఇస్లాంలో వ్యక్తిగత ఆస్తికి గల హక్కును గమనిస్తే ఇస్లాం పెట్టుబడిదారీకి ఏ మాతం వ్యతిరేకం కాదన్నది స్పష్టమవుతుందని కూడా కొందరు భావించారు.
వాస్తవానికి ఇదంతా కట్టుకథ. పెట్టుబడిదారీవ్యవస్థ వడ్డి వ్యాపారం, గుత్తాధిపత్యం లేకుండా మనజాలదు. కాని ఇస్లాం కాపటలిజం పుట్టక వెయ్యిసంవత్సరాల (క్రితం ఈ రెంటినీ విస్పష్టంగా నిషేధించింది. ఇదొక్క విషయమేచాలు ఈ రెండూ భిన్న ధృవాలని తెలుపడానికి.
ఇంతకు ఈ విషయాన్ని కాస్త వివరంగా పరిశీలించడం అవసరం. యంతాన్ని ఇస్లామీయ జగత్తులో కనిపెట్టివుంకే దాని ఫలితంగా విలసిల్లే
పెట్టుబడిదారీ వ్యవస్థ 129
ఆర్థిక పురోభివృద్ధి పట్ల ఇస్లాం వైఖరి ఎలా ఉండేది? (శమ, ఉత్పాదనల వ్యవస్థీకరణకొరకు ఇస్లామీయ చట్టాలు, నియమాలు ఎలా పరిస్థితుల్ని ఎదుర్కొనేవి? అన్న (పశ్నల్ని పరిశీలించాలి.
యంతం (పగతికి మూలమంతం
ఆర్థిక శాస్త్రవేత్తలు ఒక్క విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. చివరికి పెట్టుబడిదారీకి బద్ధశతువయిన కార్ల్ మార్క్స్ కూడా ఒప్పుకుంటాడు. అదేమిటంటే, (ప్రారంభంలో పెట్టుబడిదారీ విధానంవల్ల మానవాళికి గొప్పపయోజనం చేకూరింది. దాని పుణ్యమా అని (పపంచం కొత్త (పగతి సోపానాలు దర్శించింది. ఉత్పాదన పెరిగింది. రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. జాతీయ ఒనరుల్ని విస్తృత రూపంలో వినియోగించడం సాధ్యమయింది. పూర్వం కేవలం వ్యవసాయం పైన్నే ఆధారపడ్డ కార్మికుల జీవన (పమాణం ఎంతో ఎదిగింది.
కాని పెట్టుబడిదారీ విధానం యొక్క ఈ స్వర్ణయుగం అతి శ్నీఘగతిన అంతరించి పోయింది. ఎందుకంకే ఈ (పగతికి సహజ పరిణామంగా ధనం (క్రమేణ సమీకృతమయి కొందరు పెట్టుబడిదారుల చేతుల్లోకి వచ్చేసింది. బీద కార్మికులు తమ ఆస్తిని, సంపదను అన్నింటినీ కోల్పొయ్యారు. పర్యవసానంగా పెట్టుబడిదారులకు కార్మికులు సులువుగా దొరకసాగారు. వారి (శమకు ఫలితంగా పెట్టుబడిదారుల సంపదలోనూ వ్యాపారంలోను అంతులేని పెరుగుదల పొడసూపింది. అయినప్పటికీ, కమ్యూనిస్థులమాటల్లో చెప్పాలంకే, అధిక ఉత్పాదనకు మూలకారకులయిన కార్మికుల వేతనాలు ఏమ్మాతం పెరగలేదు. వారికి పాప్తమయేే వేతనాలలో సాధారణత సగటు జీవితం గడపాలన్నా సాధ్యమయ్యేదే కాదు. వారి (శమవల్ల వచ్చే లాభం పెట్టుబడిదారులయిన యజమానులు తమ విలాసాలకు వినియోగించుకునేవారు.
కార్మికులకు తక్కువ వేతనాలు లభించడంవల్ల ఏర్పడిన పరిణామాల్లో
130 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
ఒకటి, పెట్టుబడిదారీ దేశాల సామాన్య(పజల కొనుగోలు శక్తి క్షీణించింది. వారు తయారు చేసిన సరుకు. కుప్పలు తెప్పలుగా పేరుకోసాగింది. అప్పుడు పెట్టుబడిదారులు తమ. సరుకును అమ్ముకోడానికి కొత్త మండీలను వెదకసాగారు. ఈ అన్వేషణ వలస రాజ్యాల వ్యవస్థను, మండీల విషయంలో, ముడిసరుకు విషయంలో అంతర్జాతీయ శతుత్వాన్ని సృజించింది. చివరికి వ్యవహారం, దాని అనివార్యమయిన పరిణామానికి, అంటే వినాశకరమయిన యుద్ధాల వరకు చేరుకుంది.
అందువల్లనే పెట్టుబడిదారీ వ్యవస్థలో మార్కెటు నిత్యం మాంద్యానికి గురయ్యే (పమాదముంటుంది. ఈ పరిస్థితి ఉత్పాదనలు పెరిగే కొద్దీ చాలీ చాలని వేతనాల కారణంగా తరిగే డిమాండుకు పర్యవసానంగా ఏర్పడుతుంది. అందువల్ల పెట్టుబడిదారీ వ్యవస్థలో కొంతకాలానికోసారి మార్కెటు మాంద్యాన్ని ఎదుర్కొంటూ ఉండటం తప్పదు.
కొందరు మేధావులు, ఈ చెడులన్నీ “పెట్టుబడిలో అంతర్గతంగా ఉండే సహజమయిన చెడులని వాదిస్తారు. వారి (పకారం, ఇందులో పెట్టుబడి దారుల్ని వారి దుష్ట సంకల్పాన్ని, వారి దోపిడీ తత్వాన్నీ దూషిస్తే లాభంలేదని వారి వాదన. ఈ తర్కాన్ని ఒప్పుకుంకే, మనిషి తన సకల భావాలూ, సంకల్పాలూ శక్తులతో సవా ఆర్థిక పరిస్థితులకు లొంగిపోవలసినవాడే అని కూడా ఒప్పుకోవలసి ఉంటుంది.
(పారంభంలోనే జరిగింది పొరపాటు
పెట్టుబడిదారీ (పారంభదశలో మానవాళికి దానివల్ల కలిగిన లాభాలను, జరిగిన భౌతికపగతినీ సుసంపన్నతనూ దేన్నీ ఇస్లాం కాదనదు, దేన్నీ వ్యతిరేకించదు. కాని ఇస్లామీయ జగత్తులో పెట్టుబడిదారీ ఆవిర్భవించి ఉంకే ఇస్లాం దాన్ని అలా నిరంకుశంగా వదిలివేసేది కాదు. పెట్టుబడి దారుని దుష్టసంకల్పంవల్లగానీ పెట్టుబడిలోని అంతర్గత దౌర్జన్యం వల్లగాని నెలకొనే దోపిడికి తావే లేకుండా చట్టాలను, నియమాలను అది
పెట్టుబడిదారీ వ్యవస్థ 131
నిర్మించేది. _ ఇస్లాం నియమం (ప్రకారం పెట్టుబడిదారునితో పాటు కార్మికునికి కూడా లాభంలో భాగం లభించేలా ఈ సందర్భంలో చట్టం చెయ్యడం సాధ్యమయ్యేది. ప్రఖ్యాత ధర్మవేత్త ఇమామ్ మాలిక్ (రహ్మలై) కార్మికుడు, యజమానితో పాటు లాభంలో సమానహాక్కు కలిగి ఉన్నాడని అంటారు. ఎందుకంటే ఆ లాభం గడించడంలో పెట్టుబడిదారుని పెట్టుబడికి ఎంత (పాముఖ్యముందో కార్మికుని (శ్రమ కూడా అంతే (పముఖ పాత వహిస్తుంది. అందువల్ల ఉభయుులకూ లాభంలో సమానమయిన హక్కు లభించాలి అంటారాయన.
(పారంభకాలంలో వృత్తులూ పరి శమలు అత్యంత సాధారణరీతిలో జరిగేవి. మనుషులు అత్యధికంగా తమ చేతులతోనే పనులు చేసుకునేవారు. ఇస్లాం ప్రతిపాదించిన పై సూత్రం వెలుగులో (శమ, పెట్టుబడుల పరస్పర సంబంధాన్ని అప్పుడే వ్యవస్థీకరించి ఉంకే దానికి ఒక న్యాయవంతమయిన (ప్రాతిపదిక లభించి ఉండేది. ఆ తరువాత యూరపులో పొడ సూపిన చెడులు అందులో ఉత్పన్నమయేేవికావు.
దుష్ట ద్వయం
ఆర్ధిక శాస్త్రవేత్తలు మనకు తెలిపేదేమంటేు, పెట్టుబడిదారీ వ్యవస్థ తన (ప్రారంభకాలంనాటి “స్వర్ణయుగం” దాటి నేటి “దుష్టయుగం'” లోకి (పవేశించినప్పటి నుంచి అది జాతీయ బుణాలకై ఆధారపడటం అధికమయింది. ఫలితంగా బ్యాంకులు వెలిశాయి. అవి తమ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి వడ్డీ తీసుకుని (పభుత్వాలకు బుణాలు అందజెయ్యసాగాయి. బ్యాంకు వ్యవహారాల ఆర్థిక, సాంకేతిక వివరాల్లోకి వెళ్ళకుండా మేము ఇక్కడ విశదపరచదలచుకున్న వాస్తవమేమంకు వ్యవహారమంతా అధికంగా వడ్డీ ప్రాతిపదికగానే సాగుతోంది. వడ్డీని ఇస్లాం, నిర్దిష్టంగా నిషేధించింది.
పెట్టుబడిదారీ వ్యవస్థలోని రెండో (ప్రత్యేకత వ్యాపారంలో తీవ్రమయిన
132 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
పోటి. దీని ఫలితంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలు నాశనమయిపోతాయి, లేదా అవన్నీ ఒక్కటయి పెద్ద పెద్ద సంస్థలుగా రూపొందుతాయి. అప్పుడే అవి ఇతర సంస్థలతో పోటీలో నెగ్గుకురాగలవు. ఇదే గుత్తాధిపత్యానికి (MONOPOLY) నాంది వాచకం.. కాని ఇస్లాం ఈ గుత్తాధిపత్యాన్ని ఎదురిస్తుంది. దైవ్యపవక్త (సఅసం) (పబోధం':
గుత్తాధిపత్యాన్ని స్థాపించేవాడు అపరాధి. (ముస్లిం, అబూదావూద్, తిర్మిజి)
ఈ రెండే పెట్టుబడిదారీకి పునాదులు. ఇస్లాం ఈ రెంటినీ సూత సాయంగా వ్యతిరేకిస్తుంది. దీని తరువాత కూడా ఇస్లాం పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకమని వేరుగా చెప్పనవసరం లేదేమో ! కాని పెట్టుబడి ఇస్లాం ఒడిలో పుట్టి ఉన్నట్లయితే దాని 'దుష్టయుగం' లోని చెడులు నేడు బయల్పడి ఉండేవికావు. పెట్టుబడి, అడ్డులేని దోపిడికి, వలన రాజ్యాలకు, యుద్ధం, వినాశాలకు మారుపేరుగా మారి ఉండేది కాదు.
ఆ విప్లవం ఇక్కడ వచ్చి ఉంతే
మొదటి విషయం ఏమిటంటే, ఇస్లామీయ జగత్తులో పారిశామిక విప్లవం వచ్చిఉంగే దాన్ని తన లక్షణాలకనుగుణంగా మలచుకోవడంలో ఇస్లాంకు ఎలాంటి చిక్కులు ఎదురయ్యేవ కావు. వృత్తిపనులూ చిన్న చిన్న పారిశ్రామిక ఫ్యాక్టరీల లాభాలను యజమానులు, కార్మికులు తమలో తాము పంచుకునేవారు. అంతమ్మాాతాన, వాటిని పరిమిత స్థాయిలోనే కొనసాగనివ్వాలని పట్టు పట్టేది కాదు ఇస్లాం. దానికి బదులుగా ఇస్లాం ఆ్యశయంలో ఉత్పత్తి ఎంత పెరిగినా యజమానులూ, కార్మికుల సంబంధాలు 19, 20వ శతాబ్దాల్లో యూరపులో మాదిరిగా ఎడముఖం పెడముఖంగా మాతం ఉండేవికావు. మేము పైన సూచించిన విధంగా యజమాని, కార్మికులు లాభాల్లో పరస్పరం సమంగా భాగస్వాములుగా ఉండే సూత్రం ఆధారంగా వారి సంబంధాలు నెలకొనేవి.
పెట్టుబడిదారీ వ్యవస్థ 133
ఈ స్యూతాన్ని అమలుపరచిన తరువాత వడ్డీ మరియు గుత్తాధి పత్యం పూర్తిగా అంతమయి సాయ్యేవి. కార్మికులు, యూరపులోని పెట్టుబడిదారీ వ్యవస్థలో అప్పుడప్పుడు ఎదురయ్యే బీదరికం, దార్మిద్యం, దోపిడీలకు గురయ్యేవారుకారు.
ఇలాంటి సామాజిక న్యాయస్థాపనకై కమ్యూనిజం మాదిరిగా ఇస్లాం కూడా వర్గపోరాటం, ఆర్థిక వత్తిడులు, ఇతర కష్టాలకు తప్పనిసరిగా గురికావలసి వచ్చేదని, ఆ తరువాత దాని నియమాల్లో వాటంతట అవే మార్పులు బేర్పులు జరిగేవని భావించడం అవివేకం. బానిసత్వాన్ని, భూస్వామ్య వ్యవస్థను, (పారంభపెట్టుబడిదారీని పరిష్కరించడంలో ఇస్లాం ఏ విధంగా (పపంచంలోని ఇతర వ్యవస్థలకు భిన్నంగా వ్యవహరించి సాధించిందో ఇదివరకే మేము వివరించాము. ఇస్లాం (పవేశపెట్టిన సంస్కరణలన్నింటి వెనక ఇస్లాం యొక్క సత్యం న్యాయాల శాశ్వత సూ(తాలు పనిచేశాయి. వాటిని కమ్యూనిస్టు మేధావులు తరచు హేళన చెయ్యడం కద్దు. దీనికి భిన్నంగా “పపంచపీడిత (పజల ఆశాజ్యోతి, మొట్టమొదటి (ఏకైక) కమ్యూనిస్టు రాజ్యుం' గా ఖ్యాతిగాంచిన ఆదర్శ కమ్యూనిస్టు రాజ్యమయిన రష్యా కూడా కారల్‌మార్క్స్ (పచారం చేసిన తత్వానికి భిన్నంగా రూపొందుతూ ఉంది. అది భూస్వామ్య వ్యవస్థ నుండి ఆ తరువాత పెట్టుబడి దశలో (పవేశంచకుండానే ఏక్‌దమ్మున కమ్యూనిస్టు దశలోకి దుమికివేసింది. కారల్‌మార్క్స్ సందేశ ధ్వజవాహిక అయిన రష్యాయే ఈ విధంగా, ఆ తత్వాన్ని చీల్చి చెండాడింది. (ప్రతి మానవ సమాజం తన పరిణామక్రమంలో కొన్ని విశేష దశల్ని తప్పనిసరిగా దాటవలసి ఉంటుందన్న ఆ: సిద్ధాంతాన్ని (కియారూపంలో ఖండించి వేసింది. *
* స్టాలిన్ మొదలుకుని గొర్భచెవ్ వరకు జరిగిన అనేక మార్పులే దానికి ప్రత్యక్ష నిదర్శనాలు. 1986 నవంబరు నెలలో “కార్మిక సాంఘిక సమస్యల కమిటి చెయిర్మన్ స్రీ ఇవాన్ ఒక బిల్లు (పవేశవెడుతూ “వ్యక్తుల ఆర్థిక కార్యకలా పాలకు దేశంలో ఇదివరకే విస్తృత ఆమోదం లభించిందని" ఇంకా “సోవియట్ (పజల
134 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో వలస రాజ్యవ్యవస్థ పరిణామ్మకమంలో భాగమా?
వలసరాజ్యాలు, యుద్దాలు, ఇతర జాతుల దోపిడి ఇంకా పెట్టుబడిదారీ వ్యవస్థ తెచ్చిపెట్టిన ఇతర సర్వవ్యాప్తమయిన చెడుల్ని ® ఐ ఇస్లాం ఖండిస్తుంది. వలసరాజ్యాలు స్థాపించడాన్ని లేక ఇతరుల్ని తమ లక్ష్యాలకు పావులుగా మార్చుకునేందుకు వారితో యుద్ధాలు చెయ్యడాన్ని ఇస్లాం నిరసిస్తుంది.
కమ్యూనిస్టులు, వారితో ఏకీభవించేవారు, వలస రాజ్యవ్యవస్థ మానవ పరిణామక్రమంలో ఓ అనివార్యమయిన దశ అని భావిస్తారు. వారి (పకారం, అది ఓ ప్రత్యేక ఆర్థిక సమస్య మూలంగా ఉనికిలోకి వచ్చింది. ఆ సమస్య, పారిశ్రామికంగా వృద్ధి చెందిన దేశాల్లో మిగులు ఉత్పాదన, దాని వికయానికై విదేశీవాణిజ్య స్థావరాల ఆవశ్యకత. ఈ కారణాల వల్ల వలస వ్యవస్థ మానవ (పగతిలో ఓ అనివార్యమయిన ఘట్టం. దాన్ని ఏ నైతిక సిద్ధాంతం ఆధారంగానూ వారించ శక్యం కాదు. దాన్ని వాయిదా వెయ్యడమూ సాధ్యపడదు.
ఇస్లాం, వలసరాజ్య వ్యవస్థకు సంబంధించిన ఈ ఊవాగానాన్ని ఎంతమ్మాతం అంగీకరించదు. కమ్యూనిజం ధ్వజవాహకులు చెప్పేదేమంకే, రష్యా తన మిగులు ఉత్పాదన సమస్యను, పనివేళల్లో తగ్గుదలద్వారా, ఉత్పాదనలో మానవశమను ఆదా చేయడం ద్వారా ఎట్టకేలకు పరిష్కరించుకుంటుందని. ఇప్పుడు (పశ్న ఏమంటే, కమ్యూనిస్టు రష్యా తాను కని పెట్టిన 'పరిష్కారం' ద్వారా ఈ సమస్యను చక్కదిద్దుకోగలిగితే ఇతర వ్యవస్థలు దాన్ని వినియోగించి ఆ సమస్యను ఎందుకు పరిష్కరించుకోలేవు? వారు మటుకు వలస రాజ్య దశను దాటడం
అభిప్రాయాలను, ఇతర సోషలిస్టు దేశాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నా” మని ఆయన అన్నారు. బిల్లుపకారం, 1987 మేడే (1) నుండి చెప్పులు మొదలుకుని స్కిల్డ్ లేబర్ వరకు అన్నీ అమ్ముకోవచ్చు, టాక్సీలు నడుపుకోవచ్చు అట. (అను)
పెట్టుబడిదారీ వ్యవస్థ 135
అనివార్యమెందుకు అవుతుంది?
చరిత చెప్పేదేమంకే వలస రాజ్యస్థాపనకు మూలం, మానవనైజంలోని ఓ అతి పురాతన దౌర్బల్యం. పెట్టుబడిదారులు ఆధునిక మారణాయుధాలు చేతబూనిరావడం వల్ల అందులోని రక్తపాతం ఎన్నోరెట్లు పెరిగినమాట వాస్తవమే కాని పరాజితులు, పరాభవానికి పాలయిన జాతుల అ([కమ దోపిడి విషయంలో (పాచీన రోమనుల వలస స్మామాజ్యం నవీన యూరపు సామాజ్యానికి ఏ మాత్రం తీసిపోదు.
చరిత వల్ల మనకు తెలిసే మరో విషయం ఏమిటంకే, యుద్ధాలకు సంబంధించినంతవరకు ఇస్లాం, పపంచంలోకెల్ల అత్యంత పరిశుద్ధమయిన వ్యవస్థనిస్తుంది. ఇస్లామీయ యుద్ధాల ఫలితంగా ఎప్పుడూ ఏ జాతీ దోపిడికి గురికాలేదు. ఇంకా ఎవరూ బానిసత్వపు అభిశాపానికి లోనవలేదు. ఒక వేళ ఇస్లామీయ జగత్తులో పారిశ్రామిక విప్లవం వెలిసినా మిగులు ఉత్పాదన ( SURPLUS PRODUCTION) సమస్యను ఇస్లాం శాంతియుత విధానం ద్వారా పరిష్కరించుకునేది. దానిగ్గాను అది _పపంచాన్ని యుద్ధాల అగ్నిగుండంలో పడవేసే అవసరమూ వచ్చేదికాదు. పెట్టుబడిదారీ మౌలిక స్యూతాలను మార్చివేస్తే మిగులు ఉత్పాదన సమస్య అసలు ఉద్భవించేదే కాదు.
సమస్యకు మూలాంకురం
పెట్టుబడిదారీ వ్యవస్థలో (పభుత్వం, సంపద కేంద్రీకరణను అరికట్టే స్థితిలో ఉండదు. ఇస్లామీయ వ్యవస్థలో (పభుత్వం ఈ విధంగా అశక్తత కనబరచడమో నిరాసక్తంగా ఉండడమో జరగదు. ధనం కేవలం కొన్ని కుటుంబాల్లో కేందీకృతమయి మిగతా [ప్రజలంతా లేమికి గురవకుండా చూడటం దాని బాధ్యత. ఎందుకంటే ధనం కొందరి మధ్యనే పర్మిభమిస్తూ ఉండరాదని, (పజలందరూ (పయోజనం పొందేలా అది అందరికీ
136 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
అందుబాటులో రావాలని అభిలషిస్తుంది ఇస్లామీయ షరీఅత్. ఇస్లాం సూచించే వారసత్వపు చట్టం షరీఅత్ యొక్క ఈ స్వభావాన్నే వ్యక్త పరుస్తుంది. దాని లక్ష్యం ఏమిటంకే ఒక తరంవారు సమీకరించి వదలి వెళ్ళే సంపద, ఆస్తులు అది ఆ తరువాత వచ్చే తరంవారిలో సముచితమయిన రీతిలోనూ, సాలుసరి ఆదాయంలోను, లాభాల్లోనూ 2.5 శాతం అగత్యపరుల సంక్షేమానికిగాను కేటాయించడం అవసరం పైగా ఇస్లాం ధనాన్ని కూడబెట్టడంపట్ల తన అయిష్టతను స్పష్టంగా వ్యక్తపరచింది. దీనికి తోడుగా ధనాన్ని కూడ బెట్టందుకు మూలకారణమయిన వడ్డీని హరామ్ (నిషిద్ధం)గా నిర్ణయించింది. అంతేకాదు ఇస్లాం, సమాజంలోని వివిధ వర్గాలమధ్య సంబంధాలను దోపిడీకి బదులుగా ఉమ్మడి బాధ్యతల ఆధారంగా నిర్మిస్తుంది.
ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన విషయం మరొకటి ఉంది. దైవపవక్త (సఅసం) బోధన (ప్రకారం ఇస్లామీయ (ప్రభుత్వం తన ఉద్యోగుల (ప్రాథమిక జీవితావసరాలను అందజేసే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆయన (వబోధం: “ఎవరయితే మన(ఇస్లామీయ రాజ్యం) లో సేవజేసేందుకు నియమితుడయ్యాడో అతను అవివాహితుడయితే అతని వివాహం చెయ్యాలి. అతనికి ఇల్లులేకపోతే ఇల్లు ఇవ్వాలి. పనులు చేసుకునేందుకు నౌకరు కావలని వస్తే నౌకరునూ ఇవ్వాలి. వాహనం లేకపోతే అదీ సరఫరా చెయ్యాలి”
(ప్రాథమిక అవసరాల ఈ హామీ కేవలం (ప్రభుత్యోద్యోగులవరకే పరిమితం కాదు, ఎందుకంకే ఇవయితే (పతి మనిషికీ కావలసిన జీవితావసరాలే కదా. అందువల్ల ఇస్లామీయ రాజ్యంలో లేక సమాజంలో ఏదో ఒక సేవ ఏదో ఓ రూపంలో చేసే (పతి వ్యక్తీ దానికి అర్హుడే. అందువల్ల ఇస్లామీయ [పభుత్వం తన ఉద్యోగులకు ఇలాంటి ఈ సౌకర్యాలు అందజేసే బాధ్యతస్వీకరిస్తే సమాజంలో సేవ చేసే ఇతర సభ్యులకు కూడా అలాంటి సదుపాయాలే (ప్రాప్తం కావాలి. అందుచేతనే ఇస్లామీయ (పభుత్వం, (పభుత్వ ధనాగారంనుండి వృద్ధులకు, వ్యాధి(గస్తులకు, తమ (బతుకు
పెట్టుబడిదారీ వ్యవస్థ 137
తెరువును తామే సంపాయించుకునే స్థితిలో లేని వారికి అవసరాల మేరకు భృతిని చెల్లిస్తుంది. అలాగే ఎవరి ఆదాయం, తక్కువగా, పరిమితంగా, చాలనంతగా ఉంటుందో వారికీ (పభుత్వ ధనాగారం నుండి ధన సహాయం అందజేస్తుంది.
ఇస్లామీయ రాజ్యపరిధిలో ఉండే వ్యక్తులందరి [పాథమిక జీవిత అవసరాలను సమకూర్చే బాధ్యత ఆ (పభుత్వం వహిస్తుందని ఈ వివరణల వల్ల రుజువవుతుంది. ఈ లక్ష్యసాధనకు అది ఏ విధానాన్ని అవలంబిస్తుంది? అన్నది ముఖ్యం కాదు. అసలు (పాముఖ్యత ఇస్లామీయ రాజ్యం అనుసరించే మూల స్యూతానికే ఉంది. దాని (పకారం జాతీయ లాభనప్పాల్లో జాతి (పజలందరూ సమానంగా భాగస్వాములవుతారు. ఈ వ్యవస్థలో ఉద్యోగులూ, కార్మికులూ ఇతరులు దోపిడికి దూరంగా భ్యదంగా ఉండటమేకాక ఎంతో పరిశుద్ధమయిన జీవితాలూ గడుపుకో గలుగుతారు.
నేటి పాశ్చాత్య పెట్టుబడిదారీ వ్యవస్థలో బయట పడుతున్న వికృతరూపం ఇస్లాం ఛాయల్లో పెట్టుబడికి ఎన్నడూ ప్రాప్త్రమయి ఉండేదికాదు. షరీఅతలోని ఏ చట్టమయినా - అది మౌలికాధారాల నుండి (గహించినదయినా, పరిస్థితుల కనుగుణంగా ధర్మపరిధిలో షరీఅత్ అన్వయింపు (_పకారం నిర్మించుకున్నదయినా - కార్మికుల్ని తమ పేరాశకు బలిచేసే అనుమతిని మాతం పెట్టుబడిదారులకు ఇవ్వదు. ఇస్లాంలో పెట్టుబడిదారీవల్ల జనించే ఇతర దౌర్భాగ్యాలు, వలస స్మామాజ్యం, యుద్ధాలు, బానిసత్వం మొదలయినవి ఎన్నటికీ తలెత్త జాలవు.
జీవితంలో సమతూకం, సామరస్యం ఆర్థిక విషయాల్లో కేవలం మంచి మంచి స్యూతాలు, నియమాలు
చెయ్యడంతో సరిపుచ్చదు ఇస్లాం. వాటికి తోడుగా అది మనిషిలోని ఆధ్యాత్మిక, నైతిక భావోదేకాలనూ (పేరేపిస్తుంది. వీటిని కమ్యూనిస్టులు
138 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
అపహాసించడానికి కారణం యూరపు చర్మితలో వీటి క్రియాత్మక పయోజనం ఉన్నట్లు ఏ కోశానా కానరాకపోవడమే. అయితే నైతిక, ఆధ్యాత్మిక (వమాణాలు మానవుని దైనందిన జీవితానికి దూరంగా వేరుగా లేవన్నది ఇస్లాం దృక్పథం. ఈ కోణంలో చూస్తే ఇస్లాం ఓ విశిష్టమయిన ఏకైక జీవన వ్యవస్థ. అది ఆత్మపరిశుద్ధతకు సమాజ వ్యవస్థాపనకు పరస్పరానుబంధం ఏర్పరచి వాటిలో సామరస్యాన్ని సృష్టిస్తుంది. అది సమాజాన్నీ ఉపేక్షించదు, వ్యక్తినీ గాలికి వదలివెయ్యదు. అప్పుడే మనిషికి సిద్ధాంతం, ఆచరణల్లో సమన్వయాన్ని నిర్మించుకోవడం సాధ్యపడుతుంది. ఇస్లామీయ శాసనాల వునాది నైతికత ఆధారంగా ఏర్పడుతుంది. అందువల్లనే ఇస్లాంలో చటం మరియు నైతికతల్లో ఎన్నడూ వైరుధ్యం పాడసూపదు. ఈ రెంటిమధ్య సామరస్యం తొణికిసలాడుతుంది. రెండూ చెట్టాపట్టాలు వేసుకుని జంటగా అంటుకు తిరుగుతాయి. ఒక దానిలో ఏదయినా కొరవడితే రెండోది దాన్ని పూరిస్తుంది. వాటి మధ్య ఎన్నడూ సంఘర్షణో, ద్వంద్వ రీతియో వ్యక్తమవదు.
సంపద కేవలం కొన్ని చేతుల్లోనే ఆడటం మూలాన తప్పనిసరిగా జనించే భోగవిలాసాల్లో తేలియాడటం, రుచులు మరగటంలాంటివన్నీ ఇస్లామీయ నైతికతలో ధర్మసమ్మతం కావు. దానితోపాటు యజమానులకు ఇస్లాం తాకీదు చేస్తుంది - వారు తమ ఉద్యోగులపట్ల అన్యాయంగా (పవర్తించరాదని, వారి న్యాయవంతమయిన వేతనాన్ని తగ్గించరాదని, వారికి వారి హక్కుల్ని పూర్తిగా చెల్లించాలనీను. ధన సమీకరణకూడా ఉద్యోగులవట్ల ఓ విధమయిన అన్యాయం, అఆ(కమం అనే చెప్పాలి. అందువల్ల అన్యాయాన్ని అంతమొందించాలంకే దాన్ని కూడా అరికట్టడం అవసరమే. ఈ కారణంవల్ల కూడా ఇస్లాం ధన సమీకరణను వ్యతిరేకిస్తుంది. ఇస్లాం (వజల్లో దైవమార్గాన దనం వెచ్చించే గుణం పెంపొందాలని కోరుతుంది. దానిగ్గాను వారు అవసరమయితే తమ సర్వస్వాన్నీ ధారపోసేలా (పీరేపిస్తుంది. ఏ సమాజంలోనయితే సంవన్నులు ఈవిధంగా సుఖాలను,
పెట్టుబడిదారీ వ్యవస్థ 139
స్వార్థాలను త్యజించి, దైవంకొరకు తమ ధనాన్ని ఇతరులకై ఖర్చుచేస్తారో అక్కడ బీదరికం, లేమి అనేవి మచ్చుకయినా కానరావు.
ఆంతర్యం కోరేదే బాహ్యంలో చట్టమయితే?
పైగా ఇస్తాం (పజలకు ఏ ఆధ్యాత్మిక జెన్నత్యాలను పరిచయం చేస్తుందో వాటివల్ల వారికి దైవ సామీప్యం (పాప్తమవుతుంది.దైవ(పసన్నత, పరలోక ఫలాపేక్షలో వారు, (పపంచంలో లభించే సకల లాభాలనుండి, సుఖాస్వాదనలనుండి దూరమవడానికి సంతోషంగా అంగీకరిస్తారు. వాస్తవమేమంకే దైవనిర్ణయాల పట్ల (వసన్నుడయే వ్యక్తి, పఠలోకంలో లభించే శిక్షాసాఫల్యాలను విశ్వసించేవ్యక్తి ఎన్నడూ ధన సమీకరణ రోగానికి గురికాజాలడు, తన (వపయోజనాల సాధనకై ఇతరులపై ఎన్నడూ అన్యాయం అ(కమాలకు, దోపిడీ దుండగాలకు పాల్పడడు.
ఇస్లాం మనిషిని ఏ విధంగా ఆధ్యాత్మిక జున్నత్యాలకు లేవనెత్తుతుందో ఆ విధానం, పెట్టుబడిదారీలోని సకల రుగ్మతలను రూవుమాపే ఆర్థిక శాసనాలను అమలు జరపడం సులభతరం చేస్తుంది. ఇస్లామీయ సమాజంలో వాటిని అమలు పరచినప్పుడు సంఘ సభ్యులందరూ దాన్ని సంతోషంగా స్వీకరిస్తారు. వాటిని నిండు హృదయంతో అనుసరిస్తారు. వీరు ఇలా చెయ్యడానికి కారణం శిక్షను పొందే భయంకాదు, అది వారి జీవితానికి నైతికటపాతిపదిక. వారి అంతరాత్మ దేన్నయితే కోరుతుందో అదే చట్టమయి ముందుకు వస్తుంది గనుక !
చివరన మరోమాట. నేడు ముస్లిం జగత్తుపై తిష్టవేసిఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ చెండాలపు రూపానికి ఇస్లామీయ వ్యవస్థతో ఏ విధంగానూ సంబంధం లేదు. అందువల్ల అది జనింపజేసిన చెడులకు ఇస్లాం ఏమ్మాతం బాధ్యత వహించజాలదు.
5. వ్యక్తిగత ఆస్తి
సొంత ఆస్తిని కలిగి ఉండటం మనిషి స్వభావసిద్ధమయిన వాంఛయా? కమ్యూనిస్టులు దీనికి కాదని జవాబు ఇస్తారు. వారి వాదన (పకారం మానవాళి (ప్రారంభదశ లేక (పారంభయుగం కమ్యూనిస్థుయుగం. ఆ కాలపు మానవ సమాజంలో వ్యక్తిగత ఆస్తి అంటే ఏమిటో ఎవరికీ తెలీదు. అప్పుడు అన్ని వస్తువులూ ఉమ్మడిసాత్తుగానే ఉండేవి. వాటిలో అందరికీ సమానంగా భాగం ఉండేది. అప్పటి వారిలో (పేమానురాగాలు, సహాయసహకారాలు, సోదరభావాలు వెల్లివిరిసేవి. ఈ స్వర్ణయుగం అతి త్వరలోనే అంతమయిపోవడానికి కారణం ఏమి టంకే సమాజంలో వ్యవసాయం (పారంభంకాగానే మనుషులు వ్యవసాయభూములు, ఉత్పత్తి సాధనాలకొరకు పరస్పరం కలహించుకోసాగారు. ఆ సంఘర్షణ ముందుకు సాగి యుద్ధాలుగా రూపొందింది. కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం ఈ పరిస్థితుల పరిష్కారానికి మానవాళి మరోసారి ఆ “తొలి కమ్యూనిజం” వైపుకు మరలాలి. అన్ని వస్తువులూ అందరిసొత్తుగా మారాలి. అప్పుడే అందరూ వాటిద్వారా పయోజనం పొందగలుగుతారు. కమ్యూనిస్టుల (పకారం ఈ విధంగా మాత్రమే (పపంచంలో (పేమ, శాంతి, సామరస్యాలు పరిఢవిల్లుతాయి.
అసుభవం ఇచ్చే సాక్ష్యం
కాని మనిషి స్వభావసిద్ధమయిన భావాలు, అభిపాయాలు, అలవాట్లు, లక్షణాల్లోనూ అతడు తన పరిసరాలనుండి, శక్తిసామర్థ్యాల ద్వారా (గహించిన భావాలు, అలవాట్లు, లక్షణాల్లోనూ ఉన్న వ్యత్యాసం ఏమిటి ? మనస్తత్వ శాస్త్రవేత్తలు ఈ ప శ్నకు విభిన్నమయిన సమాధానాలు ఇస్తారు. ఈ విషయంలో వారి మధ్య త్మీవమయిన భేదాభిప్రాయాలున్నాయి. వ్యక్తిగత ఆస్తి విషయంలోనూ ఇంతే. కొందరు మనస్తత్వ శా(స్తవేత్తలు, సాంఘిక శాస్త్రవేత్తలు దీన్ని మనిషిలోని స్వభావసిద్దమయిన భావమని, ఇది పరిస్థితులు లేక వాతావరణంవల్ల జనించింది కాదని వాదిస్తారు. కాని
వ్యక్తిగత ఆస్తి 141
కొందరు దీన్ని మనిషి కృషితో సాధించిన భావమని, ఇది పరిసరాలు, పరిస్థితుల (పభావం వల్ల మనిషిలో జనిస్తుందని అభిపాయపడతారు. ఉదాహరణకు ఒక బాలుడు తన ఆట వస్తువును వదలుకోవడానికి నిరాకరిస్తాడంకే, దానికి కారణం, వారి (పకారం, తన ఆటవస్తువులు తగ్గిపోతాయన్న భయం, లేదా మరో పిల్లవాడు అతని ఆటవస్తువుల్ని దోచుకుంటాడేమో అన్న ఆందోళన తప్ప మరేమీకాదు. ఆ కారణంచేతనే పదిమంది బాలలుండి ఆటవస్తువు ఒక్కటే ఉంకే వారిలో కలహం చెలరేగడం అనివార్యం. కాని వారిలో (పతి ఒక్కనికీ ఓ ఆటవస్తువు ఉన్నట్లయితే ఎలాంటి జగడమూ తలెత్తదు.
కమ్యూనిస్టులు, ఈ మానసిక శా స్తవేత్తలూ, సాంఘిక శ్యాస్తవేత్తలతో మేము కొన్ని విషయాలు విన్నవించదలిచాము.
ఏది సహజం?
1. ఇంతవరకు ఏ సైంటిస్టు కూడా, “వ్యక్తిగత ఆస్తి” అన్నది మానవుని పవృత్తిలో లేదని ఎలాంటి బలమయిన ఆధారంతో రుజువుచెయ్యలేక పోయాడు. మహాఅయితే వ్యక్తిగత ఆస్తి మానవనైజంలోఉందనడానికి గట్టిరుజువు ఏదీలేదని మ్మాతమే అనగలరు. .అది వేరే (ప్రశ్న.
2. తమ దృక్పథాన్ని బలపరచడానికి బాలలు మరియు ఆట వస్తువుల. ఉదాహరణ ద్వారా కమ్యూనిస్టు సోదరులు ఏ ఫలితాలనయితే రాబట్టదలిచారో అవి ఎంతమా(తం వ్యక్తం కావు. పది ఆటవస్తువులున్నప్పుడు పదిమంది బాలురు పరస్పరం కలహించుకోకుండా ఉండటం, మనషి నైజంలో వ్యక్తిగత ఆస్తి భావన లేదనడాన్ని రుజువు చెయ్యదు. దీని ద్వారా, “ఆరోగ్యవంతమయిన వాతావరణంలో వ్యక్తిగత ఆస్తి వాంఛ పరిపూర్ణ సమానత్వం తద్వారా కూడా నెరవేరుతుంది అని మాత్రమే ద్యోతకమవుతుంది. మరో యదార్థం కూడా ఈ సందర్భంలో మన నిత్యానుభవంలో వస్తూనే ఉంటుంది. అనేకమంది బాలురు తమవద్ద ఆటవస్తువులు ఉంచుకుని
142 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
కూడా తమ స్నేహితుల ఆటవస్తువుల్ని దోచుకుంటారు. వారు అశక్తులయి తమకు అలివికాకపోతే తప్ప తాము చేసే ఈ చేష్టను మానుకోరు.
3. ఇక, కమ్యూనిస్టులు సూచించే ఆ “స్వర్ణయుగం” విషయానికి వస్తే, వారన్నట్టు అది పారంభ మానవ సమాజాల అన్నింటి (పత్యేకతే. కాని వాస్తవమేమంపే, ఈ స్వర్ణయుగం నిజంగానే ఉండిందా అని తెలుసుకునేందుకు నేటికీ గట్టి సాక్ష్యాధారం ఒక్కటి లభించలేదు. కేవలం చర్చ కోసం అది ఉండిందని ఒప్పుకున్నా, మరో విషయాన్ని కూడా అంగీకరించవలసి ఉంటుంది - ఆ సువర్ణయుగంలో ఉత్పత్తి సాధనాలు అసలేలేవన్న యదార్థం. ఉత్పత్తి సాధనాలే లేకపోతే కలవోలు, కలతలకు తావేది? ఆ కాలంలో మనిషికి ఆవార సంపాదన ఏమంత కష్టతరమయింది కాదు. వారు కోరుకున్నప్పుడు చెయ్యిచాచి చెట్ల ఫలాలు కోసుకునేవారు. వేటకు వెళ్ళినప్పుడు, అడవి మృగాల భయంవల్ల బృందాలరూపంలో వెళ్ళేవారు. కాని వేట జంతువు మాంసాన్ని నిల్వచేసే (ప్రశ్నే తలెత్తదు. ఎందుకంటే అది చెడిపాయ్యే (పమాదం ఉండింది. వీలయినంత తొందరగా దాన్ని వినియోగించుకోవాలని (పపయత్నించేవారు. ఇలాంటి ఓ యుగంలో మానవ సమాజంలో ఎలాంటి సంఘర్షణ గోచరించకపోతే దానివల్ల సొంత ఆస్తికి సంబంధించిన పకృతి సిద్ధమయిన వాంఛ వారిలో లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అప్పుడు వివాదానికి కారణ భూతమయ్యే ఏ వస్తువూ లేకపోయింది. అందువల్లనే వ్యవసాయ కాలం (ప్రారంభం కాగానే సంఘర్షణ కూడా మొదలయింది. వ్యవసాయం కనుగొనడంవల్ల మానవుల్లో నిదాణమయివున్న సంఘర్హణా బుద్ధి జాగృతమయింది. తద్వారా దానికి మొదటిసారిగా (పేరణ (_పాప్తమయింది.
4. కమ్యూనిస్టులు (పతిపాదించే సిద్ధాంతం (ప్రకారం (పారంభంలో (స్తీ అందరి ఉమ్మడి, సొత్తుగా ఉండేదని ఒప్పుకున్నా ఆ కాలంలో (స్తీ కోసం పురుషుల్లో కలవోలు, బల్యపదర్శనలూ జరిగేవి కావని గట్టిగా చెప్పడం సాధ్యపడదు. ఎందుకంటే ఉమ్మడి వస్తువే అయినా ఓ (స్తీ మరో (స్తీ కంటే అందమయినదవడం చేత పురుషుల్లో వివాదాస్పదం కావడానికి
వ్యక్తిగత ఆస్తి 143
ఆస్కారముంది. ఈ సందర్భంలో మనం మరో విషయాన్నీ మరువరాదు. వ్యవహారం ఒకే రకమయిన, సమానమయిన వస్తువులదయితే వాటి గురించి కలహం చెలరేగదని చెప్పవచ్చు. కాని వస్తువుల విలువలరీత్యా అవి అధమమయినవి, అధికమయినవీ అన్న విభేదం మనుషుల్లో ఏర్పడినప్పుడు వివాదం, సంఘర్షణలు ప్రారంభమవడం అనివార్యం - అది కమ్యూనిస్టులు భావిలో ఎప్పుడో ఏర్పడబోతోందని కలలు గనే ఆ “దేవతల” ఊవాలోకపు సమాజమయినాసరే.
5. మనుషుల్లో _పారంభకాలంనుండే తోటిమానవుల సమక్షాన ఏదో ప్రత్యేకత కలిగి ఉండాలన్న వాంఛ ఉండేది. అందువల్లనే కొందరు శూరత్వం, శరీరసౌష్టవం, ఇంకా ఇతర విధాలా తమ వ్యక్తిత్వాన్ని విశేషంగా (పదర్శించడానికి పయత్నించేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాచీన తెగల (పజలు, కమ్యూనిస్టుల ప్రకారం “తొలి కమ్యూనిజం' యొక్క ఆదర్శకాలంలో జీవితం గడుపుతున్నవారు, తమ కూతుళ్ల వివాహం, ఏ యువకులయితే ఎలాంటి శోషగాని బాధగాని వ్యక్తపరచకుండా తమ వీపులపై నూరు కొరడా దెబ్బలు భరించగలుగుతారో వారితోనే చేస్తారు. ఈ యువకులకు ఇలాంటి (పమాదాన్ని కొని తెచ్చుకునేందుకు పురికొలిపేది ఏమిటి? ఇది కేవలం తమ వ్యక్తిత్వపు పదర్శనాభిలాష మహత్మ్యం కాదా? (పపంచంలోని వస్తువులన్నింటిలో సమానత్వం ఉందన్న అభిపాయమే నిజమయిన దయితే, ఒక మనిషిచేత ఇతరుల ఎదుట “నేను మీలాంటి వాజ్జికాను, మీ కంకే ఉత్తముటణి, అధికుణ్ణి” అనిపించే ఆ భావం మాటేమిటి? మానవ (పకృతి యొక్క ఈ కోణం ఎంతో (పముఖమయింది. ఒకవేళ కమ్యూనిస్టుల వాదన (ప్రకారమే వ్యక్తిగత ఆస్తి మనిషిలోని (ప్రకృతి సిద్ధమయిన అభిలాషకాదని ఒప్పుకున్నప్పటికీ, దానికి మరో సహజవాంఛతో (పగాఢ సంబంధం ఉంది - అంటు అది, మనిషి భువిలో అడుగిడిన నాటినుండి అతని నైజంలో ఓ భాగంగా అగుపిస్తున్న భావం - అందరిలోనూ తాను (ప్రత్యేకత కలిగి ఉండాలన్న వాంఛ!
144 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో అన్యాయానికి మూలం ఏమిటి?
కమ్యూనిస్టులు చెప్పేదేమంకే వ్యక్తిగత ఆస్తి, అన్యాయం ఈ రెంటికీ అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల మనిషి అన్యాయం, అత్యాచారం, దౌర్జన్యాలనుండి విముక్తిని కోరదలిస్తే అతను వ్యక్తిగత ఆస్తిని
సయితం వదలుకోవాలి.
కాని ఈ మహనీయులు ఇలాంటి వాదన చేసేటప్పుడు రెండు యదార్థాలను మరచిపోతారు. ఒకటి, మానవ(పగతి అంటూ ఏదయినా ఉంటే అది కేవలం వ్యక్తుల కృషివల్లనే సాధ్యం. రెండు, ఊవాజనితమయిన ఆ “తలి కమ్యూనిజం' నాటి ఆ “ఆదర్శ” రోజుల్లో మానవ (పగతి పూజ్యం తప్ప మరేమీ కాదు. అంటే, మనిషి (పగతి సాధించడం _పారంభించాడంకే అది కేవలం వ్యక్తిగత ఆస్తివల్ల సంఘర్షణ ప్రారంభమయిన సందర్భంలోనే సాధ్యమన్నమాట! దీనివల్ల తెలిసేదేమంకే ఇలాంటి సంఘర్షణ యావత్తు కేవలం మనిషి పాలిటి చెడుగు మాత్రమే కాదు. నిజానికి న్యాయ పరిధుల్ని దాటకుండా ఉంకే అది మానవుని అనివార్యమయిన మానసిక, సామాజిక, ఆర్థిక ఆవశ్యకత.
(పపంచంలో జరిగిన అన్యాయం, అత్యాచారాలు, దౌర్దన్యాలన్నింటికీ మూలకారణం వ్యక్తిగత ఆస్తి అన్నది ఇస్లాం దృష్టిలో సరయిన అభ్మిపాయం కాదు. యూరపు మరియు ఇతర దేశాల్లో జరిగిన అన్యాయాలకు అసలు కారణం, ఆ దేశాల్లో చట్ట నిర్మాణ అధికారాలన్నీ సంపన్న వర్గం చేతుల్లో ఉండటం మ్యాతమే. ఈ అధికారాలను వినియోగించుకుని వారు పెట్టుబడిదారుల (పయోజనాలను రక్షించే ఉద్దేశ్యంతో చట్టాలు చేశారు. దానివల్ల ఇతర వర్గాల పట్ల అన్యాయం అక్రమం చెయ్యవలసి వచ్చినా, ఇతరుల [పయోజనాలు దెబ్బతిన్నా వారు ఖాతరు చెయ్యలేదు.
ఇస్లాం “అధికారవర్గం' అనేదాన్ని అసలు ఒప్పుకోదు. ఇస్లామీయ వ్యవస్థలో చట్టనిర్మాణకార్యం ఏ [పత్యేక ఉన్నతవర్గం బాధ్యతా కాదు. ఆ
వ్యక్తిగత ఆస్తి 145
అధికారాలన్నీ దేవుని హస్తగతమయి ఉంటాయి. ఆయన మానవ వర్గాలన్నింటికీ కర్త, ఆయన దృష్టిలో మానవులందరూ సమానమే. ఆయనకు ఏ మనిషీ, ఏ వర్గమూ (పత్యేకంగా ఇష్టమయినవారు కారు వారికోసం ఇతరులకు అన్యాయం చెయ్యడానికి. ఇస్లామీయ వ్యవస్థలో పౌరులందరూ స్వేచ్చాయుత ఎన్నికలద్వారా తమ పాలకుల్ని ఎన్నుకుంటారు. ఏదో ఒక వర్గానికి చెందిన కారణంగా ఎవరినీ నాయకత్వపు పట్టాకట్టడం జరగదు. పాలనాధికారాలు (గహించినప్పటికీ ఓ ముస్లిం అధినేతకు తాను నిర్మించిన చట్టాలను అమలు జరిపే హక్కులేదు. అతడు దైవం పంపిన పవిత్ర శాసనాన్ని అనుసరిస్తాడు. దాన్నే అమలు జరుపుతాడు. అతను ఆవిధంగా ఆచరించేవరకు మ్యాతమే ముస్లిం (పజలు అతనికి విధేయులయి ఉంటారు. ఈ సందర్భంలో తొలి ఖలీఫా హ్యజత్ అబూబ్యక్ (రజిఅన్) చెప్పిన మాట ఎంత స్పష్టంగా ఉందో గమనించండి:
“నేను వరిపాలనా విషయంలో దైవ విధేయత కనబరచినంతకాలం మీరు నా ఆజ్జల్ని పాలించండి. నేను దేవునిపట్ల అవిధేయత చూపితే నాకు విధేయత చూపే బాధ్యత మీపై ఏ మాత్రం ఉండదు”.
ఇస్లాం, పాలకులకు శాసన నిర్మాణ అధికారాన్నివ్వదు. స్వయంగా వారూ చట్ట నిర్మాణం చెయ్యలేరు, ఇతరులకూ ఆ హక్కును ధారాదత్తం చెయ్యలేరు. చట్టబద్ధంగా, పాలకులకు, ఒక వర్గానికి ఇతర వర్గాలపై ఆధిక్యత నిచ్చేహక్కు కూడా ఉండదు. వారు ధనవంతులకు లోబడి వారికి లాభం చేకూర్చి, ఇతర వర్గాలకు అన్యాయంచేసి నష్టం కలిగించే ఏచట్టాన్నీ చెయ్యలేరు.
ఇస్తామీయ సమాజంలో ==
ఇస్లాంలో హక్కులరీత్యా మనుషుల మధ్య ఏ విధమయిన వివక్షత
146 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
చూపడం ధర్మ సమ్మతం కాదు. అందరి పట్ల సమమయిన రీతిలో సమానస్థాయిలో వ్యవహరించడమే ఇస్లామీయ శాసనం. ఇస్లామీయ శాసనాంగాన్ని ఏ కోణంలోనయినా వివరించడమో, నిర్వచించడమో జరగవలసి వస్తే, ప్రపంచంలోని ఇతరచట్టాల మాదిరిగానే, షరీఅత్ (న్యాయ) వేత్తల అభిపాయానికే అంతిమ నిర్ణాయక స్థానం ఉంటుంది. కాని ఏ ధనిక వర్గానికో లేదా ఊహాజనితమయిన పాలకవర్గానికో ఎలాంటి అధికారం ఉండదు.
ఇస్లామీయ ధర్మవేత్తలు సాధించిన గర్వించదగ్గ విషయమేమిటంటే, వారు సంపన్నవర్గాల స్వ్నపయోజనాల కొరకు ఇస్లామీయ శాసనాంగానికి వ(కభాష్యంచెప్పి, దాన్ని ఇతర వర్గాలపై అన్యాయం జరిపే సాధనంగా చెయ్యలేదు. దీనికి భిన్నంగా, (శ్రామికవర్గం యొక్క (పాథమిక అవసరాల విషయంలో పూర్తి (శద్ధచూపడానికే వారు నిత్యం కృషిచేశారు. ఈ విషయంలో కొందరు ధర్మవేత్తలయితే, (శామికులూ, రైతుకూలీలను యజమానులకు సమానంగా లాభంలో భాగస్వాములుగా నిర్ణయించారు.
వ్యక్తిగత ఆస్తికి తప్పనిసరి పర్యవసానం అన్యాయం అత్యాచారాల రూపంలోనే వెలువడుతుందనడానికి మానవ (పకృతి అంతనీచమయింది కాదని అంటుంది ఇస్లాం. మానవుల శిక్షణ, శీలనిర్మాణం విషయంలో ఇస్లాం అద్వితీయమయిన విజయాన్ని సాధించింది. ధనవంతులూ, ఆస్తిపరులూ అయినప్పటికీ ముస్లిముల స్థితి ఎలా ఉండేదంకే :
“వారు తమ వద్దకు వలసవచ్చిన వారిని (పేమిస్తారు. వారికి ఇచ్చివేసిన దానిపట్ల తమ హృదయాల్లో ఎలాంటి అభిలాష ఉన్నట్టు కూడా భావించరు. తాము స్వయంగా నిరుపేదలయి ఉన్నప్పటికీ తమపై ఇతరులకే ప్రాధాన్యతనిస్తారు”. (అల్ హ్ :9)
ఇంకా వారు, ఇతరులకు తమ సంపదలో భాగం పంచి ఇచ్చి
వ్యక్తిగత ఆస్తి 147
సంతోషపడేవారు. అదీ ఏదో పాపంచిక (పయోజనాన్ని ఆశించేవారుకాదు, దైవం తమకు సాఫల్యాన్నీ మన్నింపునూ _పసాదిస్తే చాలని కోరుకునేవారు. ఇలాంటి ఉన్నతమయిన పవ్మితమయిన అపూర్వమయిన ఆదర్శాలను మనం ముందుంచుకోవాలి. ఇవి మనకు వెలుగునిస్తాయి. తద్వారా మన భవిష్యత్తు కాంతిమంతమవుతుంది. మానవత స్థానం, జెన్నత్యం ఎలాంటిదో అప్పుడు బోధపడుతుంది.
మనం మరువరాని మరో విషయం ఏమిటంకే మనిషి కేవలం ఊహాలోకాల్లో విహరించాలన్నది ఇస్లాం అభిమతం కాదు. అందుచేత అది సామూహిక శ్రేయాన్ని కేవలం “ఉత్తమ అభిలాషల! దయాదాక్షిణ్యాలపై వదలి వెయ్యదు. ఆత్మ పరిశుద్ధతకు ఇస్లాంలో గల (పాముఖ్యం ఎంత గొప్పదయినా జీవితపు (క్రియాత్మక సమస్యలను కనుమరుగుకానివ్వదు ఇస్లాం. సమాజంలో న్యాయవంతమయిన ప్రాతిపదికపై సంపద వర్మిభమించాలని చట్టంద్వారా తగిన ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా ఓ ఆరోగ్యవంతమయిన సమాజస్థాపనకు పునాదులు వేస్తుంది. బహుశా ఈ యదార్భాన్నే మూడవ ఖలీఫా హ(జత్ ఉస్మాన్ (రజిఅన్) తన మాటల్లో ఈ విధంగా నుడివారు:
ఏ విషయాలనయితే కేవలం ఖుర్‌ఆన్ (బోధనల ) ద్వారా వారించడం సాధ్యపడదో వాటిని అల్లావా అధికారశక్తి ద్వారా నిస్సందేహంగా దూరం చేస్తాడు.
ఇంతకు చెప్పవచ్చిందేమిటంకే కేవలం వ్యక్తిగత ఆస్తివల్ల తప్పనిసరిగా అన్యాయం జనిస్తుందనడం సబబుకాదు. ఎందుకంకే వ్యక్తిగత ఆస్తికి స్థానమున్న సమాజాల్లోనూ అది ఎలాంటి అన్యాయానికి కారణభూతం కాలేదనడానికి సాక్షాధారాలున్నాయి. ఇస్లాం భూమిని వ్యక్తిగతాస్తిగా ఉంచుకునే. అనుమతినయితే ఇచ్చింది కాని దాని ఆధారంగా భూస్వామ్యవ్యవస్థ రూపొందే అవకాశాన్నివ్వలేదు.- ఆ (ప్రమాదాన్ని వారించడానికి అది ఆర్థిక, సామాజిక చట్టాలను చేసి జమీందారీ, జాగీర్దారీ
148 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
వ్యవస్థలు పెంపొందే అవకాశమే లేకుండా చేసింది. స్థిరాస్తిగా భూమి ఏ మ్యాతమూ లేనివారు కూడా ఆ వ్యవస్థలో గౌరవ్యపదమయిన జీవితం గడిపేవారు. ఈ భ్యదతలవల్లనే సంపన్నులయినవారు ఇస్లామీయ _ వ్యవస్థలో నిరుపేదలపై ఎలాంటి జులుం చెయ్యడం సాధ్యమయ్యేదికాదు.
సామాజిక సిద్దాంతాలు, ఆర్ధికవ్యవస్థ థి థి థి
ఒకవేళ ఇస్లాంలో పెట్టుబడిదారి విధానం వృద్ధీవికాసాలు చెందే అవకాశముందని వాదనకై ఒప్పుకున్నా దానితోపాటే మరో యదార్భాన్ని కూడా గుర్తించవలసి ఉంటుంది. ఇస్లాంలో, సామాన్య(పజల (పయోజనాలకై సేవచేసేటటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థయే 'నెలకొనగలిగి ఉండేది. ఒక వైపున ఇస్లాం మానవ (పకృతిని పరిశుద్ధపరుస్తుంది. మరోవైపు అది నిర్మించే చట్టాలమూలంగా పెట్టుబడిదారులకు దోపిడి, దౌర్జన్యం, అన్యాయం, అ(కమాలవైఖరి అవలంబించడం సాధ్యమయ్యేదికాదు. ఇస్లామీయ వ్యవస్థ సక్రమంగా పనిచెయ్యగలిగి ఉంటే, అది తన ఆచరణావిధానం ద్వారా పాశ్చాత్య దేశాల్లో నేడు ప్రబలిపోయిన చెడుల్ని దూరంచేసి ఉండేది.
మరో విషయమేమంటే, ఇస్లాంలో వ్యక్తిగతఆస్తి అనేది కొన్ని నిబంధనలకు లోబడివుంది. ఉదాహరణకు (పజాసాధనాలు (పజలందరికీ చెందినవి అన్నది ఇస్లాం సూతం. అంకే న్యాయం, సమంజసం అవసరం అని తలచిన చోట ఇస్లాం వ్యక్తిగత ఆస్తికి ఆంక్షలు విధించిందన్నమాట. మరెక్కడయితే అనుమతి నిచ్చిందో అక్కడా దానివల్ల ఇతరులపై అన్యాయం అక్రమాలు జరగవన్న తృప్తి కలిగినమీదకే ఇచ్చింది.
ఈ విషయాన్ని విశదపరచడానికి మనం ఓ ముస్లిమేతరదేశాన్ని ఉదాహరణగా తీసుకుందాము. ఇంగ్లీషు (పజలు, అమెరికనులు, (ఫెంచిపజలు - జాతి, వర్ణం ఆధారంగా విచక్షణను సమర్థించే వీరంతా -స్కాండెనేవియా (పజలు (వపంచంలోకెల్లా సౌమ్యస్వభావులు, సంస్కారవంతులు, నాగరిక ప్రజలని ఒప్పుకుంటారు. కాని స్కాండనేవియా
వ్యక్తిగత ఆస్తి 149
అంటే నార్వే స్వీడన్‌లలో నేటివరకు కూడా వ్యక్తిగతఆస్తిని నిషేధించడం జరగలేదు. దానికి భిన్నంగా సంపదను న్యాయవంతంగా పంపిణిచేసే ఏర్పాట్లు చెయ్యడం జరిగింది. దీనిగ్గాను సామాజిక రక్షణలు కల్పించబడ్డాయి. ఆ రక్షణల్లో విభిన్నవర్గాల మధ్య ఆర్థిక విభేదాన్ని తగ్గించడం, (శమ - వేతనాల (పమాణాల్లో సముచితమయిన నిష్పత్తి నిలకడగా ఉండేలా చూడటం కూడా ఉన్నాయి. ఇస్లామీయ శాసనాన్ని కొన్ని కోణాల్లో అమలుపరచి ఈ దేశాలు ఇతరదేశాల కంకే అధికంగా (పగతిశీలకమయినవిగా రూపొందాయని చెప్పవచ్చు.
ఏ సామాజిక సిద్ధాంతాల ఆధారంగా ఒక ఆర్థికవ్యవస్థ రూపొందుతుందో వాటినుండి దాన్ని వేరుచేసి చూడటం సరయిన పద్ధతికాదు. నేడు (పపంచంలో చెలామణిలో ఉన్న ప్రముఖ వ్యవస్థలు - పెట్టుబడిదారీ, కమ్యూనిజం, ఇస్లాం - ఈ మూటినీ స్థూలంగా పరిశీలిస్తే, ఈ మూటిలోనూ, ఆర్థిక వ్యవస్థకు, ఆస్తికి సంబంధించిన వాటి దృక్పథాలకు, అవి _పతిపాదించే పత్యేక సామాజిక వ్యవస్థతో అవినాభావ సంబంధంఉన్న యదార్థం ఇక్టే వెల్లడవుతుంది.
ఇస్తాం - మధ్యేమార్గం
పెట్టుబడిదారీ వ్యవస్థకు పునాది - వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పవితమయింది, అతని పవితత ఎట్టి పరిస్థితిలోనూ భంగపడరాదు, దానిపై ఎలాంటి సామాజిక (పతిబంధకమూ ఉండరాదు అన్నది. దీని భావమేమిటీ ? పెట్టుబడిదారీ వ్యవస్థ విశృంఖల వ్యక్తిగతాస్థిని సమర్థిస్తుందన్నమాట. దానిపై ఎలాంటి నిర్బంధాన్ని విధించడాన్నీ అది ఒప్పుకోదు.
దీనికి పూర్తిగా భిన్నమయినరీతిలో కమ్యూనిజం మౌలిక సిద్ధాంతం (పకారం, 'సంఘం' అసలు ప్రాతిపదిక. దాన్ని కాదని, దాన్నుండి వేరుగా, స్వతంతంగా వ్యక్తికి ఎలాంటి ఉనికే లేదు. ఈ విధంగా కమ్యూనిజం, సకల
150 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
యాజమాన్యపు హక్కులు రాజ్యానికి ధారాదత్తం చేస్తుంది. వ్యక్తులనుండి వ్యక్తిగత ఆస్తి హక్కులన్నీ దోచుకుంటుంది.
ఇస్లాం (పతిపాదించే సామాజిక దృక్పథం ఈ విషయంలో పూర్తిగా భిన్నమయింది. దాని కారణంగా దాని ఆర్థిక వ్యవస్థ కూడాఈ రెంటికీ భిన్నమయిన రీతిలోనే ఉంది. ఇస్లాం (ఉపకారం వ్యక్తి - సంఘం ఈ రెంటి సంబంధాల విషయంలో వ్యక్తి ఒకేసారి రెండు స్థాయిల్లోనూ బాధ్యతాయుతంగా మెలగాలి. ఈ రంటిమధ్య సామరస్యం సృష్టించమని కోరుతుంది అతన్ని
ఇస్లాం .
ఇస్లాం (పతిపాదించే ఈ సామాజిక దృక్పథం వ్యక్తిని సమాజానికి దూరం చెయ్యదు, వ్యక్తీ, సమాజం రెండూ రెండు భిన్న ధృవాలని, అవి రెండూ నిత్యం ఒకదాన్నొకటి లోబరచుకోడానికి కృషిచేసే శక్తులని కూడా చెప్పదు. ఇస్లాం (పకారం, వ్యక్తి స్వతంతుడు అయినప్పటికీ ఓ సమాజంలో సభ్యుడు కూడాను. ఇస్లాం, ఒకవైపు వ్యక్తి మరియు సమాజాల మధ్య, రెండవవైపు వ్యక్తి మరియు సమాజంలోని ఇతరవ్యక్తుల (పయోజనాలమధ్య సామరస్యాన్ని సాధించాలని అభిలషిస్తుంది. కాని ఈ సామరస్యం కొరకు అది వ్యక్తి (పయోజనాన్నీ ఉపేక్షించదు,సమాజ సంక్షేమాన్నీ కాదనదు. దాని నియమాలు సమాజం కొరకు వ్యక్తిని బలిచెయ్యడానికిగాని, ఒక వ్యక్తి లేక కొందరు వ్యక్తుల (పయోజనాల నిమిత్తం సమాజంలో కలతల్ని సృష్టించడానికి గాని అనుమతించవు. అది వ్యక్తిని పరిరక్షిస్తే సమాజాన్ని కూడా విచ్చిన్నం కాకుండా కాపాడుతుంది.
ఇస్లామీయ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారీ మరియు కమ్యూనిజం - రెండు అతివాదాల మధ్య సుహృద్భావ పూర్వకమయిన మధ్యేమార్గంపై సమన్వయం, సామరస్యాల భావనల ఆధారంగా రూపొందుతుంది. ఇందులో రెండు వ్యవస్థల మంచి అంశాలయితే ఉన్నాయి కాని వాటిలోని చెడులూ లోపాలకు అది దూరంగా ఉంది. ఇది స్యూత్యపాయంగా వ్యక్తిగత ఆస్తిని అనుమతినిస్తుంది. కాని దాన్నిఅనేక కట్టుదిట్టాలతో పరిమితంచేసి, అది
వ్యక్తిగత ఆస్తి 151
వోనికరమవకుండా చేస్తుంది. మరోవైపు ఇస్లాం పరిపాలనా వ్యవస్థకు సామూహిక (పాతినిధ్యస్థానమిచ్చి, వ్యక్తిగత ఆస్తి వ్యవస్థీకరణ కొరకు కావలసిన శాసననిర్మాణం చేసేందుకు, ఇంకా సామాజిక సంక్షేమం దృష్ట్యా వాటిలో. మార్పులూ చేర్పులూ చేసేందుకు దానికి పరిపూర్ణ అధికారాలనిస్తుంది.
సంస్కరణే * అసలు ధ్యేయం కావాలి
ఇస్లాం వ్యక్తిగత ఆస్తిని బలపరుస్తుంది. ఎందుకంకేు, దానివల్ల జనించే చెడులను నివారించే సామర్థ్యం కూడా దానికి ఉంది. ఈ లక్ష్యం కొరకు అది అనేక సాధనాలను, మార్గాలను అవలంబిస్తుంది. వ్యక్తిగత ఆస్తికి స్మూత్య్వపాయంగా అనుమతినిచ్చి దాన్ని అదుపులో ఉంచడానికీ, (కమబద్ధం చెయ్యడానికీ సామూహిక వ్యవస్థకు అధికారాల నివ్వడం, దాన్ని పూర్తిగా అంతమొందించడం కన్నా ఉత్తమమయిన మార్గమనడంలో సందేహమేముంది? ముఖ్యంగా, వ్యక్తిగత ఆస్తి భావన మనిషినైజంలోనే లేదని, మానవ జీవితంలో దాని ఆవశ్యకత కూడా లేదని కేవలం నిర్మించుకున్న సిద్ధాంతం ఆధారంగా దాన్ని తిరస్కరించే పరిస్థితుల్లో దీని జెచిత్యం ద్విగుణీకృతమవుతుంది. స్వయంగా రష్యాలోనూ వ్యక్తిగత ఆస్తిని పరిమితస్థాయిలో అనుమతించవలసి వచ్చిందన్న యదార్ధం దేన్ని సూచిస్తోంది ? మానవ (ప్రకృతితో సామరస్యం పొందే మార్గాన్నను సరించడమే వ్యక్తి పగతి మరియు సమాజ[(శ్రేయానికి ఉత్తమమయిన విధానం అన్నది _పస్స్ఫుటం కావడంలేదా?
వ్యక్తిగత ఆస్తిని ఏ కారణాలవల్ల నిషేధించాలి? ఏ కారణాల ఆధారంగా దాన్ని నిషేధించవలసిందని ఇస్లాంను కోరుతున్నారు? ఇదీ నేటి ముఖ్యమయిన (పశ్న.
* నేడు అది ఇంకా విస్తృత మవుతుంది,వ్యక్తిగత స్థాయిలో వ్యాపారం చెయ్యడానికి, అద్దెబళ్ళు నడపడానికి అక్కడ ఇటీవలే వీలు కల్పించడం జరిగింది.
152 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
మనుషుల మధ్య సమానతను నెలకొల్పడానికి వ్యక్తిగత ఆస్తిని అంతమొందించడం తప్ప గత్యంతరం లేదని వాదిస్తుంది కమ్యూనిజం. ఎందుకంటే, ఆ విధంగానే మనిషిని తనలాంటి మనిషి బానిసత్వం నుండి విముక్తిని పసాదించడం సాధ్యమవుతుంది. రష్యాలో ఉత్పత్తి సాధనాలను వ్యక్తిగత ఆస్తి పరిధినుండి తీసి ఉమ్మడి ఆస్తిగా చెయ్యడం జరిగింది. అయితే వ్యక్తిగత ఆస్తిని అంతం చేసేటప్పుడు ఏ ఆశయాల దృష్ట్యా అలా చెయ్యడం జరిగిందో అవన్నీ నెరవేరాయా? స్టాలిన్ పాలనాకాలంలో కార్మికులచేత అధికంగా పనిచేయించుకోడానికి అధిక |వేతనాల ఆశ చూపవలసి వచ్చింది. ఈ విధంగా కార్మికుల వేతనాల్లో సమాన తాభావాన్ని స్వయంగా కమ్యూనిస్టు (పభుత్వమే చేతులారా రద్దుచేసింది. _ ఇది మరువరాని విషయం.
నేడు రష్యాలో కార్మికులందరికీ ఒకేలా వేతనాలు , ఇవ్వడం జరుగుతోందా? అక్కడ డాక్టర్లకు, నర్సులకూ ఒకే మాదిరి జీతభత్యాలున్నాయా? స్వయంగా కమ్యూనిస్టులే మనకు చెబుతారు - అక్కడ ఇంజనీర్లకు, వృత్తిపనుల నిపుణులకు దొరికే ఆదాయం అందరికంకే అధికమని. అంటే, రష్యాలోని వివిధవర్గాల్లో నేటికీ వేతనాల వ్యత్యాసం అలాగే ఉందన్న సత్యాన్ని వారు ఒప్పుకుంటున్నారన్నమాట. ఈ వ్యత్యాసాలు కేవలం విభిన్నవర్గాల పజల్లోనే కాదు ఒకేవర్గంలోని వ్యక్తుల్లోకూడా ఈ వివక్షతలు బహిరంగంగా అగుపిస్తాయి.
వ్యక్తిగత ఆస్తిని రద్దుచెయ్యడం వల్ల రష్యాపజల్లో పోటీభావం, ఎదుటి వారిని మించిపోయి వ్యక్తిగత (పత్యేకతను నిలబెట్టుకోవాలన్న ఆసక్తి క్షీణించి పోయిందా? ఒకవేళ ఈ విభేదాలు, అంతరాలు అన్నీ సమసిపోతే అక్కడ (కేడ్ యూనియన్ నాయకుల్ని, కార్జానాల మేనేజర్లను, ఉన్నత నిర్వహణాధికారుల్ని, వివిధ శాఖల అధిపతుల్ని దేని ఆధారంగా ఎన్నుకుంటున్నారు? ఖుద్దుగా కమ్యూనిస్టుపార్టీలో చురుగ్గా పాల్గొనే కార్యకర్తల్లోనూ పనిచెయ్యలేని కార్యకర్తల్లోనూ ఏ (పాతిపదికపై వ్యత్యాసాన్ని పాటిస్తున్నారు ?
వ్యక్తిగత ఆస్తి 153
వ్యక్తిగత ఆస్తిని అనుమతించడమో అనుమతించకపోవడమో తరువాత సంగతి, ముందు ఇతరులపై ఆధిక్యత సాధించాలన్న అభిలాష, ఇతరులకన్నా [పత్యేకతను పొందాలన్న భావం మానవ సహజం కాదా ? కమ్యూనిజమయితే వ్యక్తిగత ఆస్తిని రద్దుచేసి వేసిందికాని ఏ చెడు కేవలం వ్యక్తిగత ఆస్తివల్ల జనిస్తుందని అది వారించిందో దాన్నుండి మానవాళిని కాపాడలేక పోయింది. ఈ విషయంలో కమ్యూనిజం పరాజయం “సాధించిన” తరువాత, ఆ (భష్టమార్గాన్ని అనుసరించడం మనకనవనరం. అది నిజానికి మానవ(పకృతికి పూర్తిగా విరుద్ధమయింది. ఆ లక్ష్యం కోసం కృషి జరపడమంే కేవలం ఉనికిలేని, అందని గమ్యం కొరకు (పాకులాడటం అన్నమాట.
రష్యాలో ఉన్న విభేదాలు, వ్యత్యాసాలనుగురించి కమ్యూనిస్టు సోదరులు చెప్పేదేమంకే, అవన్నీ బహుస్వల్పమయినవి, వాటివల్ల నంపన్నవర్గం భోగవిలాసాల్లో మదవుకేనుగులా బలినిపాయ్యే అవకాశమూలేదు, ఇంకా (కింది తరగతివారు పూర్తిగా నిరాధారులయి పొయ్యే (పమాదమూలేదు. సరే, అయితే వ్యక్తిగత ఆస్తిని తుదముట్టించిన తరువాత కూడా (పాప్తమయ్యేది ఇదే అయితే అంతమా(్రానికి ఇంత హంగామా దేనికి ? నేటికి 13-వందల ఏళ్ళక్రితం, కమ్యూనిజం ఛాయలు కూడా ప్రపంచాన కానరానినాడు, ఇస్లాంప్రపంచానికి అందజేసిన (పబోధాల్లో ఒకటుమంకే, సమాజంలోని వ్యక్తుల మధ్యనెలకొని ఉన్న ఆర్థిక వ్యత్యాసాన్ని వీలయినంత మేరకు తగ్గించాలన్నది. తద్వారా కొందరువ్యక్తులు, ఇతరుల హక్కుల్ని కాజేసి తాము మాతం సుఖభోగాల్లో తేలియాడాలనుకుంటు అవకాశం లేకుండా చెయ్యాలన్నదే అసలు ఆశయం. కాని ఈ ఆశయసిద్ధికై ఇస్లాం చట్టం క్యరచేతబూనడమే కాదు, ప్రజల్లో దైవభక్తి, సదాచరణ, మానవాళిపట్ల (పేమభావాలను కూడా సృజించింది. ఆ తరువాత చట్టాన్ని పాటింపచేసేందుకు బాహ్యశక్తి ఏదీ అవసరంలేకుండా పోయింది.
6. వర్గ వ్యవస్థ ౧ ®
“అల్లావా మీలో కొందరికి కొందరిపై ఉపాధికల్పనలో ఆధిక్యతను (వసాదించాడు”. (అన్ నవ్లా- 71)
“మేము ఒకరిపై ఒకరికి స్థాయి స్థితుల దృష్ట్యా ఉన్నతినిచ్చాము” (అజ్ జుఖ్‌రుఫ్ : 32)
కమ్యూనిస్టు విమర్శకులు, ఈ ఆయత్‌ల దృష్ట్యా ఇస్లాంలో వర్గ వ్యవస్థలేదని వాదించడానికి ఆస్కారమేముందీ ? అని అంటారు. ఈ (ప్రశ్నకు సమాధానం వెదకాలంకే ముందు వర్గ వ్యవస్థ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఆ తరువాతనే దాని గురించి ఇస్లామీయ దృక్కోణం ఏమిటో లేక అది ఇస్లాంలో ధర్మబద్ధమయినదా కాదా అన్న విషయాలు పరిశీలించగలం.
వర్గ విభేదానికి మూలం
మధ్యయుగంలో యూరపు స్పష్టంగా మూడు వర్గాల్లో విభజించబడి ఉండింది. ్రేష్ణులు (08౬55), చర్చీ పాదరీలు (0.౬౧౮౪౬9), సామాన్య(పజలు (COMMON PEOPLE).
పాదరీల దుస్తులే వారి(పత్యేకత. అధికారం, శక్తి దృష్ట్యా ఈ వర్గం గొప్పగొప్ప రాజులు చ్మకవర్తులకు పోటీగా నిలిచేది. చర్చీ అధినేత పోపు (POPE) రాజుల్ని నియమించడమో వారిని తొలగించడమో తన హక్కుగా భావించేవాడు. ఈ పరిస్థితిని రాజులు ఎలా సమ్మతిస్తారు ? వారు చర్చీ మరియు పోపు అధికారపు పిడికిలినుండి విముక్తిని పొందేందుకు వీలయినన్ని విధాలుగా (ప్రయత్నించేవారు. చర్చీ రాబడి ఏ మేరకు ఉండిందంటు దాని ఆధారంగా అది తనకు స్వంతంగా (పత్యేక సేవను కూడా నియమించుకున్నది.
వర్గ వ్యవస్థ 155
శేష్టుల (N0BLE5)కు (శ్రేష్టత, బెన్నత్యాలు వారి తల్లిదండుల ద్వారా వంశపారంపర్యంగా లభ్యమయ్యేవి. వారికి ఉన్నతస్థానం, వారి వ్యక్తిగత బుద్ధికుశలతలు, శక్తి సామర్ధ్యాలు, గుణగణాల ద్వారా ప్రాప్తమయింది కాదు. వారి (పకారం అ(గవర్ణం వారు జన్మత: అ(గవర్షులయి ఉంటారు. “నీచాతినీచమయిన చేష్టలు, హీనాతి హీనమయిన పనులు చేసినప్పటికీ వారు ఉన్నతులుగానే ఉంటారు. ఈ చేష్టలవల్ల వారి పుట్టుకతో వచ్చిన డ్రేష్ణతలో ఎలాంటి లోపం వాటిల్లదు.
భూస్వామ్యయుగంలో ఈ అగవర్గంవారికి తమ జాగీరుల్లోనివసించే (పజలపై అవధుల్లేని అధికారాలుండేవి. వారు నియంతల మాదిరిగా న్యాయసంబంధమయిన, పరిపాలనా సంబంధమయిన సకల కార్యకలాపాలు తామే నిర్వహించేవారు. వారి ఇష్టమే చట్టం, వారి మాటలే శాసనం. వారి చేతలే నియమం. ఆ కాలంలో ఏవయినా (పాతినిధ్యత్వపు మండలులు, సంఘాలు ఉన్నా వాటిలో వీరు మాతమే సభ్యులుగా ఉండేవారు. దాని సహజపరిణామంగా, చట్టనిర్మాణంలో వారి స్వార్థానికి, వారి రాయితీలకు, వారి పయోజనాల పరిరక్షణకు (పాధాన్యత ఉండేది. అలా తయారయిన ఆ నియమాలు, చట్టాలు పరమ పవిత్రమయినవిగా వాటిని కాదనే లేక రద్దు చేసే మాటను ఆలోచించడం కూడా మవాపరాధంగా పరిగణించబడేది.
సామాన్యుల వారసత్యం
సామాన్య(పజల విషయానికి వస్తేవారికి ఎలాంటి రాయితీలు లేవు. ఎలాంటి హక్కులూ లేవు. బీదరికం, బానిసత్వం, అవమానం, అగౌరవం వారికి తల్లిదం[డులనుంచి సంక్రమించిన వారసత్వాలు. ఆ వారసత్వాన్నే వారూ తిరిగి తమ సంతానానికి అప్పజేప్పేవారు.
తరువాత కాలంలో కలిగిన ఆర్థిక (ప్రగతి మూలంగా “బూర్జువా' వర్గం ఉనికిలోకి వచ్చింది. అది కూడా (క్రమంగా (ప్రాచీన కాలంలో డ్రేష్ణలకు ప్రాప్తమయిన (పత్యేకతల్ని, ప్రాముఖ్యాన్ని, స్థానాన్నీ పుణికి
156 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో
వుచ్చుకుని ముందుకు వచ్చింది. ఈ వర్గం ఆధ్యర్యాన్నే సామాన్య (పజలు ఫెంచి విప్లవాన్ని తీసుకువాచ్చరు. ఫెంచి విప్లవం వర్గవిభేదాన్ని అంతమొందించినప్లే అగుపించింది. అయితే అది (పపంచానికి స్వేచ్చా స్వాతం్యత్యాలు, సౌ(భా(తత, సమానతల నినాదాలను మా(తం (వసాదించింది.
(ప్రాచీన కాలంలోని (శ్రేష్టుల వర్గం స్థానే ఇప్పుడు ఆధునిక కాలంలో ధనిక వర్గం వచ్చేసింది. ఈ మార్పు గుట్టు చప్పుడు లేకుండా జరిగిపోయింది. దానికితోడుగా ఆర్థిక వగతికి పర్యవసానంగా కలిగే అనేక మార్పులూ వచ్చాయి. IED మార్పులూ చేర్పులూ తల్మకిందులూ అయినా సామాజిక వ్యవస్థలో మౌలిక సూతంరీత్యా ఎలాంటి మార్పు జరగలేదు. అందువల్ల ఇప్పటికీ ధనం, 'సంవద, శకి, అధికారం - అన్నీ పెట్టుబడిదారులకే హస్తగతమయిఉన్నాయి. అది తనకు నచ్చిన రీతిలో (పభుత్వ యంతాంగాన్ని వినియోగించు కుంటుంది. (వజాస్వామిక దేశాల్లో బయటికయితే సామాన్య(పజలకే సకలస్వేచ్చలు ఉన్నట్లు గోచరిస్తుంది. కాని ఇక్కడ సయితం ధనికవర్గం, దొంగచాటుగా పార్లమెంటు, (పభుత్వ కార్యాలయాలను తన చెప్పుచేతుల్లో ఉంచుకుని ధర్మాధర్మ మార్గాల ద్వారా తన దుష్ట లక్ష్యాలను నెరవేర్పుకుంటూ ఉంటుంది.
ఈ సందర్భంలో మరువరాని మరో అంశం ఏమిటంకే నేడు (వజాస్వామ్యానికి పెద్ద దిక్కుగా నిల్చున్న (బిటిష్ రాజకీయ వ్యవస్థలో ఇప్పటికీ (పభువుల మండలి ( HOUSE OF LORDS) అనే పెద్దల సభ ఒకటి ఉండనే ఉంది. అక్కడ నేటికీ భూస్వామ్య వ్యవ్యస్థకు (పతీకలా ఒక పాత చట్టం అమల్లో ఉంది. దాని (పకారం జాగీర్ణారు ఒకడు మరణిస్తే అతని ఆస్తి అంతా అతని పెద్ద కొడుకుకే చెల్లుతుంది. ఈ చట్టంలోని స్పష్ట మయిన ఉద్దేశ్యం, జాగీరును, ఆస్తిని కేవలం కొన్ని (పత్యేక హస్తాల్లో మటుకు పరిమితం చెయ్యడం, వంశపారంపర్యంగా వచ్చే జాగీరు పంపకమయి చెదిరిపోకుండా ఒకేచోట కేంద్రీకృతమయి ఉండేలా చూడటం, తద్వారా మధ్య యుగాల్లో జాగీర్జార్లకు లభించిన సామాజిక స్థానం వంశంలో చిర స్థాయిగా నిలబెట్టడం తప్ప మరేదీకాదు.
వర్గ వ్యవస్థ 157 వర్గ వ్యవస్థకు మూలభావన
ధనమే బలమన్న తప్పుడు భావన ఆధారంగా వర్గవ్యవస్థ ఏర్పడింది. దాని (పకారం ఏ వర్గం చేతుల్లో సిరిసంపదలుంటాయో తప్పనిసరిగా ఆ వర్గమే రాజకీయ అధికారాన్నీ కలిగి ఉంటుంది. చట్ట నిర్మాణంలో దానికే ప్రాధాన్యత ఉంటుంది. తన (పయోజనాలను రక్షించుకోవడానికి అది, (పత్యక్షంగానో పరోక్షంగానో ఇతర వర్గాలను చట్టపరమయిన హక్కు లనుండి దూరంచేసి వాటిని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ఉద్దేశించిన చట్టాలను చేస్తుంది. వర్గవ్యవస్థయొక్క ఈ నిర్వచనం (పకారం చూస్తే ఇస్లాంలో ఎలాంటి వర్గవ్యవస్థకూ చోటు లేదని ఘంటా పథంగా చెప్పవచ్చు. ఈ సత్యాన్ని (కింది యదార్థాలూ బలపరుస్తాయి.
ఆస్తి వికేందీకరణ
ఇస్లాంలో, సిరిసంపదలు కొన్ని (పత్యేక వ్యక్తులమధ్యనే నిలువ ఉండేందుకు వీలు కల్పించే ఎలాంటి చట్టమూ లేదు. దివ్యఖుర్‌ఆన్‌లో (వస్ఫుటమయిన మాటల్లో ఈ ఆదేశం కానవస్తుంది :
“ధనం మీలోని శ్రీమంతుల మధ్యనే పరిభమిస్తూ ఉండరాదన్నదే దీని ఉద్దేశ్యం” (59 :7)
ఈ కారణంగానే ఇస్లాం చేసిన చట్టాల్లో ధనాన్ని నిత్యం (ప్రజల్లో తిరుగాడేలా చెయ్యడమన్న ఉద్దేశ్యం విస్పష్టంగా అగుపిస్తుంది. ఇస్లాం నిర్దేశించే వారసత్వపు చట్టం _పకారం, చనిపోయే (పతివ్యక్తి ఆస్తి అతని వారసులందరి మధ్యన - వారు ఎందరయినా సరే - పంపకం జరగవలసిందే. ఇస్లాంలో వారసత్వపు హక్కు పొందడానికి ఏ ఒక్క వ్యక్తికీ పత్యేకతలేదు - మృతుని సోదర సోదరీలు మరే బంధువులూ లేని పరిస్థితిలో తప్ప. ఇలాంటి వినాయింపులో సయితం ఇస్లాం ఏర్పరచిన వ్యవస్థ _పకారం
158 ఇస్తాం అపార్థాల మబ్బుల్లో
మొత్తం ఆస్తికి ఒకే వ్యక్తి వారసుడు కాకుండా జాగత్తలు తీసుకోవడం జరిగింది. ఇతర హక్కుదారులకూ అందులో వాటా లభించేలా చూడటం జరిగింది - వారు మృతుని బంధువర్గంలో లేకపోయినప్పటికీ వారికి కొంత లభించే ఏర్పాట్లు ఉన్నాయి.
“ఇంకా, (వారసుల్లో ఆస్తి) పంపకం జరిగేటప్పుడు (దూరపు) బంధువులు, అనాధలు, అగత్యపరులూ అక్కడ హాజరయితే వారికీ ఆ వారసత్వంలోనుంచి కొంత ఇవ్వండి. వారితో మంచిగా, మర్యాదగా మాట్లాడండి.” (4 : 8)
ధనం కేందీకృతమవడంవల్ల ఉత్పన్నమయ్యే సమస్యల్ని ఇస్తామీయ షరీఅత్‌లో ఈ విధంగా పరిష్కరించడం జరిగింది. ఇస్లామీయ వార నత్వవు చట్టం (వకారం ఆస్తి మృతుని వారసులందరి మధ్య పంపకమవుతుంది. అది తిరిగి వారివారి వారసుల్లో పంపకమవుతుంది. ఈ విధంగా ఇస్లామీయ సమాజంలో ధనం ఎన్నడూ కొందరు వ్యక్తుల మధ్యనే నిలువ ఉండదు. సమాజం మొత్తాన పరిిభమిస్తూ ఉంటుంది. దీనికి చర్మిత పలికే సాక్ష్యంకన్నా వేరొకటి అవసరం లేదు.
దీని ద్వారా మరో ముఖ్య అంశం మన ముందుకు వస్తుంది. అదేమంకే ఇస్లామీయ వ్యవస్థలో ఏ వ్యక్తికీ తనకు ఇష్టమయిన రీతిలో ఏ చట్టాన్నీ చేసే అధికారం లేదు. ఇస్లాం అందరినీ ఒకే దైవికమయిన చట్టానికి కట్టుబడి ఉండాలని కోరుతుంది. ఆ దైవ శాసనం మానవుల మధ్య ఎలాంటి వ్యత్యాసాన్నీ సహించదు. అంకే ఇస్లామీయ సమాజం వర్గరహితమయిన సమాజమన్నమాట. వర్గాలున్నాయంకే చట్టంలో ప్రాధాన్యతలు వాటంతట అవే వచ్చేస్తాయి. వర్గాలకూ చట్టంలో (పాధాన్యతలకూ గట్టి సంబంధముంది. చట్టంలో (పాధాన్యతలు లేనిచోట, ఏ వర్గమూ తనకు ఇష్టమయిన చట్టాలు చేసి తన స్వ(పయోజనాలకై ఇతరులకు నష్టం కలిగించే అవకాశాల్లేని చోట వర్గ విభేదాలు కూడా ఉండటానికి అవకాశముండదు.
వర్ణవ్యవస్థ 159
యదార్భాన్ని (పకటించిన ఖుర్‌ఆన్
ఇక, ఈ అధ్యాయం (పారంభంలో ఉదహరించిన రెండు కుర్‌ఆన్ (పవచనాలను అర్థంచేసుకోడానికి ప్రయత్నిద్దాము. వాటి అవగాహనలో! పొరపాటు జరిగితే అనేక అపోహలు అపార్థాలు జనించే అవకాశముంది. దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది :
“అల్లావా మీలో కొందరికి, కొందరిపై ఉపాధి కల్పనలో ఆధిక్యతను ప్రసాదించాడు. మేము ఒకరిపై ఒకరికి స్థాయి స్థితుల దృష్ట్యా ఉన్నతినిచ్చాము”.
థి టి
ఈ ఆయత్‌లలో కేవలం ఓ యదార్థాన్ని ఉటంకించటం జరిగింది. ఈ పరిస్థితి ఇస్లామీయ సమాజంలోనయినా ఇస్లామేతర సమాజంలో నయినా ఏర్పడటం సంభవమే. వీటిలో (పస్తావించిన విషయం కేవలం, మానవుల్లో ఉపాధి సంపాదన అంతస్థుల ప్రాప్తి రీత్యా వ్యత్యాసాలున్నాయి అన్న వాస్తవం మాతమే. రష్యా ఉదాహరణనే తీసుకోండి. అక్కడ అందరికీ ఒకే విధమయిన వేతనాలు ఇవ్వడం జరుగుతోందా? సైన్యంలో చేరే సైనికులందరికీ ఒకే విధమయిన హెదాలు, పదవులు ఇవ్వడం జరుగుతోందా ? ఈ అంతస్థుల తేడా అక్కడ కూడా ఉన్నట్లయితే దానికి కారణం ఏమిటి - మానవుల్లో సహజంగానే ఉన్న అనివార్యమయిన వ్యత్యాసాలు తప్ప ? పైన (ప్రస్తావించిన ఆయత్‌లలో ఈ వ్యత్యాసాలకు (వత్యేకకారణం ఏదీ ఉన్నట్లు చెప్పడం జరగలేదు. వీటికి మూలం ధనమే అనీ, లేక కమ్యూనిజం వల్లనో ఇస్లాం వల్లనో ఇలా జరుగుతోందని కూడా చెప్పడం జరగలేదు. అదే విధంగా, ఈ హెచ్చుతగ్గులు ఇస్లామీయ దృక్పథం దృష్ట్యా న్యాయవంతమయినవా కావా అన్న విషయం కూడా ఇందులో చర్చించడం జరగలేదు. ఈ విషయాలజోలికి పోకుండా ఈ ఆయత్‌లలో ఇలాంటి వ్యత్యాసాలు ప్రపంచంలో ప్రతిచోటా ఉంటాయన్న వాస్తవాన్ని మాత్రమే (ప్రస్తావించడం జరిగింది. (పపంచంలో జరిగేదంతా దైవానికి తెలిసిన విషయం. వేరుగా చెప్పనవసరం లేదు.
160 ఇస్లాం అపార్థాల మబ్బుల్లో ఇస్లాంలో వర్గవిభజస
ఇంతవరకు జరిగిన చర్చద్వారా, ఇస్లామీయ సమాజంలో వర్గవిభజన లేదని, చట్టపరమయిన వ్యత్యాసాలు ఇక్కడ కానరావని అర్థమయేేవుంటుంది. ధనం, సంపదల రీత్యా (పజల్లో ఉండే వ్యత్యాసాన్ని వర్గవ్యవస్థతో పోల్చడం భావ్యంకాదు. ఎందుకంటే (పాపంచిక వస్తుసామగి, ఆస్తుల వ్యత్యాసం చట్టపరమయిన లేక వ్యక్తిగతమయిన (పాధాన్యతల రూపంలో వ్యక్తం కానంతవరకు దాని కారణంగా ఏ విధమయిన వర్గాలూ ఉనికిలోకి రాలేవు. చట్టం దృష్టిలో మానవులందరూ, కేవలం సైద్ధాంతికంగానే కాకుండా (క్రియాత్మకంగానూ సమానమే అయినపక్షంలో ధనసంపదల వ్యత్యాసం ఏనాడూ వర్గ విభేదాల రూపు దాల్బజాలదు.
ఇక్కడ మరోవిషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇస్లాం వ్యక్తులకు భూస్వామ్యపు హక్కును ఇచ్చిందంకే, దాని కారణంగా, భూస్వాములకు, ఇతరుల్ని బానిసలుగా చేసుకునే హక్కుగాని, లేక వారిని తమ స్వ(పయోజనాలకు వాడుకునే హక్కుగాని, మరేవిధమయిన రాయితీలు గాని లభించవు. నిజమయిన ఇస్లామీయ వ్యవస్థలో పెట్టుబడిదారీ వ్యవస్థకు స్థానముండి ఉంకే అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడేది. ఇస్లాంలో పాలకులకు పాలనాధికారాలు, పెట్టుబడిదారుల సమర్థన ఆధారంగా (పాప్తంకావు. అవి జాతి మొత్తం సమర్థించడంవల్ల, ఎన్నుకోవడం వల్లనే సంక్రమిస్తాయి. పైగా, దైవాదేశాలను పాటించడమే ఇస్లామీయ పాలకుని విద్యుక్త ధర్మం.
వాస్తవమేమంకే, ధనసంపదలరీత్యా వ్యక్తులందరూ సమానులుగా ఉండే ఏ సమాజమూ (పపంచంలో లేదు. కమ్యూనిస్టు సమాజంలోనూ ఈ సమానతలు అగోచరం. కమ్యూనిజం, సకల వర్గాలను రూపుమాపినట్లు ఎన్ని (పగల్భాలు పలికినా నిజానికి అది సాధించింది, చిన్న చిన్న పెట్టుబడిదారుల్ని అంతమొందించి పాలకుల ఓ కొత్తవర్గాన్ని సృష్టించడం మ్మాతమే. ఆ వర్గం ఇతర వర్గాలనన్నింటినీ రూపుమాపుతుంది.
న్డ్ దాసధర్మాలు
కమ్యూనిస్టులు, సామాజ్యవాదులు ఇస్లాంపై మరో నింద మోపుతారు. “ఇస్లాం, సామాన్య (పజలకు ధనవంతులిచ్చే దానధర్మాల ఆధారంగా జీవించడం అలవరచుతుంది, తద్వారా వారు స్వయం కృషితో (బతికే ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతారు” అనంటారు. ఈ ఆరోపణకు మూలం ఓ అపోహ. వారు జకాత్ విషయంలో అది, ధనవంతులు ఉపకారబుద్ధితో నిరుపేదలకు పంచి పెట్టే దానంగా అపార్థం చేసుకున్నారు. దాన్ని సరిగ్గా అర్ధం చేసుకోడానికి దాన ధర్మాలకు జకాత్‌కుగల వ్యత్యాసం ఏమిటో ముందు బోధపడాలి. దాన ధర్మాలు స్వచృందంగా చేసే కార్యం. ఏ పభుత్వమూ దానికై నిర్బంధించ జాలదు. దీనికి భిన్నంగా జకాత్ చట్టపరమయిన ఆదేశం. ఎవరయితే దాన్ని చెల్లించేందుకు నిరాకరిస్తారో వారి విషయంలో ఇస్లామీయ (పభుత్వం చట్టపరమయిన చర్య తీసుకుంటుంది, అవసరమయితే పోరాడుతుంది, కొన్ని సందర్భాల్లో మరణదండన కూడా విధిస్తుంది. ఎందుకంటే వారు జకాత్‌ను నిరాకరించి మత[భష్టతకు లోనవుతారు - ఇస్లామీయ శాసనానికి _దోహులుగా పరిగణించబడతారు. దానధర్మాల విషయంలో ఇస్లామీయ (పభుత్వం ఏ మాతం కఠిన వైఖరి అవలంబించ జాలదని వేరే చెప్పనక్కరలేదు. ఇది ఆయా వ్యక్తుల ధర్మబుద్ధికి, సదాచార దృష్టికి వదలి వేస్తుంది.
ఆర్థికంగా మాట్లాడితే జకాత్, ఒక జాతిపై నియమబద్ధంగా విధించబడిన తొలి పన్ను అని చెప్పవచ్చు. దానికి పూర్వం పన్నులు విధించడంలో ఎలాంటి నియమం పాటించడం జరిగేదికాదు. పాలకులు తమకు నచ్చినరీతిలో దాన్ని నిర్ణయించేవారు. దాన్ని వసూలు చెయ్యడం కూడా పాలకుల వ్యక్తిగత అభిరుచి, ఇష్టాయిష్టాలు, వివేచన, విచక్షణ, ఆవశ్యకతల ఆధారంగా జరిగేది. ఈ పన్నుల భారమంతా నిజానికి ధనవంతులపై కన్నా నిరుపేదలపై అధికంగా పడేది. ఇస్లాం, పన్నుల వసూలుకు నియమబద్ధంగా ఓ వ్యవస్థ నెలకొల్పింది. సాధారణ పరిస్థితులకు గాను గరిష్ట శాతాన్ని నిర్ణయించింది. ఈ పన్ను ధనవంతుల పైనా
162 ఇస్లాం అపార్భాల మబ్బుల్లో
మధ్యతరగతి వారిపైనా విధించి, నిరుపేదలకు మినహాయింపు నిచ్చింది.
ఖథిక్షకాదు బాధ్యత
ఇస్లాం ఆదేశాలకనుగుణంగా జకాత్ నిరుపేదల్లో పంపకం జరగాలి. ఆ పంచే బాధ్యత ఇస్లామీయ (వభుత్వంపై పడుతుందేకాని, ధనవంతులు స్వయంగా పంచడానికి వీల్లేదు. అంటే జకాత్ (పభుత్వం వసూలు చేసి ప్రభుత్వమే సామాన్యపజల్లో పంచే పన్ను అన్నమాట. ఇస్లామీయ వ్యవస్థలో “రాజ్య ధనాగారం' నేటి ఆర్థిక మంతిత్వశాఖ లాంటిదే. అది ఒకవైపున [పజల నుండి పన్నుల మూలంగా ధనం వసూలు చేసి మరో వైపున (పజల సౌకర్యాలు, సౌలభ్యాలను సమకూర్చుతుంది. ఇంకా దాని ద్వారా తమ ఉపాధి సంపాదించుకోలేని వారిని లేక చాలినంత ఆదాయం లేనివారిని పోషిస్తుంది. నిజానికి ప్రభుత్వం ఈ వికలాంగుల్ని, అగత్యపరుల్నీ ఆదుకోవడమనేది వారిపై ఏ మాతం ఉపకారంగా కాదు. ఇలాంటి (పభుత్వ సహాయాన్ని స్వీకరించడమనేది దాన్ని స్వీకరించే వారిపట్ల ఏదో ఓ రీతిలో ఏహ్యభావాన్ని హీనభావాన్ని జనింప జేస్తుందనడానికి వీల్లేదు. పభుత్యోద్యోగులు రిటైరయినప్పటికీ (పభుత్వం ద్వారా పెన్షన్ పొందడమయినా, లేక సోషియల్ వెల్‌ఫేర్ స్కీముల ద్వారా అర్హులయిన వారు పయోజనం పొందడమయినా ధనవంతుల దాన ధర్మాలపై (బతకడమని ఎత్తిపాడవడం ఏ విధంగా భావ్యం కాదో అదే విధంగా అనాధలయిన వారు, ఉపాధి సంపాయించుకోలేని వికలాంగులు, వృద్ధులు (పభుత్వం నుండి భిక్ష పొందుతున్నారని అనడం సబబు కాదు. (పభుత్వం వారి అశక్తత కారణంగా వారికి ధన సహాయం చేస్తే అది వారిపట్ల అవమానం, అగౌరవం, పరాభవం కాదు. నిజానికి వారికి సహాయ సహకారాలు అందజెయ్యడం (పభుత్వ బాధ్యతల్లో భాగమే.
నేడు రివాజు పొందిన సమాజ సంక్షేమ వ్యవస్థ రూప కల్పన మానవాళి శతాబ్దాల తరబడి గడించిన చేదు అనుభవాల, సామాజిక అన్యాయాల సుదీర్ద చర్మితతో ముడివడి ఉంది. ఇస్లాం బెన్నత్యానికి, గొప్పదనానికీ తార్కణమేమంకే, యూరపు కూడా సామాజికంగా చీకటి గుహల్లో అగమ్య గోచరంగా తచ్చాడుతున్న కాలంలో, అది సామాజిక
దాన ధర్మాలు 163
సంక్షేమ వ్యవస్థను నెలకొల్పింది. కాని పాశ్చాత్యుల నుండి అరువు తెచ్చుకున్న వ్యవస్థల (పశంసల్లో భూమ్యాకాశాల మధ్య వంతెనలు కట్టి వారి భావ దాస్యం ఏ స్థాయికి చేరుకుందంటే, వారికి ఇష్టమయిన వ్యవస్థ అయినా సరే అది ఇస్లాంలో కానవస్తే మూఢత్వమని, తిరోగమన వైఖరినుండి జనించిందని చెప్పడానికి వెనుకాడరు !
జకాత్ ఇస్తామీయ వ్యవస్థలో
ఇస్లాం, [పారంభకాలంలో, ఆనాటి (పత్యేక పరిస్థితుల దృష్ట్యా అగత్యపరులు స్వయంగా వెళ్ళి నగదుగాగాని వస్తురూపేణగాని జకాత్‌ను వసూలు చెయ్యడాన్ని అనుమతించింది. కాని జకాత్ వసూలు చేసే ఈ పద్ధతినే ఇస్లాం గుర్తించిందనడంలో అర్థంలేదు. జకాత్ ధనం ద్వారా (వజోపయోగ కార్యాలెన్నో చేపట్టడాన్ని ఇస్లాం కాదనలేదు. లేక ఈ రొబ్బంతో సహకార సంస్థల్ని, కార్జానాలను ప్రారంభించడాన్ని కూడదనలేదు. అంకే జకాత్ ధనం పప్రజాశేయంగల పనులన్నింటిలోనూ వినియోగించవచ్చు. జకాత్‌నుండి నగదు రూపేణ ఇచ్చే సహాయం, వ్యాధి(గస్తులకు, వృద్ధులకు, బాలలకు వర్తిస్తుంది. ఇతర (ప్రజలందరికీ, ఉపాధి కల్పనకయినా, వారి డేయానికై ఇతర ప్రణాళికలకయినా ఈ ధనాన్ని వెచ్చించవచ్చు. ఇస్లామీయ సమాజంలో కేవలం జకాత్ ఆధారంగా (బతుకు వెళ్ళదీసే ఏ వర్గానికీ తావులేదు.<